← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రామాయణం rāmāyaṇaṃ

Original — తెలుగు
  1. రామం అయతిప్రాసయతి ఇతి రామాయణం.

(శ్రీరామచంద్రుని ప్రాపింపచేయునది రామాయణము)

  1. “రామస్య అయనం స్థానం ప్రాపయతి” ఇతి రామాయణం.

(శ్రీరాముని స్థానమును ప్రాపింపచేయునది)

  1. “శ్రీరామచంద్రస్య అనంతకల్యాణ సద్గుణలీలా ధర్మ ప్రవర్తనా ద్యుపాఖ్యాత్వాత్”.

(శ్రీరామచంద్రుని అనంతకల్యాణ ధర్మ సద్గుణలీలా ప్రవర్తనాదుల చరిత్రముగాన రామాయణమని చెప్పబడినది)

  1. “కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ |”.

(రామాయణమంతయు సీతాదేవి చరిత్రమే) రాముడే ప్రపంచమంతటికీ అయనము ఆశ్రయము. ఈ విషయము చెప్పునది రామాయణము).

  1. (ఆత్మ పరమాత్మల సంబంధము. పరమాత్మనుండి విడిపోయిన ఆత్మ (జీవాత్మ) మరల జీవాత్మను చేరుటలో గల కష్టములు, చివరకు ఏకమగుట, సీతాపహరణము, రావణసమ్హారానంతరము సీతాదేవి కలియుట రూపముగా చెప్పునది)

  2. “తొల్లి బృందారక బృంద సంప్రార్థితుండై గోవిందుడు రావణ వదార్థంబుగా దశరధ సుతుండై యుదయించి చేయు కార్యంబులు వల్మీక సంభవుండై శ్రీరామాయణంబను నభిథానంబిడి రచియించిన నితిహాసంబు పరమ పవిత్రంబును, నిహాపరసౌఖ్య సంధాయకంబును నగుటంజేసి యా ప్రబంధంబు శ్రీ వైష్ణవసన్నిధానంబున గాలక్షేపము సేయునది” (కులశేఖరమహారాజుచరిత్ర - 2 - 122)

  3. “వేదవేద్యే పరే పుంసి జాతే దశరధాత్మజే |

వేదః ప్రాచేతసా దాసీత్ సాక్షాద్రామాయణాత్మనా ||“. (శ్రీరామకర్ణామృతం - 1 - 99)

(వేదవేద్యుడైన శ్రీరామచంద్రుడు ధశరధ కుమారునిగా జనించగా వేదము వాల్మీకిమహామునిచే శ్రీమద్రామాయణముగా రచింపబడెను - వేదమే వేదములోని సారమే రామాయణము - వేదముచేత తెలియబడు పరమాత్మయే శ్రీరాముడుగా రామాయణము ద్వారా తెలియచేయబడెను)

  1. “శ్రీరామాయణమాదికావ్యమృషిణా వాల్మీకినా నిర్మితం |

వేదాంతార్థవిశారదైరనుదినం స్తుత్యం సురైరర్చితం |

శ్రోతృఊణామషు నాశనం సురతరోస్తుల్యం తు ముక్తిప్రదం |

యేశృణ్వంతి పఠంతి రామచరితం తే యాంతి విష్ణోః పదం ||“. (శ్రీరామకర్ణామృతం - 1 - 102)

(ఆదికావ్యమైన శ్రీమద్రామాయణము ఆది కవియైన శ్రీవాల్మీకిమహర్షిచే వ్రాయబడినది. వేదాంతర్థమును తెలిసినవారు దానిని ప్రతిదినము స్తోత్రము చేయుచుందురు, దేవతలు అర్చింతురు. శ్రీమద్రామాయణమును వినువారి పాపములు పోవును, కోరిన కోరికల నిచ్చునదియగు కల్పవృక్షముతో సమానమైనది, మోక్షము నిచ్చునది. అందుచేత శ్రీరామచరిత్రమైన శ్రీమద్రామయణమును వినువారును, చదువువారును శ్రీమహావిష్ణువుని లోకమైన పరమపదమును పొందుదురు.

  1. ఆదౌ రామతపోవనానుగమనం, హత్వామృగం కాంచనం |

వేదేహీ హరణం జటాయుమరణం, సుగ్రీవ సంభాషణం |

వాలేర్నిగ్రహణం, సముద్రతరణం లంకాపురీదహనం |

పశ్చా ద్రావణ కుంభకర్ణవధనం ఏ తద్ధి రామాయణం ||.

(రామాయణము క్లుప్తముగా చెప్పబడినది : - శ్రీరామచంద్రుడు తండ్రి ఆజ్ఞప్రకారము తపోవనమునకు వెళ్ళుట, బంగారు లేడిని సమ్హరించుట, సీతాపహరణం, జటాయువు మరణము, సుగ్రీవునితో సంభాషించుట, వాలివధ, సముద్రతరణం, లంకాదహనం, రావణకుంభకర్ణుల వధ - ఈ విషయములు గలది రామాయణము)

Transliteration
  1. rāmaṃ ayatiprāsayati iti rāmāyaṇaṃ.

(śrīrāmacaṃdruni prāpiṃpacēyunadi rāmāyaṇamu)

  1. “rāmasya ayanaṃ sthānaṃ prāpayati” iti rāmāyaṇaṃ.

(śrīrāmuni sthānamunu prāpiṃpacēyunadi)

  1. “śrīrāmacaṃdrasya anaṃtakalyāṇa sadguṇalīlā dharma pravartanā dyupākhyātvāt”.

(śrīrāmacaṃdruni anaṃtakalyāṇa dharma sadguṇalīlā pravartanādula caritramugāna rāmāyaṇamani ceppabaḍinadi)

  1. “kāvyaṃ rāmāyaṇaṃ kṛtsnaṃ sītāyāścaritaṃ mahat |”.

(rāmāyaṇamaṃtayu sītādēvi caritramē) rāmuḍē prapaṃcamaṃtaṭikī ayanamu āśrayamu. ī viṣayamu ceppunadi rāmāyaṇamu).

  1. (ātma paramātmala saṃbaṃdhamu. paramātmanuṃḍi viḍipōyina ātma (jīvātma) marala jīvātmanu cēruṭalō gala kaṣṭamulu, civaraku ēkamaguṭa, sītāpaharaṇamu, rāvaṇasamhārānaṃtaramu sītādēvi kaliyuṭa rūpamugā ceppunadi)

  2. “tolli bṛṃdāraka bṛṃda saṃprārthituṃḍai gōviṃduḍu rāvaṇa vadārthaṃbugā daśaradha sutuṃḍai yudayiṃci cēyu kāryaṃbulu valmīka saṃbhavuṃḍai śrīrāmāyaṇaṃbanu nabhithānaṃbiḍi raciyiṃcina nitihāsaṃbu parama pavitraṃbunu, nihāparasaukhya saṃdhāyakaṃbunu naguṭaṃjēsi yā prabaṃdhaṃbu śrī vaiṣṇavasannidhānaṃbuna gālakṣēpamu sēyunadi” (kulaśēkharamahārājucaritra - 2 - 122)

  3. “vēdavēdyē parē puṃsi jātē daśaradhātmajē |

vēdaḥ prācētasā dāsīt sākṣādrāmāyaṇātmanā ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 99)

(vēdavēdyuḍaina śrīrāmacaṃdruḍu dhaśaradha kumārunigā janiṃcagā vēdamu vālmīkimahāmunicē śrīmadrāmāyaṇamugā raciṃpabaḍenu - vēdamē vēdamulōni sāramē rāmāyaṇamu - vēdamucēta teliyabaḍu paramātmayē śrīrāmuḍugā rāmāyaṇamu dvārā teliyacēyabaḍenu)

  1. “śrīrāmāyaṇamādikāvyamṛṣiṇā vālmīkinā nirmitaṃ |

vēdāṃtārthaviśāradairanudinaṃ stutyaṃ surairarcitaṃ |

śrōtṛūṇāmaṣu nāśanaṃ suratarōstulyaṃ tu muktipradaṃ |

yēśṛṇvaṃti paṭhaṃti rāmacaritaṃ tē yāṃti viṣṇōḥ padaṃ ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 102)

(ādikāvyamaina śrīmadrāmāyaṇamu ādi kaviyaina śrīvālmīkimaharṣicē vrāyabaḍinadi. vēdāṃtarthamunu telisinavāru dānini pratidinamu stōtramu cēyucuṃduru, dēvatalu arciṃturu. śrīmadrāmāyaṇamunu vinuvāri pāpamulu pōvunu, kōrina kōrikala niccunadiyagu kalpavṛkṣamutō samānamainadi, mōkṣamu niccunadi. aṃducēta śrīrāmacaritramaina śrīmadrāmayaṇamunu vinuvārunu, caduvuvārunu śrīmahāviṣṇuvuni lōkamaina paramapadamunu poṃduduru.

  1. ādau rāmatapōvanānugamanaṃ, hatvāmṛgaṃ kāṃcanaṃ |

vēdēhī haraṇaṃ jaṭāyumaraṇaṃ, sugrīva saṃbhāṣaṇaṃ |

vālērnigrahaṇaṃ, samudrataraṇaṃ laṃkāpurīdahanaṃ |

paścā drāvaṇa kuṃbhakarṇavadhanaṃ ē taddhi rāmāyaṇaṃ ||.

(rāmāyaṇamu kluptamugā ceppabaḍinadi : - śrīrāmacaṃdruḍu taṃḍri ājñaprakāramu tapōvanamunaku veḷḷuṭa, baṃgāru lēḍini samhariṃcuṭa, sītāpaharaṇaṃ, jaṭāyuvu maraṇamu, sugrīvunitō saṃbhāṣiṃcuṭa, vālivadha, samudrataraṇaṃ, laṃkādahanaṃ, rāvaṇakuṃbhakarṇula vadha - ī viṣayamulu galadi rāmāyaṇamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.