← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రాముడు rāmuḍu

Original — తెలుగు
  1. రాజ్షసాః యేన మరణం యాంతి స్వోద్రేకతో (అ)ధవా |

రామనామ భువి ఖ్యాతం అభిరామేణ వా పునః |

రాక్షసాన్ మర్త్యరూపేణ రాహుర్మనసి జం యధా (రామతాపిన్యుపషత్)

(వారి ఉద్రేకమువలననే రాక్షసులు ఎవనిచేత మరణమునొందిరో వాడు రాముడు, లేక భూమిమీద అభిరాముడు మనోహరమైన రూపముగలవాడు అగుటచేత రాముడు అని చెప్పబడెను - రాక్షసులను నరుని ఆకారముతో - మర్త్యుని ఆకారముతో - వచ్చి (అవతారమెత్తి) చంపినందున రాముడు అని చెప్పబడెను.)

“విరాథాది రాక్షసాః యేన మరణం యాంతి స్వోద్రేకతః |

స్వపాపకృత్యతః, పునః అభిరామేణ, సర్వలోకమనోరమణరూపేణ రామనామ భువిఖ్యాతం స్యాదిత్యర్థః. రాక్షసాః ఇత్యత్రరేఫార్ణో గృహ్యతే, మరణం యాంతి ఇత్యత్ర మకారః, వర్ణద్వయ యోగే రామో భవతి.”

(వారివారి ఉద్రేకములవలన - పాపములవలన - విరాధుడు మొదలగు రాక్షసులు ఎవరిచేత మరణమును పొందిరో (చనిపోయిరో) అతడు రాముడు. విరాధుడు మొదలగు పాపాత్ములగు రాక్షసులను మరణము పొందించుటచేత రాముడు అని చెప్పబడెను). (లేక, లోకములందంతటను మనస్సును రంజింపచేయు రూపముగలవాడగుటచేతను భూమి మీద రాముడను పేరు కలిగినది. రాక్షసులను చెప్పుటలోని ‘రా’ కారము, మరణము చెప్పుటలోని ‘మ’ కారము, ఈ రెండక్షరములు కలసి - రా + మ = రామ - రాముడయినది)

  1. రాక్షసాన్ మర్త్యరూపేణ రాహుః, మనసిజం రాజ్యార్హణాం మహీభృతామతిరేష మకార యోజనతః ‘రామా’ ఖ్యాస్యాత్, ఇతి లోకదృష్ట్యా ఏవం నామ ప్రకాశయిత్వా, వస్తు దృష్ట్యా అస్య నామార్థ నిర్దిశతి : -

“రమంతే యోగినో యస్మిన్ (అ)నంతే నిత్యానందే చిదాత్మని |

ఇతి రామ పదే నాసౌ పరబ్రహ్మ ధీయతే ||“. (రామతాపిన్యుపనిషత్)

- యోగినః, సమ్యక్ జ్ఞానినః, అనంతే పరిచ్ఛేద త్రయాపహ్నవ సిద్ధే, నిత్య భూమానందే చిదాత్మని చిన్మాత్రే తన్మాత్ర విశేషతయా రమంతే ఇతి రామ పదేన అసౌ భగవాన్ పరబ్రహ్మాభి ధీయతే.)

(మర్త్యుని రూపములో రాక్షసులను - రాజులను - అవి ‘రా’ కారము, ‘మ’ కారము కలుపుటచే రాముడు - అను లోకదృష్టిలో అర్థము చెప్పై, వాస్తవమైన అర్థము ఈ క్రింద విధముగా చెప్పబడెను : - యోగులు, అనగా, సమ్యక్ జ్ఞానులు, బ్రహ్మజ్ఞానులు కాలము, దేశము, వస్తువు అను ఈ మూడు విధముల పరిచ్ఛేదము లేకుండుటచేత అనంతుడు అనియు, నిత్యము ఆనందరూపమే - మోక్షానందరూపమే - అయిన చైతన్యమాత్రుడు (చైతన్యము మాత్రమే అయినవాడు) అయిన ఎవనియందు రమింతురో - నిత్యము తదేక ధ్యానముతో చింతించుదురో - అట్టివాడు రాముడు. యోగులు అతనియందు రమించుటచేత అతను రాముడు అని చెప్పబడెను - ఇట్లు చెప్పుటచేత ‘రామ’ అను పదముచేత ఆ పరబ్రహ్మమే (నిరాకార నిర్గుణ పరబ్రహ్మమే) యని అర్థము).

  1. “రేఫో” వహ్నిః నారాయణే నాకారేణ యోజితశ్చేత్ ‘రా’ ఇతి జఠరో ‘మ’ కారః కేవలో(అ)పి హ్రస్వ మకార యోజనాత్ ‘రామే’ “తిద్వ్యక్షరో భవతి” (రామరహస్యోపనిషత్)

(రేఫము - ‘రకారపొల్లు’ - ఆకారముతో కలిసిన - ర్ +ఆ = ‘రా’ యగును. రా + మ = రామ యను రెండక్షరములు కలిసిన మాటయగును.

  1. “ఆద్యో ‘రా’ తత్పదార్థస్యాత్, ‘మ’ కారస్త్వం పదార్థవాన్ |

తయోస్సం యోజనమసీత్యేవం తత్వవిదో విదుః“. (రామరహస్యోపనిషత్)

(‘రామ’ అనుమాటలోని ‘రా’ అను అక్షరము ‘తత్’ పదార్థము. ‘తత్’ అనినది పరబ్రహ్మ వాచకము - ‘మ’ కారము ‘త్వం’ పదార్థము - (త్వం = నీవు = జీవుడు - జీవాత్మ). ఈ రెండు రా + మ = రామ, అని = అయితివి - (తత్వమసి - “పరబ్రహ్మ నీవు అయితివి” అను మహావాక్యము యొక్క అర్థమగును - ఈ ప్రకారము తత్వమును - పరతత్వమును - ఎఱిగినవారు తెలియుదురు - దీని వలన రాముడనగా పరబ్రహ్మ యనియే యర్థము)

  1. “క. సత్య జ్ఞానానంద

ప్రత్యగభిన్నాత్మునందు బ్రహ్మాది బుధుల్

నిత్యము రమించుచుండగ

కాత్యాయని రామపదము గలిగె నరునకున్“. (శ్రీసీతారామాంజనేయ సంవాదము - 1 - 69) (చూడుము - 2)

  1. “రమయ తీతి రామః”; “రమంతే అస్మిన్ ఇతి రామః”.

(రమింపచేయువాడు, ఆనందింపచేయువాడు కనుక రాముడు; లేక ఇతనియందు రమింతురు కనుక రాముడు).

  1. “నిత్యానంద లక్షణే అస్మిన్ యోగినః రమంతే ఇతి రామః”

(నిత్యానంద లక్షణముగల - మోక్షస్వరూపుడైన - యీ పరమాత్మయందు యోగులు రమింతురు కనుక రాముడని చెప్పబడెను).

  1. సర్వేషు విద్యా దానేషు విఘ్న సూర్య ఈశ శక్తి భేదేషు ఏతేషు వేదశాస్త్రపురాణాదిషు అర్థతః విచారితేషు సత్సు అథ స్వాతిరిక్తకలనా (అ)పహ్నవ సిద్ధం యద్బ్రహ్మమాత్రం నిష్ప్త్రతియోగిక మవశిష్యతే తదేవ రామః -

(విఘ్నేశ్వరుడు, సూర్యుడు, ఈశ్వరుడు, శక్తి అను ఉపాసనా భేదములను వేదములు, శాస్త్రములు, పురాణములు మొదలగువాటి ననుసరించి క్షుణ్ణముగా విచారించగా పరబ్రహ్మకాని వస్తువులన్నియు నశించిపోగా మిగిలియుండునదియే రాముడు).

  1. “క| సార బ్రహ్మాకారా

కారిత ధీవృత్తి నాకు కలుగుటవలనన్

శ్రీరామనామమెఉప్పెను

శ్రీరమ్య బ్రహ్మవిద్య శ్రీయనదగుటన్ “. (శ్రీసీతారామాంజనేయసంవాదము - 3 - 88)

  1. రమతే ఇతరః, నవిద్యతే మా యస్యసః అమః, ర + అమః = రామః. మా యనగా లక్ష్మీదేవి, లక్ష్మీదేవితో కలిసి క్రీడించువాడు. ప్రకృతి, లేక మాయతో కలిసి ఎప్పుడు ఎడతెగకుండ నుండువాడు. సృష్టిలో ప్రకృతితో కలిసికాక వేరుగా నుండనివాడు. సృష్టిలోని ప్రతి పదార్థములోను భగవదంశ ప్రకృతి అంశ కలిసియే యున్నవి. అవి విడదీయుటకు వీలుకానివి. “రశ్చ అసౌ అమశ్చ = రామః.”

  2. “రేఫా మూర్తయః స్యుః శక్తయస్తిస్ర ఏవచ” (రామతాపిన్యుపషత్)

(రాం ఇతి రామబీజే రేతిరేతివ్యం జనతః బ్రహ్మ ఇత్యుచ్యతే. తదుపరి శ్రూయమాణాకారతః, విష్ణుః, మకారతః శివః ఇతి రేఫా రూపాః త్రిమూర్తయః స్యుః - సరస్వతీ, లక్ష్మీ గౌర్తీ భేదేన క్రియాజ్ఞానేచ్ఛా భేదేన వా శక్తయః తిస్రః ఏవచ).

(రామ అనుమాటలోని ‘ర’ కారపొల్లు బ్రహ్మ అనియు, దానితో కలిసిన ‘ఆ’ కారము (ర్ + ఆ = రా) విష్ణువనియు, మకారము శివుడనియు, ఇట్లు త్రిమూర్తులు చెప్పబడుచున్నారు, సరస్వతి, లక్ష్మి, గౌరి అను భేదముతో క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి అను త్రిశక్తులు (మూడు శక్తులు) చెప్పబడుచున్నవి).

  1. “రామ ఇత్యభిరామేణ వ పుషా తస్య చోదితః |

నామధేయం గురుశ్చక్రే జగత్ప్రధమ మంగళం ||“. (కాళిదాసః - రఘువంశే - 10 సర్గే)

(అభిరామేణ మనోహరేణ వపుషా చోదితః ప్రేరితః గురుః పితా దశరధః తస్య పుత్రస్య జగతాం ప్రథమభూతం మంగళం సులక్షణం రామ ఇతి నామధేయం చక్రే. అభిరామత్వమేవ రామశబ్ద ప్రవృత్తి నిమిత్త మిత్యర్థః) (మల్లినాధః)

(సుందరమైన శరీరము కలిగియుండుటచేత జగత్తులో లక్షణమైన - మంగళకరమైన - రాముడు అను నామము తండ్రి అయిన దశరధుడు తన కుమారునకు పెట్టెను).

(అభిరాముడు - మంచి సుందరమైన శరీరము కలిగియుండుట యని రామ శబ్దమునకర్థము)

  1. “స్వేచ్ఛయా రమణీయ వపుః వహన్, వా, దాశరధీ రామః”

(తన ఇష్ట ప్రకారము మనోహరమైన | సుందరమైన శరీరమును ధరించుటచేత దశరధుడు తన కుమారునికి రాముడు అని పేరు పెట్టెను).

  1. ఆనందరూపత్వాత్, పూర్ణత్వాత్, లోకరమణత్వాత్, చ రామః. (శ్రీ ఆనందతీర్థః)

(ఆనందము కలిగించు రూపము కలవాడగుటచేతను, పూర్ణుడగుటచేతను, లోకములన్నింటిలోను మనోహరరూపముకలవాడగుటచేతను రాముడని చెప్పబడుచున్నాడు)

  1. “రామ ఏవ పరబ్రహ్మ” ఇతి శ్రుతేః.

(రాముడే పరబ్రహ్మ అని శ్రుతి చెప్పుచున్నది)

  1. “ఇదం సత్యమిదం సత్యం సత్యమే తదిహోచ్యతే |

రామః సత్యం పరబ్రహ్మ, రామాత్ కించిన్న విద్యతే ||“. ఇతి స్మృతేః.

(ముమ్మాటికి ఇదియే సత్యము - రాముడే పరబ్రహ్మ; రామునికంటె ఉత్కృష్టమైనది లేదు) “రామ పదార్థో బ్రహ్మైవ” - “రామాన్నాస్తి పరం కించిత్” - “రామాన్నాస్తిపరం పదం” (శ్రీరామకర్ణామృతం - 3 - 77)

(రామునికంటె ఉత్కృష్టమైన స్థానము - మోక్షస్థానము లేదు - రాముడే మోక్షస్థానము, వైకుంఠము - వైకుంఠుడే వైకుంఠము, వైకుంఠమే వైకుంఠుడు) రామపదార్థో బ్రహ్మైవ.

“క. పరమబ్రహ్మమనంగా

బరతత్వమనంగ బరమపదమనగను నీ

శ్వరుడన గృష్ణుడన జగ

ద్భరితుడు నారాయణుండు తా నెలకొందున్.” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 3 - 51)

  1. రామనామ్నః ముక్తి హేతుత్వం కథం ఇత్యత్ర ప్రత్యగభిన్న బ్రహ్మ వాచకత్వాత్ తత్ యుజ్యతే.

(రామ అనగా ప్రత్యగాత్మకంటె వేరుకానిది - ప్రత్యగాత్మవాచకము - అందుచేత రామనామము ముక్తికి కారణమగుచున్నది.

  1. రామో విగ్రహవాన్ ధర్మః.

(శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడు - మూర్తీభవించిన ధర్మము)

  1. “రామ పదవాచ్యుడాది నారాయణుండు” (సీతారామాంజనేయ సంవాదము - 1 - 49)

  2. “రామాభిరామం, నయనాభిరామం, వాచాభిరామం, వదనాభిరామం |

సర్వాభిరామం చ సదాభిరామం వందే సదా దాశరధిం చ రామం“. (శ్రీరామకర్ణామృతం - 1 - 96)

(సుందరుడైనవారిలో సుందరుడు, నయన మనోహరుడైనవాడు, ఇంపగు మాటలు కలవాడు, అందమైన మెఉగము కలవాడు, అందఱికిని ఆనందము కలుగచేయువాడు, దశరధకుమారుడైన శ్రీరామచంద్రుని గుఱించి నమస్కరించుచున్నాను).

(రామం - - - థ్యాయే జగన్మోహనం - శ్రీరామకర్ణామృతం - 3 - 7)

  1. “రామే పశ్యామి విశ్వం” (శ్రీరామకర్ణామృతం - 1 - 17)

(ఈ ప్రపంచమంతటిని శ్రీరామచంద్రునిలో చూచుచున్నాను - అనగా శ్రీరామచంద్రుడు విశ్వరూపుడు - ఈ ప్రపంచమంతయు అతని రూపమే - ఈ ప్రపంచములో అతనికంటె వేరైన వస్తువు లేదు).

  1. “యధైవ వటబీజస్థః ప్రాకృతశ్చ మహాన్ ద్రుమః |

తధైవ రామ బీజస్థం జగదేతచ్చరా చరం ||“.

(ప్రకృతి పురుష కలనాకలితం విశ్వం రామబీజే ప్రతిష్టితం - ఇత్యత్రదృష్టాంతః - వటబీజాంతర్గత వట వృక్షవత్ రామ బీజస్థం జగత్ |

(మర్రి విత్తనములో సూక్ష్మరూపములో ఒక పెద్ద మర్రిచెట్టు ఉన్నట్లు ‘రామ’ అను బీజములో ఈ ప్రకృతి పురుష సం యోగమువలన కలిగిన ఈ చరాచర రూపమైన జగత్తు అంతయు ఇమిడియున్నది. ఈ జగత్తు అంతయు రామునిలోనుండి పుట్టినది - మఱ్రి విత్తనములోనుండి మఱ్ఱిచెట్టు పుట్టినట్లు).

  1. శ్రీరాముని తత్వము ఈ క్రిందవిధముగా చెప్పబడినది : -

    1. శ్రీరామడు నిర్గుణ, నిరకార పరబ్రహ్మమేగాని మానవమాత్రుడు కాడు.

మ. సుమతీరాముడు నిర్వికారము, సదాశుద్ధంబు, బుద్ధంబ చిం

త్యమవాచ్యంబతులం బతీంద్రియము, సత్తామాత్రమున్ స్వప్రకా

శము నిర్ద్విందము, నిర్వికల్పమజమున్ సత్సంవిదానంద రూ

పమమూర్త మజరంబు, కేవల పరబ్రహ్మంబు చింతింపగన్. (శ్రీసీతారామంజనేయ సంవాదము - 1 - 77)

  1. “అలం వివాదేన నమానుషో యం రామాత్మనా రాక్షసమర్దనాయ |

భుజంగశయ్యాం పరిముచ్య సాక్షాన్నారయణో భూతల మాజగామ”. (శ్రీరామకర్ణామృతం - 1 - 75)

“చ. కలహ మిఁకేల మానవుడు గాఁడు సుమీ రఘురామచంద్రుఁ డీ

యిల జనియించె రాక్షసుల నే పడగింప భుజంగ తల్పమున్

దొలగి జగన్నియంతయగు తోయజనాభుడు దృష్టిపాత్రుఁడై - - - “. (శ్రీరామకర్ణామృతం - 1 - 75)

  1. “రామం - - - రాజీవాక్ష మమానుషం - - - ధ్యాయే జగాన్మోహనం ||”. (శ్రీరామకర్ణామృతం - 3 -

  2. “రామ పదవాచ్యుడాదినారాయణుండు” (శ్రీసీతారామనాంజనేయ సంవాదము - 1 - 49)

  3. “రాజ మాత్రుండె మేదినీ రక్షకుండు

రామ భూపాలుడాది నారాయణుండు” (మొ ల్లరామాయణము)

  1. “ఉ. రాముడు నిర్వికారుడు నిరామయుడవ్యయుడక్షరుండు ని

ష్కాముడతీంద్రియుండజుడ కర్త యభోక్త యసంగుడంతరా

రాముడు, నిర్వికల్పుడు నిరంజనుడద్వయుండైన యా పరం

ధాముడు గాని చారుగుణధాముడు గాడు, సమీరనందనా“. (శ్రీసీతారామాంజనేయసంవాదము - 1 - 82)

  1. “యః పృధ్వీభరవారణాయ దివిజై స్సంప్రార్థిత శ్చిన్మయః |

సంజాతః పృధివీతలే రవికులే మాయామనుష్యో (అ)వ్యయః |

నిశ్చక్రం హతరాక్షసః పునరగాద్బ్రహ్మత్వమాద్యం స్థిరాం |

కీర్తిం పాపహరాం విధాయ జగతాం తం జానకీశం భజే ||“. (శ్రీరామకర్ణామృతం - 3 - 73)

(భూభారము తగ్గించుటకు దేవతులచేత ప్రార్ధింపబడినవాడై చిన్మయుడు (చైతన్యఘనుడు), అవ్యయుడు అయిన ఆ పరబ్రహ్మమే భూమిమీద రవికులమందు పుట్టి, చక్రాయుధమక్కరలేకనే రాక్షసులను (దుర్మార్గులను) చంపి జగత్తులో పాపమును నశింపచేసిన కీర్తి నెలకొల్పి, తిరిగి తన మొదటిస్థానమైనదిన్నీ, స్థిరమైనదిన్నీ అయిన పరబ్రహ్మ స్థానమును పొందెను).

Transliteration
  1. rājṣasāḥ yēna maraṇaṃ yāṃti svōdrēkatō (a)dhavā |

rāmanāma bhuvi khyātaṃ abhirāmēṇa vā punaḥ |

rākṣasān martyarūpēṇa rāhurmanasi jaṃ yadhā (rāmatāpinyupaṣat)

(vāri udrēkamuvalananē rākṣasulu evanicēta maraṇamunoṃdirō vāḍu rāmuḍu, lēka bhūmimīda abhirāmuḍu manōharamaina rūpamugalavāḍu aguṭacēta rāmuḍu ani ceppabaḍenu - rākṣasulanu naruni ākāramutō - martyuni ākāramutō - vacci (avatārametti) caṃpinaṃduna rāmuḍu ani ceppabaḍenu.)

“virāthādi rākṣasāḥ yēna maraṇaṃ yāṃti svōdrēkataḥ |

svapāpakṛtyataḥ, punaḥ abhirāmēṇa, sarvalōkamanōramaṇarūpēṇa rāmanāma bhuvikhyātaṃ syādityarthaḥ. rākṣasāḥ ityatrarēphārṇō gṛhyatē, maraṇaṃ yāṃti ityatra makāraḥ, varṇadvaya yōgē rāmō bhavati.”

(vārivāri udrēkamulavalana - pāpamulavalana - virādhuḍu modalagu rākṣasulu evaricēta maraṇamunu poṃdirō (canipōyirō) ataḍu rāmuḍu. virādhuḍu modalagu pāpātmulagu rākṣasulanu maraṇamu poṃdiṃcuṭacēta rāmuḍu ani ceppabaḍenu). (lēka, lōkamulaṃdaṃtaṭanu manassunu raṃjiṃpacēyu rūpamugalavāḍaguṭacētanu bhūmi mīda rāmuḍanu pēru kaliginadi. rākṣasulanu ceppuṭalōni ‘rā’ kāramu, maraṇamu ceppuṭalōni ‘ma’ kāramu, ī reṃḍakṣaramulu kalasi - rā + ma = rāma - rāmuḍayinadi)

  1. rākṣasān martyarūpēṇa rāhuḥ, manasijaṃ rājyārhaṇāṃ mahībhṛtāmatirēṣa makāra yōjanataḥ ‘rāmā’ khyāsyāt, iti lōkadṛṣṭyā ēvaṃ nāma prakāśayitvā, vastu dṛṣṭyā asya nāmārtha nirdiśati : -

“ramaṃtē yōginō yasmin (a)naṃtē nityānaṃdē cidātmani |

iti rāma padē nāsau parabrahma dhīyatē ||“. (rāmatāpinyupaniṣat)

- yōginaḥ, samyak jñāninaḥ, anaṃtē paricchēda trayāpahnava siddhē, nitya bhūmānaṃdē cidātmani cinmātrē tanmātra viśēṣatayā ramaṃtē iti rāma padēna asau bhagavān parabrahmābhi dhīyatē.)

(martyuni rūpamulō rākṣasulanu - rājulanu - avi ‘rā’ kāramu, ‘ma’ kāramu kalupuṭacē rāmuḍu - anu lōkadṛṣṭilō arthamu ceppai, vāstavamaina arthamu ī kriṃda vidhamugā ceppabaḍenu : - yōgulu, anagā, samyak jñānulu, brahmajñānulu kālamu, dēśamu, vastuvu anu ī mūḍu vidhamula paricchēdamu lēkuṃḍuṭacēta anaṃtuḍu aniyu, nityamu ānaṃdarūpamē - mōkṣānaṃdarūpamē - ayina caitanyamātruḍu (caitanyamu mātramē ayinavāḍu) ayina evaniyaṃdu ramiṃturō - nityamu tadēka dhyānamutō ciṃtiṃcudurō - aṭṭivāḍu rāmuḍu. yōgulu ataniyaṃdu ramiṃcuṭacēta atanu rāmuḍu ani ceppabaḍenu - iṭlu ceppuṭacēta ‘rāma’ anu padamucēta ā parabrahmamē (nirākāra nirguṇa parabrahmamē) yani arthamu).

  1. “rēphō” vahniḥ nārāyaṇē nākārēṇa yōjitaścēt ‘rā’ iti jaṭharō ‘ma’ kāraḥ kēvalō(a)pi hrasva makāra yōjanāt ‘rāmē’ “tidvyakṣarō bhavati” (rāmarahasyōpaniṣat)

(rēphamu - ‘rakārapollu’ - ākāramutō kalisina - r +ā = ‘rā’ yagunu. rā + ma = rāma yanu reṃḍakṣaramulu kalisina māṭayagunu.

  1. “ādyō ‘rā’ tatpadārthasyāt, ‘ma’ kārastvaṃ padārthavān |

tayōssaṃ yōjanamasītyēvaṃ tatvavidō viduḥ”. (rāmarahasyōpaniṣat)

(‘rāma’ anumāṭalōni ‘rā’ anu akṣaramu ‘tat’ padārthamu. ‘tat’ aninadi parabrahma vācakamu - ‘ma’ kāramu ‘tvaṃ’ padārthamu - (tvaṃ = nīvu = jīvuḍu - jīvātma). ī reṃḍu rā + ma = rāma, ani = ayitivi - (tatvamasi - “parabrahma nīvu ayitivi” anu mahāvākyamu yokka arthamagunu - ī prakāramu tatvamunu - paratatvamunu - eṟiginavāru teliyuduru - dīni valana rāmuḍanagā parabrahma yaniyē yarthamu)

  1. “ka. satya jñānānaṃda

pratyagabhinnātmunaṃdu brahmādi budhul

nityamu ramiṃcucuṃḍaga

kātyāyani rāmapadamu galige narunakun”. (śrīsītārāmāṃjanēya saṃvādamu - 1 - 69) (cūḍumu - 2)

  1. “ramaya tīti rāmaḥ”; “ramaṃtē asmin iti rāmaḥ”.

(ramiṃpacēyuvāḍu, ānaṃdiṃpacēyuvāḍu kanuka rāmuḍu; lēka itaniyaṃdu ramiṃturu kanuka rāmuḍu).

  1. “nityānaṃda lakṣaṇē asmin yōginaḥ ramaṃtē iti rāmaḥ”

(nityānaṃda lakṣaṇamugala - mōkṣasvarūpuḍaina - yī paramātmayaṃdu yōgulu ramiṃturu kanuka rāmuḍani ceppabaḍenu).

  1. sarvēṣu vidyā dānēṣu vighna sūrya īśa śakti bhēdēṣu ētēṣu vēdaśāstrapurāṇādiṣu arthataḥ vicāritēṣu satsu atha svātiriktakalanā (a)pahnava siddhaṃ yadbrahmamātraṃ niṣptratiyōgika mavaśiṣyatē tadēva rāmaḥ -

(vighnēśvaruḍu, sūryuḍu, īśvaruḍu, śakti anu upāsanā bhēdamulanu vēdamulu, śāstramulu, purāṇamulu modalaguvāṭi nanusariṃci kṣuṇṇamugā vicāriṃcagā parabrahmakāni vastuvulanniyu naśiṃcipōgā migiliyuṃḍunadiyē rāmuḍu).

  1. “ka| sāra brahmākārā

kārita dhīvṛtti nāku kaluguṭavalanan

śrīrāmanāmameuppenu

śrīramya brahmavidya śrīyanadaguṭan “. (śrīsītārāmāṃjanēyasaṃvādamu - 3 - 88)

  1. ramatē itaraḥ, navidyatē mā yasyasaḥ amaḥ, ra + amaḥ = rāmaḥ. mā yanagā lakṣmīdēvi, lakṣmīdēvitō kalisi krīḍiṃcuvāḍu. prakṛti, lēka māyatō kalisi eppuḍu eḍategakuṃḍa nuṃḍuvāḍu. sṛṣṭilō prakṛtitō kalisikāka vērugā nuṃḍanivāḍu. sṛṣṭilōni prati padārthamulōnu bhagavadaṃśa prakṛti aṃśa kalisiyē yunnavi. avi viḍadīyuṭaku vīlukānivi. “raśca asau amaśca = rāmaḥ.”

  2. “rēphā mūrtayaḥ syuḥ śaktayastisra ēvaca” (rāmatāpinyupaṣat)

(rāṃ iti rāmabījē rētirētivyaṃ janataḥ brahma ityucyatē. tadupari śrūyamāṇākārataḥ, viṣṇuḥ, makārataḥ śivaḥ iti rēphā rūpāḥ trimūrtayaḥ syuḥ - sarasvatī, lakṣmī gaurtī bhēdēna kriyājñānēcchā bhēdēna vā śaktayaḥ tisraḥ ēvaca).

(rāma anumāṭalōni ‘ra’ kārapollu brahma aniyu, dānitō kalisina ‘ā’ kāramu (r + ā = rā) viṣṇuvaniyu, makāramu śivuḍaniyu, iṭlu trimūrtulu ceppabaḍucunnāru, sarasvati, lakṣmi, gauri anu bhēdamutō kriyāśakti, jñānaśakti, icchāśakti anu triśaktulu (mūḍu śaktulu) ceppabaḍucunnavi).

  1. “rāma ityabhirāmēṇa va puṣā tasya cōditaḥ |

nāmadhēyaṃ guruścakrē jagatpradhama maṃgaḷaṃ ||“. (kāḷidāsaḥ - raghuvaṃśē - 10 sargē)

(abhirāmēṇa manōharēṇa vapuṣā cōditaḥ prēritaḥ guruḥ pitā daśaradhaḥ tasya putrasya jagatāṃ prathamabhūtaṃ maṃgaḷaṃ sulakṣaṇaṃ rāma iti nāmadhēyaṃ cakrē. abhirāmatvamēva rāmaśabda pravṛtti nimitta mityarthaḥ) (mallinādhaḥ)

(suṃdaramaina śarīramu kaligiyuṃḍuṭacēta jagattulō lakṣaṇamaina - maṃgaḷakaramaina - rāmuḍu anu nāmamu taṃḍri ayina daśaradhuḍu tana kumārunaku peṭṭenu).

(abhirāmuḍu - maṃci suṃdaramaina śarīramu kaligiyuṃḍuṭa yani rāma śabdamunakarthamu)

  1. “svēcchayā ramaṇīya vapuḥ vahan, vā, dāśaradhī rāmaḥ”

(tana iṣṭa prakāramu manōharamaina | suṃdaramaina śarīramunu dhariṃcuṭacēta daśaradhuḍu tana kumāruniki rāmuḍu ani pēru peṭṭenu).

  1. ānaṃdarūpatvāt, pūrṇatvāt, lōkaramaṇatvāt, ca rāmaḥ. (śrī ānaṃdatīrthaḥ)

(ānaṃdamu kaligiṃcu rūpamu kalavāḍaguṭacētanu, pūrṇuḍaguṭacētanu, lōkamulanniṃṭilōnu manōhararūpamukalavāḍaguṭacētanu rāmuḍani ceppabaḍucunnāḍu)

  1. “rāma ēva parabrahma” iti śrutēḥ.

(rāmuḍē parabrahma ani śruti ceppucunnadi)

  1. “idaṃ satyamidaṃ satyaṃ satyamē tadihōcyatē |

rāmaḥ satyaṃ parabrahma, rāmāt kiṃcinna vidyatē ||“. iti smṛtēḥ.

(mummāṭiki idiyē satyamu - rāmuḍē parabrahma; rāmunikaṃṭe utkṛṣṭamainadi lēdu) “rāma padārthō brahmaiva” - “rāmānnāsti paraṃ kiṃcit” - “rāmānnāstiparaṃ padaṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 77)

(rāmunikaṃṭe utkṛṣṭamaina sthānamu - mōkṣasthānamu lēdu - rāmuḍē mōkṣasthānamu, vaikuṃṭhamu - vaikuṃṭhuḍē vaikuṃṭhamu, vaikuṃṭhamē vaikuṃṭhuḍu) rāmapadārthō brahmaiva.

“ka. paramabrahmamanaṃgā

baratatvamanaṃga baramapadamanaganu nī

śvaruḍana gṛṣṇuḍana jaga

dbharituḍu nārāyaṇuṃḍu tā nelakoṃdun.” (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 3 - 51)

  1. rāmanāmnaḥ mukti hētutvaṃ kathaṃ ityatra pratyagabhinna brahma vācakatvāt tat yujyatē.

(rāma anagā pratyagātmakaṃṭe vērukānidi - pratyagātmavācakamu - aṃducēta rāmanāmamu muktiki kāraṇamagucunnadi.

  1. rāmō vigrahavān dharmaḥ.

(śrīrāmacaṃdruḍu dharmasvarūpuḍu - mūrtībhaviṃcina dharmamu)

  1. “rāma padavācyuḍādi nārāyaṇuṃḍu” (sītārāmāṃjanēya saṃvādamu - 1 - 49)

  2. “rāmābhirāmaṃ, nayanābhirāmaṃ, vācābhirāmaṃ, vadanābhirāmaṃ |

sarvābhirāmaṃ ca sadābhirāmaṃ vaṃdē sadā dāśaradhiṃ ca rāmaṃ”. (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 96)

(suṃdaruḍainavārilō suṃdaruḍu, nayana manōharuḍainavāḍu, iṃpagu māṭalu kalavāḍu, aṃdamaina meugamu kalavāḍu, aṃdaṟikini ānaṃdamu kalugacēyuvāḍu, daśaradhakumāruḍaina śrīrāmacaṃdruni guṟiṃci namaskariṃcucunnānu).

(rāmaṃ - - - thyāyē jaganmōhanaṃ - śrīrāmakarṇāmṛtaṃ - 3 - 7)

  1. “rāmē paśyāmi viśvaṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 17)

(ī prapaṃcamaṃtaṭini śrīrāmacaṃdrunilō cūcucunnānu - anagā śrīrāmacaṃdruḍu viśvarūpuḍu - ī prapaṃcamaṃtayu atani rūpamē - ī prapaṃcamulō atanikaṃṭe vēraina vastuvu lēdu).

  1. “yadhaiva vaṭabījasthaḥ prākṛtaśca mahān drumaḥ |

tadhaiva rāma bījasthaṃ jagadētaccarā caraṃ ||“.

(prakṛti puruṣa kalanākalitaṃ viśvaṃ rāmabījē pratiṣṭitaṃ - ityatradṛṣṭāṃtaḥ - vaṭabījāṃtargata vaṭa vṛkṣavat rāma bījasthaṃ jagat |

(marri vittanamulō sūkṣmarūpamulō oka pedda marriceṭṭu unnaṭlu ‘rāma’ anu bījamulō ī prakṛti puruṣa saṃ yōgamuvalana kaligina ī carācara rūpamaina jagattu aṃtayu imiḍiyunnadi. ī jagattu aṃtayu rāmunilōnuṃḍi puṭṭinadi - maṟri vittanamulōnuṃḍi maṟṟiceṭṭu puṭṭinaṭlu).

  1. śrīrāmuni tatvamu ī kriṃdavidhamugā ceppabaḍinadi : -

    1. śrīrāmaḍu nirguṇa, nirakāra parabrahmamēgāni mānavamātruḍu kāḍu.

ma. sumatīrāmuḍu nirvikāramu, sadāśuddhaṃbu, buddhaṃba ciṃ

tyamavācyaṃbatulaṃ batīṃdriyamu, sattāmātramun svaprakā

śamu nirdviṃdamu, nirvikalpamajamun satsaṃvidānaṃda rū

pamamūrta majaraṃbu, kēvala parabrahmaṃbu ciṃtiṃpagan. (śrīsītārāmaṃjanēya saṃvādamu - 1 - 77)

  1. “alaṃ vivādēna namānuṣō yaṃ rāmātmanā rākṣasamardanāya |

bhujaṃgaśayyāṃ parimucya sākṣānnārayaṇō bhūtala mājagāma”. (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 75)

“ca. kalaha mim̐kēla mānavuḍu gām̐ḍu sumī raghurāmacaṃdrum̐ ḍī

yila janiyiṃce rākṣasula nē paḍagiṃpa bhujaṃga talpamun

dolagi jaganniyaṃtayagu tōyajanābhuḍu dṛṣṭipātrum̐ḍai - - - “. (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 75)

  1. “rāmaṃ - - - rājīvākṣa mamānuṣaṃ - - - dhyāyē jagānmōhanaṃ ||”. (śrīrāmakarṇāmṛtaṃ - 3 -

  2. “rāma padavācyuḍādinārāyaṇuṃḍu” (śrīsītārāmanāṃjanēya saṃvādamu - 1 - 49)

  3. “rāja mātruṃḍe mēdinī rakṣakuṃḍu

rāma bhūpāluḍādi nārāyaṇuṃḍu” (mo llarāmāyaṇamu)

  1. “u. rāmuḍu nirvikāruḍu nirāmayuḍavyayuḍakṣaruṃḍu ni

ṣkāmuḍatīṃdriyuṃḍajuḍa karta yabhōkta yasaṃguḍaṃtarā

rāmuḍu, nirvikalpuḍu niraṃjanuḍadvayuṃḍaina yā paraṃ

dhāmuḍu gāni cāruguṇadhāmuḍu gāḍu, samīranaṃdanā”. (śrīsītārāmāṃjanēyasaṃvādamu - 1 - 82)

  1. “yaḥ pṛdhvībharavāraṇāya divijai ssaṃprārthita ścinmayaḥ |

saṃjātaḥ pṛdhivītalē ravikulē māyāmanuṣyō (a)vyayaḥ |

niścakraṃ hatarākṣasaḥ punaragādbrahmatvamādyaṃ sthirāṃ |

kīrtiṃ pāpaharāṃ vidhāya jagatāṃ taṃ jānakīśaṃ bhajē ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 73)

(bhūbhāramu taggiṃcuṭaku dēvatulacēta prārdhiṃpabaḍinavāḍai cinmayuḍu (caitanyaghanuḍu), avyayuḍu ayina ā parabrahmamē bhūmimīda ravikulamaṃdu puṭṭi, cakrāyudhamakkaralēkanē rākṣasulanu (durmārgulanu) caṃpi jagattulō pāpamunu naśiṃpacēsina kīrti nelakolpi, tirigi tana modaṭisthānamainadinnī, sthiramainadinnī ayina parabrahma sthānamunu poṃdenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.