(వస్తువులోని సారము - ఇంద్రియములకు ఆనందము కలుగచేయు సారము).
రేతస్సు; ప్రేమ; ద్రవము; అమృతము, గంధకాది ధాతువులు.
తృష్ణా (గాఢమైన కోరిక).
"శృంగారాధౌ రసే, వీర్యే, గుణే, రాగే ద్రవే రసః" ఇత్యమరః.
(రసమను మాట శృంగారము మొదలగు నవరసమందును, వీర్యము, గుణము, రాగము, ద్రవము అని వాటియందును వ్యవహరింపబడుచున్నది.)
(రసము ఒకటే అయినను వస్తుభేదముచేత, కషాయము, మధురము, తిక్తము, కట్వము,ఆమ్లము అను అనేకవిధములుగా నుండును).
(రసము మధురము, ఆమ్లము, లవణము, కటు, కషాయము, తిక్తము అను ఆరు విధములుగా నుండును - వీటియందు రసము మధురముగానే యుండును).
తత్రాద్యాః మారుతం ఘ్నంతి, త్రయస్తిక్తా దయః కఫం |
కషాయతిక్త మధురాః పిత్తమన్యేతు కుర్వతే ||". (చికిత్సాసార సంగ్రహము)
(తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారము, వగరు అని రసములు ఆరు విధములు. వాటిలో తీపి, పులుపు, ఉప్పు ఇవి వాతమును హరించును. చేదు, కారము, వగరు ఇవి శ్లేష్మమును హరించును, వగరు, తీపి, చేదు ఇవి పిత్తమును హరించును).
(రసికుడు అని, రసజ్ఞుడు అని మొదలగుమాటలు వాడుకలోనున్నవి, కనుక రసశబ్దము అనగా రాగము అని ప్రసిద్ధి చెందినది. విషయములగు అనురాగము కలిగియుండుట).
( వస్తువులోని సారము రసము - అవి చిన్మాత్రమే. చైతన్యమాత్రుడైన భగవంతుడే).
(నీటిలోని సారమే రసము. ఆ రసరూపములోనున్న భగవంతునియందు నీరు ప్రోతమై యున్నది).
(నీటిలోని రసము, సారము నేనే - భగవంతుడే)
"రసోస్మ్యహ మసాంసారః, ఆపః ప్రోతారసేమాం" (గీతాభావప్రకాశము - 7 - 48)
(నీటిలోని సారమగు రసము నేనే - రసరూపుడనగు నాయందు నీరు ప్రోతమై యున్నది. ఎందుచేతననగా, - "మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ" (శ్రీమద్భగవద్గీత - 7 - 7)
(నా కంటె ఇతరమైన వస్తువే లేదు, అన్ని వస్తువులలోనున్న సారము నేనే - నీటిలోనున్న ఉత్కృష్టమైన సారము నేనే - నీరు లేనిదే యే ప్రాణి బ్రతకదు).
(భగవంతుడు రసస్వరూపుడు - వస్తువులలోని సారము భగవంతుడే).
"రసో వైసః, రసం హ్యేవాయం లబ్ధ్వా నందీ భవతి, ఏతద్వై సత్స్వరూపం, తత్ సత్వమే వేరితం రసః".
(రసః సారః, చిదానంద ప్రకాశః)
(ఆ పరమాత్మ రసమే, ఈ రసమును పొంది ఆనందమును పొందినవాడగుచున్నాడు, ఈ రసమే సత్వ స్వరూపము, అదియే సత్వమని చెప్పబడినది. రసము అనగా సారము, అన్నసారము మొదలగునవి. దీనిలోనే భగవంతుని చైతన్య శక్తియుండి, దాని ద్వారా అన్నింటికి చైతన్యము కలుగచేయునది).
(రసము మొదలగువాటికి సత్తా మొదలగు కారణమగుటవలనను, వాటిభోక్త యగుటవలనను - దానిని అనుభవించువాడగుటచేతను రసము మొదలగునవి భగవంతుడే)
(నీటిలోనుండు సారము - నీరు సారము కలదయి యుండుట - రసమువలననే, నీటియొక్క స్వభావము - రుచి, మొదలగు గుణములు - రసము కలిగియుండుటవలననే - రసము స్వభావమునుబట్టి నీటి స్వభావములో భేదము)
(నీరు మొదలగునవికూడ భగవంతుడే, అయినప్పటికీ రసము మొదలగువాటి స్వభావములలో, సారములలోను భేదముండుటవలన రసములో భేదము). అంతేగాని నీటిలోని విశేషమువల్ల రసమునకు భేదము కలుగుటలేదు - నీటిలో రసము కలియుటవలననే నీటిసారములో భేదము కలుగుచున్నది.)
(నీటిలోని సారమునకు దానిలో కలిసిన రసమే కారణము)
(అగ్ని అనగా వేడిమినిచ్చు, శక్తిని కలిగించు, చైతవ్యశక్తి - భగవంతుని చైతన్య శక్తి - అది నీటితో కలియగా ద్రవరూపమైన రసముగా మారెను).
(రస స్వరూపుడైన భగవంతుని పొంది ఆనందమును పొందును - అని శ్రుతిలో చెప్పబడుటచేత భగవంతుడు ఆనందమునకు కారణమైనవాడు - ఆనందము మోక్షము - "సచ్చిదానందం బ్రహ్మ" - భగవంతుడు ఆనందరూపుడు, మోక్షరూపుడు)
(రసమనగా తృప్తినిచ్చునది, ఆనందమును కలుగచేయునది, లోకములో మధురరసము మొదలగునవి ప్రసిద్ధములు - బాహ్యానందసాధనములు విడిచిపెట్టినవారికి, ఏ విధమైన కోరికలు (అనురాగము) లేనివారికి, తృప్తిని, ఆనందమును కలుగచేయునవి. వాటియందు రాగములేని విద్వాంశులకు (బ్రహ్మజ్ఙానులకు) పరబ్రహ్మమే ఆనందమును, తృప్తిని ఇచ్చు రసము - అందుచేత అట్టివారికి రసమువలె ఆనందమును కలుగచేయునది పరబ్రహ్మమే).
"యది దం బ్రహ్మ పుచ్ఛాఖ్యం, సత్యజ్ఞానసుఖాద్వయం |
సరసః సర్వదా సాక్షాల్లబ్ద్వా దేహీ సనాతనం |
సుఖీ భవతి సర్వత్ర నాన్యథా సురసత్తమాః |
అసత్యస్మిన్ పరానందే స్వాత్మభూతే(అ)ఖిలాత్మనాం |
కోజీవతి నరో దేవః కోవానిత్యం విచేష్టతే |
తస్మాత్ సర్వాత్మనా చిత్తే భాసమానో రసో హః |
ఆనందయతి దుఃఖాఢ్యం జీవాత్మానం కృపా బలాత్ ||". (సూతసంహితాయాం)
(పంచకోశముల లోపల అవరోక్షముగా ప్రకాశించు చున్నటువంటి "సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ" అని చెప్పబడు లక్షణములుగల బ్రహ్మ ఏది కలదో అదియే మధురరసము వలె - తియ్యగానుండు తేనె, అమృతము మొదలగు రసములవలె ప్రత్యక్ దృష్టిగల యోగులచేత సాక్షాత్తుగా ఎల్లపుడు ఆస్వాదించబడుచుండుటచేత (మధుర రసము నాస్వాదించి అనుభవించుటచేత) అదియే - ఆ పరబ్రహ్మమే - రసము. ఆత్మజ్ఞుడైనవాడు (బ్రహ్మజ్ఞానము కలవాడు) ఆద్యంతములు (జననమరణములు) లేనిదని ఆత్మను - ఇంతకంటె మించిన ఆనందరూపము లేకుండుటచేత రసాత్మకమైన (ఆనందరసమే అయిన) పరబ్రహ్మను సాక్షాత్కరించుకొని అన్ని దేశములందు, అన్ని కాలములందు సుఖము ననుభవించును - పరబ్రహ్మకాని ఇతర ప్రాకృతములైన మధువు మొదలైన నిత్యముకాని రసములందు సుఖము కొంచెము కొంచెముగానే లభించుచుండును. అందుచేత విద్వాంసుల (బ్రహ్మజ్ఞానుల) అనుభవబలమువలన పరబ్రహ్మయే రసము - అన్నింటికంటె మించిన మధురమైన రసము)
(బ్రహ్మ పుచ్ఛమని, సత్యము, జ్ఞానము, సుఖము, అద్వయము, సనాతనము అయిన పరబ్రహ్మమే రసము. దానిని దేహి అయినవాడు ఎల్లపుడు పొంది అంతట సుఖమును పొందును, ఇంకొకరీతిగా సుఖమును పొందడు - ఈ ప్రపంచకములో నిత్యము జీవించువాడెవడు? ఎవడు నిత్యము చేష్ట కలిగియుండును - చైతన్యము కలిగియుండును? అందుచేత అందఱిలోన ఆత్మగా చిత్తములో ప్రకాశించు రసరూపుడగు భగవంతుడు దుఃఖములతో కష్టములు పడు జీవాత్మని కరుణించి ఆనందింప చేయును).
భీభత్సకాద్భుత సహాస్య కృపాభి ధానాః |
శృంగార శాంత సహితాః క్రమ ఏషవద్భిః."
(భయానకరసము, రౌద్రరసము, వీరరసము, భీభత్సరసము, అద్భుతరసము, హాస్యరసము, కృపారసము, శృంగారరసము, శాంతరసము అని రసభేదములు పండితులు చెప్పుదురు)
(ఈ నవరసములు శ్రీరాముని యందుగలవని ఈ క్రింద శ్లోకములో వర్ణింపబడినది : -
"శృంగారం క్షితి నందినీ విహరణే వీరం ధనుర్భంజనే |
కారుణ్యం బలి భోజనే(అ)ద్భుతరసం సింధౌ గిరిస్థాపనే |
హాస్యం సూర్పణఖా ముఖే భయవహే, భీభత్సమన్యాముఖే |
రౌద్రం రావణమర్దనే, మునిజనేశాంతం వపుః పాతువః ||". (శ్రీరామకర్ణామృతం - 1 - 39)
(భూపుత్రి అయిన సీతాదేవితో విహరించునపుడు శృంగారరసమును, శివధనస్సును విరిచినపుడు వీరరసమును, అపరాధముచేసిన కాకాసురునియందు కరుణారసమును, సముద్రమునందు పర్వతములనుంచునపుడు అద్భుతరసమును, శూర్పణక ముక్కును, చెవులను కోయుటలో హాస్యరసమును, శత్రువులయడల భీభత్సరసమును, రావణిని జంపునపుడు రౌద్రరసమును, మునులయడల శాంతిరసమును శ్రీరాముడు కనపఱచెను).
తత్ర సంత చ రసాశ్చతుర్విధాః మా కరందరస ఏవ పంకజే ||". (శ్రీరామకర్ణామృతం - 3 - 76)
(ఓ మనసా! పద్మమునందు ఒక్క పుష్పరసమే యున్నది, కాని శ్రీరాంచంద్రుని పాదముల పద్మములందు ధర్మార్ధకామమోక్షములను నాలుగు విధములైన రసములున్నవి. తుమ్మెద పద్మమువద్దకు వెళ్ళిన ఒక్క పద్మరసమునే అనుభవించును. కాని శ్రీరామచంద్రుని పాదములను పద్మములనాశ్రయించిన నాలుగు విధములైన ధర్మార్థకామమోకషములను పొందవచ్చును - అందుచేత వాటి నాశ్రయించుము)
(తేజస్సువలన రసతన్మాత్రంబు పుట్టె, రసతన్మాత్రంబువలన జలంబు పుట్టె, జిహ్వయను రసనేంద్రియంబు రసగ్రాహకంబయ్యె. ఆ రసంబేకంబైయుండియు భూతవికారముబునంజేసి కషాయ, తిక్త, కట్వామ్ల మధురాది భేదంబుల ననేక భేదంబయ్యె. వెండియు సాంసర్గిక ద్రవ్య వికారంబునం జేసి యార్ద్రంబగుటయు, ముద్దగట్టుటయు దృప్తిదాతృత్వంబును, జీనంబును, దద్వెక్లబ్య నివర్తనంబును, మృదూకరణంబును, దాపనివారణంబును, గూపగతంబయిన జలంబు దివియ మఱియు నుద్గమించుట యను నివి జలవృత్తులనంబడు. రసతన్మాత్రంబువలన దైవ చోదితంబై వికారంబునం బొందిన జలంబువలన గంధతన్మాత్రంబు పుట్టె, దానివలన పృధియుం గలిగె).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 - 893)
(నీవే ఆజలము, జలము, జ్యోతిస్వరూపుడవు నీవే, రసము నీవే, నీవే అమృతస్వరూపుడవు).
(vastuvulōni sāramu - iṃdriyamulaku ānaṃdamu kalugacēyu sāramu).
rētassu; prēma; dravamu; amṛtamu, gaṃdhakādi dhātuvulu.
tṛṣṇā (gāḍhamaina kōrika).
"śṛṃgārādhau rasē, vīryē, guṇē, rāgē dravē rasaḥ" ityamaraḥ.
(rasamanu māṭa śṛṃgāramu modalagu navarasamaṃdunu, vīryamu, guṇamu, rāgamu, dravamu ani vāṭiyaṃdunu vyavahariṃpabaḍucunnadi.)
(rasamu okaṭē ayinanu vastubhēdamucēta, kaṣāyamu, madhuramu, tiktamu, kaṭvamu,āmlamu anu anēkavidhamulugā nuṃḍunu).
(rasamu madhuramu, āmlamu, lavaṇamu, kaṭu, kaṣāyamu, tiktamu anu āru vidhamulugā nuṃḍunu - vīṭiyaṃdu rasamu madhuramugānē yuṃḍunu).
tatrādyāḥ mārutaṃ ghnaṃti, trayastiktā dayaḥ kaphaṃ |
kaṣāyatikta madhurāḥ pittamanyētu kurvatē ||". (cikitsāsāra saṃgrahamu)
(tīpi, pulupu, uppu, cēdu, kāramu, vagaru ani rasamulu āru vidhamulu. vāṭilō tīpi, pulupu, uppu ivi vātamunu hariṃcunu. cēdu, kāramu, vagaru ivi ślēṣmamunu hariṃcunu, vagaru, tīpi, cēdu ivi pittamunu hariṃcunu).
(rasikuḍu ani, rasajñuḍu ani modalagumāṭalu vāḍukalōnunnavi, kanuka rasaśabdamu anagā rāgamu ani prasiddhi ceṃdinadi. viṣayamulagu anurāgamu kaligiyuṃḍuṭa).
( vastuvulōni sāramu rasamu - avi cinmātramē. caitanyamātruḍaina bhagavaṃtuḍē).
(nīṭilōni sāramē rasamu. ā rasarūpamulōnunna bhagavaṃtuniyaṃdu nīru prōtamai yunnadi).
(nīṭilōni rasamu, sāramu nēnē - bhagavaṃtuḍē)
"rasōsmyaha masāṃsāraḥ, āpaḥ prōtārasēmāṃ" (gītābhāvaprakāśamu - 7 - 48)
(nīṭilōni sāramagu rasamu nēnē - rasarūpuḍanagu nāyaṃdu nīru prōtamai yunnadi. eṃducētananagā, - "mattaḥ parataraṃ nānyat kiṃcidasti dhanaṃjaya" (śrīmadbhagavadgīta - 7 - 7)
(nā kaṃṭe itaramaina vastuvē lēdu, anni vastuvulalōnunna sāramu nēnē - nīṭilōnunna utkṛṣṭamaina sāramu nēnē - nīru lēnidē yē prāṇi bratakadu).
(bhagavaṃtuḍu rasasvarūpuḍu - vastuvulalōni sāramu bhagavaṃtuḍē).
"rasō vaisaḥ, rasaṃ hyēvāyaṃ labdhvā naṃdī bhavati, ētadvai satsvarūpaṃ, tat satvamē vēritaṃ rasaḥ".
(rasaḥ sāraḥ, cidānaṃda prakāśaḥ)
(ā paramātma rasamē, ī rasamunu poṃdi ānaṃdamunu poṃdinavāḍagucunnāḍu, ī rasamē satva svarūpamu, adiyē satvamani ceppabaḍinadi. rasamu anagā sāramu, annasāramu modalagunavi. dīnilōnē bhagavaṃtuni caitanya śaktiyuṃḍi, dāni dvārā anniṃṭiki caitanyamu kalugacēyunadi).
(rasamu modalaguvāṭiki sattā modalagu kāraṇamaguṭavalananu, vāṭibhōkta yaguṭavalananu - dānini anubhaviṃcuvāḍaguṭacētanu rasamu modalagunavi bhagavaṃtuḍē)
(nīṭilōnuṃḍu sāramu - nīru sāramu kaladayi yuṃḍuṭa - rasamuvalananē, nīṭiyokka svabhāvamu - ruci, modalagu guṇamulu - rasamu kaligiyuṃḍuṭavalananē - rasamu svabhāvamunubaṭṭi nīṭi svabhāvamulō bhēdamu)
(nīru modalagunavikūḍa bhagavaṃtuḍē, ayinappaṭikī rasamu modalaguvāṭi svabhāvamulalō, sāramulalōnu bhēdamuṃḍuṭavalana rasamulō bhēdamu). aṃtēgāni nīṭilōni viśēṣamuvalla rasamunaku bhēdamu kaluguṭalēdu - nīṭilō rasamu kaliyuṭavalananē nīṭisāramulō bhēdamu kalugucunnadi.)
(nīṭilōni sāramunaku dānilō kalisina rasamē kāraṇamu)
(agni anagā vēḍiminiccu, śaktini kaligiṃcu, caitavyaśakti - bhagavaṃtuni caitanya śakti - adi nīṭitō kaliyagā dravarūpamaina rasamugā mārenu).
(rasa svarūpuḍaina bhagavaṃtuni poṃdi ānaṃdamunu poṃdunu - ani śrutilō ceppabaḍuṭacēta bhagavaṃtuḍu ānaṃdamunaku kāraṇamainavāḍu - ānaṃdamu mōkṣamu - "saccidānaṃdaṃ brahma" - bhagavaṃtuḍu ānaṃdarūpuḍu, mōkṣarūpuḍu)
(rasamanagā tṛptiniccunadi, ānaṃdamunu kalugacēyunadi, lōkamulō madhurarasamu modalagunavi prasiddhamulu - bāhyānaṃdasādhanamulu viḍicipeṭṭinavāriki, ē vidhamaina kōrikalu (anurāgamu) lēnivāriki, tṛptini, ānaṃdamunu kalugacēyunavi. vāṭiyaṃdu rāgamulēni vidvāṃśulaku (brahmajṅānulaku) parabrahmamē ānaṃdamunu, tṛptini iccu rasamu - aṃducēta aṭṭivāriki rasamuvale ānaṃdamunu kalugacēyunadi parabrahmamē).
"yadi daṃ brahma pucchākhyaṃ, satyajñānasukhādvayaṃ |
sarasaḥ sarvadā sākṣāllabdvā dēhī sanātanaṃ |
sukhī bhavati sarvatra nānyathā surasattamāḥ |
asatyasmin parānaṃdē svātmabhūtē(a)khilātmanāṃ |
kōjīvati narō dēvaḥ kōvānityaṃ vicēṣṭatē |
tasmāt sarvātmanā cittē bhāsamānō rasō haḥ |
ānaṃdayati duḥkhāḍhyaṃ jīvātmānaṃ kṛpā balāt ||". (sūtasaṃhitāyāṃ)
(paṃcakōśamula lōpala avarōkṣamugā prakāśiṃcu cunnaṭuvaṃṭi "satyaṃ jñānamanaṃtaṃ brahma" ani ceppabaḍu lakṣaṇamulugala brahma ēdi kaladō adiyē madhurarasamu vale - tiyyagānuṃḍu tēne, amṛtamu modalagu rasamulavale pratyak dṛṣṭigala yōgulacēta sākṣāttugā ellapuḍu āsvādiṃcabaḍucuṃḍuṭacēta (madhura rasamu nāsvādiṃci anubhaviṃcuṭacēta) adiyē - ā parabrahmamē - rasamu. ātmajñuḍainavāḍu (brahmajñānamu kalavāḍu) ādyaṃtamulu (jananamaraṇamulu) lēnidani ātmanu - iṃtakaṃṭe miṃcina ānaṃdarūpamu lēkuṃḍuṭacēta rasātmakamaina (ānaṃdarasamē ayina) parabrahmanu sākṣātkariṃcukoni anni dēśamulaṃdu, anni kālamulaṃdu sukhamu nanubhaviṃcunu - parabrahmakāni itara prākṛtamulaina madhuvu modalaina nityamukāni rasamulaṃdu sukhamu koṃcemu koṃcemugānē labhiṃcucuṃḍunu. aṃducēta vidvāṃsula (brahmajñānula) anubhavabalamuvalana parabrahmayē rasamu - anniṃṭikaṃṭe miṃcina madhuramaina rasamu)
(brahma pucchamani, satyamu, jñānamu, sukhamu, advayamu, sanātanamu ayina parabrahmamē rasamu. dānini dēhi ayinavāḍu ellapuḍu poṃdi aṃtaṭa sukhamunu poṃdunu, iṃkokarītigā sukhamunu poṃdaḍu - ī prapaṃcakamulō nityamu jīviṃcuvāḍevaḍu? evaḍu nityamu cēṣṭa kaligiyuṃḍunu - caitanyamu kaligiyuṃḍunu? aṃducēta aṃdaṟilōna ātmagā cittamulō prakāśiṃcu rasarūpuḍagu bhagavaṃtuḍu duḥkhamulatō kaṣṭamulu paḍu jīvātmani karuṇiṃci ānaṃdiṃpa cēyunu).
bhībhatsakādbhuta sahāsya kṛpābhi dhānāḥ |
śṛṃgāra śāṃta sahitāḥ krama ēṣavadbhiḥ."
(bhayānakarasamu, raudrarasamu, vīrarasamu, bhībhatsarasamu, adbhutarasamu, hāsyarasamu, kṛpārasamu, śṛṃgārarasamu, śāṃtarasamu ani rasabhēdamulu paṃḍitulu ceppuduru)
(ī navarasamulu śrīrāmuni yaṃdugalavani ī kriṃda ślōkamulō varṇiṃpabaḍinadi : -
"śṛṃgāraṃ kṣiti naṃdinī viharaṇē vīraṃ dhanurbhaṃjanē |
kāruṇyaṃ bali bhōjanē(a)dbhutarasaṃ siṃdhau giristhāpanē |
hāsyaṃ sūrpaṇakhā mukhē bhayavahē, bhībhatsamanyāmukhē |
raudraṃ rāvaṇamardanē, munijanēśāṃtaṃ vapuḥ pātuvaḥ ||". (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 39)
(bhūputri ayina sītādēvitō vihariṃcunapuḍu śṛṃgārarasamunu, śivadhanassunu viricinapuḍu vīrarasamunu, aparādhamucēsina kākāsuruniyaṃdu karuṇārasamunu, samudramunaṃdu parvatamulanuṃcunapuḍu adbhutarasamunu, śūrpaṇaka mukkunu, cevulanu kōyuṭalō hāsyarasamunu, śatruvulayaḍala bhībhatsarasamunu, rāvaṇini jaṃpunapuḍu raudrarasamunu, munulayaḍala śāṃtirasamunu śrīrāmuḍu kanapaṟacenu).
tatra saṃta ca rasāścaturvidhāḥ mā karaṃdarasa ēva paṃkajē ||". (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 76)
(ō manasā! padmamunaṃdu okka puṣparasamē yunnadi, kāni śrīrāṃcaṃdruni pādamula padmamulaṃdu dharmārdhakāmamōkṣamulanu nālugu vidhamulaina rasamulunnavi. tummeda padmamuvaddaku veḷḷina okka padmarasamunē anubhaviṃcunu. kāni śrīrāmacaṃdruni pādamulanu padmamulanāśrayiṃcina nālugu vidhamulaina dharmārthakāmamōkaṣamulanu poṃdavaccunu - aṃducēta vāṭi nāśrayiṃcumu)
(tējassuvalana rasatanmātraṃbu puṭṭe, rasatanmātraṃbuvalana jalaṃbu puṭṭe, jihvayanu rasanēṃdriyaṃbu rasagrāhakaṃbayye. ā rasaṃbēkaṃbaiyuṃḍiyu bhūtavikāramubunaṃjēsi kaṣāya, tikta, kaṭvāmla madhurādi bhēdaṃbula nanēka bhēdaṃbayye. veṃḍiyu sāṃsargika dravya vikāraṃbunaṃ jēsi yārdraṃbaguṭayu, muddagaṭṭuṭayu dṛptidātṛtvaṃbunu, jīnaṃbunu, dadveklabya nivartanaṃbunu, mṛdūkaraṇaṃbunu, dāpanivāraṇaṃbunu, gūpagataṃbayina jalaṃbu diviya maṟiyu nudgamiṃcuṭa yanu nivi jalavṛttulanaṃbaḍu. rasatanmātraṃbuvalana daiva cōditaṃbai vikāraṃbunaṃ boṃdina jalaṃbuvalana gaṃdhatanmātraṃbu puṭṭe, dānivalana pṛdhiyuṃ galige).
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 - 893)
(nīvē ājalamu, jalamu, jyōtisvarūpuḍavu nīvē, rasamu nīvē, nīvē amṛtasvarūpuḍavu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.