క్రీడ, వినోదము, గోపకుల క్రీడావిశేషము -
“రాసో నామ బహునర్తకీ యుక్తో నృత్త విశేషః-”
(రాసమనగా అనేక నర్తకిలతో కూడిన నృత్యవిశేషము) (ఒకానొక నృత్యము)
ఇత్థమా కల్పితే మండలే మధ్యగఃసంజగౌ వేణునా దేవకీ నందనః ||” (శ్రీకృష్ణకర్ణామృతం 2 - 35)
(గోపికలెందఱుండిరో అన్ని శ్రీకృష్ణమూర్తులు తానే అయి ఇద్దరు గోపికలమధ్య తనమూర్తి ఒకటి, రెండు శ్రీకృష్ణరూపముల మధ్య ఒక గోపిక - ఈ విధముగా ఒక గోపిక ప్రక్కను ఒక శ్రీకృష్ణరూపము, ఒక శ్రీకృష్ణరూపము ప్రక్క ఒక గోపిక నిలువ మురళి వాయించుచు భక్తిరసపూరితలైన గోపికలతో మండలముగా ఆడిన క్రీడా విశేషము రాసక్రీడ).
చేసెను మండలభ్రమణశీల పరస్పర బద్ధ బాహుకాం
తా సువిలాసమున్ బహువిధ స్ఫురితానన హస్తపాద వి
న్యాసము రాసమున్ గృతవి యచ్చరనేత్రమనో వికాసమున్ ||“.
“వ. ఇట్లు బహుగతులం తిరుగ నేర్పరియగు హర్శించి తన యిరుకెలంకుల నలంకృతలయి కళంకరహిత చంద్రవదనలిద్దరు ముద్దియలుద్దికొని వీణలందుకొని - - - వాయించుచు - గానంబుసేయ - - మురళంబు కేలనందుకొని మురళీ వివరంబులు సారించి పూరించుచు త్రిభంగియై కమలకర్ణికాకారంబున నడుమ నిలిచి, మఱియు గోపసుందరులెందరందఱకు నందఱయి సుందరుల కవల యెడలం దానును, దనకవలయెడల సుందరులును దేజరిల్లు - - - రాసమండలంబు కల్పించె)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా.- 1084, 1085)
“చ. సతులు మఱందులున్ సుతులు బావలు నత్తలు మామలున్ సము
న్నతి వలదన్న మానక మనంబునగృష్ణపదాబ్జసేవానా
న్వి తరతి గోపకామినులు వే చనుదేర దయాపయోధి శో
భితగతి రాసకేళి సలిపెం దుణీ నవ పుష్పచాపుడై“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 2 - 118)
(భగవంతుడు ఒకడే అయినను సృష్టి విధానములో పుట్టిన రూపములన్నియు తానే అయినట్లు ఈ రాసలీలలో భగవంతుడగు శ్రీకృష్ణపరమాత్మ తన విభూతిని - అనేక రూపములతో తానే యగు శక్తిని స్థూలరూపములో ప్రకటింపచేసెను - ఈ రాసక్రీడ ఇప్పటికినీ అరణ్యవాసులలో జరుగుచుండుటకలదు) (చూడుము - విభూతి)
krīḍa, vinōdamu, gōpakula krīḍāviśēṣamu -
“rāsō nāma bahunartakī yuktō nṛtta viśēṣaḥ-”
(rāsamanagā anēka nartakilatō kūḍina nṛtyaviśēṣamu) (okānoka nṛtyamu)
itthamā kalpitē maṃḍalē madhyagaḥsaṃjagau vēṇunā dēvakī naṃdanaḥ ||” (śrīkṛṣṇakarṇāmṛtaṃ 2 - 35)
(gōpikaleṃdaṟuṃḍirō anni śrīkṛṣṇamūrtulu tānē ayi iddaru gōpikalamadhya tanamūrti okaṭi, reṃḍu śrīkṛṣṇarūpamula madhya oka gōpika - ī vidhamugā oka gōpika prakkanu oka śrīkṛṣṇarūpamu, oka śrīkṛṣṇarūpamu prakka oka gōpika niluva muraḷi vāyiṃcucu bhaktirasapūritalaina gōpikalatō maṃḍalamugā āḍina krīḍā viśēṣamu rāsakrīḍa).
cēsenu maṃḍalabhramaṇaśīla paraspara baddha bāhukāṃ
tā suvilāsamun bahuvidha sphuritānana hastapāda vi
nyāsamu rāsamun gṛtavi yaccaranētramanō vikāsamun ||“.
“va. iṭlu bahugatulaṃ tiruga nērpariyagu harśiṃci tana yirukelaṃkula nalaṃkṛtalayi kaḷaṃkarahita caṃdravadanaliddaru muddiyaluddikoni vīṇalaṃdukoni - - - vāyiṃcucu - gānaṃbusēya - - muraḷaṃbu kēlanaṃdukoni muraḷī vivaraṃbulu sāriṃci pūriṃcucu tribhaṃgiyai kamalakarṇikākāraṃbuna naḍuma nilici, maṟiyu gōpasuṃdaruleṃdaraṃdaṟaku naṃdaṟayi suṃdarula kavala yeḍalaṃ dānunu, danakavalayeḍala suṃdarulunu dējarillu - - - rāsamaṃḍalaṃbu kalpiṃce)
(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā.- 1084, 1085)
“ca. satulu maṟaṃdulun sutulu bāvalu nattalu māmalun samu
nnati valadanna mānaka manaṃbunagṛṣṇapadābjasēvānā
nvi tarati gōpakāminulu vē canudēra dayāpayōdhi śō
bhitagati rāsakēḷi salipeṃ duṇī nava puṣpacāpuḍai”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 2 - 118)
(bhagavaṃtuḍu okaḍē ayinanu sṛṣṭi vidhānamulō puṭṭina rūpamulanniyu tānē ayinaṭlu ī rāsalīlalō bhagavaṃtuḍagu śrīkṛṣṇaparamātma tana vibhūtini - anēka rūpamulatō tānē yagu śaktini sthūlarūpamulō prakaṭiṃpacēsenu - ī rāsakrīḍa ippaṭikinī araṇyavāsulalō jarugucuṃḍuṭakaladu) (cūḍumu - vibhūti)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.