← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రసాస్వాదనము rasāsvādanamu

Original — తెలుగు
  1. విక్షేప నివృతి జన్యానందాను భవోవా, సవిక్లప సమాధ్యానం దాను భవో వా రసాస్వాదః ఇత్యుచ్యతే.

(విక్షేప నివృత్తివలన కలిగిన ఆనదానుభవము, లేక, సవికల్పక సమాధివలన కలుగు ఆనందానుభవము - రసాస్వాదమని చెప్పబడును)

  1. చిత్తము భూతరూపములతో పరిణామము చెందిన ఆ శబ్దాదుల అనుభవమే పరమానందమని భావించుట.

  2. అఖండవస్త్వనవలంబనే నాపి చిత్త వృత్తేః సవికల్పకానందాస్వాదనం రసాస్వాదః,సమాధ్యారంభ సమయే సవికల్పకానందా స్వాదనం వా.

(అఖండవస్తువగు పరబ్రహ్మమును పొందలేకపోయినప్పటికీ, చిత్తవృత్తి సవికల్పక సమాధి ఆనందమును ఆస్వాదించుట, లేక సమాధి ఆరంభములో సవికల్పకానందా స్వాదనము.)

  1. "యోగినః బ్రహ్మానందానుభవో జాయతే, విక్షేప రూప దుఃఖనివృతశ్చ అనుభూయతే - కించిత్ దుఃఖనివృత్యాపి ఆనందో జాయతే. యథా భారవా హి పురుషస్య భారాపనయాత్ ఆనందో జాయతే, సహి తదానందో విషయాంతరం కారణం భాగ ప్రయుక్త దుఃఖ నివృత్యాచ "సుఖం మే అభూత్" ఇతి వక్తి తథా యోగినోపి సమాధౌ విక్షేపజన్య దుఃఖ నివృత్యాపి ఆనందో జాయతే, సో అనుభవో రసాస్వాదః ఇత్యుచ్యతే".

(యోగులకు బ్రహ్మాందానుభవము కలుగును. విక్షేపరూపమైన దుఃఖనివృత్తికూడా అనుభవమగుచున్నది. కొంచెమైనను దుఃఖనివృత్తి కలిగిన ఆనందము కలుగుచున్నది. బరువు మోయువాని బరువు క్రిందకు దింపినపుడు ఆనందము కలుగుచున్నది. అట్టి ఆనందమునకు ఇంకొక విషయము కారణముకాదు. భారము మోయుటవలన కలిగిన దుఃఖము నివృత్తి యగుటవలన "నాకు సుఖముగా నున్నది"(నాకు సుఖము కలిగినది) అని చెప్పును. ఆ ప్రకారముగానే యోగులు సమాధియందు విక్షేపమువలన కలుగు దుఃఖము నివృత్తికాగానే ఆనందమును పొందుచున్నారు. అటువంటి అనుభవము రసాస్వాదనము అని చెప్పబడుచున్నది).

  1. "ఆ. వేదకల్పవృక్ష విగళితమై శుక

ముఖ సుధా ద్రవమున మొగసియున్న

భాగవతపురాణ ఫల రసాస్వాదన

పదవి గనుడు, రసికభావ విదులు". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 1 - 37)

Transliteration
  1. vikṣēpa nivṛti janyānaṃdānu bhavōvā, saviklapa samādhyānaṃ dānu bhavō vā rasāsvādaḥ ityucyatē.

(vikṣēpa nivṛttivalana kaligina ānadānubhavamu, lēka, savikalpaka samādhivalana kalugu ānaṃdānubhavamu - rasāsvādamani ceppabaḍunu)

  1. cittamu bhūtarūpamulatō pariṇāmamu ceṃdina ā śabdādula anubhavamē paramānaṃdamani bhāviṃcuṭa.

  2. akhaṃḍavastvanavalaṃbanē nāpi citta vṛttēḥ savikalpakānaṃdāsvādanaṃ rasāsvādaḥ,samādhyāraṃbha samayē savikalpakānaṃdā svādanaṃ vā.

(akhaṃḍavastuvagu parabrahmamunu poṃdalēkapōyinappaṭikī, cittavṛtti savikalpaka samādhi ānaṃdamunu āsvādiṃcuṭa, lēka samādhi āraṃbhamulō savikalpakānaṃdā svādanamu.)

  1. "yōginaḥ brahmānaṃdānubhavō jāyatē, vikṣēpa rūpa duḥkhanivṛtaśca anubhūyatē - kiṃcit duḥkhanivṛtyāpi ānaṃdō jāyatē. yathā bhāravā hi puruṣasya bhārāpanayāt ānaṃdō jāyatē, sahi tadānaṃdō viṣayāṃtaraṃ kāraṇaṃ bhāga prayukta duḥkha nivṛtyāca "sukhaṃ mē abhūt" iti vakti tathā yōginōpi samādhau vikṣēpajanya duḥkha nivṛtyāpi ānaṃdō jāyatē, sō anubhavō rasāsvādaḥ ityucyatē".

(yōgulaku brahmāṃdānubhavamu kalugunu. vikṣēparūpamaina duḥkhanivṛttikūḍā anubhavamagucunnadi. koṃcemainanu duḥkhanivṛtti kaligina ānaṃdamu kalugucunnadi. baruvu mōyuvāni baruvu kriṃdaku diṃpinapuḍu ānaṃdamu kalugucunnadi. aṭṭi ānaṃdamunaku iṃkoka viṣayamu kāraṇamukādu. bhāramu mōyuṭavalana kaligina duḥkhamu nivṛtti yaguṭavalana "nāku sukhamugā nunnadi"(nāku sukhamu kaliginadi) ani ceppunu. ā prakāramugānē yōgulu samādhiyaṃdu vikṣēpamuvalana kalugu duḥkhamu nivṛttikāgānē ānaṃdamunu poṃducunnāru. aṭuvaṃṭi anubhavamu rasāsvādanamu ani ceppabaḍucunnadi).

  1. "ā. vēdakalpavṛkṣa vigaḷitamai śuka

mukha sudhā dravamuna mogasiyunna

bhāgavatapurāṇa phala rasāsvādana

padavi ganuḍu, rasikabhāva vidulu". (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 1 - 37)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.