← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రుద్రాక్ష rudrākṣa

Original — తెలుగు

శ్లో ||. త్రిపురస్య వదార్థాయ దేవానాం తారణాయచ |

సర్వవిఘ్నోపశమనం అహోరాత్రి మచింతయత్ |

దివ్యవర్ష సహస్రంతు చక్షురున్మీలితం మయా |

పశ్యాన్మమా కులా క్షిభ్యః పతితా జలబిందవః |

తత్రాశ్రుబిందుతో జాతాః మహారుద్రాక్ష వృక్షకాః |

మామాజ్ఞయా మహీశేన సర్వేషాం హితకామ్యయా |

బభూవుస్తేచ రుద్రాక్షాః అష్టత్రింశత్ప్రభేదతః |

సూర్యనేత్ర సముర్భూతాఃకపిలా ద్వాదశ స్మృతాః |

సోమనేత్రోత్థిశ్శ్వేతాః తే షోడశవిధా క్రమాత్ |

వహ్ని నేత్రోద్భవాఃకృష్ణా దశభేదా భవంతిహి |

శ్వేతవర్ణశ్చ రుద్రాక్షో జాతితో బ్రహ్మ ఉచ్యతే |

క్షాత్రో రక్తః తథా మిశ్రో వైశ్వః |

కృష్ణస్తు సూద్రకః |

రుద్రాక్షస్య ముఖం బ్రహ్మ, బిందూ రుద్ర ఇతీరితః |

విష్ణుః పుచ్ఛం భవేచ్ఛైవ భోగమోక్షఫలం ప్రదం ||“.

(త్రిపురాసురుని సమ్హరించుటకును, దేవతులను రక్షించుటకును, సమస్త విగ్రహములు శమించుటకును, నేను రాత్రింబవలు చింతించితిని. వేయి దివ్యవత్సరములు నేను కండ్లుమూసుకొని యుంటిని. తర్వాత ఆకులతపొందిన నా కండ్లనుండి జలబిందువులు (కన్నీటి చుక్కలు) రాలినవి. ఆ జలబిందువులనుండి రుద్రాక్షమహావృక్షములు పుట్టినవి. అవి నా ఆజ్ఞచేత అష్టత్రింశద్భేదముల రుద్రాక్షలయినవి. సూర్యనేత్రమునుండి పుట్టినవి కపిలవర్ణముగలవి 12 విధములు - చంద్రనేత్రమునుండి పుట్టినవి తెల్లనివి 16 విధములు - అగ్నినేత్రమునుండు పుట్టినవి నల్లనివి 10 విధములు, తెల్లని రుద్రాక్షలు బ్రహ్మరుద్రాక్షలు, ఎరుపు రంగుగల రుద్రాక్షలు క్షత్ర (క్షత్రియ రుద్రాక్షలు), మిశ్రమరంగు కలవి వైశ్య రుద్రాక్షలు, నల్లరంగుగల రుద్రాక్షలు సూద్ర రుద్రాక్షలు. రుద్రాక్షముఖము బ్రహ్మ, బిందువు రుద్రుడు, తోక విష్ణువు - భోగమోక్షఫలమిచ్చునది).

2.పైన చెప్పినదే రుద్రాక్ష జాబాలోపనిషత్తులో యీ క్రింద విధముగా చెప్పబడినది :-

(త్రిపురపదార్థమహం నిమీలితాక్షో భవన్, తేభ్యో జలందవో భూమౌ పతితాః సర్వానుగ్రహాయ | - - దివ్యవర్షసహస్రాణి చక్షురున్మీలితం మయా | భూమా వక్షి పుటాభ్యంతు పతితా జలబిందవః | తత్రాశ్రు బిందవో జాతాః మహారుద్రాక్ష వృక్షకాః | స్థావరత్వమనుప్రాప్య భకానుగ్రహ కారణాత్ | భక్తానాం ధారణాత్ పాపం దివారాత్రి కృతం హరేత్ “ఇతి కాలాగ్ని రుద్రవచనం” రుద్రాక్షజాబాలోపనిషత్”

(త్రిపురసంహారము గుఱించి నేను నిమీలితనేత్రుడనై యుంటిని - నా కన్నులనుండి అందఱి అనుగ్రహముకొఱకు కన్నీటి బిందువులు భూమిమీద పడినవి. వేయి దివ్య సంవత్సరములు నా కన్నులు ఉన్మీలితముగా నుంచితిని. నా కన్నులనుండి జలబిందువులు భూమిమీద పడినవి. అక్కడ జలబిందువులు మహారుద్రాక్ష వృక్షములు పుట్టినవి. భక్తుల ననుగ్రహించుటకు వృక్షములయినవి. భక్తులు ఆ రుద్రాక్షములను ధరించుటవలన వారు రాత్రింబవలు చేసిన పాపములను హరించును).

Transliteration

ślō ||. tripurasya vadārthāya dēvānāṃ tāraṇāyaca |

sarvavighnōpaśamanaṃ ahōrātri maciṃtayat |

divyavarṣa sahasraṃtu cakṣurunmīlitaṃ mayā |

paśyānmamā kulā kṣibhyaḥ patitā jalabiṃdavaḥ |

tatrāśrubiṃdutō jātāḥ mahārudrākṣa vṛkṣakāḥ |

māmājñayā mahīśēna sarvēṣāṃ hitakāmyayā |

babhūvustēca rudrākṣāḥ aṣṭatriṃśatprabhēdataḥ |

sūryanētra samurbhūtāḥkapilā dvādaśa smṛtāḥ |

sōmanētrōtthiśśvētāḥ tē ṣōḍaśavidhā kramāt |

vahni nētrōdbhavāḥkṛṣṇā daśabhēdā bhavaṃtihi |

śvētavarṇaśca rudrākṣō jātitō brahma ucyatē |

kṣātrō raktaḥ tathā miśrō vaiśvaḥ |

kṛṣṇastu sūdrakaḥ |

rudrākṣasya mukhaṃ brahma, biṃdū rudra itīritaḥ |

viṣṇuḥ pucchaṃ bhavēcchaiva bhōgamōkṣaphalaṃ pradaṃ ||“.

(tripurāsuruni samhariṃcuṭakunu, dēvatulanu rakṣiṃcuṭakunu, samasta vigrahamulu śamiṃcuṭakunu, nēnu rātriṃbavalu ciṃtiṃcitini. vēyi divyavatsaramulu nēnu kaṃḍlumūsukoni yuṃṭini. tarvāta ākulatapoṃdina nā kaṃḍlanuṃḍi jalabiṃduvulu (kannīṭi cukkalu) rālinavi. ā jalabiṃduvulanuṃḍi rudrākṣamahāvṛkṣamulu puṭṭinavi. avi nā ājñacēta aṣṭatriṃśadbhēdamula rudrākṣalayinavi. sūryanētramunuṃḍi puṭṭinavi kapilavarṇamugalavi 12 vidhamulu - caṃdranētramunuṃḍi puṭṭinavi tellanivi 16 vidhamulu - agninētramunuṃḍu puṭṭinavi nallanivi 10 vidhamulu, tellani rudrākṣalu brahmarudrākṣalu, erupu raṃgugala rudrākṣalu kṣatra (kṣatriya rudrākṣalu), miśramaraṃgu kalavi vaiśya rudrākṣalu, nallaraṃgugala rudrākṣalu sūdra rudrākṣalu. rudrākṣamukhamu brahma, biṃduvu rudruḍu, tōka viṣṇuvu - bhōgamōkṣaphalamiccunadi).

2.paina ceppinadē rudrākṣa jābālōpaniṣattulō yī kriṃda vidhamugā ceppabaḍinadi :-

(tripurapadārthamahaṃ nimīlitākṣō bhavan, tēbhyō jalaṃdavō bhūmau patitāḥ sarvānugrahāya | - - divyavarṣasahasrāṇi cakṣurunmīlitaṃ mayā | bhūmā vakṣi puṭābhyaṃtu patitā jalabiṃdavaḥ | tatrāśru biṃdavō jātāḥ mahārudrākṣa vṛkṣakāḥ | sthāvaratvamanuprāpya bhakānugraha kāraṇāt | bhaktānāṃ dhāraṇāt pāpaṃ divārātri kṛtaṃ harēt “iti kālāgni rudravacanaṃ” rudrākṣajābālōpaniṣat”

(tripurasaṃhāramu guṟiṃci nēnu nimīlitanētruḍanai yuṃṭini - nā kannulanuṃḍi aṃdaṟi anugrahamukoṟaku kannīṭi biṃduvulu bhūmimīda paḍinavi. vēyi divya saṃvatsaramulu nā kannulu unmīlitamugā nuṃcitini. nā kannulanuṃḍi jalabiṃduvulu bhūmimīda paḍinavi. akkaḍa jalabiṃduvulu mahārudrākṣa vṛkṣamulu puṭṭinavi. bhaktula nanugrahiṃcuṭaku vṛkṣamulayinavi. bhaktulu ā rudrākṣamulanu dhariṃcuṭavalana vāru rātriṃbavalu cēsina pāpamulanu hariṃcunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.