ధ్వని.
వేదం (వేదము)
మంత్రార్ద వా దేతిహాస పురాణాదిః; అధ్యయనాచ్ది వ్యాపారః.
(వర్ణములకు - అక్షరములకు సంబంధించిన మంత్రములు - అర్థవాదము, ఇతిహాసములు, పురాణములు మొదలగునవి - వేదాధ్యయనము చేయుట మొదలగు వ్యాపారము).
వ్యాకరణము - వర్ణములకు సంబంధించిన శాస్త్రము.
“శ్రోత్ర గ్రాహ్యో గుణః శబ్దః; అకాశమాత్ర వృత్తిః సద్వి విధః - ధ్వన్యాత్మకో వర్ణాత్మకశ్చేతి - ధ్వనాత్మకో భేర్యాదౌ, వర్ణాత్మక సంస్కృత భాషాది రూపః” (తర్క సంగ్రహే)
(చెవి చేత వినబడు గుణము శబ్దము - అవి సూక్ష్మరూపములోనుండు ఆకాశముయొక్క గుణము - శబ్దము రెండు విధములు - ధ్వని, వర్ణములు (అక్షరములు). భేరీ మొదలగు వాద్యములవలన కలుగునది ధ్వని. సంస్కృత భాష మొదలగు భాషరూపము అయినది వర్ణములు (అక్షరములు).
(శబ్దము మూడు విధములు - రెండు వస్తువులు కలిసినందువలన కలిగినది, ఒక వస్తువును విభజించినపుడు కలుగునది. మొదటిది భేరి (బాజా). కఱ్ఱతో కొట్టినపుడు కలుగునది. వేదురు చీల్చినపుడు రెండు పొరలుగా విడినపుడు - కలుగు ఛట ఛట శబ్దము. భేరిమీద కఱ్ఱతో కొట్టినందువలన కలిగిన శబ్దము వినువారి చెవికి తాకునంతవఱకు కలిగిన శబ్దము మూడవది. “ఆద్యే సమవాయికారణం భేర్యాకాశ సం యోగః; నిమిత్తకారణం భేరీ దండ సం యోగః. ద్వితీయే వంశదళాకాశ విభాగో (అ)సమవాయి కారణం, దళద్వయ విభాగో నిమిత్తకారణం. తృతీయే తు పూర్వశబ్దో(అ)సమవాయి కారణం, పవనాదిర్నిమిత్తకారణం ఇతి వివేకః”. (నీలకంఠదీపికా ప్రకాశికాయాం)
(పైన చెప్పిన మూడు విధముల శబ్దములలో మొదటిదానికి భేరీ (బాజా) ఆకాశము కలియుట అసమవాయి కారణము - భేరీని కఱ్ఱతో కొట్టుట (భేరీ కఱ్ఱలు కలియుట) నిమిత్తకారణము. రెండవ దానిలో వెదురులోని దళము పొర, ఆకాశముతో (లోపలనున్న ఆకాశముతో) విడిపోవుటవలన కలిగినది అసమవాయి కారణము - దాని రెండు పొరలు విడిపోవుట - ఒకదానినుండి ఒకటి వేరగుట - నిమిత్త కారణము. మూడవదానిలో మొదట కలిగిన శబ్దము అసమవాయి కారణము, గాలిద్వారా ఆశబ్దము చెవికి వచ్చుటచేత గాలి నిమిత్తకారణము - అని తెలుసుకొనవలెను).
(శబ్దము మూడు విధములు - సం యోగము వలన కలుగునది. (ఒక వస్తువు ఇంకొక వస్తువు కలియునపుడు కలుగునది) మొదటిది. రెండవది - ఒక వస్తువు రెండుగా విభజించబడినప్పుడు కలిగినది - చీల్చబడినపుడు కలిగినది. మూడవది - ఒక శబ్దమువలన కలిగిన ఇంకొక శబ్దము - మొదటి ధ్వనికి ఉదాహరణ - భేరీని (బాజాను) కఱ్ఱతో కొట్టినపుడు ‘ఢాం’ ‘ఢాం’ అని కలుగు శబ్దము - మఱియు, మద్ధిలను చేతితో కొట్టినపుడు - వాయించినపుడు - కలుగు ధ్వని, వెదురు రెండు పొరలుగా చీల్చినపుడు పటపట ధ్వని. శబ్దము మొదట ఎక్కడ పుట్టినదో ఆ ప్రదేశమునుండి వినువాని చెవివఱకు గాలి యను కారణముద్వారా శబ్దధార (ధారవలె కలుగు శబ్దము) కలుగును. అప్పుడు మొదట కలిగిన శబ్దము తర్వాత కలిగిన శబ్ద ధారకు కారణము - అప్పుడు మొదట కలిగిన శబ్దమును విడిచిపెట్టి తర్వాత చెవివఱకు కలిగిన శబ్దములు మూడవ విధమునకు చెందినవి - శబ్దము వలన కలిగిన శబ్దము).
(చెవి అను ఇంద్రియమునకు విషయమైనది. సంగీతము మొదలగు చెవికి ఇంపగువాటిని వినుట. శబ్దము ఆకాశము యొక్క గుణము -).
శబ్దః ఖే, పౌరుషం నృషు” - ప్రభాస్మి శశి సూర్యోః |
ప్రణవః సర్వ వేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు“. (శ్రీమద్భగవద్గీత - 7 - 8)
(శ్రీకృష్ణ భగవానుడు తన విభూతులను చెప్పుచూ ఆకాశము యొక్క గుణమగు శబ్దము తానే అని చెప్పి యుండెను).
ప్రమాణములలో నొకటి వేద ప్రమాణము - ఆప్తులగువారు, లేక, సర్వజ్ఞులగువారు చెప్పినది నిజమైనది అని దానిని ప్రమాణముగ తీసుకొనుచున్నారు. వేదము భగవంతుని ముఖమునుండి పుట్టినది కనుక శబ్దము - శబ్దబ్రహ్మము - అని చెప్పబడుచున్నది. భగవంతుని నుండి కలిగినది కనుక అది అపౌరుషేయము - ఒక సామాన్య పురుషుడు ప్రారంభించినది కదు - సామాన్య పురుషుని వ్రాసిన గ్రంధములో తప్పులుండవచ్చు - కాని వేదములో నుండవు. అందుచేత అది ప్రమాణగ్రంధము - వేదములో చెప్పబడినదానికి వేదమే ప్రమాణము - ఇతర గ్రంధములలో వేదములో చెప్పబడిన విషయములున్నయడల ఆ గ్రంధము కూడ ప్రమాణ గ్రంధమే).
“రజస్సత్వంబులచే నుప బృంహితంబై వికారంబునొందిన మహత్తత్త్వంబువలనం దమః ప్రథానంబై దివ్యజ్ఞాన క్రియాత్మకంబగు నహంకారంబు గలిగె. అదియు రూపాంతరంబు లొందుచు ద్రవ్యశక్తి యైన రాజసంబును గ్రియాశక్తి యైన తామసంబును, జ్ఞానశక్తియైన సాత్వికంబును నన మూడు విధంబులయ్యె. అందు భూతాదియైన తామసాహంకారంబువలన నభంబు గలిగె, నభంబునకు సూక్ష్మరూపంబు భూత దృశ్యంబునకు బోధకంబైన శబ్దంబు గుణంబగు -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 86)
dhvani.
vēdaṃ (vēdamu)
maṃtrārda vā dētihāsa purāṇādiḥ; adhyayanācdi vyāpāraḥ.
(varṇamulaku - akṣaramulaku saṃbaṃdhiṃcina maṃtramulu - arthavādamu, itihāsamulu, purāṇamulu modalagunavi - vēdādhyayanamu cēyuṭa modalagu vyāpāramu).
vyākaraṇamu - varṇamulaku saṃbaṃdhiṃcina śāstramu.
“śrōtra grāhyō guṇaḥ śabdaḥ; akāśamātra vṛttiḥ sadvi vidhaḥ - dhvanyātmakō varṇātmakaścēti - dhvanātmakō bhēryādau, varṇātmaka saṃskṛta bhāṣādi rūpaḥ” (tarka saṃgrahē)
(cevi cēta vinabaḍu guṇamu śabdamu - avi sūkṣmarūpamulōnuṃḍu ākāśamuyokka guṇamu - śabdamu reṃḍu vidhamulu - dhvani, varṇamulu (akṣaramulu). bhērī modalagu vādyamulavalana kalugunadi dhvani. saṃskṛta bhāṣa modalagu bhāṣarūpamu ayinadi varṇamulu (akṣaramulu).
(śabdamu mūḍu vidhamulu - reṃḍu vastuvulu kalisinaṃduvalana kaliginadi, oka vastuvunu vibhajiṃcinapuḍu kalugunadi. modaṭidi bhēri (bājā). kaṟṟatō koṭṭinapuḍu kalugunadi. vēduru cīlcinapuḍu reṃḍu poralugā viḍinapuḍu - kalugu chaṭa chaṭa śabdamu. bhērimīda kaṟṟatō koṭṭinaṃduvalana kaligina śabdamu vinuvāri ceviki tākunaṃtavaṟaku kaligina śabdamu mūḍavadi. “ādyē samavāyikāraṇaṃ bhēryākāśa saṃ yōgaḥ; nimittakāraṇaṃ bhērī daṃḍa saṃ yōgaḥ. dvitīyē vaṃśadaḷākāśa vibhāgō (a)samavāyi kāraṇaṃ, daḷadvaya vibhāgō nimittakāraṇaṃ. tṛtīyē tu pūrvaśabdō(a)samavāyi kāraṇaṃ, pavanādirnimittakāraṇaṃ iti vivēkaḥ”. (nīlakaṃṭhadīpikā prakāśikāyāṃ)
(paina ceppina mūḍu vidhamula śabdamulalō modaṭidāniki bhērī (bājā) ākāśamu kaliyuṭa asamavāyi kāraṇamu - bhērīni kaṟṟatō koṭṭuṭa (bhērī kaṟṟalu kaliyuṭa) nimittakāraṇamu. reṃḍava dānilō vedurulōni daḷamu pora, ākāśamutō (lōpalanunna ākāśamutō) viḍipōvuṭavalana kaliginadi asamavāyi kāraṇamu - dāni reṃḍu poralu viḍipōvuṭa - okadāninuṃḍi okaṭi vēraguṭa - nimitta kāraṇamu. mūḍavadānilō modaṭa kaligina śabdamu asamavāyi kāraṇamu, gālidvārā āśabdamu ceviki vaccuṭacēta gāli nimittakāraṇamu - ani telusukonavalenu).
(śabdamu mūḍu vidhamulu - saṃ yōgamu valana kalugunadi. (oka vastuvu iṃkoka vastuvu kaliyunapuḍu kalugunadi) modaṭidi. reṃḍavadi - oka vastuvu reṃḍugā vibhajiṃcabaḍinappuḍu kaliginadi - cīlcabaḍinapuḍu kaliginadi. mūḍavadi - oka śabdamuvalana kaligina iṃkoka śabdamu - modaṭi dhvaniki udāharaṇa - bhērīni (bājānu) kaṟṟatō koṭṭinapuḍu ‘ḍhāṃ’ ‘ḍhāṃ’ ani kalugu śabdamu - maṟiyu, maddhilanu cētitō koṭṭinapuḍu - vāyiṃcinapuḍu - kalugu dhvani, veduru reṃḍu poralugā cīlcinapuḍu paṭapaṭa dhvani. śabdamu modaṭa ekkaḍa puṭṭinadō ā pradēśamunuṃḍi vinuvāni cevivaṟaku gāli yanu kāraṇamudvārā śabdadhāra (dhāravale kalugu śabdamu) kalugunu. appuḍu modaṭa kaligina śabdamu tarvāta kaligina śabda dhāraku kāraṇamu - appuḍu modaṭa kaligina śabdamunu viḍicipeṭṭi tarvāta cevivaṟaku kaligina śabdamulu mūḍava vidhamunaku ceṃdinavi - śabdamu valana kaligina śabdamu).
(cevi anu iṃdriyamunaku viṣayamainadi. saṃgītamu modalagu ceviki iṃpaguvāṭini vinuṭa. śabdamu ākāśamu yokka guṇamu -).
śabdaḥ khē, pauruṣaṃ nṛṣu” - prabhāsmi śaśi sūryōḥ |
praṇavaḥ sarva vēdēṣu śabdaḥ khē pauruṣaṃ nṛṣu”. (śrīmadbhagavadgīta - 7 - 8)
(śrīkṛṣṇa bhagavānuḍu tana vibhūtulanu ceppucū ākāśamu yokka guṇamagu śabdamu tānē ani ceppi yuṃḍenu).
pramāṇamulalō nokaṭi vēda pramāṇamu - āptulaguvāru, lēka, sarvajñulaguvāru ceppinadi nijamainadi ani dānini pramāṇamuga tīsukonucunnāru. vēdamu bhagavaṃtuni mukhamunuṃḍi puṭṭinadi kanuka śabdamu - śabdabrahmamu - ani ceppabaḍucunnadi. bhagavaṃtuni nuṃḍi kaliginadi kanuka adi apauruṣēyamu - oka sāmānya puruṣuḍu prāraṃbhiṃcinadi kadu - sāmānya puruṣuni vrāsina graṃdhamulō tappuluṃḍavaccu - kāni vēdamulō nuṃḍavu. aṃducēta adi pramāṇagraṃdhamu - vēdamulō ceppabaḍinadāniki vēdamē pramāṇamu - itara graṃdhamulalō vēdamulō ceppabaḍina viṣayamulunnayaḍala ā graṃdhamu kūḍa pramāṇa graṃdhamē).
“rajassatvaṃbulacē nupa bṛṃhitaṃbai vikāraṃbunoṃdina mahattattvaṃbuvalanaṃ damaḥ prathānaṃbai divyajñāna kriyātmakaṃbagu nahaṃkāraṃbu galige. adiyu rūpāṃtaraṃbu loṃducu dravyaśakti yaina rājasaṃbunu griyāśakti yaina tāmasaṃbunu, jñānaśaktiyaina sātvikaṃbunu nana mūḍu vidhaṃbulayye. aṃdu bhūtādiyaina tāmasāhaṃkāraṃbuvalana nabhaṃbu galige, nabhaṃbunaku sūkṣmarūpaṃbu bhūta dṛśyaṃbunaku bōdhakaṃbaina śabdaṃbu guṇaṃbagu -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 86)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.