← Back to శ · Booklets 41–50 (digitized file 5)

శబ్దప్రమాణము śabdapramāṇamu

Original — తెలుగు
  1. “యస్య వాక్యస్య తాత్పర్య విషయీభూత సంసర్గో మానాంతరేణ నబాధ్యతే, తద్వాక్యం ప్రమాణం”.

(ఏ వాక్యము యొక్క తాత్పర్యము ఇతర ప్రమాణములచేత తెలియబడదో ఆ వాక్యము ప్రమాణము). తెలియని అర్థమును తెలియచేయు అక్షర సముదాయ రూపమైన వాక్యము)

  1. “ఆప్త వాక్యం శబ్దః, ఆప్తస్తు యథార్థవక్తా; వాక్యంతు పదసమూహః, యథా గామానయేతి; శక్తిం పదం; అస్మాత్పదాదయమర్థో బోద్ధవ్యం ఇతి స్వర సంకేత శక్తిః”. (తర్క సంగ్రహే)

(ఆప్తుని వాక్యము - తనకు మేలుకోరువాని వాక్యము శబ్దము - ఆప్తుడు యథార్థమును చెప్పువాడు, ఉన్నది ఉన్నట్టుగ చెప్పువాడు. వాక్యమనగా పదముల సమూహము - మాటలు కలిసినది - “గోవును తీసుకొని రమ్ము” అను దానిలో కొన్ని మాటలు కలిసి యీ వాక్యమైనది. ఈ మాటవలన యీ అర్థము తెలుసుకో తగును అను ఈశ్వరశక్తి)

  1. “బాలుడు గోవును చూచి ఇదేమిటి యని యడుగగనే ఇది గోవు అని చెప్పగనే ఆ శబ్దమును దాని యర్థమగు విషయమును అన్యోన్య సంబంధము గలవిగ గ్రహించి ‘ఆహా’ యని తృప్తిపడును - బాలునకు ‘ఆవు’ అను జ్ఞానము ‘ఆవు’ అను మాటవలననే కలిగెను, కాని చూచుటవలన, ఊహించుటవలన కాదు. కనుక శబ్దమే ప్రమాణము అని ఋజువగుచున్నది. శబ్దమే ముఖ్య ప్రమాణము.

  2. శబ్దమనగా వేదము - శబ్ద బ్రహ్మ - వేదములో చెప్పబడిన విషయము గుఱించి వేదమే ప్రమాణము - వేదార్థమును గుఱించి వ్రాసిన ఇతర గ్రంధములకు వేదమే ప్రమాణము - అని వేదవిరుద్ధముకాని యడల - (శబ్దము -10)

Transliteration
  1. “yasya vākyasya tātparya viṣayībhūta saṃsargō mānāṃtarēṇa nabādhyatē, tadvākyaṃ pramāṇaṃ”.

(ē vākyamu yokka tātparyamu itara pramāṇamulacēta teliyabaḍadō ā vākyamu pramāṇamu). teliyani arthamunu teliyacēyu akṣara samudāya rūpamaina vākyamu)

  1. “āpta vākyaṃ śabdaḥ, āptastu yathārthavaktā; vākyaṃtu padasamūhaḥ, yathā gāmānayēti; śaktiṃ padaṃ; asmātpadādayamarthō bōddhavyaṃ iti svara saṃkēta śaktiḥ”. (tarka saṃgrahē)

(āptuni vākyamu - tanaku mēlukōruvāni vākyamu śabdamu - āptuḍu yathārthamunu ceppuvāḍu, unnadi unnaṭṭuga ceppuvāḍu. vākyamanagā padamula samūhamu - māṭalu kalisinadi - “gōvunu tīsukoni rammu” anu dānilō konni māṭalu kalisi yī vākyamainadi. ī māṭavalana yī arthamu telusukō tagunu anu īśvaraśakti)

  1. “bāluḍu gōvunu cūci idēmiṭi yani yaḍugaganē idi gōvu ani ceppaganē ā śabdamunu dāni yarthamagu viṣayamunu anyōnya saṃbaṃdhamu galaviga grahiṃci ‘āhā’ yani tṛptipaḍunu - bālunaku ‘āvu’ anu jñānamu ‘āvu’ anu māṭavalananē kaligenu, kāni cūcuṭavalana, ūhiṃcuṭavalana kādu. kanuka śabdamē pramāṇamu ani ṛjuvagucunnadi. śabdamē mukhya pramāṇamu.

  2. śabdamanagā vēdamu - śabda brahma - vēdamulō ceppabaḍina viṣayamu guṟiṃci vēdamē pramāṇamu - vēdārthamunu guṟiṃci vrāsina itara graṃdhamulaku vēdamē pramāṇamu - ani vēdaviruddhamukāni yaḍala - (śabdamu -10)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.