శరణు జొచ్చుట; ప్రపత్తి.
అనుకూలస్య చ సంకల్పః ప్రతికూలస్య వివర్జితం |
రక్షస్యతీతి నిశ్వాసో గోప్త త్వవరణం తథా |
ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధాశరణా గతిః ||“.
హిత్వా మాం శరణం యాతాః కథం తాం స్త్యక్తుముత్సహే“.
(భార్యను, ఇల్లును, సంతానమును, ఇష్టమైనవారిని, (ఇష్టమైనవాటిని), ధనమును వదలిపెట్టి నన్నే శరణు పొందిరి. అటివారిని నేను ఎట్లు వదలివేయగలను. శరణుపొందినవారిని శరణిచ్చినవాడు వదలలేడు). (విభీషణుడు శ్రీరామును శరణుపొందినపుడు రాముడు అతనిని వదలలేదు - గయుడు అర్జునుని శరణుపొందినపుడు అర్జునుడు గయుని వదలక శ్రీకృష్ణునితో యుద్ధము చేసెను - యయాతి మహారాజు హనుమంతుని శరణు జొచ్చినపుడు హనుమంతుడు అతనిని వదలలేదు (రామాంజనేయ యుద్ధము), పావురమును శిబి చక్రవర్తి వదలలేదు. గజేంద్రుని శ్రీమహావిష్ణువు వదలలేదు).
అభయం సర్వ భూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ ||.” (శ్రీమద్రామాయాణం - యుద్ధకాండ - 17 - 33)
(నేను నీ వాడనైతిని, నిన్ను శరణు పొందితిని, అని నన్ను శరణుపొందినివానికి, అట్టి సమస్త భూతములకు అభయమిచ్చెదను - శరణమిచ్చెదను - ఇది నా వ్రతము - “సకృత్ప్రణతరక్షాయాం సాక్షీ యస్య విభీషణః”. (శ్రీరామకర్ణామృతం - 3 - 89)
భవద్గతం మే రాజ్యంచ జీవితం చ సుఖానిచ ||“. (వాల్మీకిరామాయణం -)
(లంకను విడిచితిని, స్నేహితులను, ధనమును వదలితిని, నా రాజ్యము నీ పరము చేసితిని, నా జీవితమును, జీవిత సుఖమును వదలివేసితిని. ఈ ప్రకారము అన్నింటిని వదలుకొని నీవే శరణని వచ్చితిని)
విభీషణోవా, సుగ్రీవ, యదు వారావణస్స్వయం ||“. (వాల్మీకి రామాయణము - యుద్ధకాండ)
(వానరోత్తమా! సుగ్రీవా ! ఇతనికి - విభీషణునకు - నేను అభయమిచ్చితిని - శరణిచ్చితిని. ఇతను విభీషణుడే కాని, స్వయముగా రావణుడైననుకాని నేను శరణిచ్చినమాట నిలిపెదను).
భవశరణమితీరయంతి యో వై త్యజభట దూరతరేణ తాన పాపాన్ ||“.
(కమలనయనా, వాసుదేవా, విష్ణూ, భూధరా, అచ్యుతా, శంఖ చక్రపాణీ అని శ్రీమహావిష్ణువును శరణు జొచ్చినవారు ఏ పాపమును చేయనివారు - యమభటులారా, వారి జోలికి మీరు వెళ్ళవద్దు, వారికి దూరముగా నుండుడు)
నీకంటెం బరులు గాన నేరరు జగముల్
నీ కంటె నొడయడెవ్వడు
లోకంబులకెల్ల నిఖిలలోకస్తుత్యా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 7 - 331)
ప్రాణుల రక్షింపవలయు బ్రభువులకెల్లన్ - - - “. (శ్రీమదాంధ్రమభాగవతము - 8 - 7 - 234)
- - - వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్ “. (శ్రీమహాభాగవతము – 8 – 3 - 73)
శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 7)
(ఏది శ్రేయస్కరమో దానిని నాకు చెప్పుము - నేను నీ శిష్యుడను ప్రపన్నుడను - నిన్ను శరణు జొచ్చినవాడను).
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ||“. (శ్రీమద్భగవద్ఘీత - 18 - 66)
(మిగిలిన ధర్మములన్నింటిని - మోక్షోపాయములన్నింటిని విడిచి పెట్టి నన్నే శరణు పొందుము - సమస్త పాపములనుండి నిన్ను నేని విడుదలయినట్లు చేసెదను - మోక్షము నిచ్చెదను).
సర్వాదిక ప్రేమ యుక్తం సర్వప్యాత్ర సమర్పణం |
అఖండా త్రివిధా పూజా తద్రత్యైవ స్వభావతః |
రక్షతీ త్యేవ విశ్వాసః తదీ యోహమితి స్మృతిః |
శరణాగతి రేషాస్యాత్ విష్ణు మోక్షఫలప్రదా ||“.
(విష్ణువొక్కడే సర్వోత్తముడను జ్ఞానముతో అతనియందే జ్ఞానమునుంచి, అందఱికంటె విష్ణునియందు హెచ్చైన ప్రేమ కలిగియుండి, అన్నింటిని అతనికై సమర్పించి, మానసిక, వాచిక, కాయిక పూజ తెంపు లేనట్లుగా చేసి, స్వభావముచేతనే అతనియందే రతి కలిగియుండి, అతనే నన్ను రక్షించును అను విశ్వాసము కలిగి అతని వాడనే నేను అని స్మరించుట - ఇటువంటిది మోక్షఫలమునిచ్చు విష్ణువునందు చేయు శరణాగతి)
ఉన్నవాడనిక వేరే - ఉపాయమేమిటికి |
గతియై రక్షింతువో; కాక రక్షించవో యని |
మతిలోని సంశయము మరి విడిచి |
ఇతరులచే ముందర నిక నెట్టుదునో యని |
వెత తోటి తలచేటి - వెఱపెల్లా విడిచి |
ధృవమైన నా చేతకు తోడు దెచ్చుకొనే ననే |
అవల నన్యులమీద యాస విడిచి - - - ||” (అన్నమాచార్యులు)
ముక్తా దుఃఖా ద్గజేంద్రో జలచర వివశో యం స్మరన్ పాశముక్తః |
కారాగారే విరుద్ధాః శరణ ముపగతా యం నృపా ముక్త బంధాః |
ఆసంస్థం శ్రీముకుందం సతతమహమజం నౌమి ముక్తేర్నిధానం ||“. (గీతాభావప్రకాశము - 1 - 2)
(కౌరవసభలో జుట్టు పట్టుకొని ఈడ్వబడి అవమానింపబడిన ద్రౌపది “హా కృష్ణా” యని శరణుజొచ్చి దుఃఖమును బాసెను. మొసలిచే పట్టుబడి శల్యావశిష్టమైన గజేంద్రుడు విష్ణుని స్మరించి శరణు పొందిన దానిబాధనుండి రక్షించబడెను - ముక్తుడయ్యెను - నరకాసురునిచే చెరసాలలో బంధింపబడిన రాజులు కృష్ణుని శరణు పొంది విడుదల పొందిరి. ముక్తికి - అన్ని విధముల బాధనుండి విముక్తికి - నిధానమైన, ముక్తినిచ్చువాడైన, ముకుందుని గుఱించి నమస్కరించుచున్నాను).
śaraṇu joccuṭa; prapatti.
anukūlasya ca saṃkalpaḥ pratikūlasya vivarjitaṃ |
rakṣasyatīti niśvāsō gōpta tvavaraṇaṃ tathā |
ātmanikṣēpa kārpaṇyē ṣaḍvidhāśaraṇā gatiḥ ||“.
hitvā māṃ śaraṇaṃ yātāḥ kathaṃ tāṃ styaktumutsahē”.
(bhāryanu, illunu, saṃtānamunu, iṣṭamainavārini, (iṣṭamainavāṭini), dhanamunu vadalipeṭṭi nannē śaraṇu poṃdiri. aṭivārini nēnu eṭlu vadalivēyagalanu. śaraṇupoṃdinavārini śaraṇiccinavāḍu vadalalēḍu). (vibhīṣaṇuḍu śrīrāmunu śaraṇupoṃdinapuḍu rāmuḍu atanini vadalalēdu - gayuḍu arjununi śaraṇupoṃdinapuḍu arjunuḍu gayuni vadalaka śrīkṛṣṇunitō yuddhamu cēsenu - yayāti mahārāju hanumaṃtuni śaraṇu joccinapuḍu hanumaṃtuḍu atanini vadalalēdu (rāmāṃjanēya yuddhamu), pāvuramunu śibi cakravarti vadalalēdu. gajēṃdruni śrīmahāviṣṇuvu vadalalēdu).
abhayaṃ sarva bhūtēbhyō dadāmyē tadvrataṃ mama ||.” (śrīmadrāmāyāṇaṃ - yuddhakāṃḍa - 17 - 33)
(nēnu nī vāḍanaitini, ninnu śaraṇu poṃditini, ani nannu śaraṇupoṃdinivāniki, aṭṭi samasta bhūtamulaku abhayamiccedanu - śaraṇamiccedanu - idi nā vratamu - “sakṛtpraṇatarakṣāyāṃ sākṣī yasya vibhīṣaṇaḥ”. (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 89)
bhavadgataṃ mē rājyaṃca jīvitaṃ ca sukhānica ||“. (vālmīkirāmāyaṇaṃ -)
(laṃkanu viḍicitini, snēhitulanu, dhanamunu vadalitini, nā rājyamu nī paramu cēsitini, nā jīvitamunu, jīvita sukhamunu vadalivēsitini. ī prakāramu anniṃṭini vadalukoni nīvē śaraṇani vaccitini)
vibhīṣaṇōvā, sugrīva, yadu vārāvaṇassvayaṃ ||“. (vālmīki rāmāyaṇamu - yuddhakāṃḍa)
(vānarōttamā! sugrīvā ! itaniki - vibhīṣaṇunaku - nēnu abhayamiccitini - śaraṇiccitini. itanu vibhīṣaṇuḍē kāni, svayamugā rāvaṇuḍainanukāni nēnu śaraṇiccinamāṭa nilipedanu).
bhavaśaraṇamitīrayaṃti yō vai tyajabhaṭa dūratarēṇa tāna pāpān ||“.
(kamalanayanā, vāsudēvā, viṣṇū, bhūdharā, acyutā, śaṃkha cakrapāṇī ani śrīmahāviṣṇuvunu śaraṇu joccinavāru ē pāpamunu cēyanivāru - yamabhaṭulārā, vāri jōliki mīru veḷḷavaddu, vāriki dūramugā nuṃḍuḍu)
nīkaṃṭeṃ barulu gāna nēraru jagamul
nī kaṃṭe noḍayaḍevvaḍu
lōkaṃbulakella nikhilalōkastutyā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 7 - 331)
prāṇula rakṣiṃpavalayu brabhuvulakellan - - - “. (śrīmadāṃdhramabhāgavatamu - 8 - 7 - 234)
- - - vāni nātmabhavu nīśvarunē śaraṇaṃbu vēḍedan “. (śrīmahābhāgavatamu – 8 – 3 - 73)
śiṣyastēhaṃ śādhimāṃ tvāṃ prapannaṃ ||“. (śrīmadbhagavadgīta - 2 - 7)
(ēdi śrēyaskaramō dānini nāku ceppumu - nēnu nī śiṣyuḍanu prapannuḍanu - ninnu śaraṇu joccinavāḍanu).
ahaṃ tvā sarvapāpēbhyō mōkṣayiṣyāmi mā śucaḥ ||“. (śrīmadbhagavadghīta - 18 - 66)
(migilina dharmamulanniṃṭini - mōkṣōpāyamulanniṃṭini viḍici peṭṭi nannē śaraṇu poṃdumu - samasta pāpamulanuṃḍi ninnu nēni viḍudalayinaṭlu cēsedanu - mōkṣamu niccedanu).
sarvādika prēma yuktaṃ sarvapyātra samarpaṇaṃ |
akhaṃḍā trividhā pūjā tadratyaiva svabhāvataḥ |
rakṣatī tyēva viśvāsaḥ tadī yōhamiti smṛtiḥ |
śaraṇāgati rēṣāsyāt viṣṇu mōkṣaphalapradā ||“.
(viṣṇuvokkaḍē sarvōttamuḍanu jñānamutō ataniyaṃdē jñānamunuṃci, aṃdaṟikaṃṭe viṣṇuniyaṃdu heccaina prēma kaligiyuṃḍi, anniṃṭini atanikai samarpiṃci, mānasika, vācika, kāyika pūja teṃpu lēnaṭlugā cēsi, svabhāvamucētanē ataniyaṃdē rati kaligiyuṃḍi, atanē nannu rakṣiṃcunu anu viśvāsamu kaligi atani vāḍanē nēnu ani smariṃcuṭa - iṭuvaṃṭidi mōkṣaphalamuniccu viṣṇuvunaṃdu cēyu śaraṇāgati)
unnavāḍanika vērē - upāyamēmiṭiki |
gatiyai rakṣiṃtuvō; kāka rakṣiṃcavō yani |
matilōni saṃśayamu mari viḍici |
itarulacē muṃdara nika neṭṭudunō yani |
veta tōṭi talacēṭi - veṟapellā viḍici |
dhṛvamaina nā cētaku tōḍu deccukonē nanē |
avala nanyulamīda yāsa viḍici - - - ||” (annamācāryulu)
muktā duḥkhā dgajēṃdrō jalacara vivaśō yaṃ smaran pāśamuktaḥ |
kārāgārē viruddhāḥ śaraṇa mupagatā yaṃ nṛpā mukta baṃdhāḥ |
āsaṃsthaṃ śrīmukuṃdaṃ satatamahamajaṃ naumi muktērnidhānaṃ ||“. (gītābhāvaprakāśamu - 1 - 2)
(kauravasabhalō juṭṭu paṭṭukoni īḍvabaḍi avamāniṃpabaḍina draupadi “hā kṛṣṇā” yani śaraṇujocci duḥkhamunu bāsenu. mosalicē paṭṭubaḍi śalyāvaśiṣṭamaina gajēṃdruḍu viṣṇuni smariṃci śaraṇu poṃdina dānibādhanuṃḍi rakṣiṃcabaḍenu - muktuḍayyenu - narakāsurunicē cerasālalō baṃdhiṃpabaḍina rājulu kṛṣṇuni śaraṇu poṃdi viḍudala poṃdiri. muktiki - anni vidhamula bādhanuṃḍi vimuktiki - nidhānamaina, muktiniccuvāḍaina, mukuṃduni guṟiṃci namaskariṃcucunnānu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.