దేహము.
శీర్యతే ఇతి శరీరం
(శిధిలమైపోవునది, నశించిపోవునది కనుక శరీరమని చెప్పబడుచున్నది)
(తన నిజస్థితిని - తాను పరమాత్మ అంశయని, తెలిసినంతనే, లేక కాలక్రమముచే శిధిలమగునది కనుక శరీరమని చెప్పబడినది)
(శీర్యతే ఇతి శరీరం = శిధిలమైపోవునది కనుక శరీరమని చెప్పబడినది.) యత్ప్రాణాపగమే విశరణ భావమా పద్యతే తస్మాత్ శరీరస్య శరీరత్వం”
(చైతన్యము గలది ప్రాణముపోగా అచేతనము - చేతనము లేనిది - అగుచున్నందున దానిని శరీరమందురు - అది శరీరమైనది. ప్రాణము పోయిననే శిధిలమగును - (శిధిలవస్థను పొందుచున్నది) కనుక శరీరమైనది - శిధిలమగునది యని చెప్పబడినది).
(క్షణక్షణము శిధిలమైపోవునది కనుక శరీరమని చెప్పబడినది. దీనినే దేహము (దహింపబడునది) అని కూడ చెప్పడమైనది. లోమములు, త్వక్ (చర్మము), సిరాలు, మాంసము, అస్థి (యముకలు), మజ్జ అను ఆరింటి సముదాయము - ఈ ఆరు కలియుటవలన కలిగినది. స్తంబమువలె ప్రత్యక్షముగా కంటికి కనబడుచున్నది కనుక స్థూలదేహమని చెప్పబడుచున్నది).
పతత్యవశ్యం పరిణామ పేశలం |” (శ్రీరామకర్ణామృతం - 4 - 43)
(ఈ శరీరము శిధిలమగు సంధులు గలది. తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు శిధిలమై పడిపోవునదే.)
(నిత్యుడైన శరీరియొక్క (జీవునియొక్క) ఈ దేహములు అంతము పొందవలసినవే – నశించి పోవలసినవే).
“వాసాంసిజీర్ణాని యథావిహాయ నవాని గృహ్ణాతి నరో(అ)పరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సం యాతి నవాని దేహీ ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 22)
(నరుడు చినిగిపోయిన బట్టలను విడిచిపెట్టి కొత్త బట్టలను కట్టుకొనునట్లు జీవుడు (దేహి) - (దేహము గలవాడు) జీర్ణించిన - శిధిలమైన - శరీరమును వదలి కొత్త శరీరములను పొందును - శిధిలమగునది కనుక శరీరము అని చెప్పబడినది). శిధిలమైన శరీరమును విడుచుటయే మరణము, మరియొక శరీరమును పొందుటయే జననము -)
(శరీరములు నిత్యములుకావు, ఎల్లకాలముండునవికావు - అట్లే వైభవములు కూడ శాశ్వతములు కావు)
యత్ప్రాతః సంస్కృతాం చాన్నం సాయంతశ్చ వినశ్యతి |
తదీయ రస సంపుష్టే కాయే కా నామ నిత్యతా ||“. (పద్మపురాణము)
(స్థిరముగా నుండని వస్తువు చేత స్థిరమైన పని చేయలేరు. ప్రొద్దుట వండిన అన్నము సాయంకాలమునకు రసహీనమగును - నశించును -, కాబట్టి అన్నము స్థిరముగా నుండనిది. స్థిరముగా నుండని యట్టి అన్నముతో పోషింపబడిన శరీరము స్థిరముగా నుండునని యెట్లు భావించగలము ?).
శరీరాణి ప్రజాయంతే - - - ||” (గీతాభావప్రకాశము -3 - 91)
(శుక్ల శోణితములుగా మారిన న్నము వలన శరీరములు పుట్టుచున్నవి).
రోమాణి మాంసం రుధిరాస్థి మజ్జా | ఏతచ్ఛరీరం జల బుద్బుదోపమం ||“.
(వక్షస్థలము, పృష్టము, చేతులు, కాళ్ళు, పిక్కలు, తొడలు, కడుపు, శిరస్సు, రోమములు, మాంసము, రుధిరము (రక్తము), అస్థి (యముకలు), మజ్జా ఇవన్నియు కలిసి శరీరమగుచున్నది).
(నాలుగు విధములుగా నుండి ఆరు విధముల రసములుగల ఆహారము తినిన స్త్రీ పురుషుల సం యోగము వలన ఆ తినిన అన్నరసమే ఏడు రోజులలో రేతస్సుగా మారును. అది ఎట్లంటే - అన్నమునుండి రసము, రసమునుండి రక్తము, రక్తమునుండి మాంసము, మాంసమునుండి మేథస్సు, మేథస్సునుండి స్నాయువు, స్నాయువులనుండి అస్థి, అస్థివలన మజ్జా, మజ్జవలన శుక్లము - ఈ రీతిగా తినిన అన్నము మారును. శుక్లమే రేతస్సు. ఈ రేతస్సే ప్రాణమును ధరించియుండునది - ఈ రేతస్సులోనే సూక్ష్మరూపములో ప్రాణముండును. ఇదియే ముందు కాబోయే జీవుని శరీరము, అందులో నిమిడియుండు ప్రాణమనునదే జీవుడు, లేక, ప్రాణి, పురుషుడు)
(గర్భాదానము ఎప్పుడు జరుగునో అప్పటినుండి శిశువు వృద్ధి పొందును. ఈ వృద్ధిపొందుట పూర్తికాగానే రజోవీర్యమందుండు పరమాణువులచేత అది పూర్తియగును, అప్పుడు అంగములన్నియు ఏర్పడును, స్పష్టమగును. అప్పుడు సీమంతోత్సవము చేయబడును. అప్పుడు ఆ శరీరములోనికి జీవుడు ప్రవేశించుకాలమగును - (లోన చైతన్యము కలిగి యుండుట తెలియబడుచుండును - శరీరనిర్మాణమైన తర్వాతనే జీవుడు అందులో ప్రవేశించుననుట అందఱి అభిప్రాయమై యున్నది. శరీరనిర్మాణము రజో వీర్యాణువులచేత కలుగునని తెలియవలయును)
(భగవదంశ ప్రతి వస్తువులోనున్నప్పటికీ, పురుషుని వీర్యము రేతస్సులో భగవదన్శ సూక్ష్మాతి సూక్ష్మరూ పములోనుండి స్త్రీగర్భమందు ప్రవేశించినను అవయవ నిరూపణగల శరీరనిర్మాణము అగువరకు జీవమున్నట్లు కనబడదు - జీవ చైతన్యమునకు అనుకూలమగు వస్తువుగా (శరీరముగా - ఉపాధిగా) ఆ శరీరముండినప్పుడే దానికి తల్లి కడుపులో చైతన్యము కలుగును - “చేతనత్వంబు గలదేని జీవుడండ్రు”. ఆ చైతన్యము బహిరంగముగా తోచినపుడు ఆ శరీరములో పరమాత్మ (జీవరూపములో) ప్రవేశించును - శరీర నిర్మాణము పూర్తి అయిన తర్వాత జీవుడందు ప్రవేశించును అని అనుటలో తాత్పర్యమిదియే)
“శుక్లాధిక్యే భవేత్పుంసః నారీ రక్తాధికే నతు |
శుక్లరిక్త సమత్వేన నపున్సక ఇతీరితా ||“.
దుష్కృతి కర్మ విశేషంవల్ల అంధక, బధిర, మూక, కుబ్జ, సౌందర్యహీన, షండ మొదలయిన అవలక్ష గుణాలు గలవాడగును - “శాకాద్యన్న పరిణామ సోపాధిర్పిద్య మానత్వాత్” అని కలదు. అస్థి, స్నాయు మజ్జా - ఈ మూడును తండ్రి యొక్క అంశాలు, చర్మ, మాంస రిక్తాలు - ఈ మూడున్నూ తల్లి అంశాలు - అందుచేత షట్కేశిక శరీరం ” అనబడెను. (బ్రహ్మవిద్యా సుధార్ణవము - 2)
పూర్ణం మూత్ర పురీషాభ్యాం స్థూలం నింద్యమిదం వపుః |
పంచీకృతేభ్యో భూతేభ్యో స్తూలేభ్యః పూర్వ కర్మణా |
సముత్పన్నమిదం భోగాయతనమాత్మనః |
సర్వోపి భాహ్య సంసారః పురుషస్య యదాశ్రయం |
విద్ధి దేహమిదం స్థూలం గృహవద్గృహ మేధినః ||“. (శ్రీశంకరః - వివేకచూడామణి)
(చర్మము, మాంసము, రక్తము, స్నాయువు, మేదస్సు, మజ్జా, అస్థి (యముకలు) ఇవి అన్నియు కలిసినది, మూత్రము తోడను, పురీషము తోడను నిండియుండునది, నింద్యమైనది, స్థూలరూపములో నుండునది - కంటికి కనబడునది - ఇట్టిది శరీరము. పంచీకృతమైన స్థూల పంచ భూతములతో పూర్వ జన్మల కర్మ ఫలితముగా ఆత్మకు (జీవాత్మకు) భోగములకు స్థానముగా - పాప పుణ్య ఫలమనుభవించుటకు స్థానముగా - పుట్టినది. గృహమేధికి గృహమువలె నిర్మింపబడినది.)
(పురుషునకు - జీవాత్మకు భోగాపవర్గముల నిమిత్తము సత్వరజస్తమోగుణములుగల ప్రకృతి దేహేంద్రియములుగ మారినవాటి సంఘాతమే శరీరము. పరమాత్మయందు భోగించుట యేది కలదో అది భోగాయతనము)
తం సప్తధాతుం, త్రిమలం, త్రి త్రియోనిం, చతుర్విధాహారమయం |
శరీరం భవతి. పంచాత్మకమితి కస్మాత? పృధివ్యప్తేజో వాయురాకాశం ఇతి. అస్మిన్ శరీరే క పృధివీ ? కా ఆపః, కిం మేజః కోవాయు, కో ఆకాశమితి? అస్మిన్ పంచాత్మక శరీరే యత్కఠినం సా పృధివీ, యద్ద్రవం తదాపో, యదుష్ణం తత్తేజో యస్సంచరతి సవాయుః, యత్సుషిరం తదాకాశం ఇత్యుచ్యతే. తత్ర పృధివీ ధారణే, ఆపః పిండీకరణే, తేజోరూప దర్శనే, వాయుర్గమనే ఆకాశమవకాశపదానే“.
(గర్భోపనిషత్)
(ఈ శరీరము పంచభూతాత్మకము - పంచభూతములకలియికచే కలిగినది. అది యెట్లనగా - పచ్ణభూతములు అనగా, పృధివి (భూమి), అప్పు (నీరు), తేజస్సు (అగ్ని), వాయువు (గాలి), ఆకాశము - ఈ శరీరములో ఏది భూమి, ఏది నీరు, ఏది అగ్ని, ఏది గాలి, ఏది ఆకాశము అనగా - సమాధానమిట్లు చెప్పబడినది - ఈ శరీరములో ఏది ఏది కఠినమైనదో అది భూమి అంశ, ఏది ద్రవరూపముగా నున్నదో - నీరువలె పారునది - అది నీరు అంశ, యేది వేడిమి కలిగియున్నదో అది అగ్ని, ఏది సంచరించుచున్నదో అది గాలి, ఏది గొట్టమువలె కాళీగా నున్నదో అది ఆకాశాంశ - వీటిలో భూమి ధరించునది, నీరు పిడచ కట్టునది, అగ్ని రూపమును కనపర్చునది, గాలి గమనము కలిగించునది, ఆకాశము వీటికి అవకాశము కలిగించునది).
(ఈ శరీరము పృధ్వీమయము, ఆపోమయము, వాయుమయము, ఆకాశమయము, తజోమయము, ఈ అయిదు భూతముల మయము - అయిదు భూతములతో నిండియున్నది).
(వాయువు యొక్క వికారములు - మార్పులు - గలది శరీరము - వాయు వికారములు అయిదు విధములుగా నున్నవి - హృదయమందు ప్రాణవాయువు, గుదమందు అపానవాయువు, నాభియందు సమానవాయువు, కంఠమందు ఉదానవాయువు, శరీరమంతటను వ్యానవాయువు కలది శరీరము).
(ఈ శరీరము మరణించు ధర్మము (నైజము) కలది. కేవలము మరణించు ధర్మము కలదియే కాక ఎల్లపుడు మరణించు శీలము కలదిదే - అనగా, పుటిన దగ్గరనుండి వీలయినపుడు మరణించు స్వభావముకలది - ఎప్పుడైనను మరణించునదే - ఈ శరీరము కర్మవలన కలిగినది. ఇటువంటి కర్మవలన కలిగిన శరీరము లేనటువంటి లక్షణము గల అమృతస్వరూపము (మోక్షరూపము) గల ఆత్మకు భోగమునకు అధిష్ఠానమై కర్మకు వశుడైన జీవినిచేత భోగము నిమిత్తము గ్రహింపబడును).
(సత్వరజస్తమోగుణములుగల ప్రకృతి సమస్త కారణవస్తువులు, కార్య వస్తువులు యొక్క ఆకారము పొంది - (ఆకారముగా మారి) - పురుషుని యొక్క - (పరమాత్మ యొక్క - జీవుని యొక్క) భోగము మోక్షము నిమిత్తము దేహము ఇంద్రియములయొక్క ఆకారము పొందుచున్నది. అట్లు దేహము ఇంద్రియముల సంఘాతమే (కూటమియే) యీ శరీరము)
“భగవత్క్రీడా పరికరంబును, గుణత్రయాన్వితంబును నగు ప్రకృతివలనం బుట్టిన మహత్తత్త్వంబున నగు నహంకారంబువలన నయ్యెడు శబ్దస్పర్శాది తన్మాత్రలం బ్రభూతంబులగు గగనాది భూతంబుల మేళనంబునం జేసి యీ శరీరంబులు శరీరులకు భోగభాజనంబు లగుచుండు”. (కులశేఖర మహీపాల చరిత్ర - 2 - 122)
“అస్తి స్తంబం, స్నాయు బద్ధం మాంస శోణిత లేపితం |
చరావనద్ధం దుర్గంధపాత్రం మూత్ర పురీషయోః |
జరా శోక విపాకార్తం రోగమందిర మాతురం |
దూష్పూరం దుర్ధరం దుష్టం సదోషం క్షణ భంగురం |
క్రిమి టిట్ భస్మ సంజ్ఞాంతం శరీరమితి వర్ణితం ||“. (పద్మ పురాణము - 5 - 58 to 60)
(యముకల పంజరం, స్నాయువులచేత బంధింపబడి యుండునది, మాంసము చేతను రక్తము చేతను పూయబడియుండునది, మూత్రము, పురీషము - ఈ రెండింటికి చ్దెడువాసన నిచ్చు నెలవు. ముసలితనము, శోకము, ముదిరిన బాధలు కలుగచేయునది; రోగమునకు నివాసమైనది. పూరింప శక్యముకానిది, దుష్టమైనది, దోషములు కలది, నీటి బుడగవలె క్షణమాత్రముండునది, ఎప్పుడు నశించునో తెలియనిది, ఆఖరున క్రిములచేత తిని వేయబడునది, లేక, అగ్నిచే భస్మము (బూడిద) చేయబడునది - అని ఇట్లు శరీరము వర్ణింపబడినది).
ఊర్ధ్వం కఫం శ్రవణనేత్ర మలం ప్రసూతే |
అంతర్భి భర్తి రుధిరాస్థి పలాస్య ధస్తాత్ |
మూత్ర పురీష మితి పాతు హరేర్జుగుప్సా ||“.
“అత్రలోకే శరీరభాజాం దేహినాం ఇదం అదో దుశ్శరీరం దుష్టం కళేబరం దిష్టం కళేబరం థిక్ |
యస్య శరీరస్య ఊర్థ్వం ఉపరిభాగం శిరర్ర్ణి ఇత్యర్థః ముఖేన కఫం ప్రసూతే ఉత్పాదయతి శ్రవణాభ్యాం కర్ణాభ్యాం నేత్రాభ్యాం చ మలం ప్రసూతే - జనయతి. అంతశ్చ యో దేహో రుధిరం రక్తం చ అస్థి కీకనంచ పలం మాంసం చ తాని బిభర్తి - ధారయతి. అధః తన్నాభేరధో భాగే మూత్రం పురీషం చ బిభర్తి. ఇతి దృష్ట్వా జాయమానా హరేః విష్ణోః జుగుప్సా నః సర్వాన్ పాతు అవతు -“.
(ఈ లోకమందు దేహధారులైనవారి శరీరము దుష్టమైనది. ఎందుచేతననగా - శరీరములోని మీదభాగమైన శిరస్సులో నోటినుండి కఫము వచ్చును - చెవులనుండి, కన్నులనుండు మలము కారుచుండును - శరీరము లోపల భాగములో రక్తము, యముకలు, మాంసము ఉండును. ఈ శరీరము వీటిని ధరించి యుండును. బొడ్డు క్రింభాగమందు మూత్రము, పురీషమును (మలమూత్రములను) ధరించియుండును. అందుచేత ఈ శరీరము అసహ్యకరమైనది. ఈ విషయము తెలుసుకొని భగవంతుని దయయే మనలను రక్షించుగాక అని భగవంతుని ఆశ్రయించవలెను).
ప్రాణస్య స్థూల దేహేషు సమాగమన కారణం ||“.
(పూర్వ జన్మలలో మనస్సుతో సంకల్పించి చేసిన కర్మయే ప్రానము మరల స్థూల శరీరములో ప్రవేశించుటకు కారణము - దీర్ఘముగా కోరిన కోర్కె తీరకయుండుటచేత మరల జన్మ ఎత్తి తెర్చుకొనవలెనని గాఢమైన కోరిక అవసానకాలమందు కలిగియుండుటచేత ఆ కోరిక తీరుటకు అనువైన శరీరము కలుగును)
(ఏ ద్రవ్యము - ఏ వస్తువు - చేతనముగల ఏ వస్తువునకు అన్ని విధముల తన ప్రయోజనమునకు నియమింపబడుచుండునో, తనచే ధరింపబడియుండునో, తన ఇష్టానుసారముగ ఉపయోగించుకొనుటకు వీలగునో అది ఆ చైతన్యముగల వస్తువునకు శరీరము అని చెప్పబడుచున్నది. ఇది శరీరము యొక్క లక్షణము)
(అవ్యాకృతమైన సూక్ష్మ భూతము అవస్థా విశేషమువలన శరీరమైనది).
(ఇరువది అయిదు తత్వములు కలిసినది శరీరము)
(మనుష్యులు మొదలగు వారికి పంచభూతముల కూటమియే శరీరము)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - )
(క్షీణించునది కనుక శరీరమని చెప్పబడినడుచున్నది. శరీరము ఆహారము లేక క్షీణించును, ఆహారమున్నను వ్యాధిచే క్షీణించును, వ్యాధి లేకున్నను వృద్ధాప్యమువలన క్షీణించును; పుట్టిన ప్రతి జీవి - ప్రతి వస్తువు - నశించవలసినదే - మరణ ధర్మముకలవాడు కనుక మర్త్యుడు - (Man is mortal) (Everything in the entire creation is prone to decay and die) -(పోకన్మానదు ప్రాణమెంత తనువున్ పోషించి రక్షించినన్).
(“నేనే వాసుదేవుడను, నేనే మనుష్యుడను నేను స్థూలముగానున్నాను, నేను కృశించియున్నాను” - అని భోక్త అయిన ఆత్మతో సమానాధికరణ్య న్యాయముచేత భోక్త అయిన జీవుని యొక్క భోగక్షేత్రము - పైన చెప్పబడినవి అవి మొదలగునవి యగు అనుభవములకు క్షేత్రము - స్థానము - శరీరమని శరీరయాథాత్మ్యవిదులు (శరీరతత్వమును యథార్థముగా తెలిసినవారు చెప్పియున్నారు).
ఇంద్రియాణి దశైకం చ పంచ చేంద్రియగోచరాః |
ఇచ్చా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః |
ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం ||“. (శ్రీమద్భగవద్గీత - 13 - 5,6)
(అవ్యక్తము - ప్రకృతి - బుద్ధి, అహంకారము, మహాభూతములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, విషయములు, ఇచ్చా, ద్వేషము, సుఖము, దుఃఖము, దైర్యము - వీటి అన్నింటికూటమి (వికారములతో కలిసి) క్షేత్రము - శరీరము అని చెప్పబడుచున్నది).
అదృష్టాని, మధ్యే జనేరూర్ధ్వం మృతేః పురా |
ఉపలబ్దాని సంత్యన్యేప్య దృష్టాని భవంతి చ |
యథా స్వప్నేంద్రిజా లాదౌ ప్రతిభాస సమాని వై |
భూతానీహ తథా జ్ఞానాత్ ప్రాగూర్ధ్వం న స్థితాని చ |
“ఆదావంతేచ యన్నాస్తి వర్తమానేపి తత్తథా |
“ఇతి న్యాయేన మధ్యేప్ త్యత్తధా |
ఇతి న్యాయేన మధ్యేపి న సంత్యేతాని సర్వశః ||“. (గీతాభావప్రకాశము - 2 - 328 to 331)
(పంచ భూతములకార్యములైన శరీరములు పుట్టుటకు ముందు అదృశ్యములు - కనబడనివి. మధ్యకాలమందు - అనగా, పుట్టినతర్వాత మరణమునకు ముందు కనబడుచున్నవి - ఉంటున్నవి. అటు తర్వాత కనబదకుండునవి - కలలోను, ఇంద్రజాలములోను మొదటిలో లేని వస్తువులు కనబడి, మేలుకొనిగా లేకపోయిన్నట్లు. మొదటిలోను, ఆఖరున కనబడని వస్తువు మధ్యనుకూడ లేనట్లే - అను న్యాయము ప్రకారము శరీరములు పుట్టకముందు లేవు, చనిపోయినతర్వాత కూడలేవు, కనుక మధ్యకాలమందు కూడ లేనివే)
“అవ్యక్తాదీని భూతని వ్యక్తమధ్యాని భారత |
అవ్యక్త నిధనాన్యే తత్ర కా పరిదేవనా ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 28)
“శరీరంబు కర్మ మూలంబగుటవలన కర్మంబులు సేయ జనదు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1 -)
“అత్యంత మలినః కాయో నవభిద్ర సమన్వితః |
స్రవత్యేవి దివానక్తం ప్రాతస్నానం విశోధనం ||“.
(ఈ శరీరము చాలా మలినమైనది, తొమ్మిది రంధ్రములు కలది - రాత్రి, పగలు మలినమును స్రవించుచునే యుండును. ప్రాతఃస్నానముచే దీనిని శుద్ధి చేయవలయును)
పాపమూల మిదం జ్ఞాత్వా తచ్ఛాంతిం సాధయేన్నరః ||.
(శరీరము పాపమువలన కలిగినది - పాపముల ఫలమనుభవించుటకు కలిగినది, పాపము చేతనే వృద్ధి పొందుచున్నది. శరీరమునకు కారణము పాపమని తెలుసుకిని - దాని శాంతి కొఱకు కృషి చేయవలయును).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 1 -13)
(ధర్మార్థకామ మోక్షములను చతుర్విధ పురుషార్థములలో ధర్మము మొదటిది. మొదటి మూడును నాలుగవదియైన మోక్షము కొఱకే ఉపయోగపడునట్లు చూచుకొనవలెను - మొదటిదైన ధర్మము చెప్పినందువలన మిగిలిన మూడును చెప్పినట్లే యని భావింపవలెను - ఈ పురుషార్థములను సాధించుటకు సాధనములలో మొదటిది శరీరము - శరీరము లేనిదే ఏ పనియును చేయలేము).
“వ. - - - విషయాసక్తులైనవారు వ్యర్థకర్మంబులం జేయుదురు. అట్టి దుష్కర్మంబులం జేయువారెప్పుడును బాపకర్మలగుచూ గ్లేశదంబగు దేహంబు నొందుచుండుదురు - - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1 - 68)
“వ. దారు స్థితంబైన యనలంబు తద్దారు గుణంబులయిన దైర్ఘ్యవక్రత్వాదికంబుల ననుసరించు చందంబున నవ్యక్తంబు. తత్ క్షోభకంబయిన కాలంబును, వాసనయు, నదృష్టంబునను కారణంబులచేతం బుట్టిన శరీరంబునందు విషయాకారంబయిన బుద్ధి నొంది - - - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 22 - 584)
శరీరము పాంచభౌతికము - శరీరములోని పంచభూతముల భాగములేవి యనిన : -
(1).”శ్లో||. అస్థి మాంసం త్వచో నాడి రోమ చైవతు పంచమం ||
పృధివీ పంచ గుణా ప్రోక్తా సమాసాత్ పరికీర్తితాః“. (ఇవి పృధ్వి భాగములు)
(2). “లాలామాత్రం తథా శుక్లం స్వేదః శోణితమేవ చ |
ఆపః పంచగుణా ప్రోక్తాః సమాసా త్పరికీర్తితాః ||“. ఇవి జలము గుణములు)
(3). “క్షుథా తృష్ణా తథా నిద్రా హ్యాలస్యం శాంతి రేవచ |
తేజః పంచగుణం ప్రోక్తం సమాసాత్పరి కీర్తితం ||“. (ఇవి అగ్ని భాగములు).
(4). “ధావనం, చలనం, కంపః కుంచనం చ ప్రసారణం |
వాయుః పంచగుణః ప్రోక్తః సమాసాత్పరి కీర్తితః ||“. (ఇవి వాయు గుణములు).
(5). “శబ్దో మేథా (అ)వకాశశ్చ క్రిమి శల్యాని పంచ చ |
గుణాః ఆకాశజాః ప్రోక్తాః సమాసాత్పరి కీర్తితాః ||“. (ఇవి ఆకాశ భాగములు).
సర్వ ఏవ జగత్యస్మిన్ ద్విశరీరాః శరీరిణః |
ఏకం మనః, శరీరం తు, క్షిప్రకారి సదా అచలం |
అకించత్కరమన్యత్తు శరీరం మాంస నిర్మితం ||“. (యోగావాసిష్టము - 92 - 9,10)
(ఈ ప్రపంచమున బ్రహ్మాది స్తంబపర్యంతము గల దేహధారులగు ప్రాణికోట్లు అన్నింటికీ రెండు శరీరములు గలవు - మొదటిది వేదముగ కార్యమొనర్చునదియు సదా స్థిరమై యుండునదియు నగు మనస్సు, రెండవది మాంస నిర్మితమైన దేహము)
(శరీరము రెండువిధములు - యోనిద్వారా పుట్టినది, మానవులు, పశువులు - అయోనిజము - ఇతరము - సీత, ద్రౌపది, లక్ష్మి - చెట్లు మొదలగునవి)
(శరీరములు మూడు విధములు - స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము).
(స్థూల శరీరము నాల్గు విధములు - జరాయుజములు, (మావినుండి పుట్టినవి) - మనుజులు, పశువులు; గుడ్డులోనుండి పుట్టినవి - పక్షి, పాము మొదలగునవి; స్వేదజములు - (చమటవలన పుట్టినవి) నల్లి మొదలగునవి; ఉద్భిజ్జములు - భూమిని భేదించుకొని వచ్చునవి - భూమిలో పాతిన విత్తనములనుండి భూమిని భేదించుకొని వచ్చునవి - చెట్లు మొదలగునవి).
నిత్యత్వేనాస్య సంసిద్ధం వైలక్షణ్యం శరీరితః |
దేహాద్యుపాధి భేదేన భేదః “అహం, త్వం, ఇమే” త్వితి |
నాత్రస్వాభావికో భేదోప్యాత్మనో హరిణేరితః |
త్వం పదార్థ విశుద్ధ్యర్థం భేదముద్దిశ్య లౌకికం |
ఆత్మనో నిత్యతో ద్వారా వైలక్ష్ణ్యం శరీరతః |
- - - “నవిరోధో న చోత్పత్తిర్నబద్ధో న చ సాధికః |
న ముముక్షుర్న వైముక్తః ఇత్యేషా పరమార్థతా ||”
ఇత్యాది రుతి నిర్ణీతా(అ)ద్వైత తత్వా విమర్శనాత్ |
భేదవాదో(అ)సతా మిష్టో న స తత్ర విమర్శనా ||” (గీతాభావ ప్రకాశము - 2 - 109 to112; 115 to119)
(మూడుకాలములందును సత్తాస్ఫూర్గ్తి కలిగియుండుటచేతను, నిత్యుడగుట చేతను, ప్రత్యగాత్మ శరీరముకంటె వేరైనది అనుమాట సిద్ధము. ఆత్మకు నేను, నువ్వు, ఇది అను భేదములు ఆ ఆత్మయుండే శరీరము మొదలగు ఉపాధి భేదమువలన కలిగినవి కాని ఇవి స్వాభావికమైన భేదములుకావు. లౌకిక వ్యాపారముననుసరించి, త్వం పదార్థమును విశదీకరించుటకు ఆత్మ నిత్యము, శరీరముకంటె వేరైనదని చెప్పబడినది. “విరోధము లేదు, బద్ధుడు లేడు, సాధకుడు లేడు - మోక్షము కోరువాడు లేడు, మోక్షము పొందినవాడు లేడు - ఇదియే పరమార్థము, ఇదియే అద్వైత తత్వార్థము, ఈ అద్వైత తత్వార్థము ఈ అద్వైత తత్వమును పరిశీలించినవారికి భేదము కనబడదు, పరిశీలించనివారికి భేదమే కనబడును).
dēhamu.
śīryatē iti śarīraṃ
(śidhilamaipōvunadi, naśiṃcipōvunadi kanuka śarīramani ceppabaḍucunnadi)
(tana nijasthitini - tānu paramātma aṃśayani, telisinaṃtanē, lēka kālakramamucē śidhilamagunadi kanuka śarīramani ceppabaḍinadi)
(śīryatē iti śarīraṃ = śidhilamaipōvunadi kanuka śarīramani ceppabaḍinadi.) yatprāṇāpagamē viśaraṇa bhāvamā padyatē tasmāt śarīrasya śarīratvaṃ”
(caitanyamu galadi prāṇamupōgā acētanamu - cētanamu lēnidi - agucunnaṃduna dānini śarīramaṃduru - adi śarīramainadi. prāṇamu pōyinanē śidhilamagunu - (śidhilavasthanu poṃducunnadi) kanuka śarīramainadi - śidhilamagunadi yani ceppabaḍinadi).
(kṣaṇakṣaṇamu śidhilamaipōvunadi kanuka śarīramani ceppabaḍinadi. dīninē dēhamu (dahiṃpabaḍunadi) ani kūḍa ceppaḍamainadi. lōmamulu, tvak (carmamu), sirālu, māṃsamu, asthi (yamukalu), majja anu āriṃṭi samudāyamu - ī āru kaliyuṭavalana kaliginadi. staṃbamuvale pratyakṣamugā kaṃṭiki kanabaḍucunnadi kanuka sthūladēhamani ceppabaḍucunnadi).
patatyavaśyaṃ pariṇāma pēśalaṃ |” (śrīrāmakarṇāmṛtaṃ - 4 - 43)
(ī śarīramu śidhilamagu saṃdhulu galadi. tappakuṃḍā eppuḍō okappuḍu śidhilamai paḍipōvunadē.)
(nityuḍaina śarīriyokka (jīvuniyokka) ī dēhamulu aṃtamu poṃdavalasinavē – naśiṃci pōvalasinavē).
“vāsāṃsijīrṇāni yathāvihāya navāni gṛhṇāti narō(a)parāṇi |
tathā śarīrāṇi vihāya jīrṇānyanyāni saṃ yāti navāni dēhī ||“. (śrīmadbhagavadgīta - 2 - 22)
(naruḍu cinigipōyina baṭṭalanu viḍicipeṭṭi kotta baṭṭalanu kaṭṭukonunaṭlu jīvuḍu (dēhi) - (dēhamu galavāḍu) jīrṇiṃcina - śidhilamaina - śarīramunu vadali kotta śarīramulanu poṃdunu - śidhilamagunadi kanuka śarīramu ani ceppabaḍinadi). śidhilamaina śarīramunu viḍucuṭayē maraṇamu, mariyoka śarīramunu poṃduṭayē jananamu -)
(śarīramulu nityamulukāvu, ellakālamuṃḍunavikāvu - aṭlē vaibhavamulu kūḍa śāśvatamulu kāvu)
yatprātaḥ saṃskṛtāṃ cānnaṃ sāyaṃtaśca vinaśyati |
tadīya rasa saṃpuṣṭē kāyē kā nāma nityatā ||“. (padmapurāṇamu)
(sthiramugā nuṃḍani vastuvu cēta sthiramaina pani cēyalēru. prodduṭa vaṃḍina annamu sāyaṃkālamunaku rasahīnamagunu - naśiṃcunu -, kābaṭṭi annamu sthiramugā nuṃḍanidi. sthiramugā nuṃḍani yaṭṭi annamutō pōṣiṃpabaḍina śarīramu sthiramugā nuṃḍunani yeṭlu bhāviṃcagalamu ?).
śarīrāṇi prajāyaṃtē - - - ||” (gītābhāvaprakāśamu -3 - 91)
(śukla śōṇitamulugā mārina nnamu valana śarīramulu puṭṭucunnavi).
rōmāṇi māṃsaṃ rudhirāsthi majjā | ētaccharīraṃ jala budbudōpamaṃ ||“.
(vakṣasthalamu, pṛṣṭamu, cētulu, kāḷḷu, pikkalu, toḍalu, kaḍupu, śirassu, rōmamulu, māṃsamu, rudhiramu (raktamu), asthi (yamukalu), majjā ivanniyu kalisi śarīramagucunnadi).
(nālugu vidhamulugā nuṃḍi āru vidhamula rasamulugala āhāramu tinina strī puruṣula saṃ yōgamu valana ā tinina annarasamē ēḍu rōjulalō rētassugā mārunu. adi eṭlaṃṭē - annamunuṃḍi rasamu, rasamunuṃḍi raktamu, raktamunuṃḍi māṃsamu, māṃsamunuṃḍi mēthassu, mēthassunuṃḍi snāyuvu, snāyuvulanuṃḍi asthi, asthivalana majjā, majjavalana śuklamu - ī rītigā tinina annamu mārunu. śuklamē rētassu. ī rētassē prāṇamunu dhariṃciyuṃḍunadi - ī rētassulōnē sūkṣmarūpamulō prāṇamuṃḍunu. idiyē muṃdu kābōyē jīvuni śarīramu, aṃdulō nimiḍiyuṃḍu prāṇamanunadē jīvuḍu, lēka, prāṇi, puruṣuḍu)
(garbhādānamu eppuḍu jarugunō appaṭinuṃḍi śiśuvu vṛddhi poṃdunu. ī vṛddhipoṃduṭa pūrtikāgānē rajōvīryamaṃduṃḍu paramāṇuvulacēta adi pūrtiyagunu, appuḍu aṃgamulanniyu ērpaḍunu, spaṣṭamagunu. appuḍu sīmaṃtōtsavamu cēyabaḍunu. appuḍu ā śarīramulōniki jīvuḍu pravēśiṃcukālamagunu - (lōna caitanyamu kaligi yuṃḍuṭa teliyabaḍucuṃḍunu - śarīranirmāṇamaina tarvātanē jīvuḍu aṃdulō pravēśiṃcunanuṭa aṃdaṟi abhiprāyamai yunnadi. śarīranirmāṇamu rajō vīryāṇuvulacēta kalugunani teliyavalayunu)
(bhagavadaṃśa prati vastuvulōnunnappaṭikī, puruṣuni vīryamu rētassulō bhagavadanśa sūkṣmāti sūkṣmarū pamulōnuṃḍi strīgarbhamaṃdu pravēśiṃcinanu avayava nirūpaṇagala śarīranirmāṇamu aguvaraku jīvamunnaṭlu kanabaḍadu - jīva caitanyamunaku anukūlamagu vastuvugā (śarīramugā - upādhigā) ā śarīramuṃḍinappuḍē dāniki talli kaḍupulō caitanyamu kalugunu - “cētanatvaṃbu galadēni jīvuḍaṃḍru”. ā caitanyamu bahiraṃgamugā tōcinapuḍu ā śarīramulō paramātma (jīvarūpamulō) pravēśiṃcunu - śarīra nirmāṇamu pūrti ayina tarvāta jīvuḍaṃdu pravēśiṃcunu ani anuṭalō tātparyamidiyē)
“śuklādhikyē bhavētpuṃsaḥ nārī raktādhikē natu |
śuklarikta samatvēna napunsaka itīritā ||“.
duṣkṛti karma viśēṣaṃvalla aṃdhaka, badhira, mūka, kubja, sauṃdaryahīna, ṣaṃḍa modalayina avalakṣa guṇālu galavāḍagunu - “śākādyanna pariṇāma sōpādhirpidya mānatvāt” ani kaladu. asthi, snāyu majjā - ī mūḍunu taṃḍri yokka aṃśālu, carma, māṃsa riktālu - ī mūḍunnū talli aṃśālu - aṃducēta ṣaṭkēśika śarīraṃ ” anabaḍenu. (brahmavidyā sudhārṇavamu - 2)
pūrṇaṃ mūtra purīṣābhyāṃ sthūlaṃ niṃdyamidaṃ vapuḥ |
paṃcīkṛtēbhyō bhūtēbhyō stūlēbhyaḥ pūrva karmaṇā |
samutpannamidaṃ bhōgāyatanamātmanaḥ |
sarvōpi bhāhya saṃsāraḥ puruṣasya yadāśrayaṃ |
viddhi dēhamidaṃ sthūlaṃ gṛhavadgṛha mēdhinaḥ ||“. (śrīśaṃkaraḥ - vivēkacūḍāmaṇi)
(carmamu, māṃsamu, raktamu, snāyuvu, mēdassu, majjā, asthi (yamukalu) ivi anniyu kalisinadi, mūtramu tōḍanu, purīṣamu tōḍanu niṃḍiyuṃḍunadi, niṃdyamainadi, sthūlarūpamulō nuṃḍunadi - kaṃṭiki kanabaḍunadi - iṭṭidi śarīramu. paṃcīkṛtamaina sthūla paṃca bhūtamulatō pūrva janmala karma phalitamugā ātmaku (jīvātmaku) bhōgamulaku sthānamugā - pāpa puṇya phalamanubhaviṃcuṭaku sthānamugā - puṭṭinadi. gṛhamēdhiki gṛhamuvale nirmiṃpabaḍinadi.)
(puruṣunaku - jīvātmaku bhōgāpavargamula nimittamu satvarajastamōguṇamulugala prakṛti dēhēṃdriyamuluga mārinavāṭi saṃghātamē śarīramu. paramātmayaṃdu bhōgiṃcuṭa yēdi kaladō adi bhōgāyatanamu)
taṃ saptadhātuṃ, trimalaṃ, tri triyōniṃ, caturvidhāhāramayaṃ |
śarīraṃ bhavati. paṃcātmakamiti kasmāta? pṛdhivyaptējō vāyurākāśaṃ iti. asmin śarīrē ka pṛdhivī ? kā āpaḥ, kiṃ mējaḥ kōvāyu, kō ākāśamiti? asmin paṃcātmaka śarīrē yatkaṭhinaṃ sā pṛdhivī, yaddravaṃ tadāpō, yaduṣṇaṃ tattējō yassaṃcarati savāyuḥ, yatsuṣiraṃ tadākāśaṃ ityucyatē. tatra pṛdhivī dhāraṇē, āpaḥ piṃḍīkaraṇē, tējōrūpa darśanē, vāyurgamanē ākāśamavakāśapadānē”.
(garbhōpaniṣat)
(ī śarīramu paṃcabhūtātmakamu - paṃcabhūtamulakaliyikacē kaliginadi. adi yeṭlanagā - pacṇabhūtamulu anagā, pṛdhivi (bhūmi), appu (nīru), tējassu (agni), vāyuvu (gāli), ākāśamu - ī śarīramulō ēdi bhūmi, ēdi nīru, ēdi agni, ēdi gāli, ēdi ākāśamu anagā - samādhānamiṭlu ceppabaḍinadi - ī śarīramulō ēdi ēdi kaṭhinamainadō adi bhūmi aṃśa, ēdi dravarūpamugā nunnadō - nīruvale pārunadi - adi nīru aṃśa, yēdi vēḍimi kaligiyunnadō adi agni, ēdi saṃcariṃcucunnadō adi gāli, ēdi goṭṭamuvale kāḷīgā nunnadō adi ākāśāṃśa - vīṭilō bhūmi dhariṃcunadi, nīru piḍaca kaṭṭunadi, agni rūpamunu kanaparcunadi, gāli gamanamu kaligiṃcunadi, ākāśamu vīṭiki avakāśamu kaligiṃcunadi).
(ī śarīramu pṛdhvīmayamu, āpōmayamu, vāyumayamu, ākāśamayamu, tajōmayamu, ī ayidu bhūtamula mayamu - ayidu bhūtamulatō niṃḍiyunnadi).
(vāyuvu yokka vikāramulu - mārpulu - galadi śarīramu - vāyu vikāramulu ayidu vidhamulugā nunnavi - hṛdayamaṃdu prāṇavāyuvu, gudamaṃdu apānavāyuvu, nābhiyaṃdu samānavāyuvu, kaṃṭhamaṃdu udānavāyuvu, śarīramaṃtaṭanu vyānavāyuvu kaladi śarīramu).
(ī śarīramu maraṇiṃcu dharmamu (naijamu) kaladi. kēvalamu maraṇiṃcu dharmamu kaladiyē kāka ellapuḍu maraṇiṃcu śīlamu kaladidē - anagā, puṭina daggaranuṃḍi vīlayinapuḍu maraṇiṃcu svabhāvamukaladi - eppuḍainanu maraṇiṃcunadē - ī śarīramu karmavalana kaliginadi. iṭuvaṃṭi karmavalana kaligina śarīramu lēnaṭuvaṃṭi lakṣaṇamu gala amṛtasvarūpamu (mōkṣarūpamu) gala ātmaku bhōgamunaku adhiṣṭhānamai karmaku vaśuḍaina jīvinicēta bhōgamu nimittamu grahiṃpabaḍunu).
(satvarajastamōguṇamulugala prakṛti samasta kāraṇavastuvulu, kārya vastuvulu yokka ākāramu poṃdi - (ākāramugā māri) - puruṣuni yokka - (paramātma yokka - jīvuni yokka) bhōgamu mōkṣamu nimittamu dēhamu iṃdriyamulayokka ākāramu poṃducunnadi. aṭlu dēhamu iṃdriyamula saṃghātamē (kūṭamiyē) yī śarīramu)
“bhagavatkrīḍā parikaraṃbunu, guṇatrayānvitaṃbunu nagu prakṛtivalanaṃ buṭṭina mahattattvaṃbuna nagu nahaṃkāraṃbuvalana nayyeḍu śabdasparśādi tanmātralaṃ brabhūtaṃbulagu gaganādi bhūtaṃbula mēḷanaṃbunaṃ jēsi yī śarīraṃbulu śarīrulaku bhōgabhājanaṃbu lagucuṃḍu”. (kulaśēkhara mahīpāla caritra - 2 - 122)
“asti staṃbaṃ, snāyu baddhaṃ māṃsa śōṇita lēpitaṃ |
carāvanaddhaṃ durgaṃdhapātraṃ mūtra purīṣayōḥ |
jarā śōka vipākārtaṃ rōgamaṃdira māturaṃ |
dūṣpūraṃ durdharaṃ duṣṭaṃ sadōṣaṃ kṣaṇa bhaṃguraṃ |
krimi ṭiṭ bhasma saṃjñāṃtaṃ śarīramiti varṇitaṃ ||“. (padma purāṇamu - 5 - 58 to 60)
(yamukala paṃjaraṃ, snāyuvulacēta baṃdhiṃpabaḍi yuṃḍunadi, māṃsamu cētanu raktamu cētanu pūyabaḍiyuṃḍunadi, mūtramu, purīṣamu - ī reṃḍiṃṭiki cdeḍuvāsana niccu nelavu. musalitanamu, śōkamu, mudirina bādhalu kalugacēyunadi; rōgamunaku nivāsamainadi. pūriṃpa śakyamukānidi, duṣṭamainadi, dōṣamulu kaladi, nīṭi buḍagavale kṣaṇamātramuṃḍunadi, eppuḍu naśiṃcunō teliyanidi, ākharuna krimulacēta tini vēyabaḍunadi, lēka, agnicē bhasmamu (būḍida) cēyabaḍunadi - ani iṭlu śarīramu varṇiṃpabaḍinadi).
ūrdhvaṃ kaphaṃ śravaṇanētra malaṃ prasūtē |
aṃtarbhi bharti rudhirāsthi palāsya dhastāt |
mūtra purīṣa miti pātu harērjugupsā ||“.
“atralōkē śarīrabhājāṃ dēhināṃ idaṃ adō duśśarīraṃ duṣṭaṃ kaḷēbaraṃ diṣṭaṃ kaḷēbaraṃ thik |
yasya śarīrasya ūrthvaṃ uparibhāgaṃ śirarrṇi ityarthaḥ mukhēna kaphaṃ prasūtē utpādayati śravaṇābhyāṃ karṇābhyāṃ nētrābhyāṃ ca malaṃ prasūtē - janayati. aṃtaśca yō dēhō rudhiraṃ raktaṃ ca asthi kīkanaṃca palaṃ māṃsaṃ ca tāni bibharti - dhārayati. adhaḥ tannābhēradhō bhāgē mūtraṃ purīṣaṃ ca bibharti. iti dṛṣṭvā jāyamānā harēḥ viṣṇōḥ jugupsā naḥ sarvān pātu avatu -“.
(ī lōkamaṃdu dēhadhārulainavāri śarīramu duṣṭamainadi. eṃducētananagā - śarīramulōni mīdabhāgamaina śirassulō nōṭinuṃḍi kaphamu vaccunu - cevulanuṃḍi, kannulanuṃḍu malamu kārucuṃḍunu - śarīramu lōpala bhāgamulō raktamu, yamukalu, māṃsamu uṃḍunu. ī śarīramu vīṭini dhariṃci yuṃḍunu. boḍḍu kriṃbhāgamaṃdu mūtramu, purīṣamunu (malamūtramulanu) dhariṃciyuṃḍunu. aṃducēta ī śarīramu asahyakaramainadi. ī viṣayamu telusukoni bhagavaṃtuni dayayē manalanu rakṣiṃcugāka ani bhagavaṃtuni āśrayiṃcavalenu).
prāṇasya sthūla dēhēṣu samāgamana kāraṇaṃ ||“.
(pūrva janmalalō manassutō saṃkalpiṃci cēsina karmayē prānamu marala sthūla śarīramulō pravēśiṃcuṭaku kāraṇamu - dīrghamugā kōrina kōrke tīrakayuṃḍuṭacēta marala janma etti tercukonavalenani gāḍhamaina kōrika avasānakālamaṃdu kaligiyuṃḍuṭacēta ā kōrika tīruṭaku anuvaina śarīramu kalugunu)
(ē dravyamu - ē vastuvu - cētanamugala ē vastuvunaku anni vidhamula tana prayōjanamunaku niyamiṃpabaḍucuṃḍunō, tanacē dhariṃpabaḍiyuṃḍunō, tana iṣṭānusāramuga upayōgiṃcukonuṭaku vīlagunō adi ā caitanyamugala vastuvunaku śarīramu ani ceppabaḍucunnadi. idi śarīramu yokka lakṣaṇamu)
(avyākṛtamaina sūkṣma bhūtamu avasthā viśēṣamuvalana śarīramainadi).
(iruvadi ayidu tatvamulu kalisinadi śarīramu)
(manuṣyulu modalagu vāriki paṃcabhūtamula kūṭamiyē śarīramu)
(śrīmadāṃdhramahābhāgavatamu - 4 - )
(kṣīṇiṃcunadi kanuka śarīramani ceppabaḍinaḍucunnadi. śarīramu āhāramu lēka kṣīṇiṃcunu, āhāramunnanu vyādhicē kṣīṇiṃcunu, vyādhi lēkunnanu vṛddhāpyamuvalana kṣīṇiṃcunu; puṭṭina prati jīvi - prati vastuvu - naśiṃcavalasinadē - maraṇa dharmamukalavāḍu kanuka martyuḍu - (Man is mortal) (Everything in the entire creation is prone to decay and die) -(pōkanmānadu prāṇameṃta tanuvun pōṣiṃci rakṣiṃcinan).
(“nēnē vāsudēvuḍanu, nēnē manuṣyuḍanu nēnu sthūlamugānunnānu, nēnu kṛśiṃciyunnānu” - ani bhōkta ayina ātmatō samānādhikaraṇya nyāyamucēta bhōkta ayina jīvuni yokka bhōgakṣētramu - paina ceppabaḍinavi avi modalagunavi yagu anubhavamulaku kṣētramu - sthānamu - śarīramani śarīrayāthātmyavidulu (śarīratatvamunu yathārthamugā telisinavāru ceppiyunnāru).
iṃdriyāṇi daśaikaṃ ca paṃca cēṃdriyagōcarāḥ |
iccā dvēṣaḥ sukhaṃ duḥkhaṃ saṃghātaścētanā dhṛtiḥ |
ētat kṣētraṃ samāsēna savikāramudāhṛtaṃ ||“. (śrīmadbhagavadgīta - 13 - 5,6)
(avyaktamu - prakṛti - buddhi, ahaṃkāramu, mahābhūtamulu, jñānēṃdriyamulu, karmēṃdriyamulu, viṣayamulu, iccā, dvēṣamu, sukhamu, duḥkhamu, dairyamu - vīṭi anniṃṭikūṭami (vikāramulatō kalisi) kṣētramu - śarīramu ani ceppabaḍucunnadi).
adṛṣṭāni, madhyē janērūrdhvaṃ mṛtēḥ purā |
upalabdāni saṃtyanyēpya dṛṣṭāni bhavaṃti ca |
yathā svapnēṃdrijā lādau pratibhāsa samāni vai |
bhūtānīha tathā jñānāt prāgūrdhvaṃ na sthitāni ca |
“ādāvaṃtēca yannāsti vartamānēpi tattathā |
“iti nyāyēna madhyēp tyattadhā |
iti nyāyēna madhyēpi na saṃtyētāni sarvaśaḥ ||“. (gītābhāvaprakāśamu - 2 - 328 to 331)
(paṃca bhūtamulakāryamulaina śarīramulu puṭṭuṭaku muṃdu adṛśyamulu - kanabaḍanivi. madhyakālamaṃdu - anagā, puṭṭinatarvāta maraṇamunaku muṃdu kanabaḍucunnavi - uṃṭunnavi. aṭu tarvāta kanabadakuṃḍunavi - kalalōnu, iṃdrajālamulōnu modaṭilō lēni vastuvulu kanabaḍi, mēlukonigā lēkapōyinnaṭlu. modaṭilōnu, ākharuna kanabaḍani vastuvu madhyanukūḍa lēnaṭlē - anu nyāyamu prakāramu śarīramulu puṭṭakamuṃdu lēvu, canipōyinatarvāta kūḍalēvu, kanuka madhyakālamaṃdu kūḍa lēnivē)
“avyaktādīni bhūtani vyaktamadhyāni bhārata |
avyakta nidhanānyē tatra kā paridēvanā ||“. (śrīmadbhagavadgīta - 2 - 28)
“śarīraṃbu karma mūlaṃbaguṭavalana karmaṃbulu sēya janadu” (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1 -)
“atyaṃta malinaḥ kāyō navabhidra samanvitaḥ |
sravatyēvi divānaktaṃ prātasnānaṃ viśōdhanaṃ ||“.
(ī śarīramu cālā malinamainadi, tommidi raṃdhramulu kaladi - rātri, pagalu malinamunu sraviṃcucunē yuṃḍunu. prātaḥsnānamucē dīnini śuddhi cēyavalayunu)
pāpamūla midaṃ jñātvā tacchāṃtiṃ sādhayēnnaraḥ ||.
(śarīramu pāpamuvalana kaliginadi - pāpamula phalamanubhaviṃcuṭaku kaliginadi, pāpamu cētanē vṛddhi poṃducunnadi. śarīramunaku kāraṇamu pāpamani telusukini - dāni śāṃti koṟaku kṛṣi cēyavalayunu).
(śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 1 -13)
(dharmārthakāma mōkṣamulanu caturvidha puruṣārthamulalō dharmamu modaṭidi. modaṭi mūḍunu nālugavadiyaina mōkṣamu koṟakē upayōgapaḍunaṭlu cūcukonavalenu - modaṭidaina dharmamu ceppinaṃduvalana migilina mūḍunu ceppinaṭlē yani bhāviṃpavalenu - ī puruṣārthamulanu sādhiṃcuṭaku sādhanamulalō modaṭidi śarīramu - śarīramu lēnidē ē paniyunu cēyalēmu).
“va. - - - viṣayāsaktulainavāru vyarthakarmaṃbulaṃ jēyuduru. aṭṭi duṣkarmaṃbulaṃ jēyuvāreppuḍunu bāpakarmalagucū glēśadaṃbagu dēhaṃbu noṃducuṃḍuduru - - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1 - 68)
“va. dāru sthitaṃbaina yanalaṃbu taddāru guṇaṃbulayina dairghyavakratvādikaṃbula nanusariṃcu caṃdaṃbuna navyaktaṃbu. tat kṣōbhakaṃbayina kālaṃbunu, vāsanayu, nadṛṣṭaṃbunanu kāraṇaṃbulacētaṃ buṭṭina śarīraṃbunaṃdu viṣayākāraṃbayina buddhi noṃdi - - - (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 22 - 584)
śarīramu pāṃcabhautikamu - śarīramulōni paṃcabhūtamula bhāgamulēvi yanina : -
(1).”ślō||. asthi māṃsaṃ tvacō nāḍi rōma caivatu paṃcamaṃ ||
pṛdhivī paṃca guṇā prōktā samāsāt parikīrtitāḥ”. (ivi pṛdhvi bhāgamulu)
(2). “lālāmātraṃ tathā śuklaṃ svēdaḥ śōṇitamēva ca |
āpaḥ paṃcaguṇā prōktāḥ samāsā tparikīrtitāḥ ||“. ivi jalamu guṇamulu)
(3). “kṣuthā tṛṣṇā tathā nidrā hyālasyaṃ śāṃti rēvaca |
tējaḥ paṃcaguṇaṃ prōktaṃ samāsātpari kīrtitaṃ ||“. (ivi agni bhāgamulu).
(4). “dhāvanaṃ, calanaṃ, kaṃpaḥ kuṃcanaṃ ca prasāraṇaṃ |
vāyuḥ paṃcaguṇaḥ prōktaḥ samāsātpari kīrtitaḥ ||“. (ivi vāyu guṇamulu).
(5). “śabdō mēthā (a)vakāśaśca krimi śalyāni paṃca ca |
guṇāḥ ākāśajāḥ prōktāḥ samāsātpari kīrtitāḥ ||“. (ivi ākāśa bhāgamulu).
sarva ēva jagatyasmin dviśarīrāḥ śarīriṇaḥ |
ēkaṃ manaḥ, śarīraṃ tu, kṣiprakāri sadā acalaṃ |
akiṃcatkaramanyattu śarīraṃ māṃsa nirmitaṃ ||“. (yōgāvāsiṣṭamu - 92 - 9,10)
(ī prapaṃcamuna brahmādi staṃbaparyaṃtamu gala dēhadhārulagu prāṇikōṭlu anniṃṭikī reṃḍu śarīramulu galavu - modaṭidi vēdamuga kāryamonarcunadiyu sadā sthiramai yuṃḍunadiyu nagu manassu, reṃḍavadi māṃsa nirmitamaina dēhamu)
(śarīramu reṃḍuvidhamulu - yōnidvārā puṭṭinadi, mānavulu, paśuvulu - ayōnijamu - itaramu - sīta, draupadi, lakṣmi - ceṭlu modalagunavi)
(śarīramulu mūḍu vidhamulu - sthūla śarīramu, sūkṣma śarīramu, kāraṇa śarīramu).
(sthūla śarīramu nālgu vidhamulu - jarāyujamulu, (māvinuṃḍi puṭṭinavi) - manujulu, paśuvulu; guḍḍulōnuṃḍi puṭṭinavi - pakṣi, pāmu modalagunavi; svēdajamulu - (camaṭavalana puṭṭinavi) nalli modalagunavi; udbhijjamulu - bhūmini bhēdiṃcukoni vaccunavi - bhūmilō pātina vittanamulanuṃḍi bhūmini bhēdiṃcukoni vaccunavi - ceṭlu modalagunavi).
nityatvēnāsya saṃsiddhaṃ vailakṣaṇyaṃ śarīritaḥ |
dēhādyupādhi bhēdēna bhēdaḥ “ahaṃ, tvaṃ, imē” tviti |
nātrasvābhāvikō bhēdōpyātmanō hariṇēritaḥ |
tvaṃ padārtha viśuddhyarthaṃ bhēdamuddiśya laukikaṃ |
ātmanō nityatō dvārā vailakṣṇyaṃ śarīrataḥ |
- - - “navirōdhō na cōtpattirnabaddhō na ca sādhikaḥ |
na mumukṣurna vaimuktaḥ ityēṣā paramārthatā ||”
ityādi ruti nirṇītā(a)dvaita tatvā vimarśanāt |
bhēdavādō(a)satā miṣṭō na sa tatra vimarśanā ||” (gītābhāva prakāśamu - 2 - 109 to112; 115 to119)
(mūḍukālamulaṃdunu sattāsphūrgti kaligiyuṃḍuṭacētanu, nityuḍaguṭa cētanu, pratyagātma śarīramukaṃṭe vērainadi anumāṭa siddhamu. ātmaku nēnu, nuvvu, idi anu bhēdamulu ā ātmayuṃḍē śarīramu modalagu upādhi bhēdamuvalana kaliginavi kāni ivi svābhāvikamaina bhēdamulukāvu. laukika vyāpāramunanusariṃci, tvaṃ padārthamunu viśadīkariṃcuṭaku ātma nityamu, śarīramukaṃṭe vērainadani ceppabaḍinadi. “virōdhamu lēdu, baddhuḍu lēḍu, sādhakuḍu lēḍu - mōkṣamu kōruvāḍu lēḍu, mōkṣamu poṃdinavāḍu lēḍu - idiyē paramārthamu, idiyē advaita tatvārthamu, ī advaita tatvārthamu ī advaita tatvamunu pariśīliṃcinavāriki bhēdamu kanabaḍadu, pariśīliṃcanivāriki bhēdamē kanabaḍunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.