← Back to శ · Booklets 41–50 (digitized file 5)

శరీరరధము śarīraradhamu

Original — తెలుగు
  1. “ఆత్మానం రధినం విద్ధి శరీరం రధమేవతు |

బుద్ధిం తుసారధిం విద్ధి మనః ప్రగ్రహమేవచ |

కో ఇంద్రియాణి హయా నాహు ర్విషయాంస్తేషు గోచరాన్ ||”

ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః ||“.

(“ప్రగ్రహః = అశ్వరశనా, యధా బుద్ధి సారధిః వివేకీ తథా మనసేంద్రియ హయాన్ విషమ విషయ మార్గాదా కర్షతి, యద్య వివేకీ, తదా మనో రసవ బుద్ధిం స్తాన్ ప్రవర్తయతి ఇతి మనసః ప్రగ్రహత్వం యుక్తం)

(ఆత్మ - జీవాత్మ - జీవుడు రధికుడు, శరీరము రధము; బుద్ధి సారధి; మనస్సు కళ్ళెములు; ఇంద్రియములు గుఱ్ఱములు; విషయములు వాటి లక్ష్యము - ఇంద్రియములతోను, మనస్సుతోను కూడిన ఆత్మ విషయములను భోగించువాడు - అనుభవించువాడు - భోక్త; బుద్ధి యను సారధి వివేక వంతుడైనయడల ఇంద్రియములను ఘుఱ్ఱములను విషయములమార్గమునుండి తప్పించును - మరల్చును. బుద్ధియను సారధి అవివేకి అయినయడల ఇంద్రియములను, మనస్సును పగ్గములచేత - కళ్ళెములచేత - మరల్పలేడు. అందుచేత మనస్సు పగ్గముతో పోల్చబడినది).

“యస్త్వ విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సహ |

తస్యేంద్రియాణ్యవశ్యాని దుష్టాశ్వా ఇవ సారధేః |

యస్తు విజ్ఞాన వాన్భవతి యుక్తేవ మనసా సదా |

తస్యేంద్రియాణి వశ్యాని సదశ్వా ఇవ సారధేః ||“.

(ఆత్మను రధికుడని తెలియుము, శరీరమును రధమని తెలియుము - బుద్ధిని సారధియనియు, మనస్సును పగ్గములనియు తెలియుము - ఇంద్రియములను గుఱ్ఱములనియు, ఇంద్రియవిషయములను గుఱ్ఱములు పోవు మార్గమనియు చెప్పుదురు - ఇట్లు శరీరేంద్రియ మనోయుక్తుడగు జీవుని మనీషులు భోక్తయని పేర్కొందురు. అసమాహిత చిత్తుడయి నేర్పరిగాని సారధిగల జీవునకు లోకమున పగ్గముల పట్ట తెలియని సారధికి గుఱ్ఱములవలె ఇంద్రియముల పట్టు తప్పి నడువసాగును. పగ్గములు పట్టజాలి సమాహిత చిత్త్తుడు అయి నేర్పుగల సారధికి, వశ్యములైన గుఱ్ఱముల గగిది, సమాహిత చిత్తుడయి విజ్ఞానవంతుడగు సారధిగల జీవునకు ఇంద్రియములు తప్పు త్రోవలు త్రొక్కజాలవు).

  1. “సీ. రధము మేనెల్లు, సారధి బుద్ధి, ఇంద్రియ గుణము గుఱ్ఱములు, పగ్గములు మనము

ప్రాణాది దశవిధ పవనంబులిరుసు, ధర్మా ధర్మ గతులు రధాంగకములు

బహుళతరంబైన బంధంబు చిత్తంబు, శబ్దాదికములు సంచార భూము

లభిమానసం యుతుండయిన జీవుడు రధి, ఘనతర ప్రణవంబు కార్ముకంబు

తే. శుద్ధజీవుండు బాణంబు, శుభదమైన

బ్రమంచిత లక్ష్యంబు పరులు రాగ

భయ మద ద్వేష శోక లోభ ప్రమోహ

మాన మత్సర ముఖములు, మానవేంద్ర.”

“వ. ఇట్లు మానష శరీర రూపంబయిన రధంబు దన వశంబుసేసికొని మహాభాగవత చరణముల సేవానిశితంబయిన విజ్ఞాన ఖడ్గంబు ధరియించి శ్రీమన్నారాయణ కరుణావలోకన బలంబున రాగాది శత్రు నిర్మూలనంబు గావించి ప్రణవబాణాసనంబున శుద్ధ జీవ శరంబును సంధించి బ్రహమ్మనియెడి గుఱియందు బడవేసి యహంకార రధికుండు రధికత్వంబుమాని నిజానందంబున నుండవలయు. అట్టి విశేషంబు సంభవింపని సమయంబున బహిర్ముఖంబులయిన యింద్రియ ఘోటకంబులు బుద్ధి సారధి సహితంబులై స్వాభిమాన రధికుని ప్రమత్తత్వంబు దెలిసి ప్రవృత్తమార్గంబు నొందించి విషయ శత్రుమధ్యంబునం గూల్చిన -.

“ఆ. విషయ శత్రులెల్ల విక్రాంతి తోడసా

రధి సమేతుడయిన రధికు బట్టి

యుగ్రతిమరమృత్యు యుతమగు

సంసార కూప మధ్యమందు గూల్తు రధిప”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 15 - 465.466)

  1. “రధ బద్ధ హయ స్థానీ యైః ఆకృష్య మాణత్వాత్ శరీరం రధం ఇవ; తస్య ఆత్మా రధికః (రధస్వామీ); బుద్ధిః రధ్యవసాయ లక్షణా సారధిః; బుద్ధి నేతృ ప్రథానత్వా చ్ఛరీరస్య మనః సంకల్ప వికల్పాది లక్షణం రశనా, ఇంద్రియాణి చక్షురా దీని హయాన్ రధకల్పనా కుశలాః శరీర రథాకర్షణ సామాన్యాత్ - ఇతి శరీరేంద్రియ మనోభిస్సహితం ఆత్మా సంసారీ ఇవ దృశ్యతే - (ఆత్మశబ్దో దేహపరః)”.

(రధమునకు కట్టబడిన గుఱ్ఱములవలె నుండువాటిచేత లాగబడినందువలన శరీరము ఒక రధముతో పోల్చబడినది. శరీరములోని ఆత్మ రధికుడు (రధుడు, రధమునెక్కినవాడు). బుద్ధి యనునది సారధి (రధము నడుపువాడు) - బుద్ధి శరీరమును తన ఇష్టమువచ్చినట్లు నడుపునది కనుక సారధితో పోల్చబడినది. మనస్సు సంకల్పములు చేయునది కనుక తాడు (కళ్ళెము, పగ్గము -) శరీర రధమును లాగునది కనుక కండ్లు మొదలగు ఇంద్రియములు గుఱ్ఱములతో పోల్చబడినది. ఇట్లు శరీరము, ఇంద్రియములు మనస్సుతో కలిసియున్న ఆత్మ సంసారి వలె పోల్చబడుచున్నవి)

  1. “రధ సారధి హయప్రగ్రహత్వేన (రశనయా) రూపితానాం శరీరేంద్రియ మనో బుద్ధినాం అభావే రథిత్వేన రూపితస్య ఉదాసీన స్య ఆత్మనః గమన రూప లౌకిక వైదిక క్రియా కర్తృత్వమేవ నాస్తీత్యేత త్సు ప్రసిద్ధత్వేన దర్శయతి. ఆత్మ శబ్దో దేహపరః; మనశ్శబ్దః తత్కార్య బుద్దేరపి ఉప లక్షకః; బుద్ధేరపి సారధిత్వేన నిర్దిష్టత్వాత్ భోక్తా కర్తత్వ భోక్తృత్వ వా నిత్యర్థః - నహి కేవలస్యాత్మనః అఃకర్తృత్వం భోక్తృత్వం వా స్తీతి భావః” - (శ్రీమాన్ రంగరామానుజః)

(రధము, సారది, గుఱ్ఱములు, కళ్ళెము వలె పోల్చబడిన శరీరము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనునవి లేనియడల రధికుడుగా నిరూపించబడిన ఉదాసీనుడగు ఆత్మయొక్క గమనమును లౌకిక, వైదిక క్రియలు చేయుట అను కర్తృత్వమే లేదు - అను విషయము ఇందు మూలముగా బాగుగా నిరూపించబడినది. ఆత్మ యనగా దేహము, మనస్సు అనునది ఆ శరీరము చేయు పని యగు బుద్ధికి ఉపలక్షణము. బుద్ధి సారధి యని చెప్పుటవలన భోక్తగా పోల్చబడినది - అనగా, కర్తృత్వము (కర్మచేయుట), భోక్తృత్వము (కర్మ ఫలమనుభవించుట) కలవాడు. కేవలము ఆత్మకు కర్తృత్వము భోక్తృత్వము లేదని దీని భావము).

  1. “లోకేహి సమీచీన సారధి ప్రగ్రహవతః అశ్వాః వశీకృతాః భావంతి; ఏవం సారధి ప్రగ్రహత్వేన రూపితయోః విజ్ఞాన మనసోః సామీ చీన్యే అశ్వత్యేన రూపితాని ఇంద్రియాణి వశ్యాని భవంతి, నాన్యథా ఇత్యర్థః.”

(లోకములో రధసారధికళ్ళెములతో పట్టుకొనియుండు గుఱ్ఱములు అతని వశములో నుండునని ప్రసిద్ధ విషయమే. ఆ ప్రకారముగానే సారధి చేత కళ్ళెములతో పట్టుబడిన (లొంగిన) గుఱ్ఱములవలె నిరూపించబడిన ఇంద్రియములను కూడ వశములో నుంచుకొనుటకు వీలగును - ఇంకొక రీతిగా ఇంద్రియములు వశములో నుండవు).

  1. “యః బుద్ధ్యా ఖ్య సారధిః అవివేకీభవతి (అసమాహితేన మనసా ప్రగ్రహస్థానీయేన సదా యుక్తో భవతి) తస్య అకుశలస్య బుధిసారధేః ఇంద్రియాణి అశ్వస్థానీ యాని అవశ్యాని అశక్య నివారణాని దుష్టాశ్వాః అదాంతా శ్వా ఇవ ఇతర సారదేర్భవంతి. యస్తు సారధిః వివేకవాన్ నిపుణః యుక్తేన మనసా సమాహిత చిత్తః సదా తస్య అశ్వస్థానీయాని ఇంద్రియాణి ప్రవర్తయితుం నివర్తయితుం వా శక్యాని వశ్యాని దాంతా సదశ్వా ఇదేతర సారధేః”.

(బుద్ధియను సారధి అవివేకి అయిన యడల (సమాహితమైన మనస్సు లేనివాడు, చేతకానివాడు అయినయడల) అశ్వమువలెనుండు ఇంద్రియములు తన వశములో ఉంచుకొనలేడు - పెంకి గుఱ్ఱములవలె నుండును. సారధి వివేకవంతుడు, నిపుణుడు (చేతనయినవాడు, మనస్సును తనవశములో నుంచుకొన గలిగినవాడు) అయినయడల (గుఱ్ఱములతో పోల్చబడిన) అతని ఇంద్రియములు మంచి గుఱ్ఱములవలె తన వశములో నుండును - ఎట్లు నడిపిన అట్లు నడవగలవు - ఎట్లు త్రిప్పిన అట్లు తిరుగగలవు.)

  1. “శరీరేంద్రియ మనోబుద్ధి విషయ వేదనా సం యుక్తస్య హ్యవిద్యావతో భోక్తః శరీరాదీనాం రధాధిరూప కల్పనయా సంసార మోక్షగతి నిరూపణేన ప్రత్యగాత్మ బ్రహ్మావగతి రిహ వివక్షితా”. (శ్రీ శంకరః - బ్రహ్మ సూత్రభాష్యే)

(శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, విషయవేదన, వీటి అన్నింటితో కూడిన అవిద్యవలన భోక్తయగు జీవి యొక్క శరీరము మొదలగునవి రధము మొదలగువాటితో కల్పించి పోల్చడము ద్వారా సంసారము, మోక్షము అను వీటి నిరూపించుటచేత ప్రత్యగాత్మ బ్రహ్మ ప్రాప్తి యెట్లు పొందగలుగునో తెలుపబడినది).

  1. “శరీరస్య రధ హయ స్థానీయేంద్రియా కృష్యమాణత్వాత్ శరీరమేవ రధం - శరీరం రధమేవ చ” ఇతి శ్రుతేః (కఠివల్యుపనిషత్)

(రధము, గుఱ్ఱములుగా చెప్పబడిన ఇంద్రియములచేత శరీరము త్రిప్పబడుచున్నందున - లాగబడుచున్నందున “శరీరమే రధము” అని ఉపనిషద్వాక్యము)

  1. “బుద్ధి సారధిః విషయ వీధీషు యధేచ్ఛం ప్రవర్తమానేంద్రియాశ్వ యుక్తం ఆత్మనా రధికేన ఆరూఢం శరీరరధం స్వవశే కుర్వత్ బుద్ధి రూప సారథినా సాధనేన సహితో జీవః రధికః విషయేభ్యః ఇంద్రియాశ్వ సంచారమార్గ రూపేభ్యః శబ్దాది విషయేభ్యః అక్షాన్ హయ రూపాణి ఇంద్రియాణి నియచ్ఛేత్ - నిగృహ్ణీయాత్”.

(బుద్ధియను సారధి విషయములను వీధులందు ఇష్టమువచ్చినట్లు చరించు ఇంద్రియములను గుఱ్ఱములతో కట్టబడి ఆత్మయను రథికుడు ఎక్కిన శరీరమను రధమును తన వశమందు ఉంచుకొను బుద్ధియను సారధితో కూడిన జీవుడను రధికుడు ఇంద్రియములను గుఱ్ఱములు సంచరించు మార్గమను శబ్దము మొదలగు విషయములనుండి గుఱ్ఱములను ఇంద్రియములను నిగ్రహించవలెను - తన వశములో నుంచుకొనవలెను).

  1. “నావ్యక్త శబ్దేనా బ్రహ్మాత్మకం ప్రథానమిహా భిధీయతే, కుతః? శరీర రూపక విన్యస్త గృహీతాః - శరీరాఖ్య రూపక విన్యస్తస్య అవ్యక్త శబ్దేన గృహీతాః ఆత్మ శరీరబుద్ధి మన ఇంద్రియ విషయేషు రధిరధాది భావేన రూపి తేషు రధిరూపేణ విన్యస్తస్య శరీరస్యాత్రా అవ్యక్తశబ్దేన గ్రహణాదిత్యర్థః ఏతదుక్తం భవతి - పూర్వత్రాహి –

“ఆత్మానం రథినం విద్ధి శరీరం రధమేవచ |

బుద్ధింతు సారధిం విద్ధిమనః ప్రగ్రహమేవచ |

ఇంద్రియాణి హయానా హుర్విషయాంస్తేషు గోచరాన్” |

ఇత్యాది నా “సో(అ)ధ్వనః పారమాస్నోతి తద్విష్ణోః పరమం పదం |”

ఇత్యంతేన సంసారాధ్వినః పారం వైష్ణవం పదం ప్రేప్సంత ముపాసకం రధిత్వేన తచ్ఛరీరాదీనిచ రధి రధాంగత్వేన రూపయిత్వా యస్యైతే రధాదయో వశే తిష్ఠంతి, స ఏవా ధ్వినః పారం వైష్ణవం పదమాప్నోతీత్యుక్త్వా, తేషు రధాది రూపిత శరీరాదిషు యాని యేభ్యో వశీకార్యాతయాం ప్రథానాని తాన్యుచ్యంతే - ఇంద్రియేభ్యః పరాహ్యర్థాః ఇత్యాదినా తత్ర హయత్వేన రూపితేభ్యో ఇంద్రియేభ్యో గోచరత్వేన రూపితా విషయాః వశీకార్యత్వే పరావశ్యేంద్రియ స్యాపి విషయ సన్నిధా నింద్రియాణాం దిర్నిగ్రహత్వాత్ - తేభో అపి పరం ప్రగ్రహ రూపితం మనః, మనసి విషయ ప్రవణే విష్యా సన్నిధా నస్యాప్య కించిత్కరత్వాత్. తస్మాదపి సారధిత్వ రూపితా బుద్ధిః పరా. అధ్యవసాయా భావే మనసో (అ)స్యకించిత్కరత్వాత్. తస్యాది అపి రధిత్వ రూపిత ఆత్మా కర్తృత్వేన ప్రాధాన్యాత్ పరః. సర్వస్య చాస్యాత్మేచ్ఛాయత్ తత్వాత్ ఆత్మైవ మహానితిచ విశిష్యతే. తస్మాదపి రధ రూపితం శరీరం పరం తదాయ తత్వాత్ జీవాత్మనస్సకల పురుషార్థ సాధన ప్రవృత్తీనాం | తస్మాదపి పర స్సర్వాంతరాత్మ భూతో (అ)oతర్యామ్యధ్వనః పార భూతః పరమ పురుషః యధోక్తస్యాత్మ పర్యంతస్య సమస్తస్య తత్సంకల్పాయత్త ప్రవృత్తిత్వాత్ సఖల్వంతర్యామి తయోపాసనస్యాపి నిర్వర్తకః “పరాత్తు తచ్ఛృతేః” ఇతి హి జీవాత్మనః కర్తృత్వం పరమ పురుష మాయత్తమితి వక్ష్యతే - వశీకార్యోపాసన నివృత్యుపాయ కాష్ఠా భూతః పరమ ప్రాప్యశ్చ స ఏవ తదిదిముచ్యతే -” పురుషాన్న పరం కించిత్ సాకాష్ఠా సా పరాగతిః” ఇతి. తథా చాంతర్యామి బ్రాహ్మణే - “య ఆత్మని తిష్టన్” ఇత్యాదిభిః. స్సర్వం సాక్షాత్కుర్వన్ సర్వం నియమయ తీత్యుక్త్వా “నాన్నో (అ)తో (అ)స్తి ద్రష్టా” ఇతి నియంత్రంతరం నిషిధ్యతే - భగవద్గీతాను చ –

“అధిష్ఠానం తథా కర్తా కరణంచ పృధద్విధం |

వివిధాచ పృథక్ చేష్టా దైవం చాత్ర పంచమం”

ఇతి. దైవ మత్ర పురుషోత్తమ ఏవ –

“సర్వస్యచాహం హృది సన్నివిష్టో మత్త స్స్మృ తి ర్జ్ఞాన మపోహనంచ |

ఇతి వచనాత్ తస్య చ వశీకరణం తచ్ఛరణాగతిరేవ, యధాహ -”

ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశే (అ)ర్జున తిష్ఠతి |

భ్రామయన్ సర్వభూతాని యంత్రా రూఢాని మాయయా |

తమేవ శరణం గచ్చ - - - ||.

ఇతి - తదేవం ఆత్మానం రధినం విద్ధి ఇత్యాదినా రథ్యాది రూపక విన్యస్తా ఇంద్రియాదయః ” ఇంద్రియేభ్యః పరాహ్యార్థాః” ఇత్యత్ర స్వశబ్దైరేవ ప్రత్యభిజ్ఞాయతే. నరధ రూపతం శరీరమితి పరిశేషాత్తదవ్యక్త శబ్దేనోచ్యతే ఇతి నిశ్చీయతే. అతః కాపిల తంత్ర సిద్ధస్య ప్రథానస్య ప్రసంగ ఏవనాస్తి నచాత్ర తత్తం త్ర సిద్ధ ప్రక్రియా ప్రత్యభిజ్ఞా -” ఇంద్రియేభ్యః పరాహ్యార్థాః ||

ఇతీంద్రీయేభ్యో (అ)ర్థానాం శబ్దా దీనాం పరత్వ కీర్తనాత్ న హి శబ్దాదయ ఇంద్రియాణాం కారణభూతా స్తద్దర్శనే” అర్థేభ్యశ్చ పరం మనః ఇత్యాపి న తత్తంత్ర సంగతం, అకారణత్వా దేవ - “బుద్ధేరాత్మ మహాపరః” ఇత్యప్యసంగతం, బుద్ధిశబ్దేన మహత్తత్వ స్యాభిదానాభ్యుపగమాత్. నహి మహతో మహాన్ పరస్సంభవతి. మహత ఆత్మ శబ్దేన విశేషణం చ న సంగచ్చతే. అతో రూపక విన్యస్తానామే వ గ్రహణం దర్శయతి చ తదేవ - ఏష సర్వేషు భూతేషు గూఢో (ఆ)థా న ప్రకాశతే |

దృశ్యతే త్సగ్ర్యయా బుద్ధ్యా సూక్షయా సూక్ష్మ దర్శిభిః ||.

“యచ్ఛేత్ వాఙ్మనసీ ప్రాజ్ఞస్త ద్యచ్చేత్ శాంత ఆత్మని: ఇతి అజిత బాహ్యాంతర కరణై రస్య పరమ పురుషస్య దుర్దర్షత్వ మభిధాయ హయాది రూపితానామింద్రియ దీనాం వశేఏకారప్రకారో (అ)యముచ్యతే -” యచ్ఛేద్వాఙ్మనసి వాచం మనసి నియచ్ఛేత్ - వాక్పూర్వకాని కర్మేంద్రియాణి జ్ఞానేంద్రియాణి చ మనసి నియచ్ఛేత్ ఇత్యర్థః - - ” తద్యచ్ఛేత్ జ్ఞాన ఆత్మని, తన్మనో బుద్ధౌ నియచ్ఛేత్, జ్ఞాన శబ్దేనాత్ర పూర్వోక్తా బుద్ధి రభిధీయతే | “జ్ఞాన ఆత్మని ఇత్యధికరణే సప్తమే ఆత్మని వర్తమానే జ్ఞానే నియచ్ఛేదిత్యర్థః” జ్ఞాన మాత్మని కహతి నియచ్ఛేత్” బుద్ధిం కర్తరి, మహత్యాత్మని నియచ్ఛేత్ తద్యచ్ఛేత్ ఆశాంత ఆత్మని” తం కర్తారం పరస్మిన్ బ్రహ్మణి సర్వాంతర్యామని నియచ్ఛేత్ - వ్యత్యయేన తదితి న పుంసకలింగతా. ఏవం భూతే రధినా వైష్ణవం పదం గంతవ్యమితి” (శ్రీరామానుజః)

(“ఆత్మ రధికుడు, శరీరము రథము, బుద్ధి సారధి, మనస్సు కళ్ళెము. ఇంద్రియములు గుఱ్ఱములు, విషయములు గోచరములు” అనిన్నీ, “అట్టి రధికుడు పోవు మార్గము చివర అగు పరబ్రహ్మ యగు ఆ విష్ణువుయొక్క ఉత్కృష్టమైన పదము - స్థానము - అగు వైకుంఠమును చేరగలడు” అను అంతముగల వాక్యములచేత సంసారమనెడి ప్రయాణమార్గము యొక్క చివర యగు - గమ్యస్థానమగు, వైష్ణవపదము, విష్ణుని స్థానము - పొందగోరు ఉపాసకుడు రధికుడుగా నిరూపించి శరీరము మొదలగువాటిని రధముగాను, దాని అంగములుగాను, నిరూపించి, ఎవనికి ఈ రధము మొదలగునవి తన వశములోనుండునో అతడే మార్గము యొక్క చివర యగు వైష్ణవ పదమును పొందగలడు అని చెప్పి అట్లు రధము మొదలగు వాటి శరీరాంగములు ఏది దేనికంటె ప్రథానమైనదో ఈ క్రింద విధముగా చెప్పడమైనది - ఇంద్రియములకంటె అర్థములు (విషయములు) ఉత్కృష్టమైనవి ఉత్కృష్టమైనది అను మొదలగునవి చెప్పబడినది. దీని ప్రకారము గుఱ్ఱములతో పోల్చి చెప్పబడిన ఇంద్రియములకంటె గోచరములని చెప్పబడిన విషయములు వశీకరణమందు - తన వశములో నుంచుకొనుటలో శ్రేష్టములు - ఇంద్రియములు తన వశములోనున్న వానికైనను విషయములు గోచరించునపుడు వాటినుండి ఇంద్రియములను మరలించుట కష్టమగుటచేత ఇట్లు చెప్పబడినది. కళ్ళెముతో పోల్చబడిన మనస్సు విషయములు లభించకపోవునపుడు ఏమియు చలించక యుండుటకు అవకాశము కలుగును కనుక విషయములకంటె శ్రేష్టము అని చెప్పబడినది. మనస్సుకంటె వివేకశక్తి కలదగుటచేత సారధిగా చెప్పబడిన బుద్ధి ఉత్కృష్టమైనది. రధికుడుగా నిరూపింపబడిన ఆత్మ కర్తృత్వము కలవాడగుతచేత సారధి అయిన బుద్ధికంటె శ్రేష్టము. అత్మ యొక్క ఇచ్ఛతోనే ముందు చెప్పబడినవన్నియు పనిచేయుటవలన ఆత్మయే ఇచ్చట మహాన్ అని చెప్పబడినది. ఈ ఆత్మకంటె రధముతో పోల్చి చెప్పబడినశరీరము జీవాత్మ పురుషార్థములన్నింటిని చేకూర్చుకొనుటకు సాధనమైన దగుటచేత ఉత్కృష్టమైనది. అన్నింటికి అంతరాత్మగానుండి, అంతర్యామిగానుండి, ఈ మోక్షమార్గము తుది అయిన పరమపురుషుడు - విష్ణువు - ఆత్మవరకు పైన చెప్పబడిన వాటి అన్నింటిని తన సంకల్పము చేతనే నడిపించుకొనువాడు కనుక ఉత్కృష్టమైనవాడు అతనే ఇట్టి ఉపాసకుని కూడా తన ఇష్టప్రకారము నిర్వర్తించుకొనువాడు, అతనిలో కూడ అంతర్యామిగా నుండువాడు కనుక. ఇందుచేత జీవాత్మ కర్తృత్వము పరమపురుషుని ఆధీనములోనిదే యని చెప్పబడు చున్నది. పైన చెప్పిన ప్రకారము ఉపాసకుడు ఇంద్రియములను, మనస్సును తన వశములో నుంచుకొని ఆ పరమ పదమార్గమునందు పోవుచున్నను అతని గమ్యస్థానము - చేరుకొనవలసిన స్థలము, పదము - ఆ పరమపురుషుడే - అందుచేతనే “ఆ పరమపురుషునికంటె ఉత్కృష్టమైనది లేదు - అతనే అన్నింటికంటె ఉత్కృష్టమైనవాడు; అతనే పరమగతి యగు వైకుంఠము”- అంతర్యామి బ్రాహ్మణములో ఈ క్రిందవిధముగా చెప్పబడినది - “ఎవడు ఆత్మలో నుండి - శరీరములోనుండి -” అని మొదలగునవి చెప్పుటచేత అన్నింటికి సాక్షియగుచు అన్నింటినీ నియమించునో ” అని చెప్పుచో - ” ఇతరుడు ద్రష్ట- చూచువాడు - సాక్షి మఱి యొకడు లేడు” - అని యింకొకడు భగవంతుడు కాక మఱియొకడు - నియంతయగువాడు - నియమించువాడు లేడు ” అని చెప్పబడినది. అధిష్ఠానము కర్తా, కరణము అని అనేక విధములుగా చెప్పుట, దైవము అని శ్రీమద్భగవద్గీతలో చెప్పబడినది. దైవము అనగా పురుషోత్తముడే. “అన్నింటి హృదయములోను ఉన్నవాడను నేనే, నా వలననే స్మృతి, జ్ఞానము అపోహనము కలుగుచున్నవి.” అని కూడ శ్రీమద్భగవద్గీతలో యుండుటచేత అతని వశమందే అన్నియు ఉన్నవని, అతనే అన్నిటికీ శరణాగతి యనియు చెప్పబడినది. సమస్త భూతములయొక్క హృదయమందు ఈశ్వరుడు - భగవంతుడు, ఉండి మాయచేయ, యంత్రముచేత త్రిప్పబడు బొమ్మలవలె వాటిని త్రిప్పుచు వాటికి భ్రమ కలిగించుచున్నాడు. “అతనిని శరణు పొందుము” అని కూడ చెప్పబడినది. “అతనే రధికుడు, శరీరము రధము” అను మొదలగు వాక్యములచే చెప్పుటవలన రధము మొదలగునవిగా చెప్పబడిన ఇంద్రియములు కంటె, ఒకదాని కంటె ఒకటి శ్రేష్టము (పరము) అని, అన్నింటికంటె శ్రేష్టమైనవాడు కనుక అతనిని శరణు పొందుము అని అర్థము - సమస్త భూతములందు ఈ ఆత్మ - భగవంతుడు - గూఢముగా (పైకి కనబడకుండ నున్నాడు. అయినను సూక్ష్మరూపముతో నుండువాడుకనుక, సూక్ష్మదృష్టి కలిగి దర్భ కొసవలె అతి తీక్ష్ణమైన బుద్ధి కలవారు అతనిని చూచుచున్నారు - “యచ్ఛేత్ వాఙ్మనసి ప్రాజ్ఞః, తద్యచ్ఛేత్ శాంత ఆత్మని” (వాక్కును మనసులో అణచి యుంచవలెను - అనగా వాక్కు మొదలగు వాటికి కారణమైన కర్మేంద్రియములను, జ్ఞనేంద్రియములను మనసులో అరికట్టి యుంచవలెను - ” తన్మనో బుద్ధౌ నియచ్ఛేత్” జ్ఞానము అనగా బుద్ధియని యిచ్చట అర్థము - ” జ్ఞానమాత్మని మహతి నియచ్ఛేత్ ” బుద్ధిని కర్తయగు మహత్తు అగు ఆత్మయందు అరికట్టి యుంచవలెను - “తం కర్తారం పరస్మిన్ బ్రహాణి సర్వాంతర్యామిని నియచ్ఛేత్”. దానిని కర్తయగు బుద్ధిని పరబ్రహ్మ యందు ఉంచవలెను. ఈ ప్రకారముగా రధికుడు వెళ్ళిన పరమపదమగు, లక్ష్యస్థానమగు వైకుంఠము చేరుకొనును).

Transliteration
  1. “ātmānaṃ radhinaṃ viddhi śarīraṃ radhamēvatu |

buddhiṃ tusāradhiṃ viddhi manaḥ pragrahamēvaca |

kō iṃdriyāṇi hayā nāhu rviṣayāṃstēṣu gōcarān ||”

ātmēṃdriya manōyuktaṃ bhōktētyāhurmanīṣiṇaḥ ||“.

(“pragrahaḥ = aśvaraśanā, yadhā buddhi sāradhiḥ vivēkī tathā manasēṃdriya hayān viṣama viṣaya mārgādā karṣati, yadya vivēkī, tadā manō rasava buddhiṃ stān pravartayati iti manasaḥ pragrahatvaṃ yuktaṃ)

(ātma - jīvātma - jīvuḍu radhikuḍu, śarīramu radhamu; buddhi sāradhi; manassu kaḷḷemulu; iṃdriyamulu guṟṟamulu; viṣayamulu vāṭi lakṣyamu - iṃdriyamulatōnu, manassutōnu kūḍina ātma viṣayamulanu bhōgiṃcuvāḍu - anubhaviṃcuvāḍu - bhōkta; buddhi yanu sāradhi vivēka vaṃtuḍainayaḍala iṃdriyamulanu ghuṟṟamulanu viṣayamulamārgamunuṃḍi tappiṃcunu - maralcunu. buddhiyanu sāradhi avivēki ayinayaḍala iṃdriyamulanu, manassunu paggamulacēta - kaḷḷemulacēta - maralpalēḍu. aṃducēta manassu paggamutō pōlcabaḍinadi).

“yastva vijñānavān bhavati yuktēna manasā saha |

tasyēṃdriyāṇyavaśyāni duṣṭāśvā iva sāradhēḥ |

yastu vijñāna vānbhavati yuktēva manasā sadā |

tasyēṃdriyāṇi vaśyāni sadaśvā iva sāradhēḥ ||“.

(ātmanu radhikuḍani teliyumu, śarīramunu radhamani teliyumu - buddhini sāradhiyaniyu, manassunu paggamulaniyu teliyumu - iṃdriyamulanu guṟṟamulaniyu, iṃdriyaviṣayamulanu guṟṟamulu pōvu mārgamaniyu ceppuduru - iṭlu śarīrēṃdriya manōyuktuḍagu jīvuni manīṣulu bhōktayani pērkoṃduru. asamāhita cittuḍayi nērparigāni sāradhigala jīvunaku lōkamuna paggamula paṭṭa teliyani sāradhiki guṟṟamulavale iṃdriyamula paṭṭu tappi naḍuvasāgunu. paggamulu paṭṭajāli samāhita citttuḍu ayi nērpugala sāradhiki, vaśyamulaina guṟṟamula gagidi, samāhita cittuḍayi vijñānavaṃtuḍagu sāradhigala jīvunaku iṃdriyamulu tappu trōvalu trokkajālavu).

  1. “sī. radhamu mēnellu, sāradhi buddhi, iṃdriya guṇamu guṟṟamulu, paggamulu manamu

prāṇādi daśavidha pavanaṃbulirusu, dharmā dharma gatulu radhāṃgakamulu

bahuḷataraṃbaina baṃdhaṃbu cittaṃbu, śabdādikamulu saṃcāra bhūmu

labhimānasaṃ yutuṃḍayina jīvuḍu radhi, ghanatara praṇavaṃbu kārmukaṃbu

tē. śuddhajīvuṃḍu bāṇaṃbu, śubhadamaina

bramaṃcita lakṣyaṃbu parulu rāga

bhaya mada dvēṣa śōka lōbha pramōha

māna matsara mukhamulu, mānavēṃdra.”

“va. iṭlu mānaṣa śarīra rūpaṃbayina radhaṃbu dana vaśaṃbusēsikoni mahābhāgavata caraṇamula sēvāniśitaṃbayina vijñāna khaḍgaṃbu dhariyiṃci śrīmannārāyaṇa karuṇāvalōkana balaṃbuna rāgādi śatru nirmūlanaṃbu gāviṃci praṇavabāṇāsanaṃbuna śuddha jīva śaraṃbunu saṃdhiṃci brahammaniyeḍi guṟiyaṃdu baḍavēsi yahaṃkāra radhikuṃḍu radhikatvaṃbumāni nijānaṃdaṃbuna nuṃḍavalayu. aṭṭi viśēṣaṃbu saṃbhaviṃpani samayaṃbuna bahirmukhaṃbulayina yiṃdriya ghōṭakaṃbulu buddhi sāradhi sahitaṃbulai svābhimāna radhikuni pramattatvaṃbu delisi pravṛttamārgaṃbu noṃdiṃci viṣaya śatrumadhyaṃbunaṃ gūlcina -.

“ā. viṣaya śatrulella vikrāṃti tōḍasā

radhi samētuḍayina radhiku baṭṭi

yugratimaramṛtyu yutamagu

saṃsāra kūpa madhyamaṃdu gūltu radhipa”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 15 - 465.466)

  1. “radha baddha haya sthānī yaiḥ ākṛṣya māṇatvāt śarīraṃ radhaṃ iva; tasya ātmā radhikaḥ (radhasvāmī); buddhiḥ radhyavasāya lakṣaṇā sāradhiḥ; buddhi nētṛ prathānatvā ccharīrasya manaḥ saṃkalpa vikalpādi lakṣaṇaṃ raśanā, iṃdriyāṇi cakṣurā dīni hayān radhakalpanā kuśalāḥ śarīra rathākarṣaṇa sāmānyāt - iti śarīrēṃdriya manōbhissahitaṃ ātmā saṃsārī iva dṛśyatē - (ātmaśabdō dēhaparaḥ)”.

(radhamunaku kaṭṭabaḍina guṟṟamulavale nuṃḍuvāṭicēta lāgabaḍinaṃduvalana śarīramu oka radhamutō pōlcabaḍinadi. śarīramulōni ātma radhikuḍu (radhuḍu, radhamunekkinavāḍu). buddhi yanunadi sāradhi (radhamu naḍupuvāḍu) - buddhi śarīramunu tana iṣṭamuvaccinaṭlu naḍupunadi kanuka sāradhitō pōlcabaḍinadi. manassu saṃkalpamulu cēyunadi kanuka tāḍu (kaḷḷemu, paggamu -) śarīra radhamunu lāgunadi kanuka kaṃḍlu modalagu iṃdriyamulu guṟṟamulatō pōlcabaḍinadi. iṭlu śarīramu, iṃdriyamulu manassutō kalisiyunna ātma saṃsāri vale pōlcabaḍucunnavi)

  1. “radha sāradhi hayapragrahatvēna (raśanayā) rūpitānāṃ śarīrēṃdriya manō buddhināṃ abhāvē rathitvēna rūpitasya udāsīna sya ātmanaḥ gamana rūpa laukika vaidika kriyā kartṛtvamēva nāstītyēta tsu prasiddhatvēna darśayati. ātma śabdō dēhaparaḥ; manaśśabdaḥ tatkārya buddērapi upa lakṣakaḥ; buddhērapi sāradhitvēna nirdiṣṭatvāt bhōktā kartatva bhōktṛtva vā nityarthaḥ - nahi kēvalasyātmanaḥ aḥkartṛtvaṃ bhōktṛtvaṃ vā stīti bhāvaḥ” - (śrīmān raṃgarāmānujaḥ)

(radhamu, sāradi, guṟṟamulu, kaḷḷemu vale pōlcabaḍina śarīramu iṃdriyamulu, manassu, buddhi anunavi lēniyaḍala radhikuḍugā nirūpiṃcabaḍina udāsīnuḍagu ātmayokka gamanamunu laukika, vaidika kriyalu cēyuṭa anu kartṛtvamē lēdu - anu viṣayamu iṃdu mūlamugā bāgugā nirūpiṃcabaḍinadi. ātma yanagā dēhamu, manassu anunadi ā śarīramu cēyu pani yagu buddhiki upalakṣaṇamu. buddhi sāradhi yani ceppuṭavalana bhōktagā pōlcabaḍinadi - anagā, kartṛtvamu (karmacēyuṭa), bhōktṛtvamu (karma phalamanubhaviṃcuṭa) kalavāḍu. kēvalamu ātmaku kartṛtvamu bhōktṛtvamu lēdani dīni bhāvamu).

  1. “lōkēhi samīcīna sāradhi pragrahavataḥ aśvāḥ vaśīkṛtāḥ bhāvaṃti; ēvaṃ sāradhi pragrahatvēna rūpitayōḥ vijñāna manasōḥ sāmī cīnyē aśvatyēna rūpitāni iṃdriyāṇi vaśyāni bhavaṃti, nānyathā ityarthaḥ.”

(lōkamulō radhasāradhikaḷḷemulatō paṭṭukoniyuṃḍu guṟṟamulu atani vaśamulō nuṃḍunani prasiddha viṣayamē. ā prakāramugānē sāradhi cēta kaḷḷemulatō paṭṭubaḍina (loṃgina) guṟṟamulavale nirūpiṃcabaḍina iṃdriyamulanu kūḍa vaśamulō nuṃcukonuṭaku vīlagunu - iṃkoka rītigā iṃdriyamulu vaśamulō nuṃḍavu).

  1. “yaḥ buddhyā khya sāradhiḥ avivēkībhavati (asamāhitēna manasā pragrahasthānīyēna sadā yuktō bhavati) tasya akuśalasya budhisāradhēḥ iṃdriyāṇi aśvasthānī yāni avaśyāni aśakya nivāraṇāni duṣṭāśvāḥ adāṃtā śvā iva itara sāradērbhavaṃti. yastu sāradhiḥ vivēkavān nipuṇaḥ yuktēna manasā samāhita cittaḥ sadā tasya aśvasthānīyāni iṃdriyāṇi pravartayituṃ nivartayituṃ vā śakyāni vaśyāni dāṃtā sadaśvā idētara sāradhēḥ”.

(buddhiyanu sāradhi avivēki ayina yaḍala (samāhitamaina manassu lēnivāḍu, cētakānivāḍu ayinayaḍala) aśvamuvalenuṃḍu iṃdriyamulu tana vaśamulō uṃcukonalēḍu - peṃki guṟṟamulavale nuṃḍunu. sāradhi vivēkavaṃtuḍu, nipuṇuḍu (cētanayinavāḍu, manassunu tanavaśamulō nuṃcukona galiginavāḍu) ayinayaḍala (guṟṟamulatō pōlcabaḍina) atani iṃdriyamulu maṃci guṟṟamulavale tana vaśamulō nuṃḍunu - eṭlu naḍipina aṭlu naḍavagalavu - eṭlu trippina aṭlu tirugagalavu.)

  1. “śarīrēṃdriya manōbuddhi viṣaya vēdanā saṃ yuktasya hyavidyāvatō bhōktaḥ śarīrādīnāṃ radhādhirūpa kalpanayā saṃsāra mōkṣagati nirūpaṇēna pratyagātma brahmāvagati riha vivakṣitā”. (śrī śaṃkaraḥ - brahma sūtrabhāṣyē)

(śarīramu, iṃdriyamulu, manassu, buddhi, viṣayavēdana, vīṭi anniṃṭitō kūḍina avidyavalana bhōktayagu jīvi yokka śarīramu modalagunavi radhamu modalaguvāṭitō kalpiṃci pōlcaḍamu dvārā saṃsāramu, mōkṣamu anu vīṭi nirūpiṃcuṭacēta pratyagātma brahma prāpti yeṭlu poṃdagalugunō telupabaḍinadi).

  1. “śarīrasya radha haya sthānīyēṃdriyā kṛṣyamāṇatvāt śarīramēva radhaṃ - śarīraṃ radhamēva ca” iti śrutēḥ (kaṭhivalyupaniṣat)

(radhamu, guṟṟamulugā ceppabaḍina iṃdriyamulacēta śarīramu trippabaḍucunnaṃduna - lāgabaḍucunnaṃduna “śarīramē radhamu” ani upaniṣadvākyamu)

  1. “buddhi sāradhiḥ viṣaya vīdhīṣu yadhēcchaṃ pravartamānēṃdriyāśva yuktaṃ ātmanā radhikēna ārūḍhaṃ śarīraradhaṃ svavaśē kurvat buddhi rūpa sārathinā sādhanēna sahitō jīvaḥ radhikaḥ viṣayēbhyaḥ iṃdriyāśva saṃcāramārga rūpēbhyaḥ śabdādi viṣayēbhyaḥ akṣān haya rūpāṇi iṃdriyāṇi niyacchēt - nigṛhṇīyāt”.

(buddhiyanu sāradhi viṣayamulanu vīdhulaṃdu iṣṭamuvaccinaṭlu cariṃcu iṃdriyamulanu guṟṟamulatō kaṭṭabaḍi ātmayanu rathikuḍu ekkina śarīramanu radhamunu tana vaśamaṃdu uṃcukonu buddhiyanu sāradhitō kūḍina jīvuḍanu radhikuḍu iṃdriyamulanu guṟṟamulu saṃcariṃcu mārgamanu śabdamu modalagu viṣayamulanuṃḍi guṟṟamulanu iṃdriyamulanu nigrahiṃcavalenu - tana vaśamulō nuṃcukonavalenu).

  1. “nāvyakta śabdēnā brahmātmakaṃ prathānamihā bhidhīyatē, kutaḥ? śarīra rūpaka vinyasta gṛhītāḥ - śarīrākhya rūpaka vinyastasya avyakta śabdēna gṛhītāḥ ātma śarīrabuddhi mana iṃdriya viṣayēṣu radhiradhādi bhāvēna rūpi tēṣu radhirūpēṇa vinyastasya śarīrasyātrā avyaktaśabdēna grahaṇādityarthaḥ ētaduktaṃ bhavati - pūrvatrāhi –

“ātmānaṃ rathinaṃ viddhi śarīraṃ radhamēvaca |

buddhiṃtu sāradhiṃ viddhimanaḥ pragrahamēvaca |

iṃdriyāṇi hayānā hurviṣayāṃstēṣu gōcarān” |

ityādi nā “sō(a)dhvanaḥ pāramāsnōti tadviṣṇōḥ paramaṃ padaṃ |”

ityaṃtēna saṃsārādhvinaḥ pāraṃ vaiṣṇavaṃ padaṃ prēpsaṃta mupāsakaṃ radhitvēna taccharīrādīnica radhi radhāṃgatvēna rūpayitvā yasyaitē radhādayō vaśē tiṣṭhaṃti, sa ēvā dhvinaḥ pāraṃ vaiṣṇavaṃ padamāpnōtītyuktvā, tēṣu radhādi rūpita śarīrādiṣu yāni yēbhyō vaśīkāryātayāṃ prathānāni tānyucyaṃtē - iṃdriyēbhyaḥ parāhyarthāḥ ityādinā tatra hayatvēna rūpitēbhyō iṃdriyēbhyō gōcaratvēna rūpitā viṣayāḥ vaśīkāryatvē parāvaśyēṃdriya syāpi viṣaya sannidhā niṃdriyāṇāṃ dirnigrahatvāt - tēbhō api paraṃ pragraha rūpitaṃ manaḥ, manasi viṣaya pravaṇē viṣyā sannidhā nasyāpya kiṃcitkaratvāt. tasmādapi sāradhitva rūpitā buddhiḥ parā. adhyavasāyā bhāvē manasō (a)syakiṃcitkaratvāt. tasyādi api radhitva rūpita ātmā kartṛtvēna prādhānyāt paraḥ. sarvasya cāsyātmēcchāyat tatvāt ātmaiva mahānitica viśiṣyatē. tasmādapi radha rūpitaṃ śarīraṃ paraṃ tadāya tatvāt jīvātmanassakala puruṣārtha sādhana pravṛttīnāṃ | tasmādapi para ssarvāṃtarātma bhūtō (a)otaryāmyadhvanaḥ pāra bhūtaḥ parama puruṣaḥ yadhōktasyātma paryaṃtasya samastasya tatsaṃkalpāyatta pravṛttitvāt sakhalvaṃtaryāmi tayōpāsanasyāpi nirvartakaḥ “parāttu tacchṛtēḥ” iti hi jīvātmanaḥ kartṛtvaṃ parama puruṣa māyattamiti vakṣyatē - vaśīkāryōpāsana nivṛtyupāya kāṣṭhā bhūtaḥ parama prāpyaśca sa ēva tadidimucyatē -” puruṣānna paraṃ kiṃcit sākāṣṭhā sā parāgatiḥ” iti. tathā cāṃtaryāmi brāhmaṇē - “ya ātmani tiṣṭan” ityādibhiḥ. ssarvaṃ sākṣātkurvan sarvaṃ niyamaya tītyuktvā “nānnō (a)tō (a)sti draṣṭā” iti niyaṃtraṃtaraṃ niṣidhyatē - bhagavadgītānu ca –

“adhiṣṭhānaṃ tathā kartā karaṇaṃca pṛdhadvidhaṃ |

vividhāca pṛthak cēṣṭā daivaṃ cātra paṃcamaṃ”

iti. daiva matra puruṣōttama ēva –

“sarvasyacāhaṃ hṛdi sanniviṣṭō matta ssmṛ ti rjñāna mapōhanaṃca |

iti vacanāt tasya ca vaśīkaraṇaṃ taccharaṇāgatirēva, yadhāha -”

īśvarassarvabhūtānāṃ hṛddēśē (a)rjuna tiṣṭhati |

bhrāmayan sarvabhūtāni yaṃtrā rūḍhāni māyayā |

tamēva śaraṇaṃ gacca - - - ||.

iti - tadēvaṃ ātmānaṃ radhinaṃ viddhi ityādinā rathyādi rūpaka vinyastā iṃdriyādayaḥ ” iṃdriyēbhyaḥ parāhyārthāḥ” ityatra svaśabdairēva pratyabhijñāyatē. naradha rūpataṃ śarīramiti pariśēṣāttadavyakta śabdēnōcyatē iti niścīyatē. ataḥ kāpila taṃtra siddhasya prathānasya prasaṃga ēvanāsti nacātra tattaṃ tra siddha prakriyā pratyabhijñā -” iṃdriyēbhyaḥ parāhyārthāḥ ||

itīṃdrīyēbhyō (a)rthānāṃ śabdā dīnāṃ paratva kīrtanāt na hi śabdādaya iṃdriyāṇāṃ kāraṇabhūtā staddarśanē” arthēbhyaśca paraṃ manaḥ ityāpi na tattaṃtra saṃgataṃ, akāraṇatvā dēva - “buddhērātma mahāparaḥ” ityapyasaṃgataṃ, buddhiśabdēna mahattatva syābhidānābhyupagamāt. nahi mahatō mahān parassaṃbhavati. mahata ātma śabdēna viśēṣaṇaṃ ca na saṃgaccatē. atō rūpaka vinyastānāmē va grahaṇaṃ darśayati ca tadēva - ēṣa sarvēṣu bhūtēṣu gūḍhō (ā)thā na prakāśatē |

dṛśyatē tsagryayā buddhyā sūkṣayā sūkṣma darśibhiḥ ||.

“yacchēt vāṅmanasī prājñasta dyaccēt śāṃta ātmani: iti ajita bāhyāṃtara karaṇai rasya parama puruṣasya durdarṣatva mabhidhāya hayādi rūpitānāmiṃdriya dīnāṃ vaśēēkāraprakārō (a)yamucyatē -” yacchēdvāṅmanasi vācaṃ manasi niyacchēt - vākpūrvakāni karmēṃdriyāṇi jñānēṃdriyāṇi ca manasi niyacchēt ityarthaḥ - - ” tadyacchēt jñāna ātmani, tanmanō buddhau niyacchēt, jñāna śabdēnātra pūrvōktā buddhi rabhidhīyatē | “jñāna ātmani ityadhikaraṇē saptamē ātmani vartamānē jñānē niyacchēdityarthaḥ” jñāna mātmani kahati niyacchēt” buddhiṃ kartari, mahatyātmani niyacchēt tadyacchēt āśāṃta ātmani” taṃ kartāraṃ parasmin brahmaṇi sarvāṃtaryāmani niyacchēt - vyatyayēna taditi na puṃsakaliṃgatā. ēvaṃ bhūtē radhinā vaiṣṇavaṃ padaṃ gaṃtavyamiti” (śrīrāmānujaḥ)

(“ātma radhikuḍu, śarīramu rathamu, buddhi sāradhi, manassu kaḷḷemu. iṃdriyamulu guṟṟamulu, viṣayamulu gōcaramulu” aninnī, “aṭṭi radhikuḍu pōvu mārgamu civara agu parabrahma yagu ā viṣṇuvuyokka utkṛṣṭamaina padamu - sthānamu - agu vaikuṃṭhamunu cēragalaḍu” anu aṃtamugala vākyamulacēta saṃsāramaneḍi prayāṇamārgamu yokka civara yagu - gamyasthānamagu, vaiṣṇavapadamu, viṣṇuni sthānamu - poṃdagōru upāsakuḍu radhikuḍugā nirūpiṃci śarīramu modalaguvāṭini radhamugānu, dāni aṃgamulugānu, nirūpiṃci, evaniki ī radhamu modalagunavi tana vaśamulōnuṃḍunō ataḍē mārgamu yokka civara yagu vaiṣṇava padamunu poṃdagalaḍu ani ceppi aṭlu radhamu modalagu vāṭi śarīrāṃgamulu ēdi dēnikaṃṭe prathānamainadō ī kriṃda vidhamugā ceppaḍamainadi - iṃdriyamulakaṃṭe arthamulu (viṣayamulu) utkṛṣṭamainavi utkṛṣṭamainadi anu modalagunavi ceppabaḍinadi. dīni prakāramu guṟṟamulatō pōlci ceppabaḍina iṃdriyamulakaṃṭe gōcaramulani ceppabaḍina viṣayamulu vaśīkaraṇamaṃdu - tana vaśamulō nuṃcukonuṭalō śrēṣṭamulu - iṃdriyamulu tana vaśamulōnunna vānikainanu viṣayamulu gōcariṃcunapuḍu vāṭinuṃḍi iṃdriyamulanu maraliṃcuṭa kaṣṭamaguṭacēta iṭlu ceppabaḍinadi. kaḷḷemutō pōlcabaḍina manassu viṣayamulu labhiṃcakapōvunapuḍu ēmiyu caliṃcaka yuṃḍuṭaku avakāśamu kalugunu kanuka viṣayamulakaṃṭe śrēṣṭamu ani ceppabaḍinadi. manassukaṃṭe vivēkaśakti kaladaguṭacēta sāradhigā ceppabaḍina buddhi utkṛṣṭamainadi. radhikuḍugā nirūpiṃpabaḍina ātma kartṛtvamu kalavāḍagutacēta sāradhi ayina buddhikaṃṭe śrēṣṭamu. atma yokka icchatōnē muṃdu ceppabaḍinavanniyu panicēyuṭavalana ātmayē iccaṭa mahān ani ceppabaḍinadi. ī ātmakaṃṭe radhamutō pōlci ceppabaḍinaśarīramu jīvātma puruṣārthamulanniṃṭini cēkūrcukonuṭaku sādhanamaina daguṭacēta utkṛṣṭamainadi. anniṃṭiki aṃtarātmagānuṃḍi, aṃtaryāmigānuṃḍi, ī mōkṣamārgamu tudi ayina paramapuruṣuḍu - viṣṇuvu - ātmavaraku paina ceppabaḍina vāṭi anniṃṭini tana saṃkalpamu cētanē naḍipiṃcukonuvāḍu kanuka utkṛṣṭamainavāḍu atanē iṭṭi upāsakuni kūḍā tana iṣṭaprakāramu nirvartiṃcukonuvāḍu, atanilō kūḍa aṃtaryāmigā nuṃḍuvāḍu kanuka. iṃducēta jīvātma kartṛtvamu paramapuruṣuni ādhīnamulōnidē yani ceppabaḍu cunnadi. paina ceppina prakāramu upāsakuḍu iṃdriyamulanu, manassunu tana vaśamulō nuṃcukoni ā parama padamārgamunaṃdu pōvucunnanu atani gamyasthānamu - cērukonavalasina sthalamu, padamu - ā paramapuruṣuḍē - aṃducētanē “ā paramapuruṣunikaṃṭe utkṛṣṭamainadi lēdu - atanē anniṃṭikaṃṭe utkṛṣṭamainavāḍu; atanē paramagati yagu vaikuṃṭhamu”- aṃtaryāmi brāhmaṇamulō ī kriṃdavidhamugā ceppabaḍinadi - “evaḍu ātmalō nuṃḍi - śarīramulōnuṃḍi -” ani modalagunavi ceppuṭacēta anniṃṭiki sākṣiyagucu anniṃṭinī niyamiṃcunō ” ani ceppucō - ” itaruḍu draṣṭa- cūcuvāḍu - sākṣi maṟi yokaḍu lēḍu” - ani yiṃkokaḍu bhagavaṃtuḍu kāka maṟiyokaḍu - niyaṃtayaguvāḍu - niyamiṃcuvāḍu lēḍu ” ani ceppabaḍinadi. adhiṣṭhānamu kartā, karaṇamu ani anēka vidhamulugā ceppuṭa, daivamu ani śrīmadbhagavadgītalō ceppabaḍinadi. daivamu anagā puruṣōttamuḍē. “anniṃṭi hṛdayamulōnu unnavāḍanu nēnē, nā valananē smṛti, jñānamu apōhanamu kalugucunnavi.” ani kūḍa śrīmadbhagavadgītalō yuṃḍuṭacēta atani vaśamaṃdē anniyu unnavani, atanē anniṭikī śaraṇāgati yaniyu ceppabaḍinadi. samasta bhūtamulayokka hṛdayamaṃdu īśvaruḍu - bhagavaṃtuḍu, uṃḍi māyacēya, yaṃtramucēta trippabaḍu bommalavale vāṭini trippucu vāṭiki bhrama kaligiṃcucunnāḍu. “atanini śaraṇu poṃdumu” ani kūḍa ceppabaḍinadi. “atanē radhikuḍu, śarīramu radhamu” anu modalagu vākyamulacē ceppuṭavalana radhamu modalagunavigā ceppabaḍina iṃdriyamulu kaṃṭe, okadāni kaṃṭe okaṭi śrēṣṭamu (paramu) ani, anniṃṭikaṃṭe śrēṣṭamainavāḍu kanuka atanini śaraṇu poṃdumu ani arthamu - samasta bhūtamulaṃdu ī ātma - bhagavaṃtuḍu - gūḍhamugā (paiki kanabaḍakuṃḍa nunnāḍu. ayinanu sūkṣmarūpamutō nuṃḍuvāḍukanuka, sūkṣmadṛṣṭi kaligi darbha kosavale ati tīkṣṇamaina buddhi kalavāru atanini cūcucunnāru - “yacchēt vāṅmanasi prājñaḥ, tadyacchēt śāṃta ātmani” (vākkunu manasulō aṇaci yuṃcavalenu - anagā vākku modalagu vāṭiki kāraṇamaina karmēṃdriyamulanu, jñanēṃdriyamulanu manasulō arikaṭṭi yuṃcavalenu - ” tanmanō buddhau niyacchēt” jñānamu anagā buddhiyani yiccaṭa arthamu - ” jñānamātmani mahati niyacchēt ” buddhini kartayagu mahattu agu ātmayaṃdu arikaṭṭi yuṃcavalenu - “taṃ kartāraṃ parasmin brahāṇi sarvāṃtaryāmini niyacchēt”. dānini kartayagu buddhini parabrahma yaṃdu uṃcavalenu. ī prakāramugā radhikuḍu veḷḷina paramapadamagu, lakṣyasthānamagu vaikuṃṭhamu cērukonunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.