← Back to శ · Booklets 41–50 (digitized file 5)

శరీరి śarīri

Original — తెలుగు
  1. “శరీరమస్యాస్తీతి శరీరీ - చేతనం”

(శరీరము గలవాడు - జీవుడు) (చైతన్యము గలవాడు).

  1. ప్రాణి (ప్రాణము గలవాడు)

  2. “అజో నిత్యః అశాశ్వ తోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే” (శ్రీమద్భగవద్గీత - 2 - 20)

(ఈ శరీరి - జీవుడు - కన్మలేనివాడు, శాశ్వతముగా నుండువాడు, పూర్వమునుండి యున్నవాడు, శరీరము చనిపోయినను - తాను చావనివాడు).

  1. “అచ్ఛేద్యోయమదాహ్యో యమ క్లేద్యో (అ)శోష్య ఏవచ |

నిత్యః సర్వగుతః స్థాణురచలోయం సనాతనః ||.

అవ్యక్తో యమచింత్యోయమవికార్యోయముచ్యతే ||” (శ్రీమద్భగవద్గీత - 2 - 24, 25)

(ఈ శరీరి - జీవుడు ఛేదింపనలవికానివాడు, దహించ నలవికానివాడు, క్లేదము పొందడు, అశోష్యుడు, నిత్యుడు, అన్ని వస్తువులలో నుండువాడు, స్థాణువు వలె చలించనివాడు, సనాతనుడు - కనబడనివాడు, చింతింప నలవికానివాడు, వికారములు పొందనివాడు - ఎప్పుడు ఒకే రీతిగా నుండువాడు)

  1. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో(అ)పరాణి |

తథా శరీరాణి విహాయ జీర్ణాన్యాన్యాని సం యాతి నవాని దేహీ ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 22)

(నరుడు జీర్ణించిన వస్త్రములను వదలి కొత్త వస్త్రములను ఎట్లు ధరించునో యీ శరీరి - జీవుడు - దేహి అట్లే జీర్ణించిపోయిన శరీరమును వదలి కొత్త శరీరములను ధరించును).

Transliteration
  1. “śarīramasyāstīti śarīrī - cētanaṃ”

(śarīramu galavāḍu - jīvuḍu) (caitanyamu galavāḍu).

  1. prāṇi (prāṇamu galavāḍu)

  2. “ajō nityaḥ aśāśva tōyaṃ purāṇō na hanyatē hanyamānē śarīrē” (śrīmadbhagavadgīta - 2 - 20)

(ī śarīri - jīvuḍu - kanmalēnivāḍu, śāśvatamugā nuṃḍuvāḍu, pūrvamunuṃḍi yunnavāḍu, śarīramu canipōyinanu - tānu cāvanivāḍu).

  1. “acchēdyōyamadāhyō yama klēdyō (a)śōṣya ēvaca |

nityaḥ sarvagutaḥ sthāṇuracalōyaṃ sanātanaḥ ||.

avyaktō yamaciṃtyōyamavikāryōyamucyatē ||” (śrīmadbhagavadgīta - 2 - 24, 25)

(ī śarīri - jīvuḍu chēdiṃpanalavikānivāḍu, dahiṃca nalavikānivāḍu, klēdamu poṃdaḍu, aśōṣyuḍu, nityuḍu, anni vastuvulalō nuṃḍuvāḍu, sthāṇuvu vale caliṃcanivāḍu, sanātanuḍu - kanabaḍanivāḍu, ciṃtiṃpa nalavikānivāḍu, vikāramulu poṃdanivāḍu - eppuḍu okē rītigā nuṃḍuvāḍu)

  1. vāsāṃsi jīrṇāni yathā vihāya navāni gṛhṇāti narō(a)parāṇi |

tathā śarīrāṇi vihāya jīrṇānyānyāni saṃ yāti navāni dēhī ||“. (śrīmadbhagavadgīta - 2 - 22)

(naruḍu jīrṇiṃcina vastramulanu vadali kotta vastramulanu eṭlu dhariṃcunō yī śarīri - jīvuḍu - dēhi aṭlē jīrṇiṃcipōyina śarīramunu vadali kotta śarīramulanu dhariṃcunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.