← Back to శ · Booklets 41–50 (digitized file 5)

శతాక్షీ śatākṣī

Original — తెలుగు

“అస్మాత్ శాంత్యర్థమతులం లోచనానాం సహస్రకం |

త్వయా యతో ధృతం, దేవి, శతాక్షీ త్వం తతో భవ ||“. (దేవీ భాగవతం)

“దేవీ అనంత నయనోద్భవా (బహు నయనోద్భవా) వారిధారా మోచయామాస లోకాన్ దుఃఖితాన్ దృష్ట్వా జగన్మాతః కారణ్యవశాత్ రోదనం ఆగతం తద్వశాత్ నవరాత్ర పర్యంతం భగవత్యాః నేత్రేభ్యో అశ్రూణి చ్యుతాని తేభ్యం సర్వం జగత్ తప్తం సజలం జాతం - ఇతి భగవత్యాః జనవాత్సల్యం -”

(శ్రీదేవి తనయొక్క వేలకొలదిగానున్న - లెక్కలేనన్ని కన్నులనుండి కన్నీరు కార్చెను - దుఃఖములనుభవించుచున్న లోకములను - లోకులను - చూచి జగన్మాతయైన దేవి కరుణవలన రోదనము వచ్చెను - అందువలన ఏడు రాత్రులవఱకు దేవి కండ్లనుండి కన్నెరు కార్చెను. వాటివలన తపింప చేయబడిన జగత్తు అంతయు నీరుతో నిండెను - తపింపచేయబడిన లోకములను శాంతి చేయుటకు శ్రీదేవి వేలకొలది నేత్రములను ధరించినందున శతాక్షీ అని ఆమెకు పేరు కలిగెను. లోకముల కష్టములను చూచిన కరుణామయి అయిన దేవి వేలకొలది కన్నులనుండి కన్నీరు కార్చి ఆ తాపము నడచెను -

Transliteration

“asmāt śāṃtyarthamatulaṃ lōcanānāṃ sahasrakaṃ |

tvayā yatō dhṛtaṃ, dēvi, śatākṣī tvaṃ tatō bhava ||“. (dēvī bhāgavataṃ)

“dēvī anaṃta nayanōdbhavā (bahu nayanōdbhavā) vāridhārā mōcayāmāsa lōkān duḥkhitān dṛṣṭvā jaganmātaḥ kāraṇyavaśāt rōdanaṃ āgataṃ tadvaśāt navarātra paryaṃtaṃ bhagavatyāḥ nētrēbhyō aśrūṇi cyutāni tēbhyaṃ sarvaṃ jagat taptaṃ sajalaṃ jātaṃ - iti bhagavatyāḥ janavātsalyaṃ -”

(śrīdēvi tanayokka vēlakoladigānunna - lekkalēnanni kannulanuṃḍi kannīru kārcenu - duḥkhamulanubhaviṃcucunna lōkamulanu - lōkulanu - cūci jaganmātayaina dēvi karuṇavalana rōdanamu vaccenu - aṃduvalana ēḍu rātrulavaṟaku dēvi kaṃḍlanuṃḍi kanneru kārcenu. vāṭivalana tapiṃpa cēyabaḍina jagattu aṃtayu nīrutō niṃḍenu - tapiṃpacēyabaḍina lōkamulanu śāṃti cēyuṭaku śrīdēvi vēlakoladi nētramulanu dhariṃcinaṃduna śatākṣī ani āmeku pēru kaligenu. lōkamula kaṣṭamulanu cūcina karuṇāmayi ayina dēvi vēlakoladi kannulanuṃḍi kannīru kārci ā tāpamu naḍacenu -

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.