← Back to శ · Booklets 41–50 (digitized file 5)

శత్రువు śatruvu

Original — తెలుగు
  1. తన క్రూర స్వభాముచే అకారణముగా గాని ఎదుటను, వెనుకను కూడ చెడుగును కోరువాడు.

  2. “ఉ. లోకములన్నియున్ గడియలోన జయించిన వాడవింద్రియా

నీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్దుచేయునీ

భీకర శత్రులార్వుర బ్రభిన్నుల చేయుము ప్రాణికోటిలో

నీకు విరోధి లేడొకడు నేర్పున జూడుము, దానవేశ్వరా “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 8 - 267)

  1. “సీ. చిత్తంబు సమముగా జేయుము; మార్గంబు దప్పి వర్తించు చిత్తంబు కంటె

వైరులెవ్వరు ? చిత్తంబు వైరికాక; చిత్తమును నీకు వశముగా చేయవయ్య- - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 8 - 266)

Transliteration
  1. tana krūra svabhāmucē akāraṇamugā gāni eduṭanu, venukanu kūḍa ceḍugunu kōruvāḍu.

  2. “u. lōkamulanniyun gaḍiyalōna jayiṃcina vāḍaviṃdriyā

nīkamu cittamun geluvanēravu, ninnu nibadducēyunī

bhīkara śatrulārvura brabhinnula cēyumu prāṇikōṭilō

nīku virōdhi lēḍokaḍu nērpuna jūḍumu, dānavēśvarā “. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 8 - 267)

  1. “sī. cittaṃbu samamugā jēyumu; mārgaṃbu dappi vartiṃcu cittaṃbu kaṃṭe

vairulevvaru ? cittaṃbu vairikāka; cittamunu nīku vaśamugā cēyavayya- - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 8 - 266)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.