← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వాచ్యార్థము vācyārthamu

Original — తెలుగు
  1. భ్రాంతివలన సామాన్యముగ చెప్పబడు అర్థము. విచారించిన మీదట తేలిన సిద్ధాంతము కాదు.

  2. “యస్మిన్ పదే యస్య అర్థస్య అవభోధక శక్తి రస్తి తస్య పదస్య సో అర్థః శక్యః భోధ్యః, శక్యార్థః ఏవ వాచ్యార్థః ఇతి, అభ్ధేయార్థః ఇతి, ముఖ్యార్థః ఇతి చ ఉచ్యతే. తద్యథా అగ్నిరితిపదే వహ్ని రూపార్థావ బోధకత్వ శక్తిరస్తి. తస్మాత్ అగ్ని పదస్య వహ్నిః శక్యార్థః వాచ్యార్థః అభిదేయార్థః ముఖ్యార్థశ్చ భవతి, వాచ్యార్ధ బోధకం పదం వాచకం ఇత్యుచ్యతే”.

(ఏ పదమునందు ఏ పదము యొక్క అర్థమున్నదో, బోధించు శక్తి యున్నదో ఆ పదము యొక్క అర్థము శక్యార్థము, శక్యార్థమే వాచ్యార్థము, అభిదేయార్థము, ముఖ్యార్థము అని చెప్పబడుచున్నది. అగ్ని యను పదములో వహ్ని యను అర్థమును బోధించుశక్తి యున్నది. అందుచేత అగ్ని యను పదమునకు వహ్ని యను పదము శక్యార్థము, అదియే వాచ్యార్థము, ముఖ్యార్థము. వాచ్యార్థమును బోధించు పదము వాచకమని చెప్పబడును).

  1. తత్ = ‘తత్’ అను పదమునకు పరబ్రహ్మమే వాచ్యార్థము - “తత్ త్వం అసి” (ఆ పరబ్రహ్మవు నీవే అయితివి) అను వాక్యములో తత్ = ‘అది’ అనునది పరబ్రహ్మకు బదులుగా చెప్పబడినది. అందుచేత ‘తత్’ అను పదము పరబ్రహ్మను చెప్పునది కనుక అది పరబ్రహ్మకు వాచ్యార్థము -

  2. “అహంకార విశిష్టమైన ఆత్మ అహం శబ్దమునకు వాచ్యార్థము” అహం అనగా నేను అని అర్థము - ఆ నేను అనునది సామాన్యముగా ఒక వ్యక్తిని గుఱించి చెప్పబడినది. అ వ్యక్తి జీవుడు. జీవుడే పరబ్రహ్మ. ఈ సంగతి తెలియక నేను, వాడు, జీవుడు అని చెప్పుట పరమాత్మ యొక్క వాచ్యార్థము. “అహం బ్రహ్మాస్మి” నేను పరబ్రహ్మను అయితిని అను వాక్యములో ‘అహం’ = నేను అనునది ‘బ్రహ్మ’ అనుమాటకు వాచ్యార్థము కాని అహం అనగా బ్రహ్మమే కనుక బ్రహ్మ అనునది లక్ష్యార్థము).

    1. థూలాదిత్యనుత్రయ సమష్టి రూపంబులగు విరాట్, హిరణ్యగర్భ ఈశ్వరులును బ్రహ్మంబునుంగూడి తప్తాయః పిండంబునుం బోలె నేకాకారంబై కాంచుటయే తత్పదంబునకు వాచ్యార్థంబు. (వివేకచింతామణి - పరమానందతీర్థ)
  3. ‘తత్’ అనగా ఆ జగదుత్పత్తిచేయునట్టియు, సర్వ జత్వాది ధర్మ సహితుడైన ఈశ్వరుడు; ‘త్వం’ అనగా నీవు జల్పశక్త్యిల్పజ్ఞత్వాది ధర్మములు గల జీవుడు, ‘అసి’ అనగా అయి యున్నావు అని యర్థము - ఇట్లు చెప్పుటవలన ‘వాడు, నీవుగా నున్నావు’ అని చెప్పుటవలన ఈశ్వర జీవుల ఏకత్వము వాచ్యార్థముచేత ప్రతీతమగును. కాని యిది సంభవింపదు - ఎందుచేతననగా - సర్వశక్తి, మఱియు అల్ప శక్తి, సర్వజ్ఞుడు, మఱియు అల్పజ్ఞుడు, విభుడు మఱియు పరిచ్ఛిన్నుడు, స్వతంత్రుడు మఱియు కర్మాధీనుడు, పరోక్షుడు మఱియు ప్రత్యక్షుడు, మాయాపతియు మఱియు, అవిద్యామోహితుడు ఒకడుగా నున్నాడు అని చెప్పైనట్లగును - ఇట్లు చెప్పుట ‘అగ్ని శీతలముగా నున్నది’ అని చెప్పినట్లగును - ఒకదానితో ఒకదానికి విరోధమున్నది. అందువలన ఈ స్థానమున లక్షణనుపయోగించి అర్థము గ్రహించవలెను - కాని జహల్లక్షణ, అజహల్లక్షణ ఇచ్చట నుపయోగించవు - భాగత్యాగలక్షణచేత అర్థమును గ్రహించవలెను.

Transliteration
  1. bhrāṃtivalana sāmānyamuga ceppabaḍu arthamu. vicāriṃcina mīdaṭa tēlina siddhāṃtamu kādu.

  2. “yasmin padē yasya arthasya avabhōdhaka śakti rasti tasya padasya sō arthaḥ śakyaḥ bhōdhyaḥ, śakyārthaḥ ēva vācyārthaḥ iti, abhdhēyārthaḥ iti, mukhyārthaḥ iti ca ucyatē. tadyathā agniritipadē vahni rūpārthāva bōdhakatva śaktirasti. tasmāt agni padasya vahniḥ śakyārthaḥ vācyārthaḥ abhidēyārthaḥ mukhyārthaśca bhavati, vācyārdha bōdhakaṃ padaṃ vācakaṃ ityucyatē”.

(ē padamunaṃdu ē padamu yokka arthamunnadō, bōdhiṃcu śakti yunnadō ā padamu yokka arthamu śakyārthamu, śakyārthamē vācyārthamu, abhidēyārthamu, mukhyārthamu ani ceppabaḍucunnadi. agni yanu padamulō vahni yanu arthamunu bōdhiṃcuśakti yunnadi. aṃducēta agni yanu padamunaku vahni yanu padamu śakyārthamu, adiyē vācyārthamu, mukhyārthamu. vācyārthamunu bōdhiṃcu padamu vācakamani ceppabaḍunu).

  1. tat = ‘tat’ anu padamunaku parabrahmamē vācyārthamu - “tat tvaṃ asi” (ā parabrahmavu nīvē ayitivi) anu vākyamulō tat = ‘adi’ anunadi parabrahmaku badulugā ceppabaḍinadi. aṃducēta ‘tat’ anu padamu parabrahmanu ceppunadi kanuka adi parabrahmaku vācyārthamu -

  2. “ahaṃkāra viśiṣṭamaina ātma ahaṃ śabdamunaku vācyārthamu” ahaṃ anagā nēnu ani arthamu - ā nēnu anunadi sāmānyamugā oka vyaktini guṟiṃci ceppabaḍinadi. a vyakti jīvuḍu. jīvuḍē parabrahma. ī saṃgati teliyaka nēnu, vāḍu, jīvuḍu ani ceppuṭa paramātma yokka vācyārthamu. “ahaṃ brahmāsmi” nēnu parabrahmanu ayitini anu vākyamulō ‘ahaṃ’ = nēnu anunadi ‘brahma’ anumāṭaku vācyārthamu kāni ahaṃ anagā brahmamē kanuka brahma anunadi lakṣyārthamu).

    1. thūlādityanutraya samaṣṭi rūpaṃbulagu virāṭ, hiraṇyagarbha īśvarulunu brahmaṃbunuṃgūḍi taptāyaḥ piṃḍaṃbunuṃ bōle nēkākāraṃbai kāṃcuṭayē tatpadaṃbunaku vācyārthaṃbu. (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)
  3. ‘tat’ anagā ā jagadutpatticēyunaṭṭiyu, sarva jatvādi dharma sahituḍaina īśvaruḍu; ‘tvaṃ’ anagā nīvu jalpaśaktyilpajñatvādi dharmamulu gala jīvuḍu, ‘asi’ anagā ayi yunnāvu ani yarthamu - iṭlu ceppuṭavalana ‘vāḍu, nīvugā nunnāvu’ ani ceppuṭavalana īśvara jīvula ēkatvamu vācyārthamucēta pratītamagunu. kāni yidi saṃbhaviṃpadu - eṃducētananagā - sarvaśakti, maṟiyu alpa śakti, sarvajñuḍu, maṟiyu alpajñuḍu, vibhuḍu maṟiyu paricchinnuḍu, svataṃtruḍu maṟiyu karmādhīnuḍu, parōkṣuḍu maṟiyu pratyakṣuḍu, māyāpatiyu maṟiyu, avidyāmōhituḍu okaḍugā nunnāḍu ani ceppainaṭlagunu - iṭlu ceppuṭa ‘agni śītalamugā nunnadi’ ani ceppinaṭlagunu - okadānitō okadāniki virōdhamunnadi. aṃduvalana ī sthānamuna lakṣaṇanupayōgiṃci arthamu grahiṃcavalenu - kāni jahallakṣaṇa, ajahallakṣaṇa iccaṭa nupayōgiṃcavu - bhāgatyāgalakṣaṇacēta arthamunu grahiṃcavalenu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.