(ఆరంభవాదము, పరిణామవాదము, వివర్తవాదము అని వాదము మూడు విధములు).
(1) రాగద్వేషములు లేక కేవలము తత్వమును తెలుసుకొను నభిలాషతో చేయబడు ప్రశ్నోత్తరాదులు వాదమనబడును –
(2) పరమతములను ఖండించి, తన మతమును స్థాపించుకొని, ఇతరులను జయించు నిమిత్తము చేయబడు ప్రసంగము జల్పమనబడును
(3) కేవలము పరమతమును దూషించు నుద్దేశముతో చేయబడునది వితండమనబడును.
(బ్రహ్మజ్ఞానము తెలియగోరు శ్రద్ధగల శిష్యుడు గురువు వద్ద వాదము చేయును - గురువు శిష్యుని శంక నివారించి (పోగొట్టి) బలమగు తర్కవాదముతో వానికి సిద్ధాంతమును బోధపఱచును - ఇట్టి వాదము దూషితముకాదు).
(వాదించగా వాదించగా వైరము అగ్నివలె వృద్ధి పొందును. ఏండుగడ్డి మీదపడని అగ్ని దానంతటదే ఆరిపోవును - కఱ్ఱలు వేయనిచో అగ్ని అదే ఆరిపోవును. అందుచేత వాద వివాదములు చేయక భక్తుడు అన్ని విషయములందు, అన్నిచోట్లను మౌనముగా నుండుట ఉత్తమము).
“వాదజల్ప వితండానాం మధ్యే వాదోహమీశ్వరః |
తత్ర తత్వ బుబుత్సోర్వా శిష్యదైశిక యోస్తధా |
ప్రమాణేనాచ తర్కేణ సాధనే దూషణాత్మకః |
తత్వనిర్ణయ పర్యంతః పక్షద్వయ పరిగ్రహః |
వాదః స్వాచ్ఛ్రాస్త్ర సిద్ధాంత నిర్ణయే | హేతురుత్తమః |
- - - ||“. (గీతాభావప్రకాశము - 10 - 133 to 135)
(వాదము, జల్పము, వితండము అను మూడింటిలోను వాదము అనునది నేనే (శ్రీకృష్ణభగవానుడే). బ్రహ్మతత్వమును తెలుసుకొనుటకు గురుశిష్యులు ప్రమాణతర్కములతో చేయువాదము తత్వమును నిర్ణయించువరకు శాస్త్ర సిద్ధాంతము నిర్ణయించువరకు చేయువాదము ఉత్తమమైనది).
(āraṃbhavādamu, pariṇāmavādamu, vivartavādamu ani vādamu mūḍu vidhamulu).
(1) rāgadvēṣamulu lēka kēvalamu tatvamunu telusukonu nabhilāṣatō cēyabaḍu praśnōttarādulu vādamanabaḍunu –
(2) paramatamulanu khaṃḍiṃci, tana matamunu sthāpiṃcukoni, itarulanu jayiṃcu nimittamu cēyabaḍu prasaṃgamu jalpamanabaḍunu
(3) kēvalamu paramatamunu dūṣiṃcu nuddēśamutō cēyabaḍunadi vitaṃḍamanabaḍunu.
(brahmajñānamu teliyagōru śraddhagala śiṣyuḍu guruvu vadda vādamu cēyunu - guruvu śiṣyuni śaṃka nivāriṃci (pōgoṭṭi) balamagu tarkavādamutō vāniki siddhāṃtamunu bōdhapaṟacunu - iṭṭi vādamu dūṣitamukādu).
(vādiṃcagā vādiṃcagā vairamu agnivale vṛddhi poṃdunu. ēṃḍugaḍḍi mīdapaḍani agni dānaṃtaṭadē āripōvunu - kaṟṟalu vēyanicō agni adē āripōvunu. aṃducēta vāda vivādamulu cēyaka bhaktuḍu anni viṣayamulaṃdu, annicōṭlanu maunamugā nuṃḍuṭa uttamamu).
“vādajalpa vitaṃḍānāṃ madhyē vādōhamīśvaraḥ |
tatra tatva bubutsōrvā śiṣyadaiśika yōstadhā |
pramāṇēnāca tarkēṇa sādhanē dūṣaṇātmakaḥ |
tatvanirṇaya paryaṃtaḥ pakṣadvaya parigrahaḥ |
vādaḥ svācchrāstra siddhāṃta nirṇayē | hēturuttamaḥ |
- - - ||“. (gītābhāvaprakāśamu - 10 - 133 to 135)
(vādamu, jalpamu, vitaṃḍamu anu mūḍiṃṭilōnu vādamu anunadi nēnē (śrīkṛṣṇabhagavānuḍē). brahmatatvamunu telusukonuṭaku guruśiṣyulu pramāṇatarkamulatō cēyuvādamu tatvamunu nirṇayiṃcuvaraku śāstra siddhāṃtamu nirṇayiṃcuvaraku cēyuvādamu uttamamainadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.