← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వైదికవాక్యము vaidikavākyamu

Original — తెలుగు
  1. “వైదికమీశ్వరోక్తత్వాత్ సర్వమపి ప్రమాణం” (తర్క సంగ్రహే).

(వేదము భగవంతుడు చెప్పినదగుటచేత అందులోనిదంతయు ప్రమాణము - వేదములో చెప్పినదానికి వేదమే ప్రమాణము).

  1. “నను” అష్టాదశ పురాణానాం కర్తా సత్యవతీ సుతః “ఇత్ వైజయంత్యాది ప్రమాణబలేన భారతాదౌకర్తా ఉపలభ్యతే, నహి వేదే. తదాచ స్మర్యమాణ కర్తృ కత్వస్య భారతాదౌ సాధ్యవ్యాపకత్వేన పక్షసాధన వ్యాపకత్వాత్ ఉపాధిత్వేన చ కథమనుమానం సాధకం భవేత్ ఇత్యాశంకతే”.

(పదునెనిమిది పురాణముల కర్త - పురాణములను వ్రాసినవాడు సత్యవతి కుమారుడు అయిన వ్యాసమహర్షియని వైజయంతి మొదలగు ప్రమాణగ్రంధములలో చెప్పబడియుండుటచేతను - భారతము మొదలగువాటిని ఎవరు వ్రాసిరో - వాటికి కర్త ఎవరో - తెలియవచ్చుచున్నది. వేదములో ఇటువంటిది లేదు - దాని కర్త ఎవరో చెప్పియుండ లేదు.

  1. “నను వేదస్యానిదిత్వాత్ కథమీశ్వరోక్తమితి చేన్న - వేదః పౌరుషేయః వాక్య సమూహత్వాత్ భారతాదివత్ న చ స్మర్యమాణకర్తృకత్వ ముపాధిః గౌతమాది భిశ్శిష్య పరంపరయా వేదే(అ)పి కర్తృ స్మరణేన సాధనవ్యాపకత్వాత్.”తస్మాత్తే పానా త్త్రయో వేద అజాయంతేతి శ్రుతేశ్చ; నను వర్ణాః నిత్యాః స ఏ వాయంగకారః ఇతి ప్రత్యభిజ్ఞా బలాత్, తథా చ కథం వేదస్యానిత్యత్వమితి చేన్న ఉత్పనోగకారో వినిష్టో గకార ఇతి ప్రతీత్యా వర్ణానామనిత్యత్వాత్ సోయం గకార ఇతి ప్రత్యభిజ్ఞాయాస్సేయం దీపజ్వాలేతి వ జ్జాత్యాలంబనత్వాత్ వర్ణానాం నిత్య త్వే(అ)ప్యాను పూర్వ విశిష్టవాక్యస్యా నిత్యత్వాచ్చ. తస్మాదీశ్వరఓక్తో వేదః. మన్వాదిశ్రుతీ నామాచారాణాం చ వేదమూలక తయా ప్రామాణ్యం స్మృతిమూల వాక్యానామిదానీ మనధ్యయనాత్ తన్మూల భూతా కా చిచ్ఛా కోత్పన్నైవేతి కల్ప్యతే. ననుపరిమాన వేదవాక్యో పాదనన్యకల్పయితు మశక్యేతయా విప్రకీర్ణ వాదస్యాయుక్త త్వాన్నిత్యానుమేయో వేదో మూలమితిచేన్న కదాపి వర్ణా నామాను పూర్వే జ్ఞానా భావేన భోదకత్వా సంభవాత్.”. (తర్క సంగ్రహే)

(వేదము అనాది, ఎప్పుడు పుట్టినదో తెలియదు, ఎవరివలన పుట్టినదో తెలియదు - అని చెప్పుటవలన అది భగవంతుడే చెప్పెనని యెట్లనగలము అను సందేహమనవసరము - భారతము మొదలగువాటివలెనే వాక్యముల సమూహమగుటచేత ఒకానొక పురుషుడు చేసినది అనుట తగదు. స్మర్యమాణ కర్తృకత్వము ఉపాధికాదు - “తస్మాత్తే పానాత్ త్రయో వేద అజాయంతేతి” అని శ్రుతి చెప్పుచున్నది. వర్ణములు - అక్షరములు - నిత్యములు. ఒకదానిలోని గకారమే ఇంకొకదానిలోని గకారము. అన్నింటిలోనుండు అక్షరములు ఒకటే. అట్లయినవేదము నిత్యమైనదెట్లగును ? అను ప్రశ్న అవసరములేదు - - - భగవంతునిచే చెప్పబడినది వేదము - మనువు మొదలగువారి శ్రుతులకు వేదము మూలమగుటచేత - ప్రమాణమగుటచేత ప్రమాణమగుచున్నవి - - -)

Transliteration
  1. “vaidikamīśvarōktatvāt sarvamapi pramāṇaṃ” (tarka saṃgrahē).

(vēdamu bhagavaṃtuḍu ceppinadaguṭacēta aṃdulōnidaṃtayu pramāṇamu - vēdamulō ceppinadāniki vēdamē pramāṇamu).

  1. “nanu” aṣṭādaśa purāṇānāṃ kartā satyavatī sutaḥ “it vaijayaṃtyādi pramāṇabalēna bhāratādaukartā upalabhyatē, nahi vēdē. tadāca smaryamāṇa kartṛ katvasya bhāratādau sādhyavyāpakatvēna pakṣasādhana vyāpakatvāt upādhitvēna ca kathamanumānaṃ sādhakaṃ bhavēt ityāśaṃkatē”.

(padunenimidi purāṇamula karta - purāṇamulanu vrāsinavāḍu satyavati kumāruḍu ayina vyāsamaharṣiyani vaijayaṃti modalagu pramāṇagraṃdhamulalō ceppabaḍiyuṃḍuṭacētanu - bhāratamu modalaguvāṭini evaru vrāsirō - vāṭiki karta evarō - teliyavaccucunnadi. vēdamulō iṭuvaṃṭidi lēdu - dāni karta evarō ceppiyuṃḍa lēdu.

  1. “nanu vēdasyāniditvāt kathamīśvarōktamiti cēnna - vēdaḥ pauruṣēyaḥ vākya samūhatvāt bhāratādivat na ca smaryamāṇakartṛkatva mupādhiḥ gautamādi bhiśśiṣya paraṃparayā vēdē(a)pi kartṛ smaraṇēna sādhanavyāpakatvāt.”tasmāttē pānā ttrayō vēda ajāyaṃtēti śrutēśca; nanu varṇāḥ nityāḥ sa ē vāyaṃgakāraḥ iti pratyabhijñā balāt, tathā ca kathaṃ vēdasyānityatvamiti cēnna utpanōgakārō viniṣṭō gakāra iti pratītyā varṇānāmanityatvāt sōyaṃ gakāra iti pratyabhijñāyāssēyaṃ dīpajvālēti va jjātyālaṃbanatvāt varṇānāṃ nitya tvē(a)pyānu pūrva viśiṣṭavākyasyā nityatvācca. tasmādīśvaraōktō vēdaḥ. manvādiśrutī nāmācārāṇāṃ ca vēdamūlaka tayā prāmāṇyaṃ smṛtimūla vākyānāmidānī manadhyayanāt tanmūla bhūtā kā cicchā kōtpannaivēti kalpyatē. nanuparimāna vēdavākyō pādananyakalpayitu maśakyētayā viprakīrṇa vādasyāyukta tvānnityānumēyō vēdō mūlamiticēnna kadāpi varṇā nāmānu pūrvē jñānā bhāvēna bhōdakatvā saṃbhavāt.”. (tarka saṃgrahē)

(vēdamu anādi, eppuḍu puṭṭinadō teliyadu, evarivalana puṭṭinadō teliyadu - ani ceppuṭavalana adi bhagavaṃtuḍē ceppenani yeṭlanagalamu anu saṃdēhamanavasaramu - bhāratamu modalaguvāṭivalenē vākyamula samūhamaguṭacēta okānoka puruṣuḍu cēsinadi anuṭa tagadu. smaryamāṇa kartṛkatvamu upādhikādu - “tasmāttē pānāt trayō vēda ajāyaṃtēti” ani śruti ceppucunnadi. varṇamulu - akṣaramulu - nityamulu. okadānilōni gakāramē iṃkokadānilōni gakāramu. anniṃṭilōnuṃḍu akṣaramulu okaṭē. aṭlayinavēdamu nityamainadeṭlagunu ? anu praśna avasaramulēdu - - - bhagavaṃtunicē ceppabaḍinadi vēdamu - manuvu modalaguvāri śrutulaku vēdamu mūlamaguṭacēta - pramāṇamaguṭacēta pramāṇamagucunnavi - - -)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.