ఆస్యపర్యంతంబు ఆ వాయువు చేత (మూలాధార పవనముచేత) కంఠాది స్థానంబుల యందభివ్యజ్యమానంబై యకారాది క్షకారాంత వర్ణమాలా రూపంబై (నిశ్చయాత్మయై) శ్రోత్రగ్రహణ యోగ్యంబై వైఖరీ వాక్కనంబడు) (శ్రీనాధుడు - కాశీఖండము)
అక్షరేభ్యః పదానిస్యుః పదేభ్యో వాక్యసంభవః |
సర్వ వాక్యాత్మకా మంత్రా వేదశాస్త్రాణి కృత్స్నశః |
పురాణాని చ కావ్యాని భాషాశ్చ వివిధా అపి |
సప్తస్వరాశ్చ గాధాశ్చ సర్వేనాద సముద్భవాః |
ఏషా సరస్వతీదేవీ సర్వభూత గుహాశ్రయా |
వాయునా వహ్నియుక్తేన ప్రేర్యమాణా శనైశ్శనైః |
తద్వివర్తా పదైర్వాక్యైరిత్యేవం వర్తతే సదా |
య ఇమాం వైఖరీం శక్తిం యోగీస్వాత్మని పశ్యతి |
స వాక్సిద్ధి మ వాప్నోతి సరస్వత్యాః ప్రసాదతః “. (యోగశిఖోపనిషత్)
(అకారము మొదలు క్షకారము వరకు గల అక్షరములతో పదము - మాట - అగును, పదములతో - పదములు కలిసి - వాక్యములగును - మంత్రములు, వేదములు, శాస్త్రములు, పురాణములు, కావ్యములు, అన్ని భాషలు, సప్త స్వరములు, గాధలు, ఇవన్నియు వాక్యములతో కూడినవి, నాదము (శబ్దబ్రహ్మము) వలన కలిగినవి, ఇదియే సమస్త భూతములలోను నున్న సరస్వతీ దేవి. వహ్నితో కూడిన వాయువుచేత ప్రేరింపబడినదై ప్రవర్తించును - ఈ వైఖరీ శక్తిని యోగి అయినవాడు ఎవడు తనలో (మనస్సులో) దర్శించునో అతడు సరస్వతీ దేవి యొక్క కటాక్షమువలన వాక్సుద్ధిని పొందును)
“మూలాధారస్థపవనేన సర్వత్ర స్థితం శబ్దబ్రహ్మం తత్రాభి వ్యజ్యతే. తదభివ్యక్తం శబ్దబ్రహ్మకారణ బింద్వాత్మకం స్వప్రతిష్ట తయా నిష్పందం సత్ పరా వాగుచ్యతే. తదేవ నాభి పర్యంతమా గచ్ఛతా తేన వాయునా అభివ్యక్తం. విమర్శరూపేణ మనసా యుక్తం సామాన్యస్పంద ప్రకాశరూపిణీ కార్య బిందు తత్వాత్మికా అధిదైవ మీశ్వర రూపా పశ్యంతీ వాగిత్యుచ్యతే. తదేవ శబ్ద బ్రహ్మ తేనైన వాయునా హృదయపర్యంతమభివ్యజ్యమానం నిశ్చయాత్మకయా బుద్ధ్యా యుక్తం విశేష స్పందరూప నాదబిందు మయీ అధిదైవం హిరణ్యగర్భ రూపా వాగిత్యుచ్యతే. తదేవాస్య పర్యంతం తేనైవ వాయునాభి వ్యజ్యమానం కంఠాదిస్థానేషు అకారాది క్షకారాంత వర్ణమాలా రూపం పరశ్రోత్రగ్రహణ యోగ్యం బీజాత్మకం అధి దైవతం విరాడ్రూపా వైఖరీ వాగిత్యుచ్యతే”
(బ్రహ్మాండము పేలి బ్రద్దలగుటవలన కలిగిన గొప్ప రవము - శబ్దము - (శబ్దబ్రహ్మము) జీవశరీరములోని మూలాధారమును పొంది అచ్చట పిండీభావము నొంది (కరడుకట్టి) స్వయంప్రకాశమై స్పందములేని శబ్దము పరావాక్కని చెప్పబడుచున్నది. అదే నాభివఱకు వచ్చి వాయువుతో అభివ్యక్తమై విమర్శరూపమైన మనసుతో కలిసి సామాన్యస్పందప్రకాశ రూపిణియగు కార్యబిందువైన అధిదైవము ఈశ్వరరూపము అయిన పశ్యంతీవాక్కని చెప్పబడుచున్నది. ఆ శబ్దమే (శబ్దబ్రహ్మమే) ఆ వాయువుతో హృదయమువఱకు అభివ్యక్తమానమయి నిశ్చయముచేయు శక్తిగల బుద్ధితో కలిసి విశేషమైన స్పందరూపముగల నాదబిందుమయమై అధిదైవమగు హిరణ్యగర్భ రూపా మధ్యమా వాక్కని చెప్పబడుచున్నది. ఆ శబ్దమే ముఖమువఱకు అభివ్యజ్యమానమై కంఠము మొదలగు స్థానములందు అకారము మొదలు క్షకారము వరకు గల వర్ణమాల (అక్షరముల సముదాయము) రూపము కలిగి, ఇతరుల చెవులకు వినబడుటకు యోగ్యమై బీజాత్మకమై విరాడ్రూపము అధిదైవతముగాగల వైఖరీవాక్కని చెప్పబడుచున్నది.)
āsyaparyaṃtaṃbu ā vāyuvu cēta (mūlādhāra pavanamucēta) kaṃṭhādi sthānaṃbula yaṃdabhivyajyamānaṃbai yakārādi kṣakārāṃta varṇamālā rūpaṃbai (niścayātmayai) śrōtragrahaṇa yōgyaṃbai vaikharī vākkanaṃbaḍu) (śrīnādhuḍu - kāśīkhaṃḍamu)
akṣarēbhyaḥ padānisyuḥ padēbhyō vākyasaṃbhavaḥ |
sarva vākyātmakā maṃtrā vēdaśāstrāṇi kṛtsnaśaḥ |
purāṇāni ca kāvyāni bhāṣāśca vividhā api |
saptasvarāśca gādhāśca sarvēnāda samudbhavāḥ |
ēṣā sarasvatīdēvī sarvabhūta guhāśrayā |
vāyunā vahniyuktēna prēryamāṇā śanaiśśanaiḥ |
tadvivartā padairvākyairityēvaṃ vartatē sadā |
ya imāṃ vaikharīṃ śaktiṃ yōgīsvātmani paśyati |
sa vāksiddhi ma vāpnōti sarasvatyāḥ prasādataḥ “. (yōgaśikhōpaniṣat)
(akāramu modalu kṣakāramu varaku gala akṣaramulatō padamu - māṭa - agunu, padamulatō - padamulu kalisi - vākyamulagunu - maṃtramulu, vēdamulu, śāstramulu, purāṇamulu, kāvyamulu, anni bhāṣalu, sapta svaramulu, gādhalu, ivanniyu vākyamulatō kūḍinavi, nādamu (śabdabrahmamu) valana kaliginavi, idiyē samasta bhūtamulalōnu nunna sarasvatī dēvi. vahnitō kūḍina vāyuvucēta prēriṃpabaḍinadai pravartiṃcunu - ī vaikharī śaktini yōgi ayinavāḍu evaḍu tanalō (manassulō) darśiṃcunō ataḍu sarasvatī dēvi yokka kaṭākṣamuvalana vāksuddhini poṃdunu)
“mūlādhārasthapavanēna sarvatra sthitaṃ śabdabrahmaṃ tatrābhi vyajyatē. tadabhivyaktaṃ śabdabrahmakāraṇa biṃdvātmakaṃ svapratiṣṭa tayā niṣpaṃdaṃ sat parā vāgucyatē. tadēva nābhi paryaṃtamā gacchatā tēna vāyunā abhivyaktaṃ. vimarśarūpēṇa manasā yuktaṃ sāmānyaspaṃda prakāśarūpiṇī kārya biṃdu tatvātmikā adhidaiva mīśvara rūpā paśyaṃtī vāgityucyatē. tadēva śabda brahma tēnaina vāyunā hṛdayaparyaṃtamabhivyajyamānaṃ niścayātmakayā buddhyā yuktaṃ viśēṣa spaṃdarūpa nādabiṃdu mayī adhidaivaṃ hiraṇyagarbha rūpā vāgityucyatē. tadēvāsya paryaṃtaṃ tēnaiva vāyunābhi vyajyamānaṃ kaṃṭhādisthānēṣu akārādi kṣakārāṃta varṇamālā rūpaṃ paraśrōtragrahaṇa yōgyaṃ bījātmakaṃ adhi daivataṃ virāḍrūpā vaikharī vāgityucyatē”
(brahmāṃḍamu pēli braddalaguṭavalana kaligina goppa ravamu - śabdamu - (śabdabrahmamu) jīvaśarīramulōni mūlādhāramunu poṃdi accaṭa piṃḍībhāvamu noṃdi (karaḍukaṭṭi) svayaṃprakāśamai spaṃdamulēni śabdamu parāvākkani ceppabaḍucunnadi. adē nābhivaṟaku vacci vāyuvutō abhivyaktamai vimarśarūpamaina manasutō kalisi sāmānyaspaṃdaprakāśa rūpiṇiyagu kāryabiṃduvaina adhidaivamu īśvararūpamu ayina paśyaṃtīvākkani ceppabaḍucunnadi. ā śabdamē (śabdabrahmamē) ā vāyuvutō hṛdayamuvaṟaku abhivyaktamānamayi niścayamucēyu śaktigala buddhitō kalisi viśēṣamaina spaṃdarūpamugala nādabiṃdumayamai adhidaivamagu hiraṇyagarbha rūpā madhyamā vākkani ceppabaḍucunnadi. ā śabdamē mukhamuvaṟaku abhivyajyamānamai kaṃṭhamu modalagu sthānamulaṃdu akāramu modalu kṣakāramu varaku gala varṇamāla (akṣaramula samudāyamu) rūpamu kaligi, itarula cevulaku vinabaḍuṭaku yōgyamai bījātmakamai virāḍrūpamu adhidaivatamugāgala vaikharīvākkani ceppabaḍucunnadi.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.