శ్వేతద్వీపము - మోక్షము.
పాతాళాత్ బ్రహ్మలోకాంతం బ్రహ్మాండం పరికీర్తితం |
అతః ఊర్ధ్వంచ వైకుంఠో బ్రహ్మాండాత్ బహిరేవచ |
తతః ఊర్ధ్వంచగోలోకః పంచాశత్ కోటియో జనః ||. (దేవీభాగవతము)
(పాతాళము మొదలు బ్రహ్మలోకము గలవన్నియు కలిసి బ్రహ్మాండమని చెప్పబడుచున్నది - అనగా, పదునాలుగు లోకములు - ఊర్ధ్వలోకములు, అధోలోకములు కలిసి బ్రహ్మాండమని చెప్పబడుచున్నది. ఈ బ్రహ్మాండము మీదను వైకుంఠలోకము ఉన్నది. ఇది బ్రహ్మాండములోనిది కాదు. ఈ వైకుంఠలోకమునకు మీదను పంచాశత్కోటి యోజనములు విశాలముగల గోలోకమున్నది).
తేభ్యోమ్యార్థంతు మాయావికృతి విరహితో భాతి వైకుంఠ లోకం |
తత్రత్వం కారణాం భస్యపి పశుపకులే శుద్ధ సత్వైక రూపీ |
సచ్చిద్బ్రహ్మా ద్వయాత్మా పవన పురవతే పాహిమాం సర్వ రోగాత్ ||“. (నారాయణీయము - 97వ దశకం)
(సత్యలోకమందు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మూడు నిలయములున్నవి. వాటికి మీదను మాయా వికారములు లేనిదైన వైకుంఠలోకమున్నది. ఆ లోకములో అన్నింటికి కారణమైన ఉదక తత్వమను సముద్రమధ్యమందు నీవు నివసించువాడవు. అటి నీవు ఈ గోలోకమందుకూడ నుంటివి. శుద్ధ సత్వమే రూపముగా గలిగినటువంటిన్నీ, సత్పదార్థము, చిన్మాత్రము, అద్వయము అయిన నీవు నన్ను సమస్త రోగములనుండి రక్షించుము) -
శ్శోక క్రోధ విమోహ సాధ్వస ముఖా భావాస్తు దూరం గతాః |
సాంద్రానంద ఝరీ చ యత్ర పరమ జ్యోతిః ప్రకాశాత్మకే |
తత్తే ధామని విభావితం విజయతే వైకుంఠరూపం విభో || “. (నారాయణీయం)
(ఎక్కడ మాయ తన ప్రభావమును చూపలేదో, వికారములను కలుగచేయలేదో, జగత్తులలోనే తన ప్రభావము చూపగలుగునో, శోకము, క్రోధము, మోహము, సాధ్విసము మొదలగు భావములు ఎక్కడ దూరములై పోవునో (ఎక్కడ కలుగవో), ఎక్కడ పరమానందము, అత్యంతసుఖము, పరమతేజస్సు ప్రకాశించునో, అదియే నీ యొక్క (భగవంతునియొక్క) ధామము, పరంధామము, అదియే వైకుంఠము).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 9 - 226)
దినకర చంద్ర ధీధితులకు జొరరాక సలలిత సహజ తేజమున వెలుగు
సమధికంబగు శుద్ధ సత్వ గరిష్టమై కలమొప్పు యోగీద్ర గమ్యమగుచు
హరిపదధ్యాన పరాయణులైన తద్దాసులకలరు నివాసమగుచు
తే. ప్రవిమలానంత తేజో వైరాజమాన
దివ్య మణీహేమకలిత ఫందీప్త భవ్య
సౌధ మండప తోరణస్తంభ విపుల
గోపురాకీర్ణ సరము వైకుంఠపురము“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 1251)
(పరబ్రహ్మయొక్క నాలుగు పాదములలోను ఒక్క పాదములోనే ఆవరణములతో కూడియున్న అనంతకోటి బ్రహ్మాండములున్నవి యని చెప్పబడిచున్నది. వాటిలో ఒక అండములో అనేకమైన లోకములు, అనేక వైకుంఠములు, అనేకమైన భగవద్విభూతులు ఉన్నవి. అన్ని బ్రహ్మాండములందును లెక్కలేనన్ని లోకములు, లెక్కలేనన్ని వైకుంఠములు ఉన్నవని అందఱి అభిప్రాయము. ఒక పాదములోనే ఇట్లుండగా మిగిలిన మూడు పాదములగుఱించి చెప్పవలసినదేమున్నది. నిరతిశయమైన ఆనందము, సౌఖ్యము కలుగచేయునది మోక్షము అని మోక్షలక్షణము పాదత్రయమందు - (మూడుపాదములందు) ఉన్నది. అందుచేత భగవంతుని మూడుపాదములు పరమమోక్షము, (పరమ మోక్షస్థానము), పాదత్రయమే వైకుంఠము, పాదత్రయమే కైవల్యము).
భన విభవాభిరామము, బ్రసన్న జనస్తవనీయ నామమున్
జనన విరామమున్, సుజన సన్నుతభూమము, భక్తలోకపా
లన గుణధామము, బుర లలామము జారు వైకుంఠధామమున్“. (శ్రీమహాభాగవతము - 3 - 14- 500)
ష్కామ ఫలంబె సత్ఫలముగా దలపోసి ముముక్షు ధర్ర్ములై
శ్రీమహిళాధిపాంఘ్రి సరసీరుహ పూజ లొనర్చుచున్ మహో
ద్దామ తదీయ రూపములదాల్చి సుఖించుచు నుందు రెప్పుడున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 15 - 501)
” వ. - - - దేహాభిమానంబు వర్జించి యైహికాముష్మిక సుఖంబుల గోరక, మనంబు గుదియించి, యే ప్రొద్దు నన్ను దలంచువాడు వైకుంఠ పదప్రాప్తుండగు. నేను నతని విడువం జాలక వెనువెంట నరుగుదు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 111)
విష్ణుః, తన్య లోకోవా
(విష్ణువు, లేక, విష్ణుని లోకము) (విష్ణుని లోకము - కనుక వైకుంఠము - ” వైకుంఠుండు కృతాపరాధుడు ”
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 -)
వైకుంఠుడే వైకుంఠము, వైకుంఠమే వైకుంఠుడు).
బరతత్వమనగ, బరమపదమనగను, నీ
శ్వరుడన, కృష్ణుడన, జగ
ద్భరితుడు నారాయణుండు దా వెలుగొందున్ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 51)
śvētadvīpamu - mōkṣamu.
pātāḷāt brahmalōkāṃtaṃ brahmāṃḍaṃ parikīrtitaṃ |
ataḥ ūrdhvaṃca vaikuṃṭhō brahmāṃḍāt bahirēvaca |
tataḥ ūrdhvaṃcagōlōkaḥ paṃcāśat kōṭiyō janaḥ ||. (dēvībhāgavatamu)
(pātāḷamu modalu brahmalōkamu galavanniyu kalisi brahmāṃḍamani ceppabaḍucunnadi - anagā, padunālugu lōkamulu - ūrdhvalōkamulu, adhōlōkamulu kalisi brahmāṃḍamani ceppabaḍucunnadi. ī brahmāṃḍamu mīdanu vaikuṃṭhalōkamu unnadi. idi brahmāṃḍamulōnidi kādu. ī vaikuṃṭhalōkamunaku mīdanu paṃcāśatkōṭi yōjanamulu viśālamugala gōlōkamunnadi).
tēbhyōmyārthaṃtu māyāvikṛti virahitō bhāti vaikuṃṭha lōkaṃ |
tatratvaṃ kāraṇāṃ bhasyapi paśupakulē śuddha satvaika rūpī |
saccidbrahmā dvayātmā pavana puravatē pāhimāṃ sarva rōgāt ||“. (nārāyaṇīyamu - 97va daśakaṃ)
(satyalōkamaṃdu brahma viṣṇu mahēśvarula mūḍu nilayamulunnavi. vāṭiki mīdanu māyā vikāramulu lēnidaina vaikuṃṭhalōkamunnadi. ā lōkamulō anniṃṭiki kāraṇamaina udaka tatvamanu samudramadhyamaṃdu nīvu nivasiṃcuvāḍavu. aṭi nīvu ī gōlōkamaṃdukūḍa nuṃṭivi. śuddha satvamē rūpamugā galiginaṭuvaṃṭinnī, satpadārthamu, cinmātramu, advayamu ayina nīvu nannu samasta rōgamulanuṃḍi rakṣiṃcumu) -
śśōka krōdha vimōha sādhvasa mukhā bhāvāstu dūraṃ gatāḥ |
sāṃdrānaṃda jharī ca yatra parama jyōtiḥ prakāśātmakē |
tattē dhāmani vibhāvitaṃ vijayatē vaikuṃṭharūpaṃ vibhō || “. (nārāyaṇīyaṃ)
(ekkaḍa māya tana prabhāvamunu cūpalēdō, vikāramulanu kalugacēyalēdō, jagattulalōnē tana prabhāvamu cūpagalugunō, śōkamu, krōdhamu, mōhamu, sādhvisamu modalagu bhāvamulu ekkaḍa dūramulai pōvunō (ekkaḍa kalugavō), ekkaḍa paramānaṃdamu, atyaṃtasukhamu, paramatējassu prakāśiṃcunō, adiyē nī yokka (bhagavaṃtuniyokka) dhāmamu, paraṃdhāmamu, adiyē vaikuṃṭhamu).
(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 9 - 226)
dinakara caṃdra dhīdhitulaku jorarāka salalita sahaja tējamuna velugu
samadhikaṃbagu śuddha satva gariṣṭamai kalamoppu yōgīdra gamyamagucu
haripadadhyāna parāyaṇulaina taddāsulakalaru nivāsamagucu
tē. pravimalānaṃta tējō vairājamāna
divya maṇīhēmakalita phaṃdīpta bhavya
saudha maṃḍapa tōraṇastaṃbha vipula
gōpurākīrṇa saramu vaikuṃṭhapuramu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 1251)
(parabrahmayokka nālugu pādamulalōnu okka pādamulōnē āvaraṇamulatō kūḍiyunna anaṃtakōṭi brahmāṃḍamulunnavi yani ceppabaḍicunnadi. vāṭilō oka aṃḍamulō anēkamaina lōkamulu, anēka vaikuṃṭhamulu, anēkamaina bhagavadvibhūtulu unnavi. anni brahmāṃḍamulaṃdunu lekkalēnanni lōkamulu, lekkalēnanni vaikuṃṭhamulu unnavani aṃdaṟi abhiprāyamu. oka pādamulōnē iṭluṃḍagā migilina mūḍu pādamulaguṟiṃci ceppavalasinadēmunnadi. niratiśayamaina ānaṃdamu, saukhyamu kalugacēyunadi mōkṣamu ani mōkṣalakṣaṇamu pādatrayamaṃdu - (mūḍupādamulaṃdu) unnadi. aṃducēta bhagavaṃtuni mūḍupādamulu paramamōkṣamu, (parama mōkṣasthānamu), pādatrayamē vaikuṃṭhamu, pādatrayamē kaivalyamu).
bhana vibhavābhirāmamu, brasanna janastavanīya nāmamun
janana virāmamun, sujana sannutabhūmamu, bhaktalōkapā
lana guṇadhāmamu, bura lalāmamu jāru vaikuṃṭhadhāmamun”. (śrīmahābhāgavatamu - 3 - 14- 500)
ṣkāma phalaṃbe satphalamugā dalapōsi mumukṣu dharrmulai
śrīmahiḷādhipāṃghri sarasīruha pūja lonarcucun mahō
ddāma tadīya rūpamuladālci sukhiṃcucu nuṃdu reppuḍun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 15 - 501)
” va. - - - dēhābhimānaṃbu varjiṃci yaihikāmuṣmika sukhaṃbula gōraka, manaṃbu gudiyiṃci, yē proddu nannu dalaṃcuvāḍu vaikuṃṭha padaprāptuṃḍagu. nēnu natani viḍuvaṃ jālaka venuveṃṭa narugudu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 111)
viṣṇuḥ, tanya lōkōvā
(viṣṇuvu, lēka, viṣṇuni lōkamu) (viṣṇuni lōkamu - kanuka vaikuṃṭhamu - ” vaikuṃṭhuṃḍu kṛtāparādhuḍu ”
(śrīmadāṃdhramahābhāgavatamu - 7 -)
vaikuṃṭhuḍē vaikuṃṭhamu, vaikuṃṭhamē vaikuṃṭhuḍu).
baratatvamanaga, baramapadamanaganu, nī
śvaruḍana, kṛṣṇuḍana, jaga
dbharituḍu nārāyaṇuṃḍu dā velugoṃdun “. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 51)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.