← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వైకుంఠుడు vaikuṃṭhuḍu

Original — తెలుగు
  1. విష్ణువు

  2. విగతాః కుంఠాః నాశో యస్యసః వికుంఠః; అధవా, వికుంఠం వివిధాః కుంఠాః మాయా విద్యతే యస్యసః.

(నాశము లేనివాడు, లేక, అనేక విధములైన మాయలు గలవాడు)

  1. “వివిధా కుంఠా గతేః ప్రతిహతిః వికుంఠా వికుంఠాయాః కర్త ఇతి వైకుంఠః - జగదారంభే విశిష్టాని భూతాని పరస్పరం సంశ్లేషయన్ తేషాం గతిం ప్రతి బధ్నాతి”.

(అనేకవిధముల గతులను అడ్డు పెట్టువాడు; అనేక విధములగు గతులకు ప్రతిబంధము కలిగించు వాడు - సృష్టి ప్రారంభమున వేరువేరుగా నుండు భూతముల స్వేచ్ఛాగతిని నిరోధించి వాటిని ఒకదానితో ఓకటి చేర్చువాడు)

  1. వికుంఠయతి పరాభవం ప్రాపయతి శత్రూన్ ఇతి వికుంఠః వికుంఠః ఏవ వైకుంఠః -

(శత్రువులను పరాభవము పొందునట్లు చేయువాడు - వికుంఠుడు; వికుంఠుడే వైకుంఠడు -

  1. విశేషేణ కుంఠః క్రియామందః కించిదపి కార్యం కర్తుమశక్తః వికుంఠః - వికుంఠః ఏవ వైకుంఠః -

(ఏ చిన్న కార్యమునైనను చేయుటకు శక్తి లేనివాడు, క్రియలో మందుడు, మెల్లగా చేయువాడు - వికుంఠుడు, వికుంఠడే వైకుంఠుడు.

  1. “మయా సం శ్లేషితా భూమిరద్భ్యర్వ్యో వచ వాయునా వాయుశ్చ తేజసా సార్థం వైకుంఠత్వం తతో మమ”. (మహాభారతము - శాంతిపర్వము)

(భూమిని ఉదకముతోను, ఆకాశమును వాయువుతోను వాయువును అగ్నితోను సమ్మేళనము చేసితిని గాన నేను వైకుంఠుడనైతిని - పంచ భూతములను ఒకదానితో ఒకటి కలిపితిని - పంచీకరణము చేసితిని కనుక వైకుంఠుడ నైతిని)

  1. వైకుంఠుడే వైకుంఠము, వైకుంఠమే వైకుంఠుడు - రెండింటికి భేదములేదు –

“క. పరమ బ్రహ్మమనంగా

బరతత్వమనగ, బరమపదమనగను, నీ

శ్వరుడన, కృష్ణుడన, జగ

ద్భరితుడు నారాయణుండు దా వెలుగొందున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 51)

Transliteration
  1. viṣṇuvu

  2. vigatāḥ kuṃṭhāḥ nāśō yasyasaḥ vikuṃṭhaḥ; adhavā, vikuṃṭhaṃ vividhāḥ kuṃṭhāḥ māyā vidyatē yasyasaḥ.

(nāśamu lēnivāḍu, lēka, anēka vidhamulaina māyalu galavāḍu)

  1. “vividhā kuṃṭhā gatēḥ pratihatiḥ vikuṃṭhā vikuṃṭhāyāḥ karta iti vaikuṃṭhaḥ - jagadāraṃbhē viśiṣṭāni bhūtāni parasparaṃ saṃślēṣayan tēṣāṃ gatiṃ prati badhnāti”.

(anēkavidhamula gatulanu aḍḍu peṭṭuvāḍu; anēka vidhamulagu gatulaku pratibaṃdhamu kaligiṃcu vāḍu - sṛṣṭi prāraṃbhamuna vēruvērugā nuṃḍu bhūtamula svēcchāgatini nirōdhiṃci vāṭini okadānitō ōkaṭi cērcuvāḍu)

  1. vikuṃṭhayati parābhavaṃ prāpayati śatrūn iti vikuṃṭhaḥ vikuṃṭhaḥ ēva vaikuṃṭhaḥ -

(śatruvulanu parābhavamu poṃdunaṭlu cēyuvāḍu - vikuṃṭhuḍu; vikuṃṭhuḍē vaikuṃṭhaḍu -

  1. viśēṣēṇa kuṃṭhaḥ kriyāmaṃdaḥ kiṃcidapi kāryaṃ kartumaśaktaḥ vikuṃṭhaḥ - vikuṃṭhaḥ ēva vaikuṃṭhaḥ -

(ē cinna kāryamunainanu cēyuṭaku śakti lēnivāḍu, kriyalō maṃduḍu, mellagā cēyuvāḍu - vikuṃṭhuḍu, vikuṃṭhaḍē vaikuṃṭhuḍu.

  1. “mayā saṃ ślēṣitā bhūmiradbhyarvyō vaca vāyunā vāyuśca tējasā sārthaṃ vaikuṃṭhatvaṃ tatō mama”. (mahābhāratamu - śāṃtiparvamu)

(bhūmini udakamutōnu, ākāśamunu vāyuvutōnu vāyuvunu agnitōnu sammēḷanamu cēsitini gāna nēnu vaikuṃṭhuḍanaitini - paṃca bhūtamulanu okadānitō okaṭi kalipitini - paṃcīkaraṇamu cēsitini kanuka vaikuṃṭhuḍa naitini)

  1. vaikuṃṭhuḍē vaikuṃṭhamu, vaikuṃṭhamē vaikuṃṭhuḍu - reṃḍiṃṭiki bhēdamulēdu –

“ka. parama brahmamanaṃgā

baratatvamanaga, baramapadamanaganu, nī

śvaruḍana, kṛṣṇuḍana, jaga

dbharituḍu nārāyaṇuṃḍu dā velugoṃdun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 51)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.