← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వైరాగ్యము vairāgyamu

Original — తెలుగు
  1. విగతో రాగో విషయాభిలాషో యస్య సః - విరాగః, తస్య భావం వైరాగ్యం.

(విషయములందు రాగము అనగా అభిలాష లేక నుండువాడు. విరాగీ - అట్టి భావము వైరాగ్యము -)

  1. విరాగస్య భావః వైరాగ్యం -

(విరాగియొక్క భావము వైరాగ్యము - రాగము లేకుండుట, ఆసక్తి లేకుండుట.)

  1. విషయేషు అనాసక్తిః -

(ఆసక్తి లేనివాడు - విషయములందాసక్తి లేకపోవుట)

  1. “విషయేషు యద్వైతృ ష్ణ్యం వైరాగ్యం”.

(విషయములందు తృష్ణ - ఆశ, రాగము - లేకుండుట.)

  1. “ఇంద్రియార్థేషు శబ్దాదిషు,దృష్టా అదృషేషు, విషయభోగేషు విరాగభావో వైరాగ్యం” (శ్రీశంకరః)

(ఇంద్రియములకు అర్థములైన శబ్దము మొదలగు విషయమలందు - శబ్ద,స్పర్శ,రూప,రస,గంధములందు - ఇవి గల వస్తువులందు, కనబడినవి, కనబడనివి అయిన విషయములకు సంబంధించిన భోగములందు - అనుభవములందు - రాగము, ఆసక్తి లేకుండుట వైరాగ్యము)

  1. “దృష్టానుశ్రావిక విషయ వితృ ష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం”. (పతంజలి - యోగసూత్రములు - 1 -15)

(కంటికి కనబడు విషయములందు, చెవులకు వినబడు విషయములందు ఎప్పుడును, ఆసక్తి, తృష్ణ - లేకుండునట్లు మనస్సును తన స్వాధీనములో నుంచుకొనుట వైరాగ్యము - కంటికి కనబడి ప్రీతిని కలుగచేయునవి, స్త్రీ, అన్నపానాదులు, చెవికి వినబడి ప్రీతిని కలిగించు సంగీతము మొదలగునవి; శ్రుతిలోని విషయములను వినుట, యజ్ఞయాగాదులవలన స్వర్గమును పొందుట -).

  1. వైరాగ్యం నామ దృష్టా దృష్టేషు భోగేషు దోష దర్శనాభ్యాసాత్ వై తృ ష్ణ్యం.

(వైరాగ్యమనగా కనబడునవి, కనబడనవి అయిన విషయభోగములందు దోషము కనబడుచున్నది అని అనుభవమువలన తెలుసుకొనుటవలన వాటియందు కలుగు వైతృ ష్ణ్యము -)

  1. విషయేచ్ఛా రహితత్వం; విరక్తిః; విరాగత్వం.

(విషయములందు కోరిక లేకుండుట; రక్తి, ఆసక్తి లేకుండుట).

  1. “ఆత్మవ్యతిరిక్తేషు విషయేషు సదోషతాను సంధానేన ఉద్వేజనం” (శ్రీమాన్ రామానుజః)

(ఆత్మ కానటువంటి విషయములు దోషముతో కూడియున్నవని అనుసంధానము చేయుటవలన కలిగిన ఉద్వేజనము)

  1. పరమాత్మ వ్యతిరిక్తేషు సర్వేషు విరక్తిః - పతంజలియోగానుశాసన సూత్రం - “దృష్టానుశ్రావిక విషయ వితృ ష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం” ఇతి.

(పరమాత్మ వ్యతిరేకమైన విషయములన్నింటియందును విరక్తి. పతంజలి యోగసూత్రము ప్రకారము కంటికి కనబడు విషయముల యడల, చెవులకు వినుపించు విషయములయడల తృష్ణ లేకుండునట్లు మనస్సును స్వాధీనము చేసుకొనుట.

  1. “స్త్రియో న్నపానమైశ్వర్యం” ఇతి దుష్ట విషయ వితృష్ణస్య స్వర్గ వైదేహ్యహ్య ప్రకృతి లయ తృప్తాదౌ అనుశ్రవిక విషయ సం యోగోపి చిత్తస్య విషయ దోష దర్శినః ప్రసంఖ్యాన బలాదనా భోగాత్మికా హేయో పాదేయ శూన్యా వశీకర సంజ్ఞా వైరాగ్యం” ఇతి తస్య వృత్తిః. దుష్ట విషయ వితృ ష్ణస్య అనుశ్రవికవిషయ వి తృష్ణస్య చ వశీకరణ సంజ్ఞా వైరాగ్యం ఇతి సూత్రార్థః.

(స్త్రీలు (సంభోగము), అన్నము (ఇష్ట పదార్థమును తినుట), పానము (ఇష్టమైన పానము) సేవించుట, ఇవి కలిగియుండుట ఐశ్వర్యము అని చెప్పబడియుండుటవలన పైన చెప్పబడిన దుష్ట విషయములు మొదలగువాటియందు తృష్ణ లేకుండుట. స్వర్గము మొదలగునవి క్షీణించి నశించునని వినియుండుటచేత వాటియందుకూడ తృష్ణ లేకుండుట. దివ్య భోగములు, ఇహలోక భోగములు దోషముతో కూడినవని తెలుసుకొని వాటియడల తృష్ణ లేకుండుట, హేయము ఉపాదేయము అను విచక్షణ లేకయుండుట. ఇట్లుండుటకు తన మనస్సును తనవశములో నుంచుకొనుట వైరాగ్యము)

  1. “శ్లో. తద్వైరాగ్యం జిహాసా యా దర్శన శ్రవణాదిభిః దేహాది బ్రహ్మ పర్యతే హ్యానిత్యే భోగవస్తుని”. (వివేక చూడామణి - శ్రీ శంకరః)

(ఉపనిషత్తులను వినుటవలనను, తన అనుభవము వలనను దేహము మొదలు చతుర్ముఖబ్రహ్మవరకు గల భోగమునకుపకరించు వస్తువులన్నియు నిత్యముగానివని తెలుసుకొని వాటియందు ఇచ్ఛ లేకుండనుణ్డుట వైరాగ్యము)

  1. భోగత్యా గేచ్చా భోగానిచ్చ - (భోగములను విడిచిపెట్టు కోరిక కలిగియుండుట, భోగములందు కోరిక లేకుండుట)

  2. నిత్యానిత్య వస్తు వివేక లక్షణాత్ ప్రసంఖ్యానాది హాముత్రార్దభోగ విరాగః -

(నిత్యమైన వస్తువేదో - (భగవంతుడెవడో, ఆత్మయనునది యేదో) నిత్యముకాని అనాత్మవస్తువులేవో అను విషయమునందు వివేకము కలిగియుండుటవలన ఈ లోకమునందును, పరలోకమునందును గల విషయములందు రాగము - అనురాగము, ఆసక్తి లేకయుండుట).

  1. “బ్రహ్మాది స్థావరాంతేషు వైరాగ్యం విషయేష్వను |

యదైవకాకవిష్ఠాయాం వైరాగ్యం తద్ధి నిర్మలం ” (అపరోక్షానుభూతి)

(“బ్రహ్మాది స్థావరాంతేషు - సత్యలోకాది మర్త్యలోకాంతేషు భోగసాధనేషు - అనుకర్మ జన్యత్వేన అనిత్యత్వం లక్ష్మీ కృతాః ఇత్యర్థః - వైరాగ్యం ఇచ్ఛారాహిత్యం”.

(చతుర్ముఖబ్రహ్మ మొదలుకొని క్రింద స్థావరములవరకు గల వాటియందు - అనగా, సత్యలోకము మొదలు మర్త్యలోకమువరకు (మానవలోకమువరకు) గల అన్ని భోగసాధనములందు అవి నిత్యములుగావు నశించునవి యని తెలుసుకొని, వాటిని కాకి రెట్టను అసహ్యించుకొనినట్లు విడిచి పెట్టుట నిర్మలమైన వరాగ్యము - శుద్ధవైరాగ్యము)

  1. విషయాంతర వైతృ ష్ణ్యం.

(భగవంతుడుకాని విషయములందు తృష్ణ (ఆశ) లేకుండుట)

  1. "దృష్టా దృష్టేషు భోగేషు దోషగ్రస్తత్వ దర్శనాత్ |

విషయేషు యద్వైతృ ష్ణ్యం వైరాగ్యం తనుదీరితం". (గీతాభావప్రకాశము - -6 - 180)

(దృష్టా దృష్ట భోగములు దోషముతో కూడినవని తెలుసుకొని అట్టి విషయములందు తృష్ణ - అవి కావలెను, నేను వాటిని అనుభవించవలెను అను ఆశ - లేకుండుట.)

  1. "శ్లో||. అనంతమివ మే విత్తం యస్య మేనాస్తి కించన |

మిధిలాయాం ప్రదీప్తాయాం నమే కించిన దహ్యతే ||". (భారతము - శాంతి పర్వము - 7 - 1)

(నాకు తరగని ధనమున్నది - నాకు ఏమియు లేదు - మిధిలానగరము అంతయు దహించుకొని పోవు చున్నను నాది అన్నదేదియును దహించుకొని పోవుటలేదు - ఏది పోయినను నాకు లక్ష్యములేదు - అను భావము కలిగియుండుట).

  1. విరక్తిః పరిపూర్ణత్వాత్ అనాదరః -

(జగత్తు అంతటను పూర్తిగా తానే నిండియుండుటచేత - ఏ విధమైన కామము లేకుండుటచేత అన్నింటియందు విరక్తి కలిగియుండుట).

  1. వైరాగ్యేణవినా జ్ఞానం న చ భక్తిరతః స్ఫుటం.

(వైరాగ్యము లేనిదే జ్ఞానము కలుగదు, భక్తి కలుగదు).

  1. "వాసుదేవే భగవతి భక్తియోగః ప్రయోజితః |

జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం ||". (శ్రీమద్భాగవతం - 1 - అధ్యా - 2 - 7)

"పురుషులకు బరమ ధర్మంబగు వాసుదేవుని యందు బ్రయోగింపబడిన భక్తియోగంబు వైరగ్య విజ్ఞానంబుల బుట్టించు"

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 2 - 21)

  1. వైరాగ్యము మూడు విధములు: -

(1) అభావ వైరాగ్యము - "అభావే విరక్తిః" - తనకు కావలసిన వస్తువు లభించనప్పుడు దానియందు కలుగు విరక్తి - నక్క ద్రాక్షపళ్లవలె)

(2) నిర్భంధ వైరాగ్యము –

(3) సహజ వైరాగ్యము - (చూడుము - 24).

(1). పురాణ వైరాగ్యము - పురాణ కధలు విని వాటిలో చెప్పబడిన కష్ట నష్టములు తలచి అటువంటి వాటి యందు కోరికలు అప్పటికి లేకుండగ చేసుకొనుట, మరల ఆ విషయములు తటస్థించినపుడు వాటియందు కోరికలు కలుగచునే యుండును.

(2). స్మశాన వైరాగ్యము - మనిషి చనిపోయినపుడు చూచి ఎంత బ్రతిఉకు బ్రతికినా ఇంతే కదా ! దీనికై పాపకర్మలు ఎందుకు చేయవలయును అనుకొనుట.

(3). ప్రసూతి వైరాగ్యము - పురుడు కాలమందలి నొప్పులను భరించలేక మరి సంతానము కలుగవద్దు - అని దానియందు అప్పటికి కలుగు వైరాగ్యము - ఈ పైన చెప్పిన మూడు విధముల వైరాగ్యము కొంతకాలమువఱకే ఉండునవి).

  1. వైరాగ్యము నాలుగు విధములు -

వైరాగ్యం చాతుర్విధమేవం ద్రష్టవ్యం –

"వైరాగ్యమాద్యం య తమాన సంజ్ఞం క్వచి ద్విరాగో వ్యతిరేక సంజ్ఞం |

ఏకేంద్రియాఖ్యం హృది రాగసౌక్ష్మ్యం తస్యాప్య భావస్తు వశీకృతాఖ్యం ||".

(1) యతీమానం,

(2) వ్యతిరేకం,

(3) ఏకేంద్రియం,

(4)వశీకరణం.

(1) "విషయాన్ శక్తుమ శక్నువతోపి సం మానే చ్ఛా త్యాగః" (విషయములను విడిచిపెట్టుట శక్యము కాకపోయినను సం మానేచ్ఛను వదలుట) (మంద వివేకము)

(2) విషయాణాం మిధ్యే లక్షణాది వ్యతిరికేణాపి వృత్తిర్ద్వితీయం. (విషయములలో లక్షణాది వృత్తిరేకముచే కలుగు మనో వృత్తి) (వ్యతిరేకము). (సత్పురుషుల సహవాసముచే దుర్గుణములను విడిచివేయుట.)

(3) వృత్తావపి మనసి రాగ శైధిల్యేన బాహ్యేంద్రియై రేవ విషయం సేవనం - తృతీయం.(ఏకేంద్రియం) (మనసులో రాగము లేకపోయినను బాహ్యేంద్రియములతోనే విషయములను సేవించుట - అనుభవించుట)

(4) వశీకరణం - తత్రాపి ఔదాసీన్యం చతుర్థం.(అందులోను ఔదాసీన్యము చూపుట) (మనోజయము)

  1. వైరాగ్యము మూడువిధములు –

(1) అభావ వైరాగ్యము (2) నిర్భంధవైరాగ్యము (3) సహజ వైరాగ్యము.

(1) అభావ వైరాగ్యమనగా తనకు లేని వస్తువు కలుగుటకు అవకాశము లేనపుడు దాని యందు కలుగు వైరాగ్యము.

(2) నిర్బంధ వైరాగ్యము అనగా అనుభవించుటకు వస్తువులుండినను కొన్ని నిర్బంధములుండుట వలన - అనగా, ఇది నీవు చేయకూడదు అను మొదలగు నిషేధరూపమైన నిబంధనలుగాని, రోగి యగుటచే ఇష్టమైన పదార్థములున్నను వాటిని తినకూడదు - అను నిబంధనలుగాని, ఉండుటవలన ఆ వస్తువులందు కలుగు వైరాగ్యము –

(3) సహజ వైరాగ్యమనగా ఉత్కృష్టమైన వస్తువు లభించినను దానిని సహజముగా నికృష్ట వస్తువుగా పరిగణించుట వలన కలుగు వైరాగ్యము).

  1. ఇహాముత్ర ఫల భోగ విరాగః.

(ఈ లోకమునందు, పరలోకమునందును కర్మలవలన కలుగు ఫలము ననుభవించుట యందు రాగము - ఆసక్తి లేకపోవుట)

  1. "దోష దృష్ట్యా ఆబ్రహ్మ లోకాద్వి పరివర్తమానేషు భోగేషు అనాదిరూపో పేక్షైవ వైరాగ్య మిత్యుచ్యతే బ్రహ్మపారదైః -" (విచారసాగరము)

(బ్రహ్మలోకము మొదలుగాగల లోకములన్నింటిలోను వచ్చుచు పోవుచు తిరుగుచుండు భోగముల యడల ఉపేక్ష కలిగియుండుటే వైరాగ్యమని బ్రహ్మజ్ఞానుల అభిప్రాయము).

  1. "పరీక్ష్యలోకాన్ కర్మచితాన్ బ్రహ్మణో నిర్వేదమాయాత్" ఇతి శ్రుతిః.

(కర్మచేత సంపాదింపబడిన లోకములను పరీక్షించి - అనగా, కర్మచే పొందతగిన ఫలములవలన కలుగు భోగములు నశించునవి, ఎల్లకాలముండనివి అని గ్రహించి బ్రహ్మజ్ఞాని యగువాడు నిర్వేదమును (వైరాగ్యమును) పొందును - జననమరణములవలన కలుగు కష్టనష్టముల వలన దీర్ఘముగా ఆలోచించగా వైరాగ్యము కలుగును).

  1. “మోక్షస్య హేతుః ప్రథమో నిగద్యతే వైరాగ్యమత్యంత మనిత్య వస్తుషు-" (వివేకచూడామణి)

(నిత్యముగాని వస్తువుల యడల వైరాగ్యము కలిగియుండుట మోక్షమునకు మొదటి కారణము - మొదటి సాధనము)

  1. "విరాగిణః అంతర్భేదం త్రినిదం –

(1)జ్ఞాతః లోకైః ఏతస్య వైరాగ్యం స్పష్టమేవ జాయతే ఇతి తీవ్ర వైరాగ్యవాన్ జ్ఞాతః ఇత్యుచ్యతే. అజ్ఞాతశ్చ మంద వైరాగ్యవాన్ లోకైరజ్ఞాతవైరాగ్యవాన్ - మధ్యమస్తు లోకైః కించిత్ జ్ఞాత వైరాగ్యవాన్ ".

(విరాగులు మూడు విధములు : -

(1) లోకులందఱికి ఇతని వైరాగ్యము తెలిసియుండును - తీవ్రమైన వైరాగ్యము కలవాడు జ్ఞాత వైరాగి

(2) లోకులకు వైరాగ్యము కలవాడు అని తెలియనివాడు - మంద వైరాగ్యము కలవాడు –

(3) లోకులకు కొంచెము వైరాగ్యము కలవాడు అని తెలిసిన వైరాగి.)

Transliteration
  1. vigatō rāgō viṣayābhilāṣō yasya saḥ - virāgaḥ, tasya bhāvaṃ vairāgyaṃ.

(viṣayamulaṃdu rāgamu anagā abhilāṣa lēka nuṃḍuvāḍu. virāgī - aṭṭi bhāvamu vairāgyamu -)

  1. virāgasya bhāvaḥ vairāgyaṃ -

(virāgiyokka bhāvamu vairāgyamu - rāgamu lēkuṃḍuṭa, āsakti lēkuṃḍuṭa.)

  1. viṣayēṣu anāsaktiḥ -

(āsakti lēnivāḍu - viṣayamulaṃdāsakti lēkapōvuṭa)

  1. “viṣayēṣu yadvaitṛ ṣṇyaṃ vairāgyaṃ”.

(viṣayamulaṃdu tṛṣṇa - āśa, rāgamu - lēkuṃḍuṭa.)

  1. “iṃdriyārthēṣu śabdādiṣu,dṛṣṭā adṛṣēṣu, viṣayabhōgēṣu virāgabhāvō vairāgyaṃ” (śrīśaṃkaraḥ)

(iṃdriyamulaku arthamulaina śabdamu modalagu viṣayamalaṃdu - śabda,sparśa,rūpa,rasa,gaṃdhamulaṃdu - ivi gala vastuvulaṃdu, kanabaḍinavi, kanabaḍanivi ayina viṣayamulaku saṃbaṃdhiṃcina bhōgamulaṃdu - anubhavamulaṃdu - rāgamu, āsakti lēkuṃḍuṭa vairāgyamu)

  1. “dṛṣṭānuśrāvika viṣaya vitṛ ṣṇasya vaśīkāra saṃjñā vairāgyaṃ”. (pataṃjali - yōgasūtramulu - 1 -15)

(kaṃṭiki kanabaḍu viṣayamulaṃdu, cevulaku vinabaḍu viṣayamulaṃdu eppuḍunu, āsakti, tṛṣṇa - lēkuṃḍunaṭlu manassunu tana svādhīnamulō nuṃcukonuṭa vairāgyamu - kaṃṭiki kanabaḍi prītini kalugacēyunavi, strī, annapānādulu, ceviki vinabaḍi prītini kaligiṃcu saṃgītamu modalagunavi; śrutilōni viṣayamulanu vinuṭa, yajñayāgādulavalana svargamunu poṃduṭa -).

  1. vairāgyaṃ nāma dṛṣṭā dṛṣṭēṣu bhōgēṣu dōṣa darśanābhyāsāt vai tṛ ṣṇyaṃ.

(vairāgyamanagā kanabaḍunavi, kanabaḍanavi ayina viṣayabhōgamulaṃdu dōṣamu kanabaḍucunnadi ani anubhavamuvalana telusukonuṭavalana vāṭiyaṃdu kalugu vaitṛ ṣṇyamu -)

  1. viṣayēcchā rahitatvaṃ; viraktiḥ; virāgatvaṃ.

(viṣayamulaṃdu kōrika lēkuṃḍuṭa; rakti, āsakti lēkuṃḍuṭa).

  1. “ātmavyatiriktēṣu viṣayēṣu sadōṣatānu saṃdhānēna udvējanaṃ” (śrīmān rāmānujaḥ)

(ātma kānaṭuvaṃṭi viṣayamulu dōṣamutō kūḍiyunnavani anusaṃdhānamu cēyuṭavalana kaligina udvējanamu)

  1. paramātma vyatiriktēṣu sarvēṣu viraktiḥ - pataṃjaliyōgānuśāsana sūtraṃ - “dṛṣṭānuśrāvika viṣaya vitṛ ṣṇasya vaśīkāra saṃjñā vairāgyaṃ” iti.

(paramātma vyatirēkamaina viṣayamulanniṃṭiyaṃdunu virakti. pataṃjali yōgasūtramu prakāramu kaṃṭiki kanabaḍu viṣayamula yaḍala, cevulaku vinupiṃcu viṣayamulayaḍala tṛṣṇa lēkuṃḍunaṭlu manassunu svādhīnamu cēsukonuṭa.

  1. “striyō nnapānamaiśvaryaṃ” iti duṣṭa viṣaya vitṛṣṇasya svarga vaidēhyahya prakṛti laya tṛptādau anuśravika viṣaya saṃ yōgōpi cittasya viṣaya dōṣa darśinaḥ prasaṃkhyāna balādanā bhōgātmikā hēyō pādēya śūnyā vaśīkara saṃjñā vairāgyaṃ” iti tasya vṛttiḥ. duṣṭa viṣaya vitṛ ṣṇasya anuśravikaviṣaya vi tṛṣṇasya ca vaśīkaraṇa saṃjñā vairāgyaṃ iti sūtrārthaḥ.

(strīlu (saṃbhōgamu), annamu (iṣṭa padārthamunu tinuṭa), pānamu (iṣṭamaina pānamu) sēviṃcuṭa, ivi kaligiyuṃḍuṭa aiśvaryamu ani ceppabaḍiyuṃḍuṭavalana paina ceppabaḍina duṣṭa viṣayamulu modalaguvāṭiyaṃdu tṛṣṇa lēkuṃḍuṭa. svargamu modalagunavi kṣīṇiṃci naśiṃcunani viniyuṃḍuṭacēta vāṭiyaṃdukūḍa tṛṣṇa lēkuṃḍuṭa. divya bhōgamulu, ihalōka bhōgamulu dōṣamutō kūḍinavani telusukoni vāṭiyaḍala tṛṣṇa lēkuṃḍuṭa, hēyamu upādēyamu anu vicakṣaṇa lēkayuṃḍuṭa. iṭluṃḍuṭaku tana manassunu tanavaśamulō nuṃcukonuṭa vairāgyamu)

  1. “ślō. tadvairāgyaṃ jihāsā yā darśana śravaṇādibhiḥ dēhādi brahma paryatē hyānityē bhōgavastuni”. (vivēka cūḍāmaṇi - śrī śaṃkaraḥ)

(upaniṣattulanu vinuṭavalananu, tana anubhavamu valananu dēhamu modalu caturmukhabrahmavaraku gala bhōgamunakupakariṃcu vastuvulanniyu nityamugānivani telusukoni vāṭiyaṃdu iccha lēkuṃḍanuṇḍuṭa vairāgyamu)

  1. bhōgatyā gēccā bhōgānicca - (bhōgamulanu viḍicipeṭṭu kōrika kaligiyuṃḍuṭa, bhōgamulaṃdu kōrika lēkuṃḍuṭa)

  2. nityānitya vastu vivēka lakṣaṇāt prasaṃkhyānādi hāmutrārdabhōga virāgaḥ -

(nityamaina vastuvēdō - (bhagavaṃtuḍevaḍō, ātmayanunadi yēdō) nityamukāni anātmavastuvulēvō anu viṣayamunaṃdu vivēkamu kaligiyuṃḍuṭavalana ī lōkamunaṃdunu, paralōkamunaṃdunu gala viṣayamulaṃdu rāgamu - anurāgamu, āsakti lēkayuṃḍuṭa).

  1. “brahmādi sthāvarāṃtēṣu vairāgyaṃ viṣayēṣvanu |

yadaivakākaviṣṭhāyāṃ vairāgyaṃ taddhi nirmalaṃ ” (aparōkṣānubhūti)

(“brahmādi sthāvarāṃtēṣu - satyalōkādi martyalōkāṃtēṣu bhōgasādhanēṣu - anukarma janyatvēna anityatvaṃ lakṣmī kṛtāḥ ityarthaḥ - vairāgyaṃ icchārāhityaṃ”.

(caturmukhabrahma modalukoni kriṃda sthāvaramulavaraku gala vāṭiyaṃdu - anagā, satyalōkamu modalu martyalōkamuvaraku (mānavalōkamuvaraku) gala anni bhōgasādhanamulaṃdu avi nityamulugāvu naśiṃcunavi yani telusukoni, vāṭini kāki reṭṭanu asahyiṃcukoninaṭlu viḍici peṭṭuṭa nirmalamaina varāgyamu - śuddhavairāgyamu)

  1. viṣayāṃtara vaitṛ ṣṇyaṃ.

(bhagavaṃtuḍukāni viṣayamulaṃdu tṛṣṇa (āśa) lēkuṃḍuṭa)

  1. "dṛṣṭā dṛṣṭēṣu bhōgēṣu dōṣagrastatva darśanāt |

viṣayēṣu yadvaitṛ ṣṇyaṃ vairāgyaṃ tanudīritaṃ". (gītābhāvaprakāśamu - -6 - 180)

(dṛṣṭā dṛṣṭa bhōgamulu dōṣamutō kūḍinavani telusukoni aṭṭi viṣayamulaṃdu tṛṣṇa - avi kāvalenu, nēnu vāṭini anubhaviṃcavalenu anu āśa - lēkuṃḍuṭa.)

  1. "ślō||. anaṃtamiva mē vittaṃ yasya mēnāsti kiṃcana |

midhilāyāṃ pradīptāyāṃ namē kiṃcina dahyatē ||". (bhāratamu - śāṃti parvamu - 7 - 1)

(nāku taragani dhanamunnadi - nāku ēmiyu lēdu - midhilānagaramu aṃtayu dahiṃcukoni pōvu cunnanu nādi annadēdiyunu dahiṃcukoni pōvuṭalēdu - ēdi pōyinanu nāku lakṣyamulēdu - anu bhāvamu kaligiyuṃḍuṭa).

  1. viraktiḥ paripūrṇatvāt anādaraḥ -

(jagattu aṃtaṭanu pūrtigā tānē niṃḍiyuṃḍuṭacēta - ē vidhamaina kāmamu lēkuṃḍuṭacēta anniṃṭiyaṃdu virakti kaligiyuṃḍuṭa).

  1. vairāgyēṇavinā jñānaṃ na ca bhaktirataḥ sphuṭaṃ.

(vairāgyamu lēnidē jñānamu kalugadu, bhakti kalugadu).

  1. "vāsudēvē bhagavati bhaktiyōgaḥ prayōjitaḥ |

janayatyāśu vairāgyaṃ jñānaṃ ca yadahaitukaṃ ||". (śrīmadbhāgavataṃ - 1 - adhyā - 2 - 7)

"puruṣulaku barama dharmaṃbagu vāsudēvuni yaṃdu brayōgiṃpabaḍina bhaktiyōgaṃbu vairagya vijñānaṃbula buṭṭiṃcu"

(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 2 - 21)

  1. vairāgyamu mūḍu vidhamulu: -

(1) abhāva vairāgyamu - "abhāvē viraktiḥ" - tanaku kāvalasina vastuvu labhiṃcanappuḍu dāniyaṃdu kalugu virakti - nakka drākṣapaḷlavale)

(2) nirbhaṃdha vairāgyamu –

(3) sahaja vairāgyamu - (cūḍumu - 24).

(1). purāṇa vairāgyamu - purāṇa kadhalu vini vāṭilō ceppabaḍina kaṣṭa naṣṭamulu talaci aṭuvaṃṭi vāṭi yaṃdu kōrikalu appaṭiki lēkuṃḍaga cēsukonuṭa, marala ā viṣayamulu taṭasthiṃcinapuḍu vāṭiyaṃdu kōrikalu kalugacunē yuṃḍunu.

(2). smaśāna vairāgyamu - maniṣi canipōyinapuḍu cūci eṃta bratiuku bratikinā iṃtē kadā ! dīnikai pāpakarmalu eṃduku cēyavalayunu anukonuṭa.

(3). prasūti vairāgyamu - puruḍu kālamaṃdali noppulanu bhariṃcalēka mari saṃtānamu kalugavaddu - ani dāniyaṃdu appaṭiki kalugu vairāgyamu - ī paina ceppina mūḍu vidhamula vairāgyamu koṃtakālamuvaṟakē uṃḍunavi).

  1. vairāgyamu nālugu vidhamulu -

vairāgyaṃ cāturvidhamēvaṃ draṣṭavyaṃ –

"vairāgyamādyaṃ ya tamāna saṃjñaṃ kvaci dvirāgō vyatirēka saṃjñaṃ |

ēkēṃdriyākhyaṃ hṛdi rāgasaukṣmyaṃ tasyāpya bhāvastu vaśīkṛtākhyaṃ ||".

(1) yatīmānaṃ,

(2) vyatirēkaṃ,

(3) ēkēṃdriyaṃ,

(4)vaśīkaraṇaṃ.

(1) "viṣayān śaktuma śaknuvatōpi saṃ mānē cchā tyāgaḥ" (viṣayamulanu viḍicipeṭṭuṭa śakyamu kākapōyinanu saṃ mānēcchanu vadaluṭa) (maṃda vivēkamu)

(2) viṣayāṇāṃ midhyē lakṣaṇādi vyatirikēṇāpi vṛttirdvitīyaṃ. (viṣayamulalō lakṣaṇādi vṛttirēkamucē kalugu manō vṛtti) (vyatirēkamu). (satpuruṣula sahavāsamucē durguṇamulanu viḍicivēyuṭa.)

(3) vṛttāvapi manasi rāga śaidhilyēna bāhyēṃdriyai rēva viṣayaṃ sēvanaṃ - tṛtīyaṃ.(ēkēṃdriyaṃ) (manasulō rāgamu lēkapōyinanu bāhyēṃdriyamulatōnē viṣayamulanu sēviṃcuṭa - anubhaviṃcuṭa)

(4) vaśīkaraṇaṃ - tatrāpi audāsīnyaṃ caturthaṃ.(aṃdulōnu audāsīnyamu cūpuṭa) (manōjayamu)

  1. vairāgyamu mūḍuvidhamulu –

(1) abhāva vairāgyamu (2) nirbhaṃdhavairāgyamu (3) sahaja vairāgyamu.

(1) abhāva vairāgyamanagā tanaku lēni vastuvu kaluguṭaku avakāśamu lēnapuḍu dāni yaṃdu kalugu vairāgyamu.

(2) nirbaṃdha vairāgyamu anagā anubhaviṃcuṭaku vastuvuluṃḍinanu konni nirbaṃdhamuluṃḍuṭa valana - anagā, idi nīvu cēyakūḍadu anu modalagu niṣēdharūpamaina nibaṃdhanalugāni, rōgi yaguṭacē iṣṭamaina padārthamulunnanu vāṭini tinakūḍadu - anu nibaṃdhanalugāni, uṃḍuṭavalana ā vastuvulaṃdu kalugu vairāgyamu –

(3) sahaja vairāgyamanagā utkṛṣṭamaina vastuvu labhiṃcinanu dānini sahajamugā nikṛṣṭa vastuvugā parigaṇiṃcuṭa valana kalugu vairāgyamu).

  1. ihāmutra phala bhōga virāgaḥ.

(ī lōkamunaṃdu, paralōkamunaṃdunu karmalavalana kalugu phalamu nanubhaviṃcuṭa yaṃdu rāgamu - āsakti lēkapōvuṭa)

  1. "dōṣa dṛṣṭyā ābrahma lōkādvi parivartamānēṣu bhōgēṣu anādirūpō pēkṣaiva vairāgya mityucyatē brahmapāradaiḥ -" (vicārasāgaramu)

(brahmalōkamu modalugāgala lōkamulanniṃṭilōnu vaccucu pōvucu tirugucuṃḍu bhōgamula yaḍala upēkṣa kaligiyuṃḍuṭē vairāgyamani brahmajñānula abhiprāyamu).

  1. "parīkṣyalōkān karmacitān brahmaṇō nirvēdamāyāt" iti śrutiḥ.

(karmacēta saṃpādiṃpabaḍina lōkamulanu parīkṣiṃci - anagā, karmacē poṃdatagina phalamulavalana kalugu bhōgamulu naśiṃcunavi, ellakālamuṃḍanivi ani grahiṃci brahmajñāni yaguvāḍu nirvēdamunu (vairāgyamunu) poṃdunu - jananamaraṇamulavalana kalugu kaṣṭanaṣṭamula valana dīrghamugā ālōciṃcagā vairāgyamu kalugunu).

  1. “mōkṣasya hētuḥ prathamō nigadyatē vairāgyamatyaṃta manitya vastuṣu-" (vivēkacūḍāmaṇi)

(nityamugāni vastuvula yaḍala vairāgyamu kaligiyuṃḍuṭa mōkṣamunaku modaṭi kāraṇamu - modaṭi sādhanamu)

  1. "virāgiṇaḥ aṃtarbhēdaṃ trinidaṃ –

(1)jñātaḥ lōkaiḥ ētasya vairāgyaṃ spaṣṭamēva jāyatē iti tīvra vairāgyavān jñātaḥ ityucyatē. ajñātaśca maṃda vairāgyavān lōkairajñātavairāgyavān - madhyamastu lōkaiḥ kiṃcit jñāta vairāgyavān ".

(virāgulu mūḍu vidhamulu : -

(1) lōkulaṃdaṟiki itani vairāgyamu telisiyuṃḍunu - tīvramaina vairāgyamu kalavāḍu jñāta vairāgi

(2) lōkulaku vairāgyamu kalavāḍu ani teliyanivāḍu - maṃda vairāgyamu kalavāḍu –

(3) lōkulaku koṃcemu vairāgyamu kalavāḍu ani telisina vairāgi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.