← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వైరాజ్యం vairājyaṃ

Original — తెలుగు

వివిధం రాజతే ఇతి విరాట్, తస్య భావో వైరాజ్యం, అణిమాది సిద్ధి భాక్త్వం ఇత్యర్థః -

(అనేక విధములుగా, అనేక రూపములతో రాజిల్లువాడు, ప్రకాశించువాడు విరాట్. విరాట్టు యొక్క భావము వైరాజ్యము - విరాట్టుగా నుండుట. భగవంతుడు ఒక్కడే అనేక రూపములుగా మారెను - ఆ ప్రకారముగా మారిన రూపములన్నీ కలిసే యీ ప్రపంచమైనది. అందుచేత విరాట్ విరాడ్రూపుడు అనగా భగవంతుడే.)

(ఒక విత్తనము - గింజ - మొక్కగా అయి పెద్ద చెట్టుగా పెరుగును - ఆ చెట్టులో అనేక భాగములు కలిసి చెట్టు అనిపించుకొనును - అనగా, వేళ్ళు (వేర్లు), మాను (బోదె), పెద్దకొమ్మలు, చిన్నకొమ్మలు, చిన్న చిన్న కొమ్మలు, చిగుళ్ళు, ఆకులు, పువ్వులు, కాయలు, పండ్లు, ఆ పండ్లలో గింజలు, రసము, తొక్క - ఇవి అన్నీ వేరువేరుగా ఆ ఒక్క విత్తనమునుండియే పుట్టినవి - ఆ ఒక్క విత్తనమే ఇన్ని వస్తువులుగా, ఇన్ని పేర్లతో ఇన్ని రూపములుగా మారినది. ఈ ప్రకారముగానే భగవంతుడు సృష్టికి పూర్వము ఒక్కడే అయి యుండి తనలోనుండి మహత్తత్త్వము, దానిలోనుండి అహంకారము, దానిలోనుండి పంచతన్మాత్రలు, వాటిలోనుండి పంచ స్థూలభూతములు, వాటి సమ్మేళనము వలన సమస్త చరాచర భూతములను వస్తువులను సృష్టించి వాటిలో తాను ప్రవేశించి పూర్తిగా వాటిలో వ్యాపించియున్నాడు - విత్తనములోని గుణములతో గూడిన సారమే ఆ చెట్టులోని ప్రతిభాగముగా మారెను - అట్లు మారి వాటి లోన బైట ప్రవేశించి చెట్టు ఆమూలాగ్రము వ్యాపించి ఉన్నట్టుగా).

Transliteration

vividhaṃ rājatē iti virāṭ, tasya bhāvō vairājyaṃ, aṇimādi siddhi bhāktvaṃ ityarthaḥ -

(anēka vidhamulugā, anēka rūpamulatō rājilluvāḍu, prakāśiṃcuvāḍu virāṭ. virāṭṭu yokka bhāvamu vairājyamu - virāṭṭugā nuṃḍuṭa. bhagavaṃtuḍu okkaḍē anēka rūpamulugā mārenu - ā prakāramugā mārina rūpamulannī kalisē yī prapaṃcamainadi. aṃducēta virāṭ virāḍrūpuḍu anagā bhagavaṃtuḍē.)

(oka vittanamu - giṃja - mokkagā ayi pedda ceṭṭugā perugunu - ā ceṭṭulō anēka bhāgamulu kalisi ceṭṭu anipiṃcukonunu - anagā, vēḷḷu (vērlu), mānu (bōde), peddakommalu, cinnakommalu, cinna cinna kommalu, ciguḷḷu, ākulu, puvvulu, kāyalu, paṃḍlu, ā paṃḍlalō giṃjalu, rasamu, tokka - ivi annī vēruvērugā ā okka vittanamunuṃḍiyē puṭṭinavi - ā okka vittanamē inni vastuvulugā, inni pērlatō inni rūpamulugā mārinadi. ī prakāramugānē bhagavaṃtuḍu sṛṣṭiki pūrvamu okkaḍē ayi yuṃḍi tanalōnuṃḍi mahattattvamu, dānilōnuṃḍi ahaṃkāramu, dānilōnuṃḍi paṃcatanmātralu, vāṭilōnuṃḍi paṃca sthūlabhūtamulu, vāṭi sammēḷanamu valana samasta carācara bhūtamulanu vastuvulanu sṛṣṭiṃci vāṭilō tānu pravēśiṃci pūrtigā vāṭilō vyāpiṃciyunnāḍu - vittanamulōni guṇamulatō gūḍina sāramē ā ceṭṭulōni pratibhāgamugā mārenu - aṭlu māri vāṭi lōna baiṭa pravēśiṃci ceṭṭu āmūlāgramu vyāpiṃci unnaṭṭugā).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.