(పరమాణవులు జగత్తును సృష్టించునవి అని వైశేషికుల సిద్ధాంతము. సృష్టికి ముందు నిశ్చలముగానుండు పరమాణువులు ఒకదానితో నొకటి కలియుటచేత పదార్థములు కలుగుచున్నవి. రెండు పరమాణువులు ద్వ్యణుకము - ఈ ప్రకారముగా వస్తువులన్నియు పరమాణువులు కలియుటచేత కలుగుచున్నవి అని వీరి అభిప్రాయము).
(పరమాణువులు రెండు కలిసి ద్వ్యణుకమను పదార్థంబును, మూడు కలిసిన త్ర్యణుకమను పదార్థమును అగునని, నూలు వస్త్రముగ మారునట్లు అవి వాయువు మొదలగు రూపముల నొందుననియు, కార్యవస్తువు కారణవస్తువులో సూక్ష్మరూపములో లేదనియు వైశేషికుల మతము - కాని పరమాణువులు కలియుటకు కారణమేమి ? - ప్రతి పరమాణువులోను భగవంతుని శక్తియుండి వాటిని ఒకదానితో నొకటిని ఆకర్షింపచేయుననియు అందుచేతనే అవి కలిసి పదార్థముగా మారుచున్నవని ఉపనిషత్తులు చెప్పుచున్నవి. అట్లు వాటిని ఆకర్షింపచేయుశక్తి వాటిలోనుండి భగవంతుడు ఈ పని చేయుచున్నందున భగవంతుడు సంకర్షణుడు - "సమ్యక్ కర్షతి, ఆకర్షతి ఇతి సంకర్షణః" - అని పేరున చెప్పబడుచున్నాడు - ఏ వస్తువైనను దానిలో భగవంతుడుండి వాటిచే పని చేయించనిది అవి ఆ పని చేయలేవు - అందుచేత ఈ మతము అంగీకార్యముకాదు - "వైశేషికరాద్ధాంతో దుర్యుక్తియోగాత్ వేద విరోధాత్ శిష్టా సరిగ్రహాచ్చ నాపేక్షితవ్యః -".
(ఈ వైశేషిక సిద్ధాంతము దుర్యుక్తివలన చెప్పబడినది - వేదములోని సిద్ధాంతమునకు విరుద్ధముగానున్నది - అందుచేత అంగీకరించగగినదికాదు -).
(paramāṇavulu jagattunu sṛṣṭiṃcunavi ani vaiśēṣikula siddhāṃtamu. sṛṣṭiki muṃdu niścalamugānuṃḍu paramāṇuvulu okadānitō nokaṭi kaliyuṭacēta padārthamulu kalugucunnavi. reṃḍu paramāṇuvulu dvyaṇukamu - ī prakāramugā vastuvulanniyu paramāṇuvulu kaliyuṭacēta kalugucunnavi ani vīri abhiprāyamu).
(paramāṇuvulu reṃḍu kalisi dvyaṇukamanu padārthaṃbunu, mūḍu kalisina tryaṇukamanu padārthamunu agunani, nūlu vastramuga mārunaṭlu avi vāyuvu modalagu rūpamula noṃdunaniyu, kāryavastuvu kāraṇavastuvulō sūkṣmarūpamulō lēdaniyu vaiśēṣikula matamu - kāni paramāṇuvulu kaliyuṭaku kāraṇamēmi ? - prati paramāṇuvulōnu bhagavaṃtuni śaktiyuṃḍi vāṭini okadānitō nokaṭini ākarṣiṃpacēyunaniyu aṃducētanē avi kalisi padārthamugā mārucunnavani upaniṣattulu ceppucunnavi. aṭlu vāṭini ākarṣiṃpacēyuśakti vāṭilōnuṃḍi bhagavaṃtuḍu ī pani cēyucunnaṃduna bhagavaṃtuḍu saṃkarṣaṇuḍu - "samyak karṣati, ākarṣati iti saṃkarṣaṇaḥ" - ani pēruna ceppabaḍucunnāḍu - ē vastuvainanu dānilō bhagavaṃtuḍuṃḍi vāṭicē pani cēyiṃcanidi avi ā pani cēyalēvu - aṃducēta ī matamu aṃgīkāryamukādu - "vaiśēṣikarāddhāṃtō duryuktiyōgāt vēda virōdhāt śiṣṭā sarigrahācca nāpēkṣitavyaḥ -".
(ī vaiśēṣika siddhāṃtamu duryuktivalana ceppabaḍinadi - vēdamulōni siddhāṃtamunaku viruddhamugānunnadi - aṃducēta aṃgīkariṃcagaginadikādu -).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.