← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వైష్ణవాగమములు vaiṣṇavāgamamulu

Original — తెలుగు
  1. "పాంచరాత్రాగమములు - సనత్కుమార సహితయందు బ్రహ్మరాత్ర, శివరాత్రి, ఇంద్రరాత్ర, ఋషిరాత్ర, బృహస్పతిరాత్రములని అయిదు భాగములున్నవి. రాత్రి అనగా జ్ఞానము - జ్ఞానము అయిదు విధములు. అందువలన వైష్ణవాగమములు పాంచరాత్రములని చెప్పబడుచున్నవి."

  2. "వాశిష్టం నారదీయంచ కాపిలం, గౌతమీయకం |

పరం సనత్కుమారీయం పంచరాత్రం చ పంచకం ||".

(వాశిష్టము, నారదీయము, కాపిలము, గౌతమీయము, సనత్కుమారము అను అయిదు పాంచరాత్రములు -).

  1. వైష్ణవాగమములు పాంచరాత్రములని వైఖానసములని రెండు తెగలు - (చూడుము - పాంచరాత్రములు).
Transliteration
  1. "pāṃcarātrāgamamulu - sanatkumāra sahitayaṃdu brahmarātra, śivarātri, iṃdrarātra, ṛṣirātra, bṛhaspatirātramulani ayidu bhāgamulunnavi. rātri anagā jñānamu - jñānamu ayidu vidhamulu. aṃduvalana vaiṣṇavāgamamulu pāṃcarātramulani ceppabaḍucunnavi."

  2. "vāśiṣṭaṃ nāradīyaṃca kāpilaṃ, gautamīyakaṃ |

paraṃ sanatkumārīyaṃ paṃcarātraṃ ca paṃcakaṃ ||".

(vāśiṣṭamu, nāradīyamu, kāpilamu, gautamīyamu, sanatkumāramu anu ayidu pāṃcarātramulu -).

  1. vaiṣṇavāgamamulu pāṃcarātramulani vaikhānasamulani reṃḍu tegalu - (cūḍumu - pāṃcarātramulu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.