"పృద్వి సలిల తేజస్సమీర గగనాహంకార మహత్తత్త్వంబులనెయెడి యేడి ఆవరణంబులమీద ప్రకృత్యావరణంబున మహా వ్యాపకంబగు బ్రహ్మాండంబు భేదించి వైష్ణవ పదారోహణంబు సేయువాడు నిర్భయుండై మెల్లన లింగదేహంబున పృధివ్యాత్మకత్వంబు నొంది యట్టి పృధివ్యాత్మకత్వంబున ఘ్రాణంబున గంధంబును జలాత్మకత్వంబున రసనేంద్రియంబున రసంబును, తేజోరూపకత్వంబున దర్శనంబున రూపంబును, సమీరణాత్మకత్వంబున దేహంబున స్పర్శంబును, గగనాత్మ కత్వంబున శ్రవణంబున శ్రవణంబు నతిక్రమించి, భూత సూక్ష్మేంద్రియ లయస్థానంబైన యహంకారావరణంబున సంప్రాప్తుండై, యందు మనోమయంబును దేవమయంబునైన సాత్వికాహాంకార గమనంబున మహత్తత్త్వంబుసొచ్చి, గుణత్రయంబునలయించి, ప్రధానంబునొంది, ప్రథానాత్మకత్వంబున దేహంబును నుపాధిపరంపరావస్థానంబునం ప్రకృతిం బాసి ఆనందమయుండై యానందంబున పరమాత్మ రూపంబైన వాసుదేవ బ్రహ్మంబునందు గలియును-" (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 - 32)
"pṛdvi salila tējassamīra gaganāhaṃkāra mahattattvaṃbulaneyeḍi yēḍi āvaraṇaṃbulamīda prakṛtyāvaraṇaṃbuna mahā vyāpakaṃbagu brahmāṃḍaṃbu bhēdiṃci vaiṣṇava padārōhaṇaṃbu sēyuvāḍu nirbhayuṃḍai mellana liṃgadēhaṃbuna pṛdhivyātmakatvaṃbu noṃdi yaṭṭi pṛdhivyātmakatvaṃbuna ghrāṇaṃbuna gaṃdhaṃbunu jalātmakatvaṃbuna rasanēṃdriyaṃbuna rasaṃbunu, tējōrūpakatvaṃbuna darśanaṃbuna rūpaṃbunu, samīraṇātmakatvaṃbuna dēhaṃbuna sparśaṃbunu, gaganātma katvaṃbuna śravaṇaṃbuna śravaṇaṃbu natikramiṃci, bhūta sūkṣmēṃdriya layasthānaṃbaina yahaṃkārāvaraṇaṃbuna saṃprāptuṃḍai, yaṃdu manōmayaṃbunu dēvamayaṃbunaina sātvikāhāṃkāra gamanaṃbuna mahattattvaṃbusocci, guṇatrayaṃbunalayiṃci, pradhānaṃbunoṃdi, prathānātmakatvaṃbuna dēhaṃbunu nupādhiparaṃparāvasthānaṃbunaṃ prakṛtiṃ bāsi ānaṃdamayuṃḍai yānaṃdaṃbuna paramātma rūpaṃbaina vāsudēva brahmaṃbunaṃdu galiyunu-" (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 2 - 32)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.