విష్ణు భక్తులు -
"న దైవం కేశవాత్పరం" అని నమ్మువారు - విష్ణువుకన్న ఉత్కృష్టమైన దైవము లేడని నమ్మువారు -
శ్లో ||. శ్రుతి స్మృతి మమైవా జ్ఞేయస్తే ఉల్లంఘ్యవర్తతే |
ఆజ్ఞాచ్ఛేదీ మమద్వేషీ మద్భక్తోపి న వైష్ణవః ||.
ఇతి భగవద్వచనాత్.
(శృతి స్మృతులు నా ఆజ్ఞలే కావున వీని నెవడుల్లంఘించునో అతడు నా ఆజ్ఞను భగపరచినవాడును, నన్ను ద్వేషించినవాడును అగును - అట్టివాడు నా భక్తుడుకాని, నావాడుకాని కానేరడు)
యేవా లలాటఫలకే లసదూర్ధ్వ పుండ్రాస్తే వైష్ణవాః భువన మాశు పవిత్రయంతి ||
(కంఠమందు తులసీ మాలను, బాహు మూలములందు - (భుజములమీద) - శంక చక్రములు, లలాటమందు - నుదురుమీద- ఊర్ధ్వపుండ్రమును - నిలువుబొట్టును - ధరించువారు వైష్ణవులు - వారు లోకములను పవిత్రము చేయువారు -)
ప్రీతో భవతి యోదృష్ట్వా వైష్ణవో(అ)సౌ ప్రకీర్తితః ||"
(విష్ణుభక్తి కలవారిని, శ్రుతి స్మృతులలఓ చెప్పబడినట్లు ప్రవర్తించువారిని చూచి వారియందు ప్రీతిగలవాడు వైష్ణవుడని చెప్పబడును).
న హరతి, న చ హంతి కించిదుచ్చైః సితమననం తమవేహి విష్ణుభక్తం ||".
(తనయొక్క వర్ణాశ్రమధర్మములను విడిచిపెట్టనివాడు, తన మిత్రునియడల శత్రువునియడల సమానబుద్ధి కలవాడు, నిర్మలమైన మనస్సు కలవాడు విష్ణుభక్తుడు - వైష్ణవుడు అని తెలుసుకొనుము).
సాలోక్య, సార్షి, సారూప్యం చ హరేరపి |
దీయమానం న గృహ్ణంతి వైష్ణవాః సేవనం వినా |
బ్రహ్మత్వం అనురత్వం వా తుచ్ఛం మేనే చ వైష్ణవః |
ఇంద్రత్వం వా మనత్వం వా నమేనే గణనాసుచ ||" (దేవీభాగవతము)
(మీదను చతుర్ముఖ బ్రహ్మ మొదలు క్రిందను స్తంబమువరకు గల సమస్త వస్తువులు తుచ్ఛమైనవని వైష్ణవుడు తలచును - సాలోక్యమోక్షము, సామాప్యము, సామీప్యము, సాక్షి అను నాలుగు విధములైన మోక్షమును భగవంతుడనుగ్రహించినను వైష్ణవుడు అంగీకరించడు. విష్ణుసేవ, విష్ణుభక్తియే కోరును. బ్రహ్మత్వముకాని తుచ్ఛమని తలంచును. వీటిని లెక్క చేయునవిగా అంగీకరించడు -).
తేనైవతే ప్రయాస్యంతి తద్విష్ణోః పరమం పదం ||"
(పశువుగాని, మనుష్యుడుగాని, పక్షిగాని విష్ణువనాశ్రయించువారు ఆ పరబ్రహ్మ అయిన విష్ణువుయొక్క లోకమును, వైకుంఠమును - పొందుదురు -)
న చ సత్యాత్ పరోధర్మో, న సాధ్వీ పార్వతీ పరా ||".
(బ్రహ్మ వైవర్త పురాణే - బ్రహ్మఖండే).
(శివునికంటె ఉత్కృష్టుడైన విష్ణుభక్తుడు లేడు, భూమికంటె హెచ్చు ఓర్పుగలదిలేదు - సత్యముకంటె ఉత్కృష్టమైన ధర్మము లేదు - పార్వతికంటె ఉత్త్తమురాలైన సాధ్విలేదు).
ప్రమాణ పూర్వకం క్షాంత్యా యోవదేత్ వైష్ణవోహి సః ||.
(భాగవతులు - విష్ణుభక్తులు - పరుషమైన మాటలాడినను, మనసులో బాధపడక సంతోషముతో స్వీకరించువాడు వైష్ణవుడు)
viṣṇu bhaktulu -
"na daivaṃ kēśavātparaṃ" ani nammuvāru - viṣṇuvukanna utkṛṣṭamaina daivamu lēḍani nammuvāru -
ślō ||. śruti smṛti mamaivā jñēyastē ullaṃghyavartatē |
ājñācchēdī mamadvēṣī madbhaktōpi na vaiṣṇavaḥ ||.
iti bhagavadvacanāt.
(śṛti smṛtulu nā ājñalē kāvuna vīni nevaḍullaṃghiṃcunō ataḍu nā ājñanu bhagaparacinavāḍunu, nannu dvēṣiṃcinavāḍunu agunu - aṭṭivāḍu nā bhaktuḍukāni, nāvāḍukāni kānēraḍu)
yēvā lalāṭaphalakē lasadūrdhva puṃḍrāstē vaiṣṇavāḥ bhuvana māśu pavitrayaṃti ||
(kaṃṭhamaṃdu tulasī mālanu, bāhu mūlamulaṃdu - (bhujamulamīda) - śaṃka cakramulu, lalāṭamaṃdu - nudurumīda- ūrdhvapuṃḍramunu - niluvuboṭṭunu - dhariṃcuvāru vaiṣṇavulu - vāru lōkamulanu pavitramu cēyuvāru -)
prītō bhavati yōdṛṣṭvā vaiṣṇavō(a)sau prakīrtitaḥ ||"
(viṣṇubhakti kalavārini, śruti smṛtulalaō ceppabaḍinaṭlu pravartiṃcuvārini cūci vāriyaṃdu prītigalavāḍu vaiṣṇavuḍani ceppabaḍunu).
na harati, na ca haṃti kiṃciduccaiḥ sitamananaṃ tamavēhi viṣṇubhaktaṃ ||".
(tanayokka varṇāśramadharmamulanu viḍicipeṭṭanivāḍu, tana mitruniyaḍala śatruvuniyaḍala samānabuddhi kalavāḍu, nirmalamaina manassu kalavāḍu viṣṇubhaktuḍu - vaiṣṇavuḍu ani telusukonumu).
sālōkya, sārṣi, sārūpyaṃ ca harērapi |
dīyamānaṃ na gṛhṇaṃti vaiṣṇavāḥ sēvanaṃ vinā |
brahmatvaṃ anuratvaṃ vā tucchaṃ mēnē ca vaiṣṇavaḥ |
iṃdratvaṃ vā manatvaṃ vā namēnē gaṇanāsuca ||" (dēvībhāgavatamu)
(mīdanu caturmukha brahma modalu kriṃdanu staṃbamuvaraku gala samasta vastuvulu tucchamainavani vaiṣṇavuḍu talacunu - sālōkyamōkṣamu, sāmāpyamu, sāmīpyamu, sākṣi anu nālugu vidhamulaina mōkṣamunu bhagavaṃtuḍanugrahiṃcinanu vaiṣṇavuḍu aṃgīkariṃcaḍu. viṣṇusēva, viṣṇubhaktiyē kōrunu. brahmatvamukāni tucchamani talaṃcunu. vīṭini lekka cēyunavigā aṃgīkariṃcaḍu -).
tēnaivatē prayāsyaṃti tadviṣṇōḥ paramaṃ padaṃ ||"
(paśuvugāni, manuṣyuḍugāni, pakṣigāni viṣṇuvanāśrayiṃcuvāru ā parabrahma ayina viṣṇuvuyokka lōkamunu, vaikuṃṭhamunu - poṃduduru -)
na ca satyāt parōdharmō, na sādhvī pārvatī parā ||".
(brahma vaivarta purāṇē - brahmakhaṃḍē).
(śivunikaṃṭe utkṛṣṭuḍaina viṣṇubhaktuḍu lēḍu, bhūmikaṃṭe heccu ōrpugaladilēdu - satyamukaṃṭe utkṛṣṭamaina dharmamu lēdu - pārvatikaṃṭe utttamurālaina sādhvilēdu).
pramāṇa pūrvakaṃ kṣāṃtyā yōvadēt vaiṣṇavōhi saḥ ||.
(bhāgavatulu - viṣṇubhaktulu - paruṣamaina māṭalāḍinanu, manasulō bādhapaḍaka saṃtōṣamutō svīkariṃcuvāḍu vaiṣṇavuḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.