← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వైశ్వానరుడు vaiśvānaruḍu

Original — తెలుగు
  1. "విశ్వాన్ నరాన్ నయతీతి వైశ్వానరః" (శ్రీరంగరామానుజః)

(ప్రపంచములను నరులను నడుపువాడు)

  1. విశ్వశ్చాయం నరశ్చ విశ్వానరః, విశ్వానరశ్చ ఏవ వైశ్వానరః.

(ప్రపంచము - నరుడు తానే అయినవాడు విశ్వానరుడు - విశ్వానరుడే వైశ్వనరుడు)

  1. విశ్వేషాం నరః విశ్వానరః; విశ్వానర ఏవ వైశ్వానరః -

(ప్రత్యగాత్మ యగుటవలన ప్రపంచములోనున్న సమస్త భూతములకు నరుడు - పురుషుడు, నియమించు వాడు, వారిలో నుండువాడు విశ్వానరుడు. విశ్వానరుడే వైశ్వానరుడు)

  1. విశ్వేషాం నరాణాం అనేకథా నయనాత్ విశ్వారః; యద్వా విశ్వశ్చాసౌ నరశ్చేతి విశ్వానరః - విశ్వానర ఏవ వైశ్వానరః, సర్వ పిండాత్మానన్యత్వాత్ - సః ఆత్మనః ప్రథమః పాదః - (శ్రీశంకరః)

(ప్రపంచములోని నరులందఱినీ అనేక రీతులుగా నియమించువాడు కనుకనే విశ్వానరుడు - లేక, విశ్వము (ప్రపంచము) నరుడు అతనే అయినవాడు కనుక విశ్వానరుడు - సమస్తమైన జీవుల ఆత్మకంటె వేరుకానివాడు, తానే అయినవాడు, కనుక ఆత్మయొక్క నాలుగు పాదములలోను మొదటి పాదము అయినవాడు - విశ్వానరుడే వైశ్వానరుడు -).

  1. "సర్వదేహేషు ఆదాన కర్తృత్వేన స్థితస్య ఆత్మనః ప్రథమం రూపం" (శ్రీకూరనారాయణః)

(అన్ని దేహములందు ఆదానకరుడగు ఆత్మయొక్క నాలుగు రూపములలో - పాదములలో - మొదటి రూపము - మొదటి పాదము)

  1. విశ్బశ్చా యం నరో జీవశ్చ సర్వాత్మకత్వాత్, విశేషాణాం వికారాణాం వా నరః కర్తా; విశ్వే సర్వే నరాః జీవాః అస్యాత్మత్వేన నియమ్యత్వేన వా సంతీతి విశ్వానరః, రక్ష ఏవ రాక్షస ఇతి వత్; విశ్వానర ఏవ వైశ్వానరః ఇతి యోగేన వైశ్వానర శబ్దో బ్రహ్మపరతయా నేతవ్యః -

(విశ్వుడు ప్రపంచరూపుడు, జీవుడు తానే అయి యుండుటవలనను వికారములన్నియు - రూపములన్నియు తానే అయి, అన్నింటికి తానే ఆత్మ అయినవాడు, వాటినన్నింటినీ సృష్టించినవాడు అగుటవలన వైశ్యానరుడు. ప్రపంచమందుండు జీవులన్నియు అతని ఆత్మయే, అతని శరీరమే యగుటవలన, అతనిచేత నియమింపబడినవగుటచేతను "రక్షుడు" అనగా రాక్షసుడే అయినట్లు విశ్వానరుడే వైశ్వానరుడు - వైశ్వనరుడనగా పరబ్రహ్మమనే అర్థము).

  1. "విశ్యతే, గమ్యతే సర్వైః జ్ఞాయతే ఇతి - - - విశ్వః సర్వైః జ్ఞేయం స్థూలం వస్తూచ్యతే. భోక్తృతయా, తత్సంబంధీ వైశ్వః, నరీయతే న క్షీయతే ఇతి నరః - వైశ్వశ్చాసౌ నరశ్చ ఇతి వైశ్వానరః". (శ్రీకూరనారాయణః)

(విశ్వమనగా అందఱూ తెలియ తగినది, విశ్వము అందఱకు తెలియ తగిన స్థూల వస్తువు. భోక్తయగుటవలన విశ్వమునకు సంబంధించిన వాడు వైశ్యుడు. క్షీణించనివడు నరుడు వైశ్యుడు, నరుడు కనుక - క్షీణించని వైశ్యుడు కనుక వైశ్వానరుడు).

  1. విశ్వేనరాః యస్యసః -

(సమస్త జీవులను ఆత్మగా గాని నియమితులుగా గాని కలవాడు)

  1. విశ్వశ్చా యం నరశ్చ విశ్వనరః

(విశ్వము - ప్రపంచము - అందులోని నరుడు (నరులు) వాటి రూపములు తానే అయినవాడు).

  1. విశ్వేషాం నరః (సమస్త వికారములకు కర్త అయినవాడు, కారణమైనవాడు)

  2. "వివ్వాన్నరాన్ న యతి పుయపాపాం రూపాం గతిం సర్వాత్మా ఏవ ఈశ్వరో వైశ్వానరః. విశ్వశ్చాయం నరశ్చ వైశ్వానరః సర్వాత్మత్వాత్. విశ్వైర్యానరైః ప్రత్యగాత్మతయా ప్రత్యగాత్మతయా ప్రవిభజ్య న యత ఇతి వైశ్వానరః. విశ్వేషాం వా అయం నరః, తద్వికార భూతత్వాత్ విశ్వ ప్రపంచశ్చ విశ్వేవా నరాః జీవాత్మనః జీవాత్మనః అస్య తాదాత్మ్యే నేతి. విశ్వానరో యో అయమంతః పురుషే యేనేద మిన్నం పచ్యత ఇతి".

(విశ్వములను - ప్రపంచములోనున్న నరులను పుణ్యపాప రూపములగు గతులను పొందించువాడు - అన్నింటికి ఆత్మ అయినవాడే వైశ్వానరుడు - సర్వాత్మ యగుటవలన విశ్వము నరుడు అయినవాడు కనుక వైశ్వానరుడు - ప్రత్యగాత్మయగుటవలన నరులను వేరు వేరుగా విభజించి నడిపించువాడు - ప్రపంచముల వికారములు - వేరు వేరు రూపములు తానే అయిన వాడు - అ వి అన్నియు తాదాత్మ్యములే అయినవాడు. పురుషుని లోపల అన్నమును పచనము చేయువాడు - అరుగుదలకు తగిన స్థితికి తెచ్చు వాడు.

  1. "అయమగ్నిః వైశ్వానరో యో (అ)యమంతః పురుషే యేన మిదమన్నం పచ్యతే యది దమద్యతే".

(పురుషునిలోపలనుండి తినిన అన్నమును పచనము చేసి తినువాడు).

  1. జఠరానలః; ఉదరస్థః అగ్నిః.

(కడుపులోనుండు అగ్ని - వేడిమి -, ఆహారమును పచనము చేయు శక్తి.)

  1. అగ్ని - (తేజోరూపము - అగ్న్యభిమాని దేవతా)

  2. వైశ్వానర శబ్దస్య విష్ణావేన ప్రసిద్ధాత్మ శబ్దేన విశేషణాత్ –

"శ్లో ||. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః |

ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం ||". (శ్రీమద్భగవద్గీత - 15 - 14)

(వైశ్వానరుడనగా జీవాత్మయగు విష్ణువేయని ప్రసిద్ధి) (జీవుల దేహమునాశ్రయించి ప్రాణవాయువు అపానవాయువుతో కలిసి నాలుగు విధములైన అన్నమును - భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య, పానీయములను నాలుగు విధములైన అన్నమును వైశ్వానరుడనై - వైశ్వానరుడను రూపముతో - శారీరకాంతర్గతమైన ఉష్ణము, తేజస్సు, శక్తి (Energy)నేనే అయి తినిన అన్నమును పచనము చేయుదును - శరీరము అంతటిలోను ప్రవహింపచేసి జీర్ణించునట్లు - శక్తిగా మారునట్లు - చేయుదును - అని శ్రీమద్భగవద్గీతలో చెప్పబడియున్నదానిని బట్టి వైశ్వానరుడనగా విష్ణువే అని ప్రసిద్ధి).

  1. యస్యాగ్ని రాస్యం ద్యౌర్మూర్థా ఖం నాభిశ్చరణౌ క్షితిః |

సూర్యశ్చక్షుర్దిశః శ్రోత్రం తస్మై లోకాత్మనేనమః ఇతి శ్రీవిష్ణుపురాణే -

యదద్యతే తదన్నం, యేన పచ్యతే సో(అ)యం పురుషే శరీరే అంతరస్తీ. "నఖాది శాఖాంతావయవ సముదాయాత్మక పురుష శరీరే మూర్థాచుబుకాంతాంగాని వృక్షే శాఖావత్ పర్తిష్టితాని తేషు సంపన్నా వైశ్వానరః పురుషే అంతిః ప్రతిష్టితః ఇత్యుచ్యతే. అతో యథా శఖాస్థస్య పక్షిణో వృక్షాం తస్థం తథా వైశ్వానరస్య పురుషాంతస్థం".

(క్రిందను కాలి గోళ్ళు మొదలు మీదను తలమీద జుట్టు వరకు గల అవయవములుగల పురుషుని శరీరమందలి శిరస్సు మొదలగు అంగములు చెట్టు కొమ్మలవలె ప్రతిష్టింపబడియున్నవి. అంగములుగల పురుష శరీరములోపల ప్రవేశించి వైశ్వానరుడు అను పేరుతో జీవాత్మ యున్నాడు. చెట్టు కొమ్మలలోనున్న పక్షి చెట్టులోనున్నట్లు వైశ్వానరుడు పురుషునిలోపల ఉన్నాడు - తినబడునది అన్నము - ఆ అన్నమును లోపల వండినట్లు పచనము చేయునది వైశ్వానరుడు)

  1. "సుషుప్త్యసహితం చైతన్యం వైశ్వానరో సర్వ నరాభిమానత్వాత్ విరాట్ వివిధ రాజమానత్వాత్ ఇత్యుచ్యతే".

(సమష్టి స్థూల శరీరముతో కూడిన చైతన్యము - చిచ్ఛక్తి - ఇదియే విరాట్పురుషుడు- అనగా, ఈ సమష్టి స్థూల శరీరమే అనేక విధములుగా, అనేక రూపములుగా మారునది. సమస్త జీవుల శరీరములోను "నేను, నాది" అను అభిమానముతో కూడిన శక్తి)

  1. సమష్టి స్థూల దేహాభిమానీ.

(అన్ని జీవుల సమష్టి స్థూల దేహము నభిమానించువాడు)

  1. విశ్వేషాం నరాణాం వానరః కర్తా - విశ్వేసర్వే నరాః జీవాః అస్యాత్మత్వేన నియమ్య త్వేన వా సంతీతి విశ్వానరః

(నరులందఱికి కర్త అయినవాడు, సృష్టించువాడు - ఈ విశ్వమందు - ప్రపంచమందు నరులందఱకు - జీవులందఱకు పరబ్రహ్మమే ఆత్మ. అతనే. అతనే వాటిని నియమించువాడు, వాటిలో నుండి వాటికి తన శక్తినిచ్చి వాటివాటి పనులు చేయించు వాడు - చేయునట్లు ప్రేరేపించువాడు).

  1. జాగరిత స్థానో బహిం ప్రజ్ఞః, సప్తాంగః, ఏకోన వింశతి ముఖః, స్థూల భుకో వైశ్వానరః ప్రథమః పాదః - (మాండూక్యోపనిషత్)

(ఆత్మయొక్క నాలుగు పాదములలో మొదటిది వైశ్వానరుడు జాగ్రదవస్థలో పని చేయువాడు - చైతన్యము కలిగించువాడు - పందొమ్మిది ముఖములు అనగా పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ ప్రాణములు, మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము - స్థూల వస్తువులను భుజించువాడు - అనుభవించువాడు - వైశ్వానరడే విశ్వుడు).

Transliteration
  1. "viśvān narān nayatīti vaiśvānaraḥ" (śrīraṃgarāmānujaḥ)

(prapaṃcamulanu narulanu naḍupuvāḍu)

  1. viśvaścāyaṃ naraśca viśvānaraḥ, viśvānaraśca ēva vaiśvānaraḥ.

(prapaṃcamu - naruḍu tānē ayinavāḍu viśvānaruḍu - viśvānaruḍē vaiśvanaruḍu)

  1. viśvēṣāṃ naraḥ viśvānaraḥ; viśvānara ēva vaiśvānaraḥ -

(pratyagātma yaguṭavalana prapaṃcamulōnunna samasta bhūtamulaku naruḍu - puruṣuḍu, niyamiṃcu vāḍu, vārilō nuṃḍuvāḍu viśvānaruḍu. viśvānaruḍē vaiśvānaruḍu)

  1. viśvēṣāṃ narāṇāṃ anēkathā nayanāt viśvāraḥ; yadvā viśvaścāsau naraścēti viśvānaraḥ - viśvānara ēva vaiśvānaraḥ, sarva piṃḍātmānanyatvāt - saḥ ātmanaḥ prathamaḥ pādaḥ - (śrīśaṃkaraḥ)

(prapaṃcamulōni narulaṃdaṟinī anēka rītulugā niyamiṃcuvāḍu kanukanē viśvānaruḍu - lēka, viśvamu (prapaṃcamu) naruḍu atanē ayinavāḍu kanuka viśvānaruḍu - samastamaina jīvula ātmakaṃṭe vērukānivāḍu, tānē ayinavāḍu, kanuka ātmayokka nālugu pādamulalōnu modaṭi pādamu ayinavāḍu - viśvānaruḍē vaiśvānaruḍu -).

  1. "sarvadēhēṣu ādāna kartṛtvēna sthitasya ātmanaḥ prathamaṃ rūpaṃ" (śrīkūranārāyaṇaḥ)

(anni dēhamulaṃdu ādānakaruḍagu ātmayokka nālugu rūpamulalō - pādamulalō - modaṭi rūpamu - modaṭi pādamu)

  1. viśbaścā yaṃ narō jīvaśca sarvātmakatvāt, viśēṣāṇāṃ vikārāṇāṃ vā naraḥ kartā; viśvē sarvē narāḥ jīvāḥ asyātmatvēna niyamyatvēna vā saṃtīti viśvānaraḥ, rakṣa ēva rākṣasa iti vat; viśvānara ēva vaiśvānaraḥ iti yōgēna vaiśvānara śabdō brahmaparatayā nētavyaḥ -

(viśvuḍu prapaṃcarūpuḍu, jīvuḍu tānē ayi yuṃḍuṭavalananu vikāramulanniyu - rūpamulanniyu tānē ayi, anniṃṭiki tānē ātma ayinavāḍu, vāṭinanniṃṭinī sṛṣṭiṃcinavāḍu aguṭavalana vaiśyānaruḍu. prapaṃcamaṃduṃḍu jīvulanniyu atani ātmayē, atani śarīramē yaguṭavalana, atanicēta niyamiṃpabaḍinavaguṭacētanu "rakṣuḍu" anagā rākṣasuḍē ayinaṭlu viśvānaruḍē vaiśvānaruḍu - vaiśvanaruḍanagā parabrahmamanē arthamu).

  1. "viśyatē, gamyatē sarvaiḥ jñāyatē iti - - - viśvaḥ sarvaiḥ jñēyaṃ sthūlaṃ vastūcyatē. bhōktṛtayā, tatsaṃbaṃdhī vaiśvaḥ, narīyatē na kṣīyatē iti naraḥ - vaiśvaścāsau naraśca iti vaiśvānaraḥ". (śrīkūranārāyaṇaḥ)

(viśvamanagā aṃdaṟū teliya taginadi, viśvamu aṃdaṟaku teliya tagina sthūla vastuvu. bhōktayaguṭavalana viśvamunaku saṃbaṃdhiṃcina vāḍu vaiśyuḍu. kṣīṇiṃcanivaḍu naruḍu vaiśyuḍu, naruḍu kanuka - kṣīṇiṃcani vaiśyuḍu kanuka vaiśvānaruḍu).

  1. viśvēnarāḥ yasyasaḥ -

(samasta jīvulanu ātmagā gāni niyamitulugā gāni kalavāḍu)

  1. viśvaścā yaṃ naraśca viśvanaraḥ

(viśvamu - prapaṃcamu - aṃdulōni naruḍu (narulu) vāṭi rūpamulu tānē ayinavāḍu).

  1. viśvēṣāṃ naraḥ (samasta vikāramulaku karta ayinavāḍu, kāraṇamainavāḍu)

  2. "vivvānnarān na yati puyapāpāṃ rūpāṃ gatiṃ sarvātmā ēva īśvarō vaiśvānaraḥ. viśvaścāyaṃ naraśca vaiśvānaraḥ sarvātmatvāt. viśvairyānaraiḥ pratyagātmatayā pratyagātmatayā pravibhajya na yata iti vaiśvānaraḥ. viśvēṣāṃ vā ayaṃ naraḥ, tadvikāra bhūtatvāt viśva prapaṃcaśca viśvēvā narāḥ jīvātmanaḥ jīvātmanaḥ asya tādātmyē nēti. viśvānarō yō ayamaṃtaḥ puruṣē yēnēda minnaṃ pacyata iti".

(viśvamulanu - prapaṃcamulōnunna narulanu puṇyapāpa rūpamulagu gatulanu poṃdiṃcuvāḍu - anniṃṭiki ātma ayinavāḍē vaiśvānaruḍu - sarvātma yaguṭavalana viśvamu naruḍu ayinavāḍu kanuka vaiśvānaruḍu - pratyagātmayaguṭavalana narulanu vēru vērugā vibhajiṃci naḍipiṃcuvāḍu - prapaṃcamula vikāramulu - vēru vēru rūpamulu tānē ayina vāḍu - a vi anniyu tādātmyamulē ayinavāḍu. puruṣuni lōpala annamunu pacanamu cēyuvāḍu - arugudalaku tagina sthitiki teccu vāḍu.

  1. "ayamagniḥ vaiśvānarō yō (a)yamaṃtaḥ puruṣē yēna midamannaṃ pacyatē yadi damadyatē".

(puruṣunilōpalanuṃḍi tinina annamunu pacanamu cēsi tinuvāḍu).

  1. jaṭharānalaḥ; udarasthaḥ agniḥ.

(kaḍupulōnuṃḍu agni - vēḍimi -, āhāramunu pacanamu cēyu śakti.)

  1. agni - (tējōrūpamu - agnyabhimāni dēvatā)

  2. vaiśvānara śabdasya viṣṇāvēna prasiddhātma śabdēna viśēṣaṇāt –

"ślō ||. ahaṃ vaiśvānarō bhūtvā prāṇināṃ dēhamāśritaḥ |

prāṇāpāna samāyuktaḥ pacāmyannaṃ caturvidhaṃ ||". (śrīmadbhagavadgīta - 15 - 14)

(vaiśvānaruḍanagā jīvātmayagu viṣṇuvēyani prasiddhi) (jīvula dēhamunāśrayiṃci prāṇavāyuvu apānavāyuvutō kalisi nālugu vidhamulaina annamunu - bhakṣya, bhōjya, lēhya, cōṣya, pānīyamulanu nālugu vidhamulaina annamunu vaiśvānaruḍanai - vaiśvānaruḍanu rūpamutō - śārīrakāṃtargatamaina uṣṇamu, tējassu, śakti (Energy)nēnē ayi tinina annamunu pacanamu cēyudunu - śarīramu aṃtaṭilōnu pravahiṃpacēsi jīrṇiṃcunaṭlu - śaktigā mārunaṭlu - cēyudunu - ani śrīmadbhagavadgītalō ceppabaḍiyunnadānini baṭṭi vaiśvānaruḍanagā viṣṇuvē ani prasiddhi).

  1. yasyāgni rāsyaṃ dyaurmūrthā khaṃ nābhiścaraṇau kṣitiḥ |

sūryaścakṣurdiśaḥ śrōtraṃ tasmai lōkātmanēnamaḥ iti śrīviṣṇupurāṇē -

yadadyatē tadannaṃ, yēna pacyatē sō(a)yaṃ puruṣē śarīrē aṃtarastī. "nakhādi śākhāṃtāvayava samudāyātmaka puruṣa śarīrē mūrthācubukāṃtāṃgāni vṛkṣē śākhāvat partiṣṭitāni tēṣu saṃpannā vaiśvānaraḥ puruṣē aṃtiḥ pratiṣṭitaḥ ityucyatē. atō yathā śakhāsthasya pakṣiṇō vṛkṣāṃ tasthaṃ tathā vaiśvānarasya puruṣāṃtasthaṃ".

(kriṃdanu kāli gōḷḷu modalu mīdanu talamīda juṭṭu varaku gala avayavamulugala puruṣuni śarīramaṃdali śirassu modalagu aṃgamulu ceṭṭu kommalavale pratiṣṭiṃpabaḍiyunnavi. aṃgamulugala puruṣa śarīramulōpala pravēśiṃci vaiśvānaruḍu anu pērutō jīvātma yunnāḍu. ceṭṭu kommalalōnunna pakṣi ceṭṭulōnunnaṭlu vaiśvānaruḍu puruṣunilōpala unnāḍu - tinabaḍunadi annamu - ā annamunu lōpala vaṃḍinaṭlu pacanamu cēyunadi vaiśvānaruḍu)

  1. "suṣuptyasahitaṃ caitanyaṃ vaiśvānarō sarva narābhimānatvāt virāṭ vividha rājamānatvāt ityucyatē".

(samaṣṭi sthūla śarīramutō kūḍina caitanyamu - cicchakti - idiyē virāṭpuruṣuḍu- anagā, ī samaṣṭi sthūla śarīramē anēka vidhamulugā, anēka rūpamulugā mārunadi. samasta jīvula śarīramulōnu "nēnu, nādi" anu abhimānamutō kūḍina śakti)

  1. samaṣṭi sthūla dēhābhimānī.

(anni jīvula samaṣṭi sthūla dēhamu nabhimāniṃcuvāḍu)

  1. viśvēṣāṃ narāṇāṃ vānaraḥ kartā - viśvēsarvē narāḥ jīvāḥ asyātmatvēna niyamya tvēna vā saṃtīti viśvānaraḥ

(narulaṃdaṟiki karta ayinavāḍu, sṛṣṭiṃcuvāḍu - ī viśvamaṃdu - prapaṃcamaṃdu narulaṃdaṟaku - jīvulaṃdaṟaku parabrahmamē ātma. atanē. atanē vāṭini niyamiṃcuvāḍu, vāṭilō nuṃḍi vāṭiki tana śaktinicci vāṭivāṭi panulu cēyiṃcu vāḍu - cēyunaṭlu prērēpiṃcuvāḍu).

  1. jāgarita sthānō bahiṃ prajñaḥ, saptāṃgaḥ, ēkōna viṃśati mukhaḥ, sthūla bhukō vaiśvānaraḥ prathamaḥ pādaḥ - (māṃḍūkyōpaniṣat)

(ātmayokka nālugu pādamulalō modaṭidi vaiśvānaruḍu jāgradavasthalō pani cēyuvāḍu - caitanyamu kaligiṃcuvāḍu - paṃdommidi mukhamulu anagā paṃca jñānēṃdriyamulu, paṃca karmēṃdriyamulu, paṃca prāṇamulu, manassu, cittamu, buddhi, ahaṃkāramu - sthūla vastuvulanu bhujiṃcuvāḍu - anubhaviṃcuvāḍu - vaiśvānaraḍē viśvuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.