వాగ్దేవతా స్థానములు - పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ.
“సకల వ్యవహారమును ప్రథమమందు సహస్రార మధ్యవర్తియగు నాడీస్థానమందు స్ఫురణశక్తి కలుగుచున్నది. పిదప నా క్రియ యే ఇంద్రియ సంబంధమైనదో యా ఇంద్రియము ప్రేరింపబడి యా ఇంద్రియముచే నా క్రియ జరుగును. గాన ఒక శబ్దము నుచ్చరించదలచినపుడు ముందు సహస్రారమందు ఇచ్ఛ జనించును. గాన నది పరావాక్కు స్థానము. పిదప వాక్కునకు వాయువు ఆధారము గాన నా శబ్దోచ్చారణ జనించిన వెంటనే అచటనుండి వ్యాపించి యున్న పరానాడీద్వారా ప్రేరణమయి మూలాధరమందు వాయువు ఉత్పన్నమగును. అది పశ్యంతీ స్థానము. ఆ వాయువు పరనాడీ ద్వారా స్వాధిష్ఠానమణిపూరకములు దాటి అనాహతమను సంవిత్కమలమును పొందినపుడు మధ్యమ యనబడును. అంతటి నుండి విశుద్ధకమలమును పొందినపుడు వైఖరీయను తేజోమయమయి స్పష్టాక్షరములు కలిగి యా శబ్దముచ్చరింపబడుచున్నది. ఈ నాలుగు స్థానములలో సహస్రారగతమైన పరాస్థానమును, మూలాధారగతమైన వాయూత్పత్తిరూప పశ్యంతిస్థానము, సంవిత్కమలమును పొందిన మధ్యమ యనునదియు - ఈ మూడు స్థానములు తేజోమయములుగాన మనుష్యులు తెలుసుకొనజాలరు. నాలుగవదియగు వైఖిరి మాత్రము సకల జనుల వ్యవహారములలో నున్నది.” –
శ్లో||. మూలాధారాత్సముత్పన్నః పరాఖ్యానామ సంభవః |
స ఏవోర్థ్వతయా నీతః స్వాధిష్ఠానే విజృంభితః |
పశ్యంత్యాఖ్యమనో వాప్నోతి తయోరూర్థ్వం శనైశ్సనైః |
అనాహతే బుద్ధి తీత్వ సమేతో మధ్యమాభిధః |
తదా తయోర్థ్వం స్థితస్సన్ విశుద్ధౌ కంఠ దేశతః |
వైఖిర్యాఖ్య ఇత్యది శ్రుతి స్మృతి సిద్ధా పరావాగ్దేవీ. ||
(వాగ్దేవి పరాఖ్య యను పేరుతో మూలాధారమందు పుట్టి, మీదకు స్వాధిష్ఠానమునకు యోగముచే తీసుకొని వెళ్ళబడి, అచ్చటపశ్యంతీ వాక్కు అని చెప్పబడును, దానిమీదకు తీసుకొని వెళ్ళబడి అనాహత చక్రమున, బుద్ధి తత్వముతోకూడిమధ్యమా యని పేరుతో చెప్పబడును - తర్వాత దానిమీదకు తీసుకొనిపోబడి విశుద్ధకమలమందు కంఠమందుండి వైఖరీ యను పేరు గలదిగా శ్రుతులలోను, స్మౄతులలోను చెప్పబడుచున్నది).
vāgdēvatā sthānamulu - parā, paśyaṃtī, madhyamā, vaikharī.
“sakala vyavahāramunu prathamamaṃdu sahasrāra madhyavartiyagu nāḍīsthānamaṃdu sphuraṇaśakti kalugucunnadi. pidapa nā kriya yē iṃdriya saṃbaṃdhamainadō yā iṃdriyamu prēriṃpabaḍi yā iṃdriyamucē nā kriya jarugunu. gāna oka śabdamu nuccariṃcadalacinapuḍu muṃdu sahasrāramaṃdu iccha janiṃcunu. gāna nadi parāvākku sthānamu. pidapa vākkunaku vāyuvu ādhāramu gāna nā śabdōccāraṇa janiṃcina veṃṭanē acaṭanuṃḍi vyāpiṃci yunna parānāḍīdvārā prēraṇamayi mūlādharamaṃdu vāyuvu utpannamagunu. adi paśyaṃtī sthānamu. ā vāyuvu paranāḍī dvārā svādhiṣṭhānamaṇipūrakamulu dāṭi anāhatamanu saṃvitkamalamunu poṃdinapuḍu madhyama yanabaḍunu. aṃtaṭi nuṃḍi viśuddhakamalamunu poṃdinapuḍu vaikharīyanu tējōmayamayi spaṣṭākṣaramulu kaligi yā śabdamuccariṃpabaḍucunnadi. ī nālugu sthānamulalō sahasrāragatamaina parāsthānamunu, mūlādhāragatamaina vāyūtpattirūpa paśyaṃtisthānamu, saṃvitkamalamunu poṃdina madhyama yanunadiyu - ī mūḍu sthānamulu tējōmayamulugāna manuṣyulu telusukonajālaru. nālugavadiyagu vaikhiri mātramu sakala janula vyavahāramulalō nunnadi.” –
ślō||. mūlādhārātsamutpannaḥ parākhyānāma saṃbhavaḥ |
sa ēvōrthvatayā nītaḥ svādhiṣṭhānē vijṛṃbhitaḥ |
paśyaṃtyākhyamanō vāpnōti tayōrūrthvaṃ śanaiśsanaiḥ |
anāhatē buddhi tītva samētō madhyamābhidhaḥ |
tadā tayōrthvaṃ sthitassan viśuddhau kaṃṭha dēśataḥ |
vaikhiryākhya ityadi śruti smṛti siddhā parāvāgdēvī. ||
(vāgdēvi parākhya yanu pērutō mūlādhāramaṃdu puṭṭi, mīdaku svādhiṣṭhānamunaku yōgamucē tīsukoni veḷḷabaḍi, accaṭapaśyaṃtī vākku ani ceppabaḍunu, dānimīdaku tīsukoni veḷḷabaḍi anāhata cakramuna, buddhi tatvamutōkūḍimadhyamā yani pērutō ceppabaḍunu - tarvāta dānimīdaku tīsukonipōbaḍi viśuddhakamalamaṃdu kaṃṭhamaṃduṃḍi vaikharī yanu pēru galadigā śrutulalōnu, smṝtulalōnu ceppabaḍucunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.