“యమాద్యాసన జయాసహఠాబ్యాసాత్ పునః పునః |
సంజాత విఘ్నబాహుల్యః అణిమాది వశాదిహ |
అలబ్థ్వాపి ఫలం సమ్యక్ పునర్భూత్వా మహాకులే |
పూర్వ వాసన యైవా యం యోగాభ్యాసం పునశ్చరన్ |
అనేక జన్మాభ్యాసేన వామదేవేనవై పథా |
సోపి ముక్తిం సమాప్నోతి తద్విష్ణో | పరమం పదం ||“. (వరాహోపనిహత్)
(ముందుగా ఆసనజయము లేనిదే మరల మరల హఠయోగము నభ్యసించినయడల అణిమాదులవలన విఘ్నములెన్నియో కలుగును - ఫలము పొందక ఈ జన్మవాసనతో మరల జన్మించి గొప్పకులమందు జన్మించి యోగాభ్యాసము చేసినచో ఇట్లనేక జన్మలలో వామదేవమార్గమునవలంభించిన వాడుకూడ నా మహావిష్ణువు యొక్క పరమపదము - ఉత్కౄష్టమైనది, గమ్యస్థానమైనది అయిన వైకుంథమును పొందును - వామదేవమనగా పిపీలికము. అది చెట్టుచివరనున్న ఫలము (పండు) వాసననుబట్తి ఆ ఫలము కొఱకు ఆ చెట్టునెక్కుట ప్రయత్నించును. కాని ఈ ప్రయత్నములో మధ్యనున్న కొమ్మలు అడ్డుపడుటవలన క్రిందకి పడిపోవుచు, మరలమరల ఇట్లు ప్రయత్నించుచు చిరకాలమునకు ఫలము సిద్ధించును - నిష్కామకర్మ యోగులకు, హఠయోగులకు పిపీలికమువలె అనేక ఆటంకములున్నందున వారిది వామదేవమార్గమని చెప్పబడినది - జ్ఞాయోగమార్గమే ఆవశ్యకము, శ్రేయస్కరము).
“yamādyāsana jayāsahaṭhābyāsāt punaḥ punaḥ |
saṃjāta vighnabāhulyaḥ aṇimādi vaśādiha |
alabthvāpi phalaṃ samyak punarbhūtvā mahākulē |
pūrva vāsana yaivā yaṃ yōgābhyāsaṃ punaścaran |
anēka janmābhyāsēna vāmadēvēnavai pathā |
sōpi muktiṃ samāpnōti tadviṣṇō | paramaṃ padaṃ ||“. (varāhōpanihat)
(muṃdugā āsanajayamu lēnidē marala marala haṭhayōgamu nabhyasiṃcinayaḍala aṇimādulavalana vighnamulenniyō kalugunu - phalamu poṃdaka ī janmavāsanatō marala janmiṃci goppakulamaṃdu janmiṃci yōgābhyāsamu cēsinacō iṭlanēka janmalalō vāmadēvamārgamunavalaṃbhiṃcina vāḍukūḍa nā mahāviṣṇuvu yokka paramapadamu - utkṝṣṭamainadi, gamyasthānamainadi ayina vaikuṃthamunu poṃdunu - vāmadēvamanagā pipīlikamu. adi ceṭṭucivaranunna phalamu (paṃḍu) vāsananubaṭti ā phalamu koṟaku ā ceṭṭunekkuṭa prayatniṃcunu. kāni ī prayatnamulō madhyanunna kommalu aḍḍupaḍuṭavalana kriṃdaki paḍipōvucu, maralamarala iṭlu prayatniṃcucu cirakālamunaku phalamu siddhiṃcunu - niṣkāmakarma yōgulaku, haṭhayōgulaku pipīlikamuvale anēka āṭaṃkamulunnaṃduna vāridi vāmadēvamārgamani ceppabaḍinadi - jñāyōgamārgamē āvaśyakamu, śrēyaskaramu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.