← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వర్ణములు varṇamulu

Original — తెలుగు
  1. జాతులు, రంగులు.

  2. జాతులు –

“బ్రాహ్మణ, క్షత్రియ, విశాం శూద్రాణాం చ పరంతప |

కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవర్గుణైః ||” (శ్రీమద్భగవద్గీత - 18 - 41)

(బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని వర్ణములు నాలుగు. వారి స్వభావమువలన కలిగిన గుణములను బట్టి వారివారి కర్మలు నిర్ణయించబడినవి)

  1. “చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః |

తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయం ||” (శ్రీమద్భగవద్గీత - 4 - 13)

(గుణములను బట్టి, కర్మలను బట్టి నాలుగు వర్ణములు నా చేత సృష్టింపబడినవి. అవ్యయుడను, అకర్తను అయినను - ఏ పనియును చేయనివాడనైనను వాటికి నేనే కర్తను - వాటిని చేసినను నేను అకర్తను అని తెలుసుకొనుము)

“గుణానామపి వైషమ్యాచ్ఛరీరారంభ కారిణాం |

న సర్వే తుల్యశీలాః స్యురిత్యాహ ప్రకృతేః పతిః |

చత్వార ఏవ వర్ణాస్తే ష్వజ్ఞః స్వార్థే విధానతః |

గుణకర్మ విభాగేన వర్ణాస్తే బ్రాహంఅణాదయః |

చత్వారో నిర్మితాః సర్గేమయా భగవతా యతః |

సత్వ ప్రథానా యే విప్రా స్తేషాం కర్మశమాదికం |

సత్వగౌణ రజోముఖ్యాః నృపాః శౌర్యాది కర్మిణః |

తమః ప్రథానాం శూద్రాస్తత్కర్మ శుశ్రూషణాదికం |

తదిదం మానుషే లోకే చాతుర్వర్ణ్యం వ్యవస్థితం |

ఏవం వైషమ్య సృష్టేస్తే కర్తృత్వాత్త త్ఫలేనచ |

సంబంధో దుర్నివారఃస్యాదిత్యతః ప్రాహ మాధవః |

వ్యవహార దృశా తస్య చాతుర్వర్ణ్యస్య సర్వశః |

కర్తారం సం తమపి మాం పరమార్థదృశా (అ)వ్యయం |

విద్ధ్యకర్తారమక్షీణ సభావ మనహం కృతిం |

నిర్వికారతయా నంతం మా జ్ఞాత్వా ముచ్యతే భయాత్ ||“. (గీతాభావప్రకాశము - 4 - 85 to 91)

(సత్వము, రజస్సు, తమస్సు, అని ప్రకృతి గుణములు మూడు. ఇవియే శరీరమునకు కారణములు. ఇవి వేరువేరుగా, హెచ్చు తక్కువగా నుండుటవలన ప్రాణులందరు వేరువేరు గుణములుగలవారుగా నున్నారు - అందరూ ఒకే శీలముగలవారు కారు. భగవంతుడనైన నేను సృష్టి ప్రారంభములో బ్రాహ్మణులు మొదలగు నాలుగు వర్ణములను వారివారి గుణములను బట్టి, కర్మలను బట్టి సృజించితిని. వారిలో సత్వగుణము ప్రధానముగా గలవారు బ్రాహ్మణులు. వారికర్మ శమము, దమము మొదలగునవి. సత్వగుణము గౌణముగానుండి రజోగుణము ముఖ్యముగా నుండువారు క్షత్రియులు. వారి కర్మ శౌర్యము మొదలగునవి. తమోగుణము గౌణముగా నుండి రజోగుణము ముఖ్యముగా నుండువారు వైశ్యులు. వారి కర్మ కృషి (వ్యవసాయము), మొదలగునవి. తమోగుణము ప్రధానముగా గలవారు శూద్రులు. వారి కర్మ శుశ్రూష (సేవ చేయుట) మొదలగునవి. ఇట్టి విషమ సృష్టి దాని ప్రకారము ఫలము నిచ్చుటను బట్టి భగవంతునికి ఉండవలసిన కర్తౄత్వము లేదు - వ్యవహారరీత్యా కర్మవలె కనబడినను భగవంతుడు నిర్వికారుడు, నిరహంకారుడు - అక్షీణస్వభావము గలవాడగుటచేత పరమార్థ సృష్టిలో కర్తకాడు.)

  1. చాతుర్వర్ణ్యం చత్వార ఏవర్ణాశ్చాతుర్వర్ణ్యం, మయా ఈశ్వరేణ సృష్టముత్పాదితం -“బ్రాహ్మణో (అ)స్య ముఖమాసీత్”

(ఋగ్వేదము - 10 - 9 - 12)

ఇత్యాది శ్రతేః. గుణకర్మ విభాగశః - గుణ విభాగశః, కర్మ విభావశః - గుణ విభాగశః, కర్మ విభాగశశ్చ, సత్వ ప్రథానస్య బ్రాహంఅణస్య శమోదమస్తపః ఇత్యాదీని కర్మాణి. సత్వోప సర్జన రజః ప్రథానస్య క్షత్రియస్య శౌర్య తేజః ప్రభృతీని కర్మాణి. తమ ఉపసర్జన రజః ప్రథాన స్య వైశ్యస్య కృష్యాదీని కర్మాణి రజ ఉపసర్జన తమః ప్రథానస్య శూద్రస్య శుశ్రూషైవ కర్మేత్యేవం గుణకర్మ విభాగశశ్చాతుర్వర్ణ్యం మయా సృష్టమిత్యర్థః ||.

(చాతుర్వర్ణ్యము అనగా నాలుగు వర్ణములు భగవంతునిచేత సృష్టించబడినవి - “ఆ పరబ్రహ్మయొక్క ముఖమునుండి బ్రాహ్మణుడు పుట్టెను -”అని శ్రుతి చెప్పుచున్నది. పరబ్రహ్మ ఆ నాలుగు వర్ణములను గుణకర్మ విభాగము చేత సృష్టించెను - అనగా, గుణవిభాగముచేత, కర్మవిభాగము చేతను సృష్టించెను. గుణములు అనగా సత్వము, రజస్సు, తమము. సత్వగుణము ప్రథానముగాగల సాత్వికుడైన బ్రాహ్మణుని కర్మలు శమము, దమము, తపస్సు మొదలగునవి. సత్వగుణము తక్కువగానుండి (అప్రధానముగానుండి) దానిని అణచియుంచిన రజోగుణము ప్రథానముగాగల క్షత్రియుని కర్మలు శౌర్యము, తేజస్సు మొదలగునవి. తమోగుణము అప్రధానమై రజోగుణము ప్రథానముగానుండు వైశ్యుని కేర్మలు కృషి - వ్యవసాయము - మొదలగునవి. రజోగుణము అప్రథానముగానుండి తమోగుణము ప్రథానముగానుండు శూద్రుని కర్మ పై మూడు వర్ణములవారికి శుశ్రూష చేయుట - అని పైన చెప్పిన ప్రకారముగా వారివారి ప్రాకృతిక గుణములను బట్టి, వారువారు చేయు కర్మలను బట్టి వర్ణములు పరమాత్మచే సృష్టించబడినవి.)

  1. “గుణైః పృథక్ ఉత్పత్తిః - సత్వేన విప్రః, సత్వరజోభ్యాం, క్షత్రియః, రజస్తమెఊభ్యాం వైశ్యః, కేవలం తమసా శూద్రః ఇతి.

(సత్వరజస్తమోగుణముల చేతనే సృష్టియగుచున్నది - సత్వగుణమువలన బ్రాహ్మణుడు, సత్వరజోగుణములు రెండింటివలనను క్షత్రియులు, రజస్తమోగుణములవలన వైశ్యులు, కేవలము తమోగుణమువలన శూద్రుడు)

  1. స్వభావ ప్రభవైః ప్రకృతి ప్రభవైః సత్వరజస్తమోభిః గుణైః స్వకార్యాను రూపేణ శమాదీని వర్ణకర్మాణి ప్రవిభకాని, బ్రాహ్మణాదీనాం శాస్త్రేణ విహితాని. శాస్త్రేణాపి బ్రాహ్మణా దీనాం సత్వాది గుణ విశేషాపేక్ష యైవ శమాదీని కర్మాణి ప్రవిభక్తాని, న గుణా నపేక్షయా ఇతి ఉచ్యతే”

(శ్రీశంకరః)

(స్వభావమువలన కలిగిన, అనగా, వారివారి ప్రకృతివలన కలిగిన సత్వరజస్తమోగుణములచేత వారివారి కార్యములకు అనుకూలమైన గుణములచేత శమము, దమము మొదలగునవి వర్ణములకు కర్మలుగా విభజించ బడినవి. బ్రాహ్మణులు మొదలగువారికి శమదమాదులు శాస్త్రములో విభజించబడిన కర్మలు - అందులోను విశేషించి వారివారి సత్వరజస్తమోగుణములను బట్టియే శాస్త్రములో కర్మలు విధించబడినవి. అంతియేకాని గుణములకు సంబంధము లేకుండునట్లుగా విధించబడి యుండలేదు).

  1. చతుర్ణాం వర్ణానాం వృత్తిభిః సహ కర్తవ్యానాం శాస్త్ర విహితానాం యజ్ఞాది కర్మణాం ప్రదర్శనార్థం ఉక్తం - యజ్ఞాదయః హి త్రయాణాం వర్ణానాంసాధారణాః శమాదయోపి త్రయాణాం వర్ణానాం - ముముక్షూణాం సాధారణాః బ్రాహ్మణస్యతు సత్వోద్రేకస్య స్వాభావికత్వేన శమదమా దయః సుఖోపాదానాః ఇతి కృత్వా తస్య శమాదయః స్వభావజం కర్మ ఇత్యుక్తం, క్షత్రియ వైశ్యయోస్తు స్వతః. రజస్తమోపాదానత్వేన శమదామాదయో దుఃఖోపాదానాః ఇతి కృత్వా నతత్కర్మ ఇత్యుక్తం. బ్రాహ్మణస్యతు వృత్తిః వ్యాజనాధ్యాపన ప్రతిగ్రహాః ; క్షత్రియస్య జనపద పరిపాలనం, వైశ్యస్య చ కృష్యాదయో యధోక్తాః, శూద్రస్య తు కర్తవ్యం వృత్తిశ్చ పూర్వవర్ణత్రయ పరిచర్యైవ (శ్రీమాన్ రామానుజః)

(నాలుగు వర్ణములకు వారివారి వృత్తులతోసహ వారు చేయవలసిన కర్మలు శాస్త్రములో విధించబడినవి. యజ్ఞములు మొదలగు కర్మలు మొదటి మూడు వర్ణములకు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యలకు, - సాధారణములు. శమదమాదులు మూడు వర్ణములకు మోక్షకాములకు సాధారణ కర్మలు - బ్రాహ్మణునకు సత్వగుణము హెచ్చుగా నుండుటవలన స్వాభావికముగ శమదమాదులు సుఖమును కలిగించునవి. అందుచేత వారికి ఆ కర్మలు స్వాభావికముగా చేయు కర్మలు అని చెప్పబడినవి. క్షత్రియులకు, వైశ్యులకు రజస్తమోగుణములవలన కలుగు స్వభావము కలవారగుటచేత ఆ కర్మలు చేయుట కష్టమగుటచేత చెప్పబడియుండలేదు. బ్రాహ్మణ వృత్తి వ్యాజన, అధ్యాపన ప్రతిగ్రహములు; క్షత్రియునకు వృత్తి ప్రజలను పరిపాలించుట, వైశ్యులకు వ్యవసాయము మొదలగునవి, శూద్రునకు పై మూడు వర్ణములకు పరిచర్య చేయుట.)

  1. క. ధరణీ దివిజులు శ్రుతులును

నరవర యమ్మేటి ముఖమునం బొడముట భూ

సురుడఖిల వర్ణములకున్

గురుడున్ ముఖ్యుండు నయ్యె, గణరత్ననిధీ.

“క. ధర బ్రాహ్మాణాధికము ద

స్కరబాదల బొంద గైకొనికావం

బురుషోత్తము బాహువులన్

నరనాధ కులంబు పుట్టె నయ తత్వనిధీ“.

“క. గణుతింపగ గృషిగోర

క్షణ వాణిజ్యాది కర్మకలితంబుగనా

గుణనిధి యూరువులందుం |

బ్రణుతింపగ వైశ్యజాతి బ్రభావంబయ్యెన్“.

తే. తివిరి సేవక ధర్ములై దేవదేవు

పదములను శూద్రసంతతులు దయమైరి

వీరలందఱు దమతమ విహిత కర్మ

మలర జేయుచు - - -. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 6 - 216 to 220)

  1. “వ. సంకర జాతులయిన రజక, చర్మకారక, నట,బురడక, కైవర్తక, మ్లేచ్చ, భిల్లురగు నంత్యజాతులేడ్వురకును, జండాల, పుల్కస, మాతంగ జాతులకును ఆయా కులాగతంబులయిన వృత్తులు చౌర్య హింసాదులు వర్జించి సంచరింప వలయును. మానవులకు ప్రతియుగంబున నైసర్గికంబులయిన ధర్మంబులు రెండు లోకంబులందును సుఖకరంబులని వేదవిదులైన పెద్దలు చెప్పుదురు. సత్వ స్వభావంబుతోడ నెప్పుడు తప్పక నిజ వంశాచార విహిత కర్మంబున వర్తించు నరుండు మెల్లన స్వాభావిక కర్మపరత్వంబు విడిచి ముక్తినొందు. జాతి మాత్రంబున పురుషునికి వర్ణంబు నిర్దేశింపం బనిలేదు. శమదమాది వర్ణలక్షణ వ్యవహారంబుల గనవలయు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 11 - 419)

  1. “ర్ణాశ్రమాశ్చ స్వకర్మనిష్టాః ప్రేత్య; కర్మఫలమనుభూయ, తతః శేషేణ విశిష్టదేశ జాతి కులధర్మ ఆయుః శ్రుతవిత్తవృత్త సుఖ మేధసో జన్మప్రతి పద్యంతే ||”. (గౌతమ ధర్మసూత్రములు - 11 - 26)

(వర్ణాశ్రమ ధర్మముల నిష్టతో అవలంభించువారు చనిపోయినతర్వాత, కర్మఫలమనుభవించి తర్వాత మిగిలిన కర్మఫలముగా విశిష్టమైన దేశమునందు, విశిష్ట కులమునందు, ఆయుర్దాయము, విశిష్టధనము, సుఖము, బుద్ధి గలజన్మల నొందుదురు.)

  1. “చతుర్వర్ణ మయో లోకః” (రఘువంశము)

(ఈ లోకము నాలుగు వర్ణములవారితోను నిండి యున్నది)

  1. వర్ణ్యంతే కపిలారుణా పీత కృష్ణ వర్ణైః నిరూప్యంతే ఇతి వర్ణాః.

(కపిల, అరుణ, పీత, కృష్ణ వర్ణములచేత నిరూపించబడుచున్నవి, కనుక వర్ణములని చెప్పబడుచున్నవి. రంగులలో తెలుపు, ఎఱుపు, నలుపు, ముఖ్యమైనవి. మిగిలిన రంగులు ఈ మూడు రంగులు మిశ్రమించుటవలన కలిగినవే - (eg. If red and yellow together be, orange is the colour we see). ముఖ్యమైన ఈ మూడు రంగులు ప్రకృతియొక్క మూడు గుణములయిన సత్వ రజస్తమములను తెలియచేయును - తెలుపు సత్వగుణమును, ఎఱుపు రజోగుణమును, నలుపు తమోగుణమును సూచించును.)

(వర్ణము అను పదమునకు - మాటకు - వ్యుత్పత్యర్థము ఈ క్రిందవిధముగా నున్నది - వృ = వరించుట, ఎన్నుకొనుట, కోరుకొనుట. ‘రం’ = రమణ. ఈ రెండు కలిసిన ‘వర్ణ’ మగును.- దీని యర్థము వారివారి స్వభావముననుసరించి ఎన్నుకొని లేక కోరుకొని తెచ్చుకొనునది. ప్రాణులు ఏయే రంగులందు అభిమానము కలిగియుందురో ఆయా రంగులకు సంబంధించిన త్రిగుణముల పాళ్ళతో కూడిన జన్మను పొందుచున్నారు. ఈ వర్ణ భేదము చెట్లలోను, పక్షులలోను, పశువులలోను, మానవులలోను కూడ కనబడుచున్నది, దీనిని బట్టి సృష్టి అంతటిలోను కూడ కనబడుచున్నది - “యదగ్నే రోహితం రూపం తేజస్తద్రూపం, యచ్ఛుక్లం తదపాం, యత్కృష్ణం తదన్యస్య” (ఛాందోగ్యోపనిషత్). (అగ్నియందు కనబడు రక్తవర్ణము, తేజస్సు, తెలుపు జలము యొక్క రూపము, నలుపు ఇతరము భూమి యొక్క నలుపు)

  1. “వర్ణ్యంతే ఇతి వర్ణాః ద్రవ్య ధర్మాః -” (ద్రవ్యము ఏ రంగు గలదో వర్ణింపబడుచున్నది కనుక వర్ణములు)

  2. వర్ణములనగా అక్షరములు - అ కారము మొదలు క్షకారమువరకు గల అక్షరములు - “అక్షాంత వర్ణాశ్రయం”

(శ్రీరామకర్ణామృతం - 2 - 15)

(అకారము మొదలు క్షకారము వరకు గల అక్షరములనాశ్రయించి యుండువాడు - లేక అకారము మొదలు క్షకారమువరకు గల అక్షరములకాశ్రయమైనవాడు) “అక్షాంతవర్ణం” (శ్రీరామకర్ణామృతం - 2 - 3)

అకారము మొదలు క్షకారమువరకు గల అక్షరరూపమైనవాడు - అక్షరములు తానే అయినవాడు. అక్షరములన్నింటిలోను భగవదంశ - భగవంతుని శక్తి యున్నదని దీనివలన తెలియుచున్నది. ప్రతి అక్షరములోను భగవంతుని శక్తి యున్నదికనుక వాటి కలియుటవలన ఏర్పడిన పదములకు, ఆ పదములతో కూడిన మంత్రములకు భగవంతుని శక్తి కలదనియు కూడ తెలియుచున్నది. అందుచేతనే కొన్ని మంత్రములు - ఆశీర్వచనముకాని, శాపము గాని దాని ఫలితము నిచ్చుచున్నవి - ఇట్లు చేయుటకు వాటినుచ్చరించువారి చిత్తశుద్ధి, వాక్సుద్ధి తోడ్పడవలయును “ఆ ఇతి బ్రహ్మ”, “ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ”, “కం బ్రహ్మ”.

  1. అకారాదిః త్రిషష్టిః - అష్టౌ స్థానాని వర్ణానా మురః, కంఠశ్శిరస్తధా |

జిహ్వామూలంచ, దంతాశ్చ నాసికోష్టౌచ తాలుచ ||.

(వర్ణములకు - అక్షరములకు, అవి పలుకుటకు స్థానములు ఎనిమిది - వక్షస్థలము, కంఠము, శిరస్సు, జిహ్వగ్రము, దంతములు, నాసిక, జీష్టము, తాలువు - కంఠ్యములు (కవర్గు), తాలవ్యములు (చవర్గు), దంత్యములు (తవర్గు), అంతఃస్థములు (యరలవ), ఊష్మములు (శషసహ), అనునాసికములు (ఙ ఞ ణ న మ); కంఠతాయివులు (ఎ ఏ ఐ), కంటోష్ఠములు (ఒ, ఓ, ఔ). శరీరములోని కుండలినీ శక్తి వాయువుతో కలిసి ఆ యా స్థలములనుండి వచ్చునపుడు ఆ అక్షరములు పలుకబడుచున్నవి. (linguals, dentals, paletals, etc.)

Transliteration
  1. jātulu, raṃgulu.

  2. jātulu –

“brāhmaṇa, kṣatriya, viśāṃ śūdrāṇāṃ ca paraṃtapa |

karmāṇi pravibhaktāni svabhāva prabhavarguṇaiḥ ||” (śrīmadbhagavadgīta - 18 - 41)

(brāhmaṇulu, kṣatriyulu, vaiśyulu, śūdrulu ani varṇamulu nālugu. vāri svabhāvamuvalana kaligina guṇamulanu baṭṭi vārivāri karmalu nirṇayiṃcabaḍinavi)

  1. “cāturvarṇyaṃ mayā sṛṣṭaṃ guṇakarma vibhāgaśaḥ |

tasya kartāramapi māṃ viddhyakartāramavyayaṃ ||” (śrīmadbhagavadgīta - 4 - 13)

(guṇamulanu baṭṭi, karmalanu baṭṭi nālugu varṇamulu nā cēta sṛṣṭiṃpabaḍinavi. avyayuḍanu, akartanu ayinanu - ē paniyunu cēyanivāḍanainanu vāṭiki nēnē kartanu - vāṭini cēsinanu nēnu akartanu ani telusukonumu)

“guṇānāmapi vaiṣamyāccharīrāraṃbha kāriṇāṃ |

na sarvē tulyaśīlāḥ syurityāha prakṛtēḥ patiḥ |

catvāra ēva varṇāstē ṣvajñaḥ svārthē vidhānataḥ |

guṇakarma vibhāgēna varṇāstē brāhaṃaṇādayaḥ |

catvārō nirmitāḥ sargēmayā bhagavatā yataḥ |

satva prathānā yē viprā stēṣāṃ karmaśamādikaṃ |

satvagauṇa rajōmukhyāḥ nṛpāḥ śauryādi karmiṇaḥ |

tamaḥ prathānāṃ śūdrāstatkarma śuśrūṣaṇādikaṃ |

tadidaṃ mānuṣē lōkē cāturvarṇyaṃ vyavasthitaṃ |

ēvaṃ vaiṣamya sṛṣṭēstē kartṛtvātta tphalēnaca |

saṃbaṃdhō durnivāraḥsyādityataḥ prāha mādhavaḥ |

vyavahāra dṛśā tasya cāturvarṇyasya sarvaśaḥ |

kartāraṃ saṃ tamapi māṃ paramārthadṛśā (a)vyayaṃ |

viddhyakartāramakṣīṇa sabhāva manahaṃ kṛtiṃ |

nirvikāratayā naṃtaṃ mā jñātvā mucyatē bhayāt ||“. (gītābhāvaprakāśamu - 4 - 85 to 91)

(satvamu, rajassu, tamassu, ani prakṛti guṇamulu mūḍu. iviyē śarīramunaku kāraṇamulu. ivi vēruvērugā, heccu takkuvagā nuṃḍuṭavalana prāṇulaṃdaru vēruvēru guṇamulugalavārugā nunnāru - aṃdarū okē śīlamugalavāru kāru. bhagavaṃtuḍanaina nēnu sṛṣṭi prāraṃbhamulō brāhmaṇulu modalagu nālugu varṇamulanu vārivāri guṇamulanu baṭṭi, karmalanu baṭṭi sṛjiṃcitini. vārilō satvaguṇamu pradhānamugā galavāru brāhmaṇulu. vārikarma śamamu, damamu modalagunavi. satvaguṇamu gauṇamugānuṃḍi rajōguṇamu mukhyamugā nuṃḍuvāru kṣatriyulu. vāri karma śauryamu modalagunavi. tamōguṇamu gauṇamugā nuṃḍi rajōguṇamu mukhyamugā nuṃḍuvāru vaiśyulu. vāri karma kṛṣi (vyavasāyamu), modalagunavi. tamōguṇamu pradhānamugā galavāru śūdrulu. vāri karma śuśrūṣa (sēva cēyuṭa) modalagunavi. iṭṭi viṣama sṛṣṭi dāni prakāramu phalamu niccuṭanu baṭṭi bhagavaṃtuniki uṃḍavalasina kartṝtvamu lēdu - vyavahārarītyā karmavale kanabaḍinanu bhagavaṃtuḍu nirvikāruḍu, nirahaṃkāruḍu - akṣīṇasvabhāvamu galavāḍaguṭacēta paramārtha sṛṣṭilō kartakāḍu.)

  1. cāturvarṇyaṃ catvāra ēvarṇāścāturvarṇyaṃ, mayā īśvarēṇa sṛṣṭamutpāditaṃ -“brāhmaṇō (a)sya mukhamāsīt”

(ṛgvēdamu - 10 - 9 - 12)

ityādi śratēḥ. guṇakarma vibhāgaśaḥ - guṇa vibhāgaśaḥ, karma vibhāvaśaḥ - guṇa vibhāgaśaḥ, karma vibhāgaśaśca, satva prathānasya brāhaṃaṇasya śamōdamastapaḥ ityādīni karmāṇi. satvōpa sarjana rajaḥ prathānasya kṣatriyasya śaurya tējaḥ prabhṛtīni karmāṇi. tama upasarjana rajaḥ prathāna sya vaiśyasya kṛṣyādīni karmāṇi raja upasarjana tamaḥ prathānasya śūdrasya śuśrūṣaiva karmētyēvaṃ guṇakarma vibhāgaśaścāturvarṇyaṃ mayā sṛṣṭamityarthaḥ ||.

(cāturvarṇyamu anagā nālugu varṇamulu bhagavaṃtunicēta sṛṣṭiṃcabaḍinavi - “ā parabrahmayokka mukhamunuṃḍi brāhmaṇuḍu puṭṭenu -”ani śruti ceppucunnadi. parabrahma ā nālugu varṇamulanu guṇakarma vibhāgamu cēta sṛṣṭiṃcenu - anagā, guṇavibhāgamucēta, karmavibhāgamu cētanu sṛṣṭiṃcenu. guṇamulu anagā satvamu, rajassu, tamamu. satvaguṇamu prathānamugāgala sātvikuḍaina brāhmaṇuni karmalu śamamu, damamu, tapassu modalagunavi. satvaguṇamu takkuvagānuṃḍi (apradhānamugānuṃḍi) dānini aṇaciyuṃcina rajōguṇamu prathānamugāgala kṣatriyuni karmalu śauryamu, tējassu modalagunavi. tamōguṇamu apradhānamai rajōguṇamu prathānamugānuṃḍu vaiśyuni kērmalu kṛṣi - vyavasāyamu - modalagunavi. rajōguṇamu aprathānamugānuṃḍi tamōguṇamu prathānamugānuṃḍu śūdruni karma pai mūḍu varṇamulavāriki śuśrūṣa cēyuṭa - ani paina ceppina prakāramugā vārivāri prākṛtika guṇamulanu baṭṭi, vāruvāru cēyu karmalanu baṭṭi varṇamulu paramātmacē sṛṣṭiṃcabaḍinavi.)

  1. “guṇaiḥ pṛthak utpattiḥ - satvēna vipraḥ, satvarajōbhyāṃ, kṣatriyaḥ, rajastameūbhyāṃ vaiśyaḥ, kēvalaṃ tamasā śūdraḥ iti.

(satvarajastamōguṇamula cētanē sṛṣṭiyagucunnadi - satvaguṇamuvalana brāhmaṇuḍu, satvarajōguṇamulu reṃḍiṃṭivalananu kṣatriyulu, rajastamōguṇamulavalana vaiśyulu, kēvalamu tamōguṇamuvalana śūdruḍu)

  1. svabhāva prabhavaiḥ prakṛti prabhavaiḥ satvarajastamōbhiḥ guṇaiḥ svakāryānu rūpēṇa śamādīni varṇakarmāṇi pravibhakāni, brāhmaṇādīnāṃ śāstrēṇa vihitāni. śāstrēṇāpi brāhmaṇā dīnāṃ satvādi guṇa viśēṣāpēkṣa yaiva śamādīni karmāṇi pravibhaktāni, na guṇā napēkṣayā iti ucyatē”

(śrīśaṃkaraḥ)

(svabhāvamuvalana kaligina, anagā, vārivāri prakṛtivalana kaligina satvarajastamōguṇamulacēta vārivāri kāryamulaku anukūlamaina guṇamulacēta śamamu, damamu modalagunavi varṇamulaku karmalugā vibhajiṃca baḍinavi. brāhmaṇulu modalaguvāriki śamadamādulu śāstramulō vibhajiṃcabaḍina karmalu - aṃdulōnu viśēṣiṃci vārivāri satvarajastamōguṇamulanu baṭṭiyē śāstramulō karmalu vidhiṃcabaḍinavi. aṃtiyēkāni guṇamulaku saṃbaṃdhamu lēkuṃḍunaṭlugā vidhiṃcabaḍi yuṃḍalēdu).

  1. caturṇāṃ varṇānāṃ vṛttibhiḥ saha kartavyānāṃ śāstra vihitānāṃ yajñādi karmaṇāṃ pradarśanārthaṃ uktaṃ - yajñādayaḥ hi trayāṇāṃ varṇānāṃsādhāraṇāḥ śamādayōpi trayāṇāṃ varṇānāṃ - mumukṣūṇāṃ sādhāraṇāḥ brāhmaṇasyatu satvōdrēkasya svābhāvikatvēna śamadamā dayaḥ sukhōpādānāḥ iti kṛtvā tasya śamādayaḥ svabhāvajaṃ karma ityuktaṃ, kṣatriya vaiśyayōstu svataḥ. rajastamōpādānatvēna śamadāmādayō duḥkhōpādānāḥ iti kṛtvā natatkarma ityuktaṃ. brāhmaṇasyatu vṛttiḥ vyājanādhyāpana pratigrahāḥ ; kṣatriyasya janapada paripālanaṃ, vaiśyasya ca kṛṣyādayō yadhōktāḥ, śūdrasya tu kartavyaṃ vṛttiśca pūrvavarṇatraya paricaryaiva (śrīmān rāmānujaḥ)

(nālugu varṇamulaku vārivāri vṛttulatōsaha vāru cēyavalasina karmalu śāstramulō vidhiṃcabaḍinavi. yajñamulu modalagu karmalu modaṭi mūḍu varṇamulaku - brāhmaṇa, kṣatriya, vaiśyalaku, - sādhāraṇamulu. śamadamādulu mūḍu varṇamulaku mōkṣakāmulaku sādhāraṇa karmalu - brāhmaṇunaku satvaguṇamu heccugā nuṃḍuṭavalana svābhāvikamuga śamadamādulu sukhamunu kaligiṃcunavi. aṃducēta vāriki ā karmalu svābhāvikamugā cēyu karmalu ani ceppabaḍinavi. kṣatriyulaku, vaiśyulaku rajastamōguṇamulavalana kalugu svabhāvamu kalavāraguṭacēta ā karmalu cēyuṭa kaṣṭamaguṭacēta ceppabaḍiyuṃḍalēdu. brāhmaṇa vṛtti vyājana, adhyāpana pratigrahamulu; kṣatriyunaku vṛtti prajalanu paripāliṃcuṭa, vaiśyulaku vyavasāyamu modalagunavi, śūdrunaku pai mūḍu varṇamulaku paricarya cēyuṭa.)

  1. ka. dharaṇī divijulu śrutulunu

naravara yammēṭi mukhamunaṃ boḍamuṭa bhū

suruḍakhila varṇamulakun

guruḍun mukhyuṃḍu nayye, gaṇaratnanidhī.

“ka. dhara brāhmāṇādhikamu da

skarabādala boṃda gaikonikāvaṃ

buruṣōttamu bāhuvulan

naranādha kulaṃbu puṭṭe naya tatvanidhī”.

“ka. gaṇutiṃpaga gṛṣigōra

kṣaṇa vāṇijyādi karmakalitaṃbuganā

guṇanidhi yūruvulaṃduṃ |

braṇutiṃpaga vaiśyajāti brabhāvaṃbayyen”.

tē. tiviri sēvaka dharmulai dēvadēvu

padamulanu śūdrasaṃtatulu dayamairi

vīralaṃdaṟu damatama vihita karma

malara jēyucu - - -. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 6 - 216 to 220)

  1. “va. saṃkara jātulayina rajaka, carmakāraka, naṭa,buraḍaka, kaivartaka, mlēcca, bhilluragu naṃtyajātulēḍvurakunu, jaṃḍāla, pulkasa, mātaṃga jātulakunu āyā kulāgataṃbulayina vṛttulu caurya hiṃsādulu varjiṃci saṃcariṃpa valayunu. mānavulaku pratiyugaṃbuna naisargikaṃbulayina dharmaṃbulu reṃḍu lōkaṃbulaṃdunu sukhakaraṃbulani vēdavidulaina peddalu ceppuduru. satva svabhāvaṃbutōḍa neppuḍu tappaka nija vaṃśācāra vihita karmaṃbuna vartiṃcu naruṃḍu mellana svābhāvika karmaparatvaṃbu viḍici muktinoṃdu. jāti mātraṃbuna puruṣuniki varṇaṃbu nirdēśiṃpaṃ banilēdu. śamadamādi varṇalakṣaṇa vyavahāraṃbula ganavalayu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 11 - 419)

  1. “rṇāśramāśca svakarmaniṣṭāḥ prētya; karmaphalamanubhūya, tataḥ śēṣēṇa viśiṣṭadēśa jāti kuladharma āyuḥ śrutavittavṛtta sukha mēdhasō janmaprati padyaṃtē ||”. (gautama dharmasūtramulu - 11 - 26)

(varṇāśrama dharmamula niṣṭatō avalaṃbhiṃcuvāru canipōyinatarvāta, karmaphalamanubhaviṃci tarvāta migilina karmaphalamugā viśiṣṭamaina dēśamunaṃdu, viśiṣṭa kulamunaṃdu, āyurdāyamu, viśiṣṭadhanamu, sukhamu, buddhi galajanmala noṃduduru.)

  1. “caturvarṇa mayō lōkaḥ” (raghuvaṃśamu)

(ī lōkamu nālugu varṇamulavāritōnu niṃḍi yunnadi)

  1. varṇyaṃtē kapilāruṇā pīta kṛṣṇa varṇaiḥ nirūpyaṃtē iti varṇāḥ.

(kapila, aruṇa, pīta, kṛṣṇa varṇamulacēta nirūpiṃcabaḍucunnavi, kanuka varṇamulani ceppabaḍucunnavi. raṃgulalō telupu, eṟupu, nalupu, mukhyamainavi. migilina raṃgulu ī mūḍu raṃgulu miśramiṃcuṭavalana kaliginavē - (eg. If red and yellow together be, orange is the colour we see). mukhyamaina ī mūḍu raṃgulu prakṛtiyokka mūḍu guṇamulayina satva rajastamamulanu teliyacēyunu - telupu satvaguṇamunu, eṟupu rajōguṇamunu, nalupu tamōguṇamunu sūciṃcunu.)

(varṇamu anu padamunaku - māṭaku - vyutpatyarthamu ī kriṃdavidhamugā nunnadi - vṛ = variṃcuṭa, ennukonuṭa, kōrukonuṭa. ‘raṃ’ = ramaṇa. ī reṃḍu kalisina ‘varṇa’ magunu.- dīni yarthamu vārivāri svabhāvamunanusariṃci ennukoni lēka kōrukoni teccukonunadi. prāṇulu ēyē raṃgulaṃdu abhimānamu kaligiyuṃdurō āyā raṃgulaku saṃbaṃdhiṃcina triguṇamula pāḷḷatō kūḍina janmanu poṃducunnāru. ī varṇa bhēdamu ceṭlalōnu, pakṣulalōnu, paśuvulalōnu, mānavulalōnu kūḍa kanabaḍucunnadi, dīnini baṭṭi sṛṣṭi aṃtaṭilōnu kūḍa kanabaḍucunnadi - “yadagnē rōhitaṃ rūpaṃ tējastadrūpaṃ, yacchuklaṃ tadapāṃ, yatkṛṣṇaṃ tadanyasya” (chāṃdōgyōpaniṣat). (agniyaṃdu kanabaḍu raktavarṇamu, tējassu, telupu jalamu yokka rūpamu, nalupu itaramu bhūmi yokka nalupu)

  1. “varṇyaṃtē iti varṇāḥ dravya dharmāḥ -” (dravyamu ē raṃgu galadō varṇiṃpabaḍucunnadi kanuka varṇamulu)

  2. varṇamulanagā akṣaramulu - a kāramu modalu kṣakāramuvaraku gala akṣaramulu - “akṣāṃta varṇāśrayaṃ”

(śrīrāmakarṇāmṛtaṃ - 2 - 15)

(akāramu modalu kṣakāramu varaku gala akṣaramulanāśrayiṃci yuṃḍuvāḍu - lēka akāramu modalu kṣakāramuvaraku gala akṣaramulakāśrayamainavāḍu) “akṣāṃtavarṇaṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 3)

akāramu modalu kṣakāramuvaraku gala akṣararūpamainavāḍu - akṣaramulu tānē ayinavāḍu. akṣaramulanniṃṭilōnu bhagavadaṃśa - bhagavaṃtuni śakti yunnadani dīnivalana teliyucunnadi. prati akṣaramulōnu bhagavaṃtuni śakti yunnadikanuka vāṭi kaliyuṭavalana ērpaḍina padamulaku, ā padamulatō kūḍina maṃtramulaku bhagavaṃtuni śakti kaladaniyu kūḍa teliyucunnadi. aṃducētanē konni maṃtramulu - āśīrvacanamukāni, śāpamu gāni dāni phalitamu niccucunnavi - iṭlu cēyuṭaku vāṭinuccariṃcuvāri cittaśuddhi, vāksuddhi tōḍpaḍavalayunu “ā iti brahma”, “ōṃ ityēkākṣaraṃ brahma”, “kaṃ brahma”.

  1. akārādiḥ triṣaṣṭiḥ - aṣṭau sthānāni varṇānā muraḥ, kaṃṭhaśśirastadhā |

jihvāmūlaṃca, daṃtāśca nāsikōṣṭauca tāluca ||.

(varṇamulaku - akṣaramulaku, avi palukuṭaku sthānamulu enimidi - vakṣasthalamu, kaṃṭhamu, śirassu, jihvagramu, daṃtamulu, nāsika, jīṣṭamu, tāluvu - kaṃṭhyamulu (kavargu), tālavyamulu (cavargu), daṃtyamulu (tavargu), aṃtaḥsthamulu (yaralava), ūṣmamulu (śaṣasaha), anunāsikamulu (ṅa ña ṇa na ma); kaṃṭhatāyivulu (e ē ai), kaṃṭōṣṭhamulu (o, ō, au). śarīramulōni kuṃḍalinī śakti vāyuvutō kalisi ā yā sthalamulanuṃḍi vaccunapuḍu ā akṣaramulu palukabaḍucunnavi. (linguals, dentals, paletals, etc.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.