← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వర్థిష్ణువు varthiṣṇuvu

Original — తెలుగు
  1. వృద్ధిపొందు స్వభావముగలవాడు విష్ణువు వ్యాపకశీలుడు - వ్యాపించి వృద్ధిపొందువాడు - ఒక చిన్న విత్తనము మహావృక్షమువలె పెరిగి పెద్దదైనట్లు చేయువాడు, ఒక చిన్నపిల్లడు పెరిగి పెద్దవాడైనట్లు చేయువాడు. సృష్ట్యాదిని తానొకడే అయినను సృష్టి చేయుటలో తానే అనేక రూపములతో, అనేక నామములతో వృద్ధి పొందువాడు. వామనావతారములో ఒక పొట్టి వడుగు ఆకారముతో పుట్టి లోకములన్నింటిని చూచుచుండగనే ఆక్రమించగలిగినట్లుగా వ్యాపించినవాడు - వృద్ధిపొందినవాడు - తాను పుట్టించిన ప్రతివస్తువులోను ప్రవేశించి, దానిలో పూర్తిగా వ్యాపించియుండువాడు -

  2. శా. ఇంతింతై వటుడింతయై మఱియు దానింతై, నభోవీధిపై

నంతై తోయదమండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై

నంతై, చంద్రుని కంతయై, ధృవునిపైనంతై మహర్వాటి పై

నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 20 - 622)

Transliteration
  1. vṛddhipoṃdu svabhāvamugalavāḍu viṣṇuvu vyāpakaśīluḍu - vyāpiṃci vṛddhipoṃduvāḍu - oka cinna vittanamu mahāvṛkṣamuvale perigi peddadainaṭlu cēyuvāḍu, oka cinnapillaḍu perigi peddavāḍainaṭlu cēyuvāḍu. sṛṣṭyādini tānokaḍē ayinanu sṛṣṭi cēyuṭalō tānē anēka rūpamulatō, anēka nāmamulatō vṛddhi poṃduvāḍu. vāmanāvatāramulō oka poṭṭi vaḍugu ākāramutō puṭṭi lōkamulanniṃṭini cūcucuṃḍaganē ākramiṃcagaliginaṭlugā vyāpiṃcinavāḍu - vṛddhipoṃdinavāḍu - tānu puṭṭiṃcina prativastuvulōnu pravēśiṃci, dānilō pūrtigā vyāpiṃciyuṃḍuvāḍu -

  2. śā. iṃtiṃtai vaṭuḍiṃtayai maṟiyu dāniṃtai, nabhōvīdhipai

naṃtai tōyadamaṃḍalāgramuna kallaṃtai, prabhārāśipai

naṃtai, caṃdruni kaṃtayai, dhṛvunipainaṃtai maharvāṭi pai

naṃtai satyapadōnnatuṃḍagucu brahmāṃḍāṃta saṃvardhiyai. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 20 - 622)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.