(సంస్కారమును బట్టి పుణ్యపాపములు చేయుట జరుగుచుండును. అందుచేత మనిషియొక్క అభిరుచిని బట్టి పుణ్యాపుణ్య సంస్కారము అనుమానింపబడును - అదియే స్వభావము, ప్రకృతి, లేక వాసన యని చెప్పబడుచున్నది).
చిత్త శబ్దస్తు పర్యాయో వాసనా యా ఉదాహృతః ||.
(వాసన అనగా చిత్తముయొక్క స్వరూపము - చిత్తము అను మాటకు వాసన యను పదము పర్యాయపదము - చిత్తమన్నను, అహంకారమన్నను బుద్ధియన్నను, మనస్సు అన్నను వాసనయే, వేరుకాదు).
కారణశరీరము.
అబుద్ధి పూర్వక ప్రవృత్తి హేతుః సంస్కార విశేషో వాసనా - సాచ అజ్ఞాన వాసనా, కర్మవాసనా, ప్రకృతి సంబంధివాసనా చ ఇతి త్రిప్రకారా.
(బుద్ధిపూర్వకముగా కాక చేయు పనులలో ప్రేరేపణ కలుగుటకు కారణమైన సంస్కార విశేషము - అది అజ్ఞానవాసన, కర్మవాసనా, ప్రకృతికి సంబంధించిన వాసనా యని మూదు విధములు)
లోకవాసనా, దేహవాసన, శాస్త్రవాసన అని వాసన మూడు విధములు).
యథా పదార్థశక్తీనాం సంభుక్తానామివాంబరే | వసత్యస్తమితాన్యేహ వాసనేతి తధోచ్యతే ||. (యోగవాశిష్టము - 90 - 24)
(అనుభవించిన పదార్థముయొక్క సూక్ష్మ శక్తులు గలిగి భావనా రూపమున ఆకాశమువలె సూక్ష్మమై సూక్ష్మ చేష్టా సహితమై యుండునపుడు ఆ చైతన్యమే వాసనయని చెప్పబడును.)
మనస్సులో ఏదైన పనిచేయుటకు ప్రోద్బలము చేసి ఆ పనిని చేయించునది వాసన.
“ధృఢ భావనయా త్యక్త్వా పూర్వాపర విచారణం |
యథా దానం పదార్థస్య వాసనా సా ప్రకీర్తితా ||“.
(ముందువెనుకల నాలోచించక దృఢమైన భావనతో ఏ దైనా పదార్థమును చేసిన అది వాసన యనబడును).
విషయములందు మనస్సునకు కలుగు సంస్కారము వాసన. విషయములయడల మనస్సునకు కలుగు సంకల్పములు మనస్సునంటి యుండి ఎప్పటికిని విడిచిపోకుండనుండును - ఇవియే వాసనలు - ఇవియే దేశకాలానుగుణముగ పనులను చేయించు చుండును. విషయములనేకములగుటచేత వాసనలు కూడ అనేకములు - పాపపుణ్యకర్మలకు మూలము, బీజము వాసన. ఇదియే స్వభావము. క్రియలే జననమరణరూపమైన సంసారమునకు కారణము - క్రియలకు మూలము సంకల్పము - అదియే వాసన, అందుచేత సంసారమునకదియే మూలము.
“వాసనా ఏవ సంసారః ఇతి సర్వా విముంచతాః |
తత్త్యాగో వాసనా త్యాగాత్ స్థితిరవ్య యధా తథా ||“. (అష్టావక్రగీత - 9 - 8)
(వాసనయే సంసారము - అందుచేత వాసనలను వదలివేయుము. వాసనలను వదలివేసిన అవ్యయస్థితి కలుగును.)
వాసనాస్త్వం పరిత్యజ్య మోక్షార్థిత్వమపి త్యజః ||“. (యోగవాశిష్టము - )
(వాసన బంధము - వాసనాక్షయమే మోక్షము).
అందుచేత వాసనలను వదలివేయుము - వాసనలను వదలివేసి మోక్షమందు కోరికను కూడ వదలివేయుము -)
క్షీణాయాం శీతసంతత్యాం బ్రహ్మాన్ హిమకణో యథా ||“. (యోగవాశిష్టము - 3 - 9)
(శీతకాలము అయిపోయిననే మంచు తుంపరులు పోవునట్లు వాసనలు క్షీణించగా మనస్సు లయమై పోవును)
తననాంతర్ని విష్టేన ముక్తా ఘ స్తంతునా యథా ||“.
(ముత్యములు వాటిలోన గ్రుచ్చబడిన దారమువలన ధరింపబడినట్లు పంచభూతమయమైన శరీరము అను పంజరము వాసనవలన నిలబడియున్నది.)
మోక్ష ఇత్యుచ్యతే, బ్రహ్మాన్, స ఏవ విమల క్రమః ||“. (యోగవాశిష్టము - 3 - 8)
(వాసనలన్నింటిని వదలివేయుటయే మోక్షము.)
మునే, తధైవ తిష్ఠామి కృపణం కిం కరోమ్యహం ||“.
(“గడచిన జన్మలలో కలిగిన వాసనలు - పుణ్యపాపరూపములైన కర్మలవలన అలవడిన సంస్కారము - నన్ను ఎట్లు ఎట్టిపనులలో నియమించునో అట్లే చేయుచున్నాను. వేరు విధముగా నేనేమి చేయగలను?” అని శ్రీరామును వచనము
“అత ఏవహి, హేరామ, శ్రేయః ప్రాప్నోతి శాశ్వతం |
స్వప్రయత్నోపనాకేన పౌరుషేణైవ నాన్యథా |
ద్వివిధో వాసనా వ్యూహ రభశ్చైవ శుభశ్చతే |
ప్రాక్తనోవిద్యతే, రామ, ద్వయో కేతరో ధవా ||“.
(శ్రీరాముని ప్రశ్నకు సమాధానము ఈ క్రింద విధముగా నున్నది : -
స్వప్రయత్నము లేక, పౌరుషము - పురుషప్రయత్నము - చేసి శాశ్వతమైన శ్రేయస్సును పొందనగును.
“తస్మాద్వాసన యా బద్ధం ముక్తం నిర్వాసనం మనః |
సమ్యగాలోకనాత్సత్యా వాసనా ప్రవిలీయతే |
వాసనా విలయాత్ చేతః శమమాయాతి దీసవత్ ||”
(అందుచేత వసన వలన బంధము కలుగును. వాసనలు వదలిపోయిన ముక్తి కలుగును - పరమాత్మధ్యానమువలన వాసన లయమై పోవును - వాసన లభియించిన దీపమువలె శమము కలుగును - శాంతి కలుగును).
(పూవుల దండలు, మంచిగంధము - చందనము - కస్తూరి మొదలగు వాసన ద్రవ్యములనుండి వాటి వాటి ప్రదేశములనుండి వాటివాటి వాసనను సూక్ష్మావయములతో సహ తీసుకొని వాయువు ఇతర ప్రదేశములకు ఆ వాసనను తీసుకొని పోవునట్లు జీవుడు ఏ శరీరమునుండి వీడి పోవునో ఆ శరీరమునకు సంబంధించిన సూక్ష్మ పంచభూతములను, సూక్ష్మేంద్రియములతో కూడ ఇంకొక శరీరమునకు తీసుకొని పోవును. వాటితోనే వాసనలను కూడ తీసుకొని పోవును -).
(గంధములను - వాసనలను వాటికి ఆశ్రయములైన పుష్పములు, చందనము, కస్తూరి మొదలగు వాసన ద్రవ్యములనుండి వాయువు తనతో ఏట్లు తీసుకొని పోవునో ఆ ప్రకారముగానే ఈశ్వరుడు - దేహమునకు నాధుడైన జీవుడు - ఎప్పుడు దేనినుండి విడిపోవునో, అప్పుడు ఆ వీడిపోయిన శరీరము (సూక్ష్మరూపములో నున్నవాటిని) తనతో తీసుకొని పోవును.)
(ఈ స్థూలశరీరముకంటె నదృష్ట గుణంబై యశ్రుతంబైన వస్తువగుటం జేసి వ్యక్తంబుగాక సూక్ష్మంబై కరచరణాదులు లేక జీవునికి నొండొకరూపము విరచితమైయుండు సూక్ష్ముండై జీవునివలన నుత్క్రాంతి గమనాగమనంబుల బునర్జన్మంబు దోచు)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 3 - 65)
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ||“. (శ్రీమద్భగవద్గీత - 3 - 33)
శ్రుణు సాగ్జన్మ సంస్కారో ధర్మాధర్మైక గోచరః |
వర్తమాన భవే వ్యక్తః సర్వతో బలవాంశ్చ యః |
ప్రకృతిః సా స్వకీయా యాస్త స్యాః సదృశమేవ హి |
సర్వోపి గుణదోషజ్ఞశ్చేష్టతే కి ముమూఢధీః |
తస్మాత్సర్వే అనువర్తతే ప్రాణినః ప్రకృతిం స్వికాం |
పురుషార్థక్షయే హేతు భూతమపి దురత్యయాం |
రాజ్ఞోవా మమ వా తత్ర నిగ్రహం కిం కరిష్యతి |
రాగౌత్కట్యేన దురితా న్న నివారయితుం క్షమాః |
మహానరకహేతుత్వం జ్ఞాత్వాపి వాసనా బలాత్ |
ప్రవర్తమానాః పాపేషు మథాజ్ఞాతిక్రమాదపి |
నభిభ్యతీతి తాత్పర్యం హరేర్నారాయణస్య చ ||. (గీతాభావప్రకాశము - 3 - 202 to 204)
(ధర్మము, అధర్మము, లేక పుణ్యము, పాపము అనువాటి రూపముగా పరిణమించు పూర్వజన్మములలోని కర్మఫలము, ఈ వర్తమాన జన్మలో - ఇప్పటి జన్మలో వ్యక్తమగును - కనబడును, అనుభవములోనికి వచ్చును - ఇది అన్నివిధములబ్రమైనది. ఇదియే మనుష్యునికి స్వకీయమైన ప్రకృతి, లేక నైజగుణము - గుణదోషములనెఱిగిన వాడైనను ఆ నైజగుణము ప్రకారమే - తనస్వభావము ప్రకారమే - ప్రవర్తించును. అట్టి విషయములో ఏమియు తెలియని మూఢుని సంగతి చెప్పనవసరము లేదు. దీనినే పూర్వజన్మ వాసన యందురు. సమస్త జీవులు వారివారి స్వభావమును - నైజగుణమును, మోక్షమును దూరముగా చేయునదైనను దానిని నిగ్రహింప శక్తి లేక దాని ప్రకారమే ప్రవర్తించుచున్నారు).
మలినా జన్మ హేతుస్యాత్ శుద్ధా జన్మ వినాశినీ |
అజ్ఞానసుఖ సాకారా ఘనాహంకార శాలినీ |
పునర్జన్మ కరీ ప్రోక్తా మలినా వాసనా బుధైః ||
పునర్జన్మాంకురం త్యక్త్వ్సంభ్రష్ట బీజవత్ |
దేహార్థ దీయతే జ్ఞాతృజ్ఞేయా శుద్ధేతి చోచ్యతే ||“. (ముక్తికోపనిషత్)
(వాసన రెండువిధములు - శుద్ధ వాసనా, మలిన వాసన అని - మలినవాసన జన్మమునకు కారణమగును - శుద్ధవాసన కలుగకుండచేయును. మలినవాసన అజ్ఞానము సుఖము ఆకారముగా గలదిన్నీ, అహంకారగుణము కలదిన్నీ, మరల జన్మ కలుగునట్లు చేయునది అని పండితులు చెప్పుదురు - తిరిగి జన్మ కలుగునట్లు విత్తనమువలెనుండు మలిన వాసనను విడిచిపెట్టి మాడిపోయిన విత్తనము వలెనుండుము).
(saṃskāramunu baṭṭi puṇyapāpamulu cēyuṭa jarugucuṃḍunu. aṃducēta maniṣiyokka abhirucini baṭṭi puṇyāpuṇya saṃskāramu anumāniṃpabaḍunu - adiyē svabhāvamu, prakṛti, lēka vāsana yani ceppabaḍucunnadi).
citta śabdastu paryāyō vāsanā yā udāhṛtaḥ ||.
(vāsana anagā cittamuyokka svarūpamu - cittamu anu māṭaku vāsana yanu padamu paryāyapadamu - cittamannanu, ahaṃkāramannanu buddhiyannanu, manassu annanu vāsanayē, vērukādu).
kāraṇaśarīramu.
abuddhi pūrvaka pravṛtti hētuḥ saṃskāra viśēṣō vāsanā - sāca ajñāna vāsanā, karmavāsanā, prakṛti saṃbaṃdhivāsanā ca iti triprakārā.
(buddhipūrvakamugā kāka cēyu panulalō prērēpaṇa kaluguṭaku kāraṇamaina saṃskāra viśēṣamu - adi ajñānavāsana, karmavāsanā, prakṛtiki saṃbaṃdhiṃcina vāsanā yani mūdu vidhamulu)
lōkavāsanā, dēhavāsana, śāstravāsana ani vāsana mūḍu vidhamulu).
yathā padārthaśaktīnāṃ saṃbhuktānāmivāṃbarē | vasatyastamitānyēha vāsanēti tadhōcyatē ||. (yōgavāśiṣṭamu - 90 - 24)
(anubhaviṃcina padārthamuyokka sūkṣma śaktulu galigi bhāvanā rūpamuna ākāśamuvale sūkṣmamai sūkṣma cēṣṭā sahitamai yuṃḍunapuḍu ā caitanyamē vāsanayani ceppabaḍunu.)
manassulō ēdaina panicēyuṭaku prōdbalamu cēsi ā panini cēyiṃcunadi vāsana.
“dhṛḍha bhāvanayā tyaktvā pūrvāpara vicāraṇaṃ |
yathā dānaṃ padārthasya vāsanā sā prakīrtitā ||“.
(muṃduvenukala nālōciṃcaka dṛḍhamaina bhāvanatō ē dainā padārthamunu cēsina adi vāsana yanabaḍunu).
viṣayamulaṃdu manassunaku kalugu saṃskāramu vāsana. viṣayamulayaḍala manassunaku kalugu saṃkalpamulu manassunaṃṭi yuṃḍi eppaṭikini viḍicipōkuṃḍanuṃḍunu - iviyē vāsanalu - iviyē dēśakālānuguṇamuga panulanu cēyiṃcu cuṃḍunu. viṣayamulanēkamulaguṭacēta vāsanalu kūḍa anēkamulu - pāpapuṇyakarmalaku mūlamu, bījamu vāsana. idiyē svabhāvamu. kriyalē jananamaraṇarūpamaina saṃsāramunaku kāraṇamu - kriyalaku mūlamu saṃkalpamu - adiyē vāsana, aṃducēta saṃsāramunakadiyē mūlamu.
“vāsanā ēva saṃsāraḥ iti sarvā vimuṃcatāḥ |
tattyāgō vāsanā tyāgāt sthitiravya yadhā tathā ||“. (aṣṭāvakragīta - 9 - 8)
(vāsanayē saṃsāramu - aṃducēta vāsanalanu vadalivēyumu. vāsanalanu vadalivēsina avyayasthiti kalugunu.)
vāsanāstvaṃ parityajya mōkṣārthitvamapi tyajaḥ ||“. (yōgavāśiṣṭamu - )
(vāsana baṃdhamu - vāsanākṣayamē mōkṣamu).
aṃducēta vāsanalanu vadalivēyumu - vāsanalanu vadalivēsi mōkṣamaṃdu kōrikanu kūḍa vadalivēyumu -)
kṣīṇāyāṃ śītasaṃtatyāṃ brahmān himakaṇō yathā ||“. (yōgavāśiṣṭamu - 3 - 9)
(śītakālamu ayipōyinanē maṃcu tuṃparulu pōvunaṭlu vāsanalu kṣīṇiṃcagā manassu layamai pōvunu)
tananāṃtarni viṣṭēna muktā gha staṃtunā yathā ||“.
(mutyamulu vāṭilōna gruccabaḍina dāramuvalana dhariṃpabaḍinaṭlu paṃcabhūtamayamaina śarīramu anu paṃjaramu vāsanavalana nilabaḍiyunnadi.)
mōkṣa ityucyatē, brahmān, sa ēva vimala kramaḥ ||“. (yōgavāśiṣṭamu - 3 - 8)
(vāsanalanniṃṭini vadalivēyuṭayē mōkṣamu.)
munē, tadhaiva tiṣṭhāmi kṛpaṇaṃ kiṃ karōmyahaṃ ||“.
(“gaḍacina janmalalō kaligina vāsanalu - puṇyapāparūpamulaina karmalavalana alavaḍina saṃskāramu - nannu eṭlu eṭṭipanulalō niyamiṃcunō aṭlē cēyucunnānu. vēru vidhamugā nēnēmi cēyagalanu?” ani śrīrāmunu vacanamu
“ata ēvahi, hērāma, śrēyaḥ prāpnōti śāśvataṃ |
svaprayatnōpanākēna pauruṣēṇaiva nānyathā |
dvividhō vāsanā vyūha rabhaścaiva śubhaścatē |
prāktanōvidyatē, rāma, dvayō kētarō dhavā ||“.
(śrīrāmuni praśnaku samādhānamu ī kriṃda vidhamugā nunnadi : -
svaprayatnamu lēka, pauruṣamu - puruṣaprayatnamu - cēsi śāśvatamaina śrēyassunu poṃdanagunu.
“tasmādvāsana yā baddhaṃ muktaṃ nirvāsanaṃ manaḥ |
samyagālōkanātsatyā vāsanā pravilīyatē |
vāsanā vilayāt cētaḥ śamamāyāti dīsavat ||”
(aṃducēta vasana valana baṃdhamu kalugunu. vāsanalu vadalipōyina mukti kalugunu - paramātmadhyānamuvalana vāsana layamai pōvunu - vāsana labhiyiṃcina dīpamuvale śamamu kalugunu - śāṃti kalugunu).
(pūvula daṃḍalu, maṃcigaṃdhamu - caṃdanamu - kastūri modalagu vāsana dravyamulanuṃḍi vāṭi vāṭi pradēśamulanuṃḍi vāṭivāṭi vāsananu sūkṣmāvayamulatō saha tīsukoni vāyuvu itara pradēśamulaku ā vāsananu tīsukoni pōvunaṭlu jīvuḍu ē śarīramunuṃḍi vīḍi pōvunō ā śarīramunaku saṃbaṃdhiṃcina sūkṣma paṃcabhūtamulanu, sūkṣmēṃdriyamulatō kūḍa iṃkoka śarīramunaku tīsukoni pōvunu. vāṭitōnē vāsanalanu kūḍa tīsukoni pōvunu -).
(gaṃdhamulanu - vāsanalanu vāṭiki āśrayamulaina puṣpamulu, caṃdanamu, kastūri modalagu vāsana dravyamulanuṃḍi vāyuvu tanatō ēṭlu tīsukoni pōvunō ā prakāramugānē īśvaruḍu - dēhamunaku nādhuḍaina jīvuḍu - eppuḍu dēninuṃḍi viḍipōvunō, appuḍu ā vīḍipōyina śarīramu (sūkṣmarūpamulō nunnavāṭini) tanatō tīsukoni pōvunu.)
(ī sthūlaśarīramukaṃṭe nadṛṣṭa guṇaṃbai yaśrutaṃbaina vastuvaguṭaṃ jēsi vyaktaṃbugāka sūkṣmaṃbai karacaraṇādulu lēka jīvuniki noṃḍokarūpamu viracitamaiyuṃḍu sūkṣmuṃḍai jīvunivalana nutkrāṃti gamanāgamanaṃbula bunarjanmaṃbu dōcu)
(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 3 - 65)
prakṛtiṃ yāṃti bhūtāni nigrahaḥ kiṃ kariṣyati ||“. (śrīmadbhagavadgīta - 3 - 33)
śruṇu sāgjanma saṃskārō dharmādharmaika gōcaraḥ |
vartamāna bhavē vyaktaḥ sarvatō balavāṃśca yaḥ |
prakṛtiḥ sā svakīyā yāsta syāḥ sadṛśamēva hi |
sarvōpi guṇadōṣajñaścēṣṭatē ki mumūḍhadhīḥ |
tasmātsarvē anuvartatē prāṇinaḥ prakṛtiṃ svikāṃ |
puruṣārthakṣayē hētu bhūtamapi duratyayāṃ |
rājñōvā mama vā tatra nigrahaṃ kiṃ kariṣyati |
rāgautkaṭyēna duritā nna nivārayituṃ kṣamāḥ |
mahānarakahētutvaṃ jñātvāpi vāsanā balāt |
pravartamānāḥ pāpēṣu mathājñātikramādapi |
nabhibhyatīti tātparyaṃ harērnārāyaṇasya ca ||. (gītābhāvaprakāśamu - 3 - 202 to 204)
(dharmamu, adharmamu, lēka puṇyamu, pāpamu anuvāṭi rūpamugā pariṇamiṃcu pūrvajanmamulalōni karmaphalamu, ī vartamāna janmalō - ippaṭi janmalō vyaktamagunu - kanabaḍunu, anubhavamulōniki vaccunu - idi annividhamulabramainadi. idiyē manuṣyuniki svakīyamaina prakṛti, lēka naijaguṇamu - guṇadōṣamulaneṟigina vāḍainanu ā naijaguṇamu prakāramē - tanasvabhāvamu prakāramē - pravartiṃcunu. aṭṭi viṣayamulō ēmiyu teliyani mūḍhuni saṃgati ceppanavasaramu lēdu. dīninē pūrvajanma vāsana yaṃduru. samasta jīvulu vārivāri svabhāvamunu - naijaguṇamunu, mōkṣamunu dūramugā cēyunadainanu dānini nigrahiṃpa śakti lēka dāni prakāramē pravartiṃcucunnāru).
malinā janma hētusyāt śuddhā janma vināśinī |
ajñānasukha sākārā ghanāhaṃkāra śālinī |
punarjanma karī prōktā malinā vāsanā budhaiḥ ||
punarjanmāṃkuraṃ tyaktvsaṃbhraṣṭa bījavat |
dēhārtha dīyatē jñātṛjñēyā śuddhēti cōcyatē ||“. (muktikōpaniṣat)
(vāsana reṃḍuvidhamulu - śuddha vāsanā, malina vāsana ani - malinavāsana janmamunaku kāraṇamagunu - śuddhavāsana kalugakuṃḍacēyunu. malinavāsana ajñānamu sukhamu ākāramugā galadinnī, ahaṃkāraguṇamu kaladinnī, marala janma kalugunaṭlu cēyunadi ani paṃḍitulu ceppuduru - tirigi janma kalugunaṭlu vittanamuvalenuṃḍu malina vāsananu viḍicipeṭṭi māḍipōyina vittanamu valenuṃḍumu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.