సత్తకలది వస్తువు.
సచ్చిదానందం అద్వయం బ్రహ్మ
(సత్, చిత్, ఆనందములు రూపముగా గలది - ఎల్లకాలమందుండునది - చైతన్యమాత్రము - మోక్షము అను ఆనందము తానే అయినవాడు, అతడే అద్వయ బ్రహ్మ. తనుకాక ఇతర వస్తువు అనునది లేనివాడు - అట్టి పరబ్రహ్మమే వస్తువు - ఒకటే యగు వస్తువు.)
(దేశము, కాలము, వస్తువు అను మూడింటివలన పరిమితముగల వస్తువు, జన్మ మరణములు కలదగుటచేత అసద్వస్తువు - కలలో కన్నది అబద్ధమగుటచేత - అంతయు మట్టికుండ మొదలగు వాటివలె జననమరణములు కలవి అసద్వస్తువులు -)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 91)
(లోకమందు - సృష్టిలో - ఏ వస్తువైనను - అణువంతదైనను, పెద్దదిగాని, యున్నదో - ఎంత చిన్న వస్తువైనను, ఎంత పెద్ద వస్తువైనను ఉన్నదో అది సత్పదార్థము కలది (భగవంతుని అంశ, కళ, చిచ్ఛక్తి కలది) కనుక అది సత్పదార్థమే యగును. అందుకు వ్యతిరేకముగానుండునది అసత్తే యగును - వస్తువు యొక్క నామరూపకర్మలతో కూడిన ఉపాధిని బట్టి అది చిన్నది అనిగాని, పెద్దదియనిగాని - అణువంతదనిగాని, మహత్తత్వమంతదనిగాని చెప్పబడుచున్నది).
(పుట్టిన వస్తువేదియు ఏ ప్రమాణముచేతనయినను స్వతః (దానంతత అది) గాని. ఇతరమునుండికాని, ఈ రెండింటివలనకాని, సద్రూపముగా గాని, అసద్రూపముగా గాని, సదసద్రూపముగా గాని పుట్టుట లేదు - కుండనుండి కుండ పుట్టుటలేదు, కుండనుండి బట్ట పుట్టుటలేదు - కుండ, బట్ట - ఈ రెండింటినుండి కుండగాని, బట్టగాని పుట్టుటలేదు. మట్టివలన కుండ, తండ్రివలన కొడుకు పుట్టుచున్నాడనిన అది మూఢులు బాగుగ విచారించకపోవుట వలన. ఏది సద్వస్తువువలె కనబడునో అది వివేకము గలవారిచేత - జ్ఞానులచేత - మృష (అబద్ధము, అసత్యము) యని చెప్పబడుచున్నది. సద్వస్తువునకు పుట్టుట లేదు - కుందేటి కొమ్మువలె అసత్తు అయినయడల పుట్టుటలేదు. ఈ రెండునూ - సత్తు, అసత్తు - వెలుతురు, చీకటివలె - ఒకే పర్యాయము ఒకే చోట ఉండనేరవు, అందుచేత ఏ వస్తువైనను పుట్టునదికాదు).
sattakaladi vastuvu.
saccidānaṃdaṃ advayaṃ brahma
(sat, cit, ānaṃdamulu rūpamugā galadi - ellakālamaṃduṃḍunadi - caitanyamātramu - mōkṣamu anu ānaṃdamu tānē ayinavāḍu, ataḍē advaya brahma. tanukāka itara vastuvu anunadi lēnivāḍu - aṭṭi parabrahmamē vastuvu - okaṭē yagu vastuvu.)
(dēśamu, kālamu, vastuvu anu mūḍiṃṭivalana parimitamugala vastuvu, janma maraṇamulu kaladaguṭacēta asadvastuvu - kalalō kannadi abaddhamaguṭacēta - aṃtayu maṭṭikuṃḍa modalagu vāṭivale jananamaraṇamulu kalavi asadvastuvulu -)
(śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 91)
(lōkamaṃdu - sṛṣṭilō - ē vastuvainanu - aṇuvaṃtadainanu, peddadigāni, yunnadō - eṃta cinna vastuvainanu, eṃta pedda vastuvainanu unnadō adi satpadārthamu kaladi (bhagavaṃtuni aṃśa, kaḷa, cicchakti kaladi) kanuka adi satpadārthamē yagunu. aṃduku vyatirēkamugānuṃḍunadi asattē yagunu - vastuvu yokka nāmarūpakarmalatō kūḍina upādhini baṭṭi adi cinnadi anigāni, peddadiyanigāni - aṇuvaṃtadanigāni, mahattatvamaṃtadanigāni ceppabaḍucunnadi).
(puṭṭina vastuvēdiyu ē pramāṇamucētanayinanu svataḥ (dānaṃtata adi) gāni. itaramunuṃḍikāni, ī reṃḍiṃṭivalanakāni, sadrūpamugā gāni, asadrūpamugā gāni, sadasadrūpamugā gāni puṭṭuṭa lēdu - kuṃḍanuṃḍi kuṃḍa puṭṭuṭalēdu, kuṃḍanuṃḍi baṭṭa puṭṭuṭalēdu - kuṃḍa, baṭṭa - ī reṃḍiṃṭinuṃḍi kuṃḍagāni, baṭṭagāni puṭṭuṭalēdu. maṭṭivalana kuṃḍa, taṃḍrivalana koḍuku puṭṭucunnāḍanina adi mūḍhulu bāguga vicāriṃcakapōvuṭa valana. ēdi sadvastuvuvale kanabaḍunō adi vivēkamu galavāricēta - jñānulacēta - mṛṣa (abaddhamu, asatyamu) yani ceppabaḍucunnadi. sadvastuvunaku puṭṭuṭa lēdu - kuṃdēṭi kommuvale asattu ayinayaḍala puṭṭuṭalēdu. ī reṃḍunū - sattu, asattu - veluturu, cīkaṭivale - okē paryāyamu okē cōṭa uṃḍanēravu, aṃducēta ē vastuvainanu puṭṭunadikādu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.