(వసుదేవుని కుమారుడు - వాసుదేవుడు - శ్రీకృష్ణుడు)
(జగత్తును రక్షించుటకు వసుదేవుని కుమారుడై అవతరించినవాడు)
(అష్ట వసువులలో ప్రకాశించువాడు వసుదేవుడు, వాని నందుడు - కుమారుడు - వాసుదేవుడు).
(వసుదేవ శబ్దమునకు అర్థము శుద్ధ సత్వము. శుద్ధ సత్వముతో ప్రకాశించువాడు.)
“వసుదేవునకు నొక్కెడ జన్మించిన కతంబున వాసుదేవుండయ్యె”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 288)
“సర్వత్రాసౌ వసత్యాత్మరూపేణ విశ్వంభరిత్వాత్ ఇతి వాసుః; వాసుశ్చాసౌ దేవశ్చ వాసుదేవః” -
(విశ్వంభరుడు ప్రపంచమును భరించువాడు - అగుటవలన, ఆత్మరూపములో అన్నింటియందు నివసించువాడు - ఉండువాడు - కనుక వాసువు - వాసువు + దేవుడు అయినవాడు వాసుదేవుడు - అన్నింటిలోను ఆత్మ రూపంబున నుండు దేవుడు.)
(భూతములన్నియు నితనియందుండును - విశ్వరూపుడు కనుక - వాసుడు ప్రకాశించువాడు. కనుక దేవుడు ఈ రెండును కలిసి వాసుదేవుడు).
తతః స వాసుదేవేతి విద్వద్భిః పరి పఠ్యతే ||. (విష్ణుపురాణము)
(అన్నింటిలోను భగవంతుడుండుటచేతను, ఇతనిలో సమస్తముండుతచేతను భగవంతుడు పండితులచేత వాసుదేవుడని చెప్పబడుచున్నాడు).
(సమస్తమైన జగత్తును తనలోనుంచువాడు, సమస్త భూతములందు నుండువాడు, సూర్యునివలె ప్రకాశించువాడు, కనుక వాసుదేవుడు).
భూతేషుచ స సర్వాత్మా వాసుదేవస్తతః స్మృతః ||” (శ్రీవిష్ణుపురాణము)
(పరమాత్మయందు సమస్త భూతములు నివసించి యున్నవి. భూతములందు అతను అన్నింటికి ఆత్మగా నివసించియున్నాడు - అందుచేత వాసుదేవుడని చెప్పబడుచున్నాడు.)
(వస అను ధాతువునకు నివసించుట యని యర్థము. అందుచేత అన్నింటియందు నివసించి యుండువాడు కనుక వాసువు - ప్రకాశించువాడు కనుక దేవుడు - ఈ రెండు కలిసి అన్నింటియందును నివసించియుండు దేవుడు కనుక వాసుడేవుడు).
పొసగిన వసుదేవ సంప్ర భూత్యర్థములం
దెసగుట జగన్నివాసాభ్యాస నరశియు
వాసుదేవుడందురు నిన్నున్ ||“. (హరివంశము)
(సమస్త ప్రాణుల హృదయమందు నివసించువాడు)
(భూతములలో గుహవలె (అందులో ఏమున్నదో ఎవరికి తెలియకూడని స్థానము వలె) నుండు స్థానమైన హృదయమందు నివసించియుండువాడు)
(సమస్త భూతములందు అధిష్టించియుండువాడు కనుక వాసుదేవుడు).
(సమస్త భూతములకు ఆశ్రయమైనవాడు - నివసించు చోటు అగువాడు).
(జగత్తులన్నింటికి నివాసమైనవాడు - సృష్టికి పూర్వము భూతములన్నియు సూక్ష్మరూపములో భగవంతునిలోనే యుండెను - స్థితికాలములో కూడ, అవన్నియు స్థూలరూపములో నున్న అతనిలోనే అతని విశ్వరూపములోనే - దారముతో గ్రుచ్చబడిన మణులవలె - యుండును)
(దేవా నీ విశ్వశరీరమందు దేవతులను, సమస్తమైన భూతములను చూచుచున్నాను).
మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా |
(ఈ జగత్తంతయు ఇంద్రియములకు గోచరుడుకానట్టి - కంటికి కనబడక, మనసులో ఊహించుటకు వీలుకాక యుండు రూపముగల నా చేత వ్యాపించబడి యున్నది. సమస్త భూతములు పుట్టుటకు నేనే మూల కారణమగుటచేత అవన్నియు - కార్యవస్తువులన్నియు - కారణ వస్తువులైన నా యందు సూక్ష్మరూపములో నున్నవి.)
వాలాయము నీకు గానవచ్చునిపుడు, నీ
వాలోకింపుము, దారు వి
లోలహుతాశనుని కరణి, లోకస్తుత్యా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 9 - 319)
(చిత్తమునధిష్టించి యుండువాడు)
(సత్వగుణము, శాంతగుణము గల చిత్తమే మహత్తు (మహత్తత్వము). వాసుదేవుడు అను పేర భగవంతుడుండు స్థానము. చిత్తమునకు అధిభూతము మహత్తత్వము - ఆధ్యాత్మ విషయములో చిత్తమని అదియే చెప్పబడును. దాని అధిష్ఠాన దేవత క్షేత్రజ్ఞుడు)
వాసుదేవాత్ పరం, బ్రహ్మాన్, నత్వన్యో (అ)ర్థోస్తి తత్వతః ||“. (శ్రీమద్భాగవతం - 2 - 5 - 14)
(ద్రవ్యం = మహాభూతాని, ఉపాదాన రూపాణి; కర్మ = జన్మనిమిత్తం, కాలః తత్ క్షోభకః; స్వభావః = తత్పరిణమ హేతుః).
“దేహంబునకు ద్రవ్యంబులైన మహాభూతంబులును, జన్మ నిమిత్తములైన కర్మంబులును, కర్మ క్షోభకంబైన కాలంబును, కాల పరిణామ హేతువైన స్వభావంబును, భోక్తయైన జీవుండును వాసుదేవుండుగా నెఱుంగుము”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 84)
(అన్నింటిలోను నివసించియుండి వాటిని ఆచ్ఛాదించుటచేత – ఆవరించి యుండుటచేత, కప్పి యుండుటచేత వాసువు; ప్రకాశించువాడు, క్రీడించు వాడు, ఆచ్ఛాదించువాడు, వ్యవహరించువాడు, చైతన్యము కలిగించు వాడగుటచేత దేవుడు; కనుక - ఈ రెండు లక్షణములు కలిసి తనయందుండుటచేత వాసుదేవుడాయెను).
(అన్నింటిని తనయందుంచుకొని ఆచ్ఛాదించువాడు - అన్నింటిలోనుండునది.)
(జగత్తునంతటను సూర్యకిరణములవలె ఆవరించియుండుటచేతను, సర్వ భూతములందుండుటచేతను నేను వాసుదేవుడనైతిని, - నన్ను వాసు దేవుడందురు).
(మాయచేత జగత్తును వ్యాపించి కప్పి పుచ్చువాడు కనుక వాసుః - అట్టి దేవుడు వాసుదేవుడు).
(వానాత్ = జ్ఞానాధిక్యమువలనను, దేవనాత్ = ప్రకాశము గలవాడగుటచేతను, సూతేః = సృష్టి చేయుటవలనను, వాసుదేవుడు. వాసాత్ = అన్నింటియందును నివసించియుండుటచేతను, ద్యుతేః = ప్రకాశము కలిగియుండుటచేతను, ఛాదనాత్ = అన్నింటిని ఆవరించి యుండుటచేతను, వాసుదేవుడు, క్రీడించియుండువాడు, - వ = బలము, అసు = ప్రాణము - ఈ రెండునూ తానే అయి యుండువాడు)
(శ్రీకృష్ణావతారమందు వసుదేవుని కుమారుడు అగుటవలననే వాసుదేవుడని చెప్పబడియుండుట కాదు. తనయొక్క వాస్తవమైన పరబ్రహ్మరూపముతో వాసించి (వసించి) యుండుటచేత వాసుదేవుడని చెప్పబడుచున్నాడు).
(వృష్ణి వంశీయులలో - యాదవులలో - వాసుదేవుడనువాడను నేను - వృష్ణివంశములో పుట్టినవాడను కనుక వార్ష్ణేయుడని కూడ చెప్పబడుచున్నాడు - అవతారమూర్తియగుటచేత వార్ష్ణేయులందరిలోను భగవదంశ సంభూతుడైనవాడు).
“శరీర వాచక శబ్దంబులకు శరీర పర్యంత ధావనంబు గలదు, కావున జగచ్ఛరీరుండగు పురుషోత్తముండు సకల శబ్ద వాచ్యుండగు, నైనను విష్ణు, నారాయణ వాసుదేవాది దివ్య నామంబులతని యందు ముఖ్య వృత్తిం బ్రవర్తించుటం జేసి తదాత్మకంబయిన మంత్రంబులు ప్రపన్నుల కవశ్యాను సంధానంబులని వేద వాదంబుల వినంబడు”. (కులశేఖరమహీపాలచరిత్ర)
“వసుభిః పుణ్యైః దీప్యతే ప్రకాశతే ఇతి వా”
(పుణ్యములచేత ప్రకాశించువాడు)
(వాసుదేవుడనగా ఏ విధమైన ఉపాధి లేక, కేవలుడు అయి యుండు పరమాత్మ సృష్టి అంతటిలోను ప్రకృతితో, లేక ప్రకృతియొక్క పరిణామములతో కాని పరమాత్మ కలిసియున్నాడు. అట్లు దేనితోను కలిసియుండక శుద్ధమైన చిచ్ఛక్తి రూపమైన పరబ్రహ్మమే వాసుదేవుడు - అట్టి వాసుదేవుడు నిరుపాధికమైన - ఏ విధమైన ఉపాధితోను కలియనివాడు - వాసుదేవ పరబ్రహ్మము - అతనిని కలియుటే కైవల్యముక్తి -)
“మ. కలసెన్ సంగములెల్లబాసి నియతిన్ ఖట్వాంగుడశ్రాంతమై
కలదయ్యున్ మఱి మీద లేదనెడిదై కల్యాణమై యాత్మలో
దలపం బల్కగరానిదై పరమమై, తత్వజ్ఞులూహించి, హృ
జ్జలజాతంబుల వాసుదేవుడని సంస్థాపించు నా బ్రహ్మమున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 9 - 257)
(vasudēvuni kumāruḍu - vāsudēvuḍu - śrīkṛṣṇuḍu)
(jagattunu rakṣiṃcuṭaku vasudēvuni kumāruḍai avatariṃcinavāḍu)
(aṣṭa vasuvulalō prakāśiṃcuvāḍu vasudēvuḍu, vāni naṃduḍu - kumāruḍu - vāsudēvuḍu).
(vasudēva śabdamunaku arthamu śuddha satvamu. śuddha satvamutō prakāśiṃcuvāḍu.)
“vasudēvunaku nokkeḍa janmiṃcina kataṃbuna vāsudēvuṃḍayye”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 288)
“sarvatrāsau vasatyātmarūpēṇa viśvaṃbharitvāt iti vāsuḥ; vāsuścāsau dēvaśca vāsudēvaḥ” -
(viśvaṃbharuḍu prapaṃcamunu bhariṃcuvāḍu - aguṭavalana, ātmarūpamulō anniṃṭiyaṃdu nivasiṃcuvāḍu - uṃḍuvāḍu - kanuka vāsuvu - vāsuvu + dēvuḍu ayinavāḍu vāsudēvuḍu - anniṃṭilōnu ātma rūpaṃbuna nuṃḍu dēvuḍu.)
(bhūtamulanniyu nitaniyaṃduṃḍunu - viśvarūpuḍu kanuka - vāsuḍu prakāśiṃcuvāḍu. kanuka dēvuḍu ī reṃḍunu kalisi vāsudēvuḍu).
tataḥ sa vāsudēvēti vidvadbhiḥ pari paṭhyatē ||. (viṣṇupurāṇamu)
(anniṃṭilōnu bhagavaṃtuḍuṃḍuṭacētanu, itanilō samastamuṃḍutacētanu bhagavaṃtuḍu paṃḍitulacēta vāsudēvuḍani ceppabaḍucunnāḍu).
(samastamaina jagattunu tanalōnuṃcuvāḍu, samasta bhūtamulaṃdu nuṃḍuvāḍu, sūryunivale prakāśiṃcuvāḍu, kanuka vāsudēvuḍu).
bhūtēṣuca sa sarvātmā vāsudēvastataḥ smṛtaḥ ||” (śrīviṣṇupurāṇamu)
(paramātmayaṃdu samasta bhūtamulu nivasiṃci yunnavi. bhūtamulaṃdu atanu anniṃṭiki ātmagā nivasiṃciyunnāḍu - aṃducēta vāsudēvuḍani ceppabaḍucunnāḍu.)
(vasa anu dhātuvunaku nivasiṃcuṭa yani yarthamu. aṃducēta anniṃṭiyaṃdu nivasiṃci yuṃḍuvāḍu kanuka vāsuvu - prakāśiṃcuvāḍu kanuka dēvuḍu - ī reṃḍu kalisi anniṃṭiyaṃdunu nivasiṃciyuṃḍu dēvuḍu kanuka vāsuḍēvuḍu).
posagina vasudēva saṃpra bhūtyarthamulaṃ
desaguṭa jagannivāsābhyāsa naraśiyu
vāsudēvuḍaṃduru ninnun ||“. (harivaṃśamu)
(samasta prāṇula hṛdayamaṃdu nivasiṃcuvāḍu)
(bhūtamulalō guhavale (aṃdulō ēmunnadō evariki teliyakūḍani sthānamu vale) nuṃḍu sthānamaina hṛdayamaṃdu nivasiṃciyuṃḍuvāḍu)
(samasta bhūtamulaṃdu adhiṣṭiṃciyuṃḍuvāḍu kanuka vāsudēvuḍu).
(samasta bhūtamulaku āśrayamainavāḍu - nivasiṃcu cōṭu aguvāḍu).
(jagattulanniṃṭiki nivāsamainavāḍu - sṛṣṭiki pūrvamu bhūtamulanniyu sūkṣmarūpamulō bhagavaṃtunilōnē yuṃḍenu - sthitikālamulō kūḍa, avanniyu sthūlarūpamulō nunna atanilōnē atani viśvarūpamulōnē - dāramutō gruccabaḍina maṇulavale - yuṃḍunu)
(dēvā nī viśvaśarīramaṃdu dēvatulanu, samastamaina bhūtamulanu cūcucunnānu).
mayā tatamidaṃ sarvaṃ jagadavyaktamūrtinā |
(ī jagattaṃtayu iṃdriyamulaku gōcaruḍukānaṭṭi - kaṃṭiki kanabaḍaka, manasulō ūhiṃcuṭaku vīlukāka yuṃḍu rūpamugala nā cēta vyāpiṃcabaḍi yunnadi. samasta bhūtamulu puṭṭuṭaku nēnē mūla kāraṇamaguṭacēta avanniyu - kāryavastuvulanniyu - kāraṇa vastuvulaina nā yaṃdu sūkṣmarūpamulō nunnavi.)
vālāyamu nīku gānavaccunipuḍu, nī
vālōkiṃpumu, dāru vi
lōlahutāśanuni karaṇi, lōkastutyā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 9 - 319)
(cittamunadhiṣṭiṃci yuṃḍuvāḍu)
(satvaguṇamu, śāṃtaguṇamu gala cittamē mahattu (mahattatvamu). vāsudēvuḍu anu pēra bhagavaṃtuḍuṃḍu sthānamu. cittamunaku adhibhūtamu mahattatvamu - ādhyātma viṣayamulō cittamani adiyē ceppabaḍunu. dāni adhiṣṭhāna dēvata kṣētrajñuḍu)
vāsudēvāt paraṃ, brahmān, natvanyō (a)rthōsti tatvataḥ ||“. (śrīmadbhāgavataṃ - 2 - 5 - 14)
(dravyaṃ = mahābhūtāni, upādāna rūpāṇi; karma = janmanimittaṃ, kālaḥ tat kṣōbhakaḥ; svabhāvaḥ = tatpariṇama hētuḥ).
“dēhaṃbunaku dravyaṃbulaina mahābhūtaṃbulunu, janma nimittamulaina karmaṃbulunu, karma kṣōbhakaṃbaina kālaṃbunu, kāla pariṇāma hētuvaina svabhāvaṃbunu, bhōktayaina jīvuṃḍunu vāsudēvuṃḍugā neṟuṃgumu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 84)
(anniṃṭilōnu nivasiṃciyuṃḍi vāṭini ācchādiṃcuṭacēta – āvariṃci yuṃḍuṭacēta, kappi yuṃḍuṭacēta vāsuvu; prakāśiṃcuvāḍu, krīḍiṃcu vāḍu, ācchādiṃcuvāḍu, vyavahariṃcuvāḍu, caitanyamu kaligiṃcu vāḍaguṭacēta dēvuḍu; kanuka - ī reṃḍu lakṣaṇamulu kalisi tanayaṃduṃḍuṭacēta vāsudēvuḍāyenu).
(anniṃṭini tanayaṃduṃcukoni ācchādiṃcuvāḍu - anniṃṭilōnuṃḍunadi.)
(jagattunaṃtaṭanu sūryakiraṇamulavale āvariṃciyuṃḍuṭacētanu, sarva bhūtamulaṃduṃḍuṭacētanu nēnu vāsudēvuḍanaitini, - nannu vāsu dēvuḍaṃduru).
(māyacēta jagattunu vyāpiṃci kappi puccuvāḍu kanuka vāsuḥ - aṭṭi dēvuḍu vāsudēvuḍu).
(vānāt = jñānādhikyamuvalananu, dēvanāt = prakāśamu galavāḍaguṭacētanu, sūtēḥ = sṛṣṭi cēyuṭavalananu, vāsudēvuḍu. vāsāt = anniṃṭiyaṃdunu nivasiṃciyuṃḍuṭacētanu, dyutēḥ = prakāśamu kaligiyuṃḍuṭacētanu, chādanāt = anniṃṭini āvariṃci yuṃḍuṭacētanu, vāsudēvuḍu, krīḍiṃciyuṃḍuvāḍu, - va = balamu, asu = prāṇamu - ī reṃḍunū tānē ayi yuṃḍuvāḍu)
(śrīkṛṣṇāvatāramaṃdu vasudēvuni kumāruḍu aguṭavalananē vāsudēvuḍani ceppabaḍiyuṃḍuṭa kādu. tanayokka vāstavamaina parabrahmarūpamutō vāsiṃci (vasiṃci) yuṃḍuṭacēta vāsudēvuḍani ceppabaḍucunnāḍu).
(vṛṣṇi vaṃśīyulalō - yādavulalō - vāsudēvuḍanuvāḍanu nēnu - vṛṣṇivaṃśamulō puṭṭinavāḍanu kanuka vārṣṇēyuḍani kūḍa ceppabaḍucunnāḍu - avatāramūrtiyaguṭacēta vārṣṇēyulaṃdarilōnu bhagavadaṃśa saṃbhūtuḍainavāḍu).
“śarīra vācaka śabdaṃbulaku śarīra paryaṃta dhāvanaṃbu galadu, kāvuna jagaccharīruṃḍagu puruṣōttamuṃḍu sakala śabda vācyuṃḍagu, nainanu viṣṇu, nārāyaṇa vāsudēvādi divya nāmaṃbulatani yaṃdu mukhya vṛttiṃ bravartiṃcuṭaṃ jēsi tadātmakaṃbayina maṃtraṃbulu prapannula kavaśyānu saṃdhānaṃbulani vēda vādaṃbula vinaṃbaḍu”. (kulaśēkharamahīpālacaritra)
“vasubhiḥ puṇyaiḥ dīpyatē prakāśatē iti vā”
(puṇyamulacēta prakāśiṃcuvāḍu)
(vāsudēvuḍanagā ē vidhamaina upādhi lēka, kēvaluḍu ayi yuṃḍu paramātma sṛṣṭi aṃtaṭilōnu prakṛtitō, lēka prakṛtiyokka pariṇāmamulatō kāni paramātma kalisiyunnāḍu. aṭlu dēnitōnu kalisiyuṃḍaka śuddhamaina cicchakti rūpamaina parabrahmamē vāsudēvuḍu - aṭṭi vāsudēvuḍu nirupādhikamaina - ē vidhamaina upādhitōnu kaliyanivāḍu - vāsudēva parabrahmamu - atanini kaliyuṭē kaivalyamukti -)
“ma. kalasen saṃgamulellabāsi niyatin khaṭvāṃguḍaśrāṃtamai
kaladayyun maṟi mīda lēdaneḍidai kalyāṇamai yātmalō
dalapaṃ balkagarānidai paramamai, tatvajñulūhiṃci, hṛ
jjalajātaṃbula vāsudēvuḍani saṃsthāpiṃcu nā brahmamun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 9 - 257)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.