(వీచునది, చలించునది, చలనము కలుగచేయునది).
(వాసన కలుగచేయునది వాయువు).
(వీచునది, చలించునది, వాసనగలదికనుక వాయువని చెప్పబడినది.)
వాయుః సర్వ జగత్ప్రణో
(సమస్త జగత్తునకు ప్రాణము వాయువు)
(వీచునది - బలముగలవాటిలో గొప్ప బలముగలదై చరాచర జగత్తును హరించునది - సంహరించునది వాయువు - “వాతాద్విష్ణోర్బల మాహుః” - విష్ణువునకు వాయువువలన - వాయురూపములో - బలము).
(ఎల్లపుడు ఊర్ధ్వగతి గలది - వాయువు).
(ఖాళీగానున్నది ఆకాశము; చలనము గలది వాయువు).
(ఆకాశమువలన వాయువు కలిగినది, వాయువు వలన అగ్ని పుట్టెను).
(పుండరీకాక్షు నిరీక్షణంబున - భగవంతుని అంశ - చిచ్ఛక్తి తనలోపల లేనిదే ఏ వస్తువైనను ఇంకొక వస్తువను పుట్టించలేదు - అని గ్రహించవలసినది).
“వ. నభంబువలన వాయువు గలిగె వాయువునకుం బరాన్వయంబున శబ్దంబు స్పర్శంబునను రెండు గుణంబులు గలిగియుండు. అవి దేహంబులందుండుటంజేసి బ్రాణరూపంబై ఇంద్రియ మనశ్శరీరపాటవంబైన యోజస్సహో బలంబులకు హేతువై వర్తించు. వాయువు వలన రూప స్పర్శ శబ్దంబులనియెడి గుణంబులు మూటితోడ దేజంబు గలిగె”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 86)
“పృధ్వి నిజాంశమే పాయ్వింద్రియమాయెను - - - వాయువుతోగూడి ఘ్రాణెంద్రియమాయెను.”
“అగ్నియొక్క నిజాంశమే చక్షుస్సాయెను - - - వాయువును గూడి త్వక్కాయె.”
“ఆకాశమే వాయు సం యోగాన మనస్సాయెను”.
“వాయువునకు ఈశ్వరుండధి దేవత”
“శ్లో ||. పృధ్వ్యాం బ్రహ్మ, జలే విష్ణుస్తతో రుద్రో హుతాశనే |
ఈశ్వరః పవనే తస్మిన్ ఆకాశే (అ)స్మిన్ సదాశివః ||“.
(పృధివికి అధిదేవత బ్రహ్మ, జలమునకు అధిదేవత విష్ణువు, అగ్నికి రుద్రుడు, వాయువునకీశ్వరుడు, ఆకాశమునకు అధిదేవత సదాశివుడి).
“ఆత్మనః ఆకాశస్సంభూతః అనెడి శ్రుతి ప్రమాణానం జేసి ఆ భూతాత్మయొక్క యీక్షణమే కాలము, ఆ కాలముయొక్క అస్తిత్వమే ఆకాశము, ఆ ఆకాశం యొక్క విస్తీర్ణమే వాయువు, ఆ వాయువుచుట్టి మథించగాను అగ్ని.”
వ. శబ్ద తన్మాత్ర లక్షణంబగు నభంబువలన స్పర్శంబును, స్పర్శంబువలన వాయువును, వాయువుచే స్పర్శగ్రాహియై త్వగింద్రియంబును బుట్టె - మృదుత్వంబును గఠినత్వంబును, శైత్యంబును, నుష్ణత్వంబును ననునవి. స్పర్శంబునకు స్పర్శత్వంబని చెప్పంబడు. మఱియు వాయువునకు జాలనంబును, పరస్పర విభాగ కరణంబును, దన్మేళినంబును, ద్రవ్యశబ్ద నేతృత్వంబును నగు. అందు గంధవంతంబగు ద్రవ్యంబును ఘ్రాణేంద్రియంబు నొందించుట ద్రవ్యనేతృత్వంబు, దూరస్థంబగు శబ్దంబును శ్రోత్రేంద్రియగ్రాహ్యంబగునట్లొనరించుట శబ్దనేతౄత్వంబు. సర్వేంద్రియాత్మకంబు ననునది లక్షణంబులై యుండు - దైవప్రేరితంబై స్పర్సతన్మాత్ర గుణకంబగు వాయువువలన రూపంబును, దాని వలన తేజంబునుం బుట్టె.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 - 893)
(రూపములేనిదగుటచేత స్పర్శయే వాయువుయొక్క లక్షణము)
(రూపము లేకపోవుటవలన - సూక్ష్మమగుటవలన వాయువు కంటికి కనబడదు).
(వాయువు రూపములేనిది, కలిగినది - అని రెండువిధములు - నిత్యము, అనిత్యము; నిత్యమైనది పరమాణురూపమైనది; అనిత్యమైనది కార్యవస్తువు అయినది. ఇది మరల శరీరమునకు ఇంద్రియములకు, విషయములకు సంబంధించి మూడు విధములుగ నున్నది. శరీరమునకు సంబధించినది వాయులోకమందున్నది; ఇంద్రియములకు సంబంధించినది స్పర్శను గ్రహించు చర్మము - శరీరమంతటను ఈ వృత్తిగలది, విషయములకు సంబంధించినది. చెట్లు మొదలగునవి కదులుటకు కారణమైనది. శరీరములోపల సంచరించు వాయువు ప్రాణము - ఈ ప్రాణము ఒకటే అయినను ఉపాధిభేధమును బట్టి ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అని అయిదుపేర్లు కలిగినది).
భిన్నో అనిలస్తథా హ్యేకో నామస్థాన క్రియామయైః |
ప్రాణో దానే సమానశ్చ వ్యానశ్చాపాన ఏ నచి |
స్థానాస్థాః మరుతః పంచయప యంతి శరీరిణం ||“. (సుశ్రుత సంహిత)
(శరీరములో నుండు అగ్ని (జఠరాగ్ని) అదియుండు స్థానమును బట్టి, చేయుపనుల భేదమువలనను, పేరులో భేదమువలనను అయిదు విధములుగా ఎట్లు చెప్పబడుచున్నదో, అట్లే శరీరమునందుండు వాయువుగూడ స్థానభేదమును బట్టి కార్యభేదమును బట్టి అయిదు విధములుగా - ప్రాణము, అపానము, ఉదానము, సమానము, వ్యానము అని చెప్పబడుచున్నది.
ఉదానః కంఠ దేశస్థో వ్యానస్సర్వ శరీరగః ||.
(వాయువు యొక్క వికారమే శరీరము - వాయువే శరీరముగా మారినది - అది యెట్లంటే - హృదయమందు ప్రాణవాయువు, గుదమదపానవాయువు, నాభియందు సమానవాయువు, కంఠమందు ఉదానము, శరీరమంతటను వ్యానవాయువు సంచరించుచుండును).
(శ్రీమద్భగవద్గీత - 11 - 39)
(వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజపతి - ఇవన్నియు నేనే - శ్రీకౄష్ణుడే).
“ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయుః, ఓం తదాత్మా - -” (మంత్రపుష్పము - )
(ఆ పరబ్రహ్మ, వాయువు, ఆత్మ - అన్నీ ఆపరబ్రహ్మమే).
(vīcunadi, caliṃcunadi, calanamu kalugacēyunadi).
(vāsana kalugacēyunadi vāyuvu).
(vīcunadi, caliṃcunadi, vāsanagaladikanuka vāyuvani ceppabaḍinadi.)
vāyuḥ sarva jagatpraṇō
(samasta jagattunaku prāṇamu vāyuvu)
(vīcunadi - balamugalavāṭilō goppa balamugaladai carācara jagattunu hariṃcunadi - saṃhariṃcunadi vāyuvu - “vātādviṣṇōrbala māhuḥ” - viṣṇuvunaku vāyuvuvalana - vāyurūpamulō - balamu).
(ellapuḍu ūrdhvagati galadi - vāyuvu).
(khāḷīgānunnadi ākāśamu; calanamu galadi vāyuvu).
(ākāśamuvalana vāyuvu kaliginadi, vāyuvu valana agni puṭṭenu).
(puṃḍarīkākṣu nirīkṣaṇaṃbuna - bhagavaṃtuni aṃśa - cicchakti tanalōpala lēnidē ē vastuvainanu iṃkoka vastuvanu puṭṭiṃcalēdu - ani grahiṃcavalasinadi).
“va. nabhaṃbuvalana vāyuvu galige vāyuvunakuṃ barānvayaṃbuna śabdaṃbu sparśaṃbunanu reṃḍu guṇaṃbulu galigiyuṃḍu. avi dēhaṃbulaṃduṃḍuṭaṃjēsi brāṇarūpaṃbai iṃdriya manaśśarīrapāṭavaṃbaina yōjassahō balaṃbulaku hētuvai vartiṃcu. vāyuvu valana rūpa sparśa śabdaṃbulaniyeḍi guṇaṃbulu mūṭitōḍa dējaṃbu galige”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 86)
“pṛdhvi nijāṃśamē pāyviṃdriyamāyenu - - - vāyuvutōgūḍi ghrāṇeṃdriyamāyenu.”
“agniyokka nijāṃśamē cakṣussāyenu - - - vāyuvunu gūḍi tvakkāye.”
“ākāśamē vāyu saṃ yōgāna manassāyenu”.
“vāyuvunaku īśvaruṃḍadhi dēvata”
“ślō ||. pṛdhvyāṃ brahma, jalē viṣṇustatō rudrō hutāśanē |
īśvaraḥ pavanē tasmin ākāśē (a)smin sadāśivaḥ ||“.
(pṛdhiviki adhidēvata brahma, jalamunaku adhidēvata viṣṇuvu, agniki rudruḍu, vāyuvunakīśvaruḍu, ākāśamunaku adhidēvata sadāśivuḍi).
“ātmanaḥ ākāśassaṃbhūtaḥ aneḍi śruti pramāṇānaṃ jēsi ā bhūtātmayokka yīkṣaṇamē kālamu, ā kālamuyokka astitvamē ākāśamu, ā ākāśaṃ yokka vistīrṇamē vāyuvu, ā vāyuvucuṭṭi mathiṃcagānu agni.”
va. śabda tanmātra lakṣaṇaṃbagu nabhaṃbuvalana sparśaṃbunu, sparśaṃbuvalana vāyuvunu, vāyuvucē sparśagrāhiyai tvagiṃdriyaṃbunu buṭṭe - mṛdutvaṃbunu gaṭhinatvaṃbunu, śaityaṃbunu, nuṣṇatvaṃbunu nanunavi. sparśaṃbunaku sparśatvaṃbani ceppaṃbaḍu. maṟiyu vāyuvunaku jālanaṃbunu, paraspara vibhāga karaṇaṃbunu, danmēḷinaṃbunu, dravyaśabda nētṛtvaṃbunu nagu. aṃdu gaṃdhavaṃtaṃbagu dravyaṃbunu ghrāṇēṃdriyaṃbu noṃdiṃcuṭa dravyanētṛtvaṃbu, dūrasthaṃbagu śabdaṃbunu śrōtrēṃdriyagrāhyaṃbagunaṭlonariṃcuṭa śabdanētṝtvaṃbu. sarvēṃdriyātmakaṃbu nanunadi lakṣaṇaṃbulai yuṃḍu - daivaprēritaṃbai sparsatanmātra guṇakaṃbagu vāyuvuvalana rūpaṃbunu, dāni valana tējaṃbunuṃ buṭṭe.
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 - 893)
(rūpamulēnidaguṭacēta sparśayē vāyuvuyokka lakṣaṇamu)
(rūpamu lēkapōvuṭavalana - sūkṣmamaguṭavalana vāyuvu kaṃṭiki kanabaḍadu).
(vāyuvu rūpamulēnidi, kaliginadi - ani reṃḍuvidhamulu - nityamu, anityamu; nityamainadi paramāṇurūpamainadi; anityamainadi kāryavastuvu ayinadi. idi marala śarīramunaku iṃdriyamulaku, viṣayamulaku saṃbaṃdhiṃci mūḍu vidhamuluga nunnadi. śarīramunaku saṃbadhiṃcinadi vāyulōkamaṃdunnadi; iṃdriyamulaku saṃbaṃdhiṃcinadi sparśanu grahiṃcu carmamu - śarīramaṃtaṭanu ī vṛttigaladi, viṣayamulaku saṃbaṃdhiṃcinadi. ceṭlu modalagunavi kaduluṭaku kāraṇamainadi. śarīramulōpala saṃcariṃcu vāyuvu prāṇamu - ī prāṇamu okaṭē ayinanu upādhibhēdhamunu baṭṭi prāṇamu, apānamu, vyānamu, udānamu, samānamu ani ayidupērlu kaliginadi).
bhinnō anilastathā hyēkō nāmasthāna kriyāmayaiḥ |
prāṇō dānē samānaśca vyānaścāpāna ē naci |
sthānāsthāḥ marutaḥ paṃcayapa yaṃti śarīriṇaṃ ||“. (suśruta saṃhita)
(śarīramulō nuṃḍu agni (jaṭharāgni) adiyuṃḍu sthānamunu baṭṭi, cēyupanula bhēdamuvalananu, pērulō bhēdamuvalananu ayidu vidhamulugā eṭlu ceppabaḍucunnadō, aṭlē śarīramunaṃduṃḍu vāyuvugūḍa sthānabhēdamunu baṭṭi kāryabhēdamunu baṭṭi ayidu vidhamulugā - prāṇamu, apānamu, udānamu, samānamu, vyānamu ani ceppabaḍucunnadi.
udānaḥ kaṃṭha dēśasthō vyānassarva śarīragaḥ ||.
(vāyuvu yokka vikāramē śarīramu - vāyuvē śarīramugā mārinadi - adi yeṭlaṃṭē - hṛdayamaṃdu prāṇavāyuvu, gudamadapānavāyuvu, nābhiyaṃdu samānavāyuvu, kaṃṭhamaṃdu udānamu, śarīramaṃtaṭanu vyānavāyuvu saṃcariṃcucuṃḍunu).
(śrīmadbhagavadgīta - 11 - 39)
(vāyuvu, yamuḍu, agni, varuṇuḍu, caṃdruḍu, prajapati - ivanniyu nēnē - śrīkṝṣṇuḍē).
“ōṃ tadbrahma, ōṃ tadvāyuḥ, ōṃ tadātmā - -” (maṃtrapuṣpamu - )
(ā parabrahma, vāyuvu, ātma - annī āparabrahmamē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.