← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వేదాంతములు vēdāṃtamulu

Original — తెలుగు
  1. వేదస్య అంతః సమాప్తిః చరమభాగః సిద్ధాంతః వేదాంతః - ఉపనిషత్ -

(వేదము యొక్క అంతము - ఆఖరిభాగము, వేదములోని భాగమైనది - వేదార్థమును నిర్ణయించునది, వేదమునకు భాష్య రూపముగా నున్నది - ఉత్తరమీమాంస)

  1. వేదాంతోనామ ఉపనిషత్ప్రమాణం, తదుపకారీణి, శారీరక సూత్రదీని.

(వేదాంతమనగా ఉపనిషత్తులను ప్రమాణగ్రంధము, అందుకు సహాయపడు శారీరకశాస్త్రము, మొదలగునవి)

  1. వేదస్యాంతే వర్తమానత్వాత్ వేదాంతః, తథా. వేదాంత నిర్ణయో ప యోగిత్వాదపి, అతో అవసానం సంశయాపగమో నిర్ణయ ఇతి.

(వేదము తుదిని ఉండుటవలన వేదాంతమని చెప్పబడినది, వేదాంతమును - ఆధ్యాత్మిక విషయమును నిర్ణయించుటకు - సిద్ధాంతము చేయుటకు ఉపయోగించునదగుటచేతను, అందుచేత సంశయములను పోగొట్టునదగుటచేతను నిర్ణయము చేయునది, సిద్ధాంతము చేయునది)

  1. సమ్యక్ తాత్పర్యత్వేన వేదాంతానాం బ్రహ్మణ్యన్వయాత్ సంబంధాత్ అతో వేదాంతాః బ్రహ్మ పరాః, న కర్త్రాదిపరాః, భిన్న ప్రకరణ స్థత్వాత్, న చ ప్రకరణా భేదాత్, ఉపాసనా విధిపరాః - - - రూపాది హీనస్య బ్రహ్మణః ప్రమాణాంతరా గమ్యత్వేన తత్ప్రతిపాదక వేదాంతానాం సాపేక్షత్వా సంభవం. తస్మాత్ ఉపక్రమాదిలింగైర్వేదాంతాః బ్రహ్మ పరా ఏవ ఇతి సిద్ధం

(సమ్యక్ జ్ఙానమందే తాత్పర్యము కలిగియుండుటచేతను, పరబ్రహ్మయందే అన్వయించుటచేతను వేదాంతములు బ్రహ్మ పరములు. కర్త యగు ఒక ప్రాకృత పురుషునకు సంబంధించినవి కావు. రూపములేని భగవంతుడు మఱియొక ప్రమాణముచేత తెలిసికొనుటకు శక్యము కాకుండుటచేత, పరబ్రహ్మను ప్రతిపాదించు - బోధించు, వేదాంతవంటి ఇతర గ్రంధములు లేకుండుటచేతను, ఉపక్రమము, ఉపసంహారము మొదలగు షడ్లింగములచేత ఉపనిషత్తులు బ్రహ్మపరములేయని సిద్ధాంతము చేయబడినది)

(వేదములో భగవంతుని గుఱించి చెప్పినదానికి అంతము, వేదములో చెప్పినదంతా ఇదే, ఇంతే అని స్పష్టముచేయునవి. వీటిలో చెప్పిన భగవత్ జ్ఞానమునకు మించిన జ్ఞానము లేదను చెప్పుటయే.)

Transliteration
  1. vēdasya aṃtaḥ samāptiḥ caramabhāgaḥ siddhāṃtaḥ vēdāṃtaḥ - upaniṣat -

(vēdamu yokka aṃtamu - ākharibhāgamu, vēdamulōni bhāgamainadi - vēdārthamunu nirṇayiṃcunadi, vēdamunaku bhāṣya rūpamugā nunnadi - uttaramīmāṃsa)

  1. vēdāṃtōnāma upaniṣatpramāṇaṃ, tadupakārīṇi, śārīraka sūtradīni.

(vēdāṃtamanagā upaniṣattulanu pramāṇagraṃdhamu, aṃduku sahāyapaḍu śārīrakaśāstramu, modalagunavi)

  1. vēdasyāṃtē vartamānatvāt vēdāṃtaḥ, tathā. vēdāṃta nirṇayō pa yōgitvādapi, atō avasānaṃ saṃśayāpagamō nirṇaya iti.

(vēdamu tudini uṃḍuṭavalana vēdāṃtamani ceppabaḍinadi, vēdāṃtamunu - ādhyātmika viṣayamunu nirṇayiṃcuṭaku - siddhāṃtamu cēyuṭaku upayōgiṃcunadaguṭacētanu, aṃducēta saṃśayamulanu pōgoṭṭunadaguṭacētanu nirṇayamu cēyunadi, siddhāṃtamu cēyunadi)

  1. samyak tātparyatvēna vēdāṃtānāṃ brahmaṇyanvayāt saṃbaṃdhāt atō vēdāṃtāḥ brahma parāḥ, na kartrādiparāḥ, bhinna prakaraṇa sthatvāt, na ca prakaraṇā bhēdāt, upāsanā vidhiparāḥ - - - rūpādi hīnasya brahmaṇaḥ pramāṇāṃtarā gamyatvēna tatpratipādaka vēdāṃtānāṃ sāpēkṣatvā saṃbhavaṃ. tasmāt upakramādiliṃgairvēdāṃtāḥ brahma parā ēva iti siddhaṃ

(samyak jṅānamaṃdē tātparyamu kaligiyuṃḍuṭacētanu, parabrahmayaṃdē anvayiṃcuṭacētanu vēdāṃtamulu brahma paramulu. karta yagu oka prākṛta puruṣunaku saṃbaṃdhiṃcinavi kāvu. rūpamulēni bhagavaṃtuḍu maṟiyoka pramāṇamucēta telisikonuṭaku śakyamu kākuṃḍuṭacēta, parabrahmanu pratipādiṃcu - bōdhiṃcu, vēdāṃtavaṃṭi itara graṃdhamulu lēkuṃḍuṭacētanu, upakramamu, upasaṃhāramu modalagu ṣaḍliṃgamulacēta upaniṣattulu brahmaparamulēyani siddhāṃtamu cēyabaḍinadi)

(vēdamulō bhagavaṃtuni guṟiṃci ceppinadāniki aṃtamu, vēdamulō ceppinadaṃtā idē, iṃtē ani spaṣṭamucēyunavi. vīṭilō ceppina bhagavat jñānamunaku miṃcina jñānamu lēdanu ceppuṭayē.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.