(వేదాంతములు - ఉపనిషత్తులు - పరబ్రహ్మను రుజువుచేయుటకు ప్రమాణభూతములగుటవలన వాటివలననే తెలియతగినవాడు - సర్వేవేదాః యత్పదమామనంతి - (కా - 2 - 15)
“తత్వజ్ఞులైన విద్వాంసులు వేదాద్యయనాది వ్యాపారంబులుమాని వేదాంత ప్రతిపాద్యుండవగు నిన్ను సమాధి విశేషంబుల నెఱింగి సేవింతురు-” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 -)
“ప్రధమో అధ్యాయే ప్రత్యక్షాది గోచరా చేతనా దర్థాంతర భూతం నిరస్త నిఖిల విద్యా విద్యపురుషార్థ గంధం అనంతజ్ఞానానందైక తానమ పరిమితోదారగుణసాగరం నిఖిల జగదేకకారణం సర్వాంతరాత్మభూతం పరః బ్రహ్మ వేదంతవేద్యమిత్యుక్తం -” (శ్రీమాన్ రామానుజః)
(ప్రత్యక్ష ప్రమాణము మొదలగువాటివలన గోచరుడగునటువంటి అచేతనవస్తువుకంటె వేఱయినటువంటిదిన్నీ, అనంతజ్ఞానానంద స్వరూపుడు, అపరిమితమైన ఉదారగుణములకు సముద్రుడువంటివాడు, సమస్త జగత్తునకు తాను ఒకడే కారణమైనటువంటివాడున్నూ అన్నింటిలోను అంతరాత్మగా నున్నటువంటిన్నీ పరబ్రహ్మయే ఉపనిషత్తుల మూలముగా తెలియబడువాడు - తెలియతగినవాడు).
(vēdāṃtamulu - upaniṣattulu - parabrahmanu rujuvucēyuṭaku pramāṇabhūtamulaguṭavalana vāṭivalananē teliyataginavāḍu - sarvēvēdāḥ yatpadamāmanaṃti - (kā - 2 - 15)
“tatvajñulaina vidvāṃsulu vēdādyayanādi vyāpāraṃbulumāni vēdāṃta pratipādyuṃḍavagu ninnu samādhi viśēṣaṃbula neṟiṃgi sēviṃturu-” (śrīmadāṃdhramahābhāgavatamu - 7 -)
“pradhamō adhyāyē pratyakṣādi gōcarā cētanā darthāṃtara bhūtaṃ nirasta nikhila vidyā vidyapuruṣārtha gaṃdhaṃ anaṃtajñānānaṃdaika tānama parimitōdāraguṇasāgaraṃ nikhila jagadēkakāraṇaṃ sarvāṃtarātmabhūtaṃ paraḥ brahma vēdaṃtavēdyamityuktaṃ -” (śrīmān rāmānujaḥ)
(pratyakṣa pramāṇamu modalaguvāṭivalana gōcaruḍagunaṭuvaṃṭi acētanavastuvukaṃṭe vēṟayinaṭuvaṃṭidinnī, anaṃtajñānānaṃda svarūpuḍu, aparimitamaina udāraguṇamulaku samudruḍuvaṃṭivāḍu, samasta jagattunaku tānu okaḍē kāraṇamainaṭuvaṃṭivāḍunnū anniṃṭilōnu aṃtarātmagā nunnaṭuvaṃṭinnī parabrahmayē upaniṣattula mūlamugā teliyabaḍuvāḍu - teliyataginavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.