← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వేదార్థం vēdārthaṃ

Original — తెలుగు
  1. వేదార్థః పరమాద్వైతం,వేతరత్ -; “సర్వే వేదాః యత్పదమామనంతి” ఇతి శ్రుతి స్మృత్యనురోధేన-

(వేదములోని యర్థము - వేదములో చెప్పబడిన విషయము - ఉత్కృష్టమైన అద్వైతమే - జీవబ్రహ్మలు ఒకటే అని, సర్వము ఆ పరబ్రహ్మేయని, పరబ్రహ్మతప్ప మరియొకటి లేదని - ఈ విషయముకాక ఇంకేమియు లేదని చెప్పునదే వేదార్థము. “వేదములన్నియు ఆ భగవంగ్తుని యొక్క పరమపదమునే చెప్పుచున్నవి.” అని శ్రుతి - “తద్విష్ణోః పరమం పదం” అని శ్రుతి.

  1. వేదముల సారార్థము - మహావాక్యములు -
  1. అయమాత్మా బ్రహ్మ (ఈ ఆత్మయే బ్రహ్మ) (జీవాత్మ, పరమాత్మా ఒకటే).

  2. “తత్వమసి” - (ఆ పరబ్రహ్మ నీవే అయితివి)

  3. “అహం బ్రహ్మాస్మి” నేను బ్రహ్మను అయి యున్నాను) - “సర్వ ఖిల్విదం బ్రహ్మ” ఈ సృష్టి అంతయు -సృష్టిలోని వస్తువులన్నియు కలిసిన ఈ ప్రపంచకమంతా బ్రహ్మమే) - ఈ వాక్యములను వ్యాఖానించుటకే మిగతా వేదమంతా).

Transliteration
  1. vēdārthaḥ paramādvaitaṃ,vētarat -; “sarvē vēdāḥ yatpadamāmanaṃti” iti śruti smṛtyanurōdhēna-

(vēdamulōni yarthamu - vēdamulō ceppabaḍina viṣayamu - utkṛṣṭamaina advaitamē - jīvabrahmalu okaṭē ani, sarvamu ā parabrahmēyani, parabrahmatappa mariyokaṭi lēdani - ī viṣayamukāka iṃkēmiyu lēdani ceppunadē vēdārthamu. “vēdamulanniyu ā bhagavaṃgtuni yokka paramapadamunē ceppucunnavi.” ani śruti - “tadviṣṇōḥ paramaṃ padaṃ” ani śruti.

  1. vēdamula sārārthamu - mahāvākyamulu -
  1. ayamātmā brahma (ī ātmayē brahma) (jīvātma, paramātmā okaṭē).

  2. “tatvamasi” - (ā parabrahma nīvē ayitivi)

  3. “ahaṃ brahmāsmi” nēnu brahmanu ayi yunnānu) - “sarva khilvidaṃ brahma” ī sṛṣṭi aṃtayu -sṛṣṭilōni vastuvulanniyu kalisina ī prapaṃcakamaṃtā brahmamē) - ī vākyamulanu vyākhāniṃcuṭakē migatā vēdamaṃtā).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.