← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వేదవిత్ vēdavit

Original — తెలుగు
  1. వేదాన్ లింతే విచారయతీతి వేదవిత్ - (శ్రీశంకరః)

(వేదములను పరిశీలించువాడు)

  1. వేదనాం సాంగానాం సర్వవిద్యాస్థానానాం వేత్తా -

(సమస్త విద్యలకు స్థానమైన వేదములను, వేదాంగములను తెలిసినవాడు)

  1. “వేదార్థవిత్” (శ్రీశంకరః)

(వేదముల అర్థమును తెలిసినవాడు - వేదములో చెప్పబడిన విషయమంతయు భగవంతుడే కనుక భగవంతుని తెలుసుకొనినవాడు - బ్రహ్మజ్ఞాని)

“యధావత్ వేదార్థం వేత్తీతి వేదవత్ -” (శ్రీశంకరః)

(వేదముల అర్థమును యధార్థముగా తెలుసుకొనినవాడు)

  1. “ఆద్యంతు త్ర్యక్షరం బ్రహ్మ త్రయీ యత్ర ప్రతిష్టితా |

సాగుహ్యో అన్యస్థ్రివృద్వేదో యస్తం వేద స వేదవిత్ ||“.

“సర్వవేదానాం ఆద్యం యత్ బ్రహ్మ వేదసారం అకారోకారత్మకత్వేన త్ర్యక్షరం యత్రత్రయో వేదాః స్థ్గితాః, సో అన్యః త్రివృద్వేదః ప్రణవాఖ్యః గుహ్యః గోపనీయః, వేదమంత్ర శ్రేష్టత్వాత్ పరమార్థాభిధాయకత్వాత్ పరమార్థకత్వేన ధారణ జపాదినా మోక్షహేతుత్వాచ్చ, యః తం స్వరూపతః అర్థతః చ జానాతి స వేదవిత్ ఇత్యర్థః-”.

(వేదములన్నింటికి ఆది - మొదలు - అయినదిన్నీ, వేదముల సారమైనదిన్నీ, అకార ఉకార మకారములతో కూడినందున మూడు అక్షరములుగలది అయిన ఓంకారము - ప్రణవము - వేదమంత్రము గుహ్యమైనది (గోప్యముగా నుంచవలసినదికనుకను వేదమంత్రములలోనిది శ్రేష్టమైనదగుటవలనను పరమార్థమని చెప్పబడుటచేతను, ధారణజపము మొదలగు వాటితో మోక్షమునకు కారణమైనదగుటచేతను ఆ ప్రణవమును యథార్థముగా తత్వరీత్యా నెఱింగినవాడు వేదవిత్)

  1. “ఊర్థ్వ మూలమధిః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయం |

ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ||“. (శ్రీమద్భగవద్గీత - 15 - 1)

“యః ఏవం భూతం అశ్వత్థం వేద స వేదవిత్ - వేదోహి సంసారవృక్షచ్ఛేదోపాయం వదతి. చ్ఛేద్య వృక్షస్య రూపజ్ఞానం భేదేనోపాయ జ్ఞానోప యోగీ ఇతి వేదవిత్ ఇత్యుచ్యతే -” (శ్రీమాన్ రామానుజః)

(చెట్టునకు సామాన్యముగా వేళ్ళు క్రిందను కొమ్మలు మీదనుండును, కాని అశ్వత్థమను చెట్టునకు మీదను వేళ్ళు ఉన్నవి, శాఖలు క్రిందనున్నవి. ఇది సంసారమను చెట్టు. దీనికి మూలము - కారణము భగవంతుడు. అతనిలోనుండి పుట్టి క్రిందకు కొమ్మలుగా వ్యాపించినవి. ప్రపంచము - ప్రపంచములోని జీవులు ఇది అంతములేనిది. ఎందుచేతననగా కర్మచేసి, చనిపోయి, కర్మఫలము అనుభవించుటకు మరల పుట్టి, మరల కర్మ చేయుచు, మరల చనిపోవుచు, పుట్తుచు, ఇట్లు చావు పుట్టుకలతో అంతము లేకుండనుండుటను బట్టి దీనిని - ఈ సంసారమును - ప్రవాహరీత్యా అవ్యయము (క్షీణించనిది - నశించనిది) యని చెప్పిరి. ఇట్టి సంసారమును అశ్వత్థవృక్షమునకు ఆకులు ఛందస్సులు వేదములోను ఛందస్సులు ఆకులు చెట్టుకు ప్రాణముపోసి జీవింపచేయునవి. ఆకులు లేక చెట్టు బ్రతుకుట కష్టము. అందుచేత చెట్టుకు ఆకులువలెనుండు ఛందస్సులుగల యీ సంసారమువృక్షమును తత్వరీత్యా తెలిసినవాడు వేదమును తెలిసినవాడేయగును - అందుచేత ఈ సంసారము గుఱించి అయిన జ్ఞానము వేదార్థ జ్ఞానమే యగును. అందుచేత అది తెలిసినవాడు వేదవిత్ - వేదమును తెలిసినవాడు)

(సంసారమను వృక్షమును భేదించు ఉపాయమును బోధించునది వేదము - ఆ వృక్షమును భేదించుటకుపయోగపడునది. అందుచేత ఆ జ్ఞానముకలవాడు - సంసారమనువృక్షమును భేదించు ఉపాయము వేదమువలన తెలుసుకొనినవాడు వేదవిత్).

(వేదమను మాటకు అర్థము భగవంతుడే, వేదమనగా భగవంతుడే. భగవంతుని పేరు వేదము - ఇదియే వేదములోని యర్థము, వేదము బోధించు పరమార్థము - ఇట్లుకాక వేఱొకరీతిని వేదముల అర్థమును బోధించువాడు వేదవిత్ (వేదమును తెలిసినవాడు) కాడు).

  1. “సంసారవృక్షం సమూలం అశ్వత్థం, యః తం వేద స వేదవిత్. వేదార్థవిత్ ఇత్యరథః - నహి సమూలాత్ సంసార వృక్షాత్ అస్మాత్ జ్ఞేయః అన్యః అణుమాత్రోపి అస్తి ఇత్యతః సర్వజ్ఞః సర్వ వేదార్థవిత్ ఇతి సమూల సంసార వృక్ష జ్ఞానం స్తౌతి” (శ్రీశంకరః)

(అశ్వత్థము - అస్థిరమైనది - అను ఈ సంసార వృక్షమును సమూలముగా (దీనికి మూలము భగవంతుడు కనుక భగవత్తత్త్వముతో సహా) తెలిసినివాడు వేదనిత్ అని అర్థము- సంసార వృక్షమును మూలముతో కూడ (దానికి మూలమైన భగవంతునితో కూడ, దానికి కారణమైన కర్మగతితో కూడ) తెలియుటకంటె అణుమాత్రము ఇంకొకటిలేదు. కనుక ఈ అశ్వత్థవృక్షము యొక్క అంతరార్థమును తెలిసినవాడే వేదవిత్. సంసారమునకు మూలము భగవంతుడు - అశ్వత్థవృక్షమునకు మూలము - వేరు - చెట్టు పైభాగమున నున్నది. భగవంతుడు నిత్యుడు - సంసారము శాశ్వతముకాదు - ఇదియే వేదము బోధించునది, అందుచేతనే దానిని తెలిసినవాడు వేదవిత్.

  1. “వేదాంతకృత్ వేదవిదేవ చాహం” (శ్రీమద్భగవద్గీత - 15 - 15)

(వేదాంతములను - ఊపనిషత్తులను వ్రాసినవాడను నేనే, వేదార్థమును యదార్థముగా తెలిసినవాడను నేనే) (వేదార్థమును లోకములో ప్రకటింపచేసినవాడను నేనే).

Transliteration
  1. vēdān liṃtē vicārayatīti vēdavit - (śrīśaṃkaraḥ)

(vēdamulanu pariśīliṃcuvāḍu)

  1. vēdanāṃ sāṃgānāṃ sarvavidyāsthānānāṃ vēttā -

(samasta vidyalaku sthānamaina vēdamulanu, vēdāṃgamulanu telisinavāḍu)

  1. “vēdārthavit” (śrīśaṃkaraḥ)

(vēdamula arthamunu telisinavāḍu - vēdamulō ceppabaḍina viṣayamaṃtayu bhagavaṃtuḍē kanuka bhagavaṃtuni telusukoninavāḍu - brahmajñāni)

“yadhāvat vēdārthaṃ vēttīti vēdavat -” (śrīśaṃkaraḥ)

(vēdamula arthamunu yadhārthamugā telusukoninavāḍu)

  1. “ādyaṃtu tryakṣaraṃ brahma trayī yatra pratiṣṭitā |

sāguhyō anyasthrivṛdvēdō yastaṃ vēda sa vēdavit ||“.

“sarvavēdānāṃ ādyaṃ yat brahma vēdasāraṃ akārōkāratmakatvēna tryakṣaraṃ yatratrayō vēdāḥ sthgitāḥ, sō anyaḥ trivṛdvēdaḥ praṇavākhyaḥ guhyaḥ gōpanīyaḥ, vēdamaṃtra śrēṣṭatvāt paramārthābhidhāyakatvāt paramārthakatvēna dhāraṇa japādinā mōkṣahētutvācca, yaḥ taṃ svarūpataḥ arthataḥ ca jānāti sa vēdavit ityarthaḥ-”.

(vēdamulanniṃṭiki ādi - modalu - ayinadinnī, vēdamula sāramainadinnī, akāra ukāra makāramulatō kūḍinaṃduna mūḍu akṣaramulugaladi ayina ōṃkāramu - praṇavamu - vēdamaṃtramu guhyamainadi (gōpyamugā nuṃcavalasinadikanukanu vēdamaṃtramulalōnidi śrēṣṭamainadaguṭavalananu paramārthamani ceppabaḍuṭacētanu, dhāraṇajapamu modalagu vāṭitō mōkṣamunaku kāraṇamainadaguṭacētanu ā praṇavamunu yathārthamugā tatvarītyā neṟiṃginavāḍu vēdavit)

  1. “ūrthva mūlamadhiḥ śākhamaśvatthaṃ prāhuravyayaṃ |

chaṃdāṃsi yasya parṇāni yastaṃ vēda sa vēdavit ||“. (śrīmadbhagavadgīta - 15 - 1)

“yaḥ ēvaṃ bhūtaṃ aśvatthaṃ vēda sa vēdavit - vēdōhi saṃsāravṛkṣacchēdōpāyaṃ vadati. cchēdya vṛkṣasya rūpajñānaṃ bhēdēnōpāya jñānōpa yōgī iti vēdavit ityucyatē -” (śrīmān rāmānujaḥ)

(ceṭṭunaku sāmānyamugā vēḷḷu kriṃdanu kommalu mīdanuṃḍunu, kāni aśvatthamanu ceṭṭunaku mīdanu vēḷḷu unnavi, śākhalu kriṃdanunnavi. idi saṃsāramanu ceṭṭu. dīniki mūlamu - kāraṇamu bhagavaṃtuḍu. atanilōnuṃḍi puṭṭi kriṃdaku kommalugā vyāpiṃcinavi. prapaṃcamu - prapaṃcamulōni jīvulu idi aṃtamulēnidi. eṃducētananagā karmacēsi, canipōyi, karmaphalamu anubhaviṃcuṭaku marala puṭṭi, marala karma cēyucu, marala canipōvucu, puṭtucu, iṭlu cāvu puṭṭukalatō aṃtamu lēkuṃḍanuṃḍuṭanu baṭṭi dīnini - ī saṃsāramunu - pravāharītyā avyayamu (kṣīṇiṃcanidi - naśiṃcanidi) yani ceppiri. iṭṭi saṃsāramunu aśvatthavṛkṣamunaku ākulu chaṃdassulu vēdamulōnu chaṃdassulu ākulu ceṭṭuku prāṇamupōsi jīviṃpacēyunavi. ākulu lēka ceṭṭu bratukuṭa kaṣṭamu. aṃducēta ceṭṭuku ākuluvalenuṃḍu chaṃdassulugala yī saṃsāramuvṛkṣamunu tatvarītyā telisinavāḍu vēdamunu telisinavāḍēyagunu - aṃducēta ī saṃsāramu guṟiṃci ayina jñānamu vēdārtha jñānamē yagunu. aṃducēta adi telisinavāḍu vēdavit - vēdamunu telisinavāḍu)

(saṃsāramanu vṛkṣamunu bhēdiṃcu upāyamunu bōdhiṃcunadi vēdamu - ā vṛkṣamunu bhēdiṃcuṭakupayōgapaḍunadi. aṃducēta ā jñānamukalavāḍu - saṃsāramanuvṛkṣamunu bhēdiṃcu upāyamu vēdamuvalana telusukoninavāḍu vēdavit).

(vēdamanu māṭaku arthamu bhagavaṃtuḍē, vēdamanagā bhagavaṃtuḍē. bhagavaṃtuni pēru vēdamu - idiyē vēdamulōni yarthamu, vēdamu bōdhiṃcu paramārthamu - iṭlukāka vēṟokarītini vēdamula arthamunu bōdhiṃcuvāḍu vēdavit (vēdamunu telisinavāḍu) kāḍu).

  1. “saṃsāravṛkṣaṃ samūlaṃ aśvatthaṃ, yaḥ taṃ vēda sa vēdavit. vēdārthavit ityarathaḥ - nahi samūlāt saṃsāra vṛkṣāt asmāt jñēyaḥ anyaḥ aṇumātrōpi asti ityataḥ sarvajñaḥ sarva vēdārthavit iti samūla saṃsāra vṛkṣa jñānaṃ stauti” (śrīśaṃkaraḥ)

(aśvatthamu - asthiramainadi - anu ī saṃsāra vṛkṣamunu samūlamugā (dīniki mūlamu bhagavaṃtuḍu kanuka bhagavattattvamutō sahā) telisinivāḍu vēdanit ani arthamu- saṃsāra vṛkṣamunu mūlamutō kūḍa (dāniki mūlamaina bhagavaṃtunitō kūḍa, dāniki kāraṇamaina karmagatitō kūḍa) teliyuṭakaṃṭe aṇumātramu iṃkokaṭilēdu. kanuka ī aśvatthavṛkṣamu yokka aṃtarārthamunu telisinavāḍē vēdavit. saṃsāramunaku mūlamu bhagavaṃtuḍu - aśvatthavṛkṣamunaku mūlamu - vēru - ceṭṭu paibhāgamuna nunnadi. bhagavaṃtuḍu nityuḍu - saṃsāramu śāśvatamukādu - idiyē vēdamu bōdhiṃcunadi, aṃducētanē dānini telisinavāḍu vēdavit.

  1. “vēdāṃtakṛt vēdavidēva cāhaṃ” (śrīmadbhagavadgīta - 15 - 15)

(vēdāṃtamulanu - ūpaniṣattulanu vrāsinavāḍanu nēnē, vēdārthamunu yadārthamugā telisinavāḍanu nēnē) (vēdārthamunu lōkamulō prakaṭiṃpacēsinavāḍanu nēnē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.