← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వేద్ధవ్యం vēddhavyaṃ

Original — తెలుగు
  1. మనస్సాధనం కర్తవ్యం -

(మనస్సుతో సాధన చేయవలసినది).

  1. మనసా శరేణ తాడయితవ్యం, మనసమాధానం తత్ర కర్తవ్యం. కథ వేద్ధవ్యం, తదుచ్యతే : -

మహాస్త్రం - (మహచ్చ తదస్త్రంచ ఇతి మహాస్త్రం) ధనుర్గృహీత్వా (ఆదాయ) తదుపాసా భిర్నిశితం సంత తాభిధ్యానేన తనూకృతం శరం తస్మిన్ ధనుషి సంధాయీత (యోజయేత్). శరం సంధాయ (సంస్థావ్య) అనంతర మాయామ్యాకృష్య సేంద్రియం అంతఃకరణం స్వవిషయాత్ విని వర్త్య లక్ష్యే యేవస్థాపయిత్వా తద్భాగవతేన తస్మిన్ బ్రహ్మణి అక్షరే లక్ష్యే భావనా భాస్తద్గతేన చేతసా లక్ష్యం తదేవ యధోక్త లక్షణమక్షరం విద్ధి తాడయేత్ ఇత్యర్థః.

(మనస్సు అను శరముచేత (బాణము చేత) (గురి చూసి) కొట్టతగినది. మనస్సమాధానము, కేంద్రీకరణము చేయవలయును. ఇట్లు చేసిన భగవంతునెట్లు తెలుసుకొనగలుగును? - గొప్ప బాణమును తీసుకొని, ధనస్సును (విల్లును) తీసుకొని, అభ్యాసమువలన తీక్ష్ణమైన గురి చూచుకొని, ధనస్సుమీద బాణమును ఎక్కించి (సందించి) మనస్సును ఇంద్రియములను విషయములనుండి నివర్తించి (తప్పించి), లక్ష్య వస్తువునందే నిలిపి, తన లక్ష్యమైన (గురి అయిన) అక్షరుడగు బ్రహ్మమందు నిలిపి, ఆ లక్ష్యమందు భక్తుడగువాడు ఆ బాణమును కొట్టవలెను. పైన చెప్పినదానిలో ప్రణవము ధనస్సు, బాణము ఆత్మ, వేదనము కలుగచేయునదగుటచేత అంతఃకరణము బాణము. ఈ బాణముతో ఆ ధనస్సు మీదనుంచి కొట్టవలసిన లక్ష్యము పరబ్రహ్మము. అప్రమత్తతతో ఏకాగ్ర చిత్తముతో ఆ లక్ష్యమైన బ్రహ్మను తెలుసుకొనవలెను - సాధారణముగా బాణమును లక్ష్యము మీదకు వదులుటలో ఏకాగ్రత యున్నట్లే. దేహము మొదలగునవి ఆత్మకాదని వదలి (తిరస్కరించి) అక్షరుడైన పరబ్రహ్మమే ఫలమని దానిని పొందవలెను).

  1. “యథా ధనుషా ప్రక్షిప్తః ఇషుః లక్ష్యే అతః ప్రణవః ధనురివ ధనుః శరోహ్యాత్మాంతఃకరణం హి శరః శర సదృశ లక్ష్యవేదనాచ్చర ఇవ శరః - అత్ర లక్ష్యంతు దద్బ్రహ్మైవ ఉచ్యతే. అప్రమత్తేన ఏకాగ్రచేతసా తల్లక్ష్యం బ్రహ్మవేద్ధవ్యం, యధాశరో లక్ష్యైకతాం ప్రాపోతి తథా దేహాద్యాత్మప్రత్యయ తిరస్కారేణ అక్షరైకాత్మ్యం ఫలం ఆపాదయేత్ ఇథ్యర్థః”.

(పైన ‘2’ లో చెప్పినదానిలో ధనస్సుచేత కొట్టబడిన బాణము - ప్రణవము ధనస్సు, బాణము (శరము) ఆత్మ అంతఃకరణము, లక్ష్యము బ్రహ్మము - అని తెలుసుకొనవలెను - బాణము లక్ష్యమునే తాకునట్లు దేహమే ఆత్మ యనుట తిరస్కరించి అక్షరుడైన పరబ్రహ్మమే ఆత్మయను సిద్ధాంతమే ఫలము).

Transliteration
  1. manassādhanaṃ kartavyaṃ -

(manassutō sādhana cēyavalasinadi).

  1. manasā śarēṇa tāḍayitavyaṃ, manasamādhānaṃ tatra kartavyaṃ. katha vēddhavyaṃ, taducyatē : -

mahāstraṃ - (mahacca tadastraṃca iti mahāstraṃ) dhanurgṛhītvā (ādāya) tadupāsā bhirniśitaṃ saṃta tābhidhyānēna tanūkṛtaṃ śaraṃ tasmin dhanuṣi saṃdhāyīta (yōjayēt). śaraṃ saṃdhāya (saṃsthāvya) anaṃtara māyāmyākṛṣya sēṃdriyaṃ aṃtaḥkaraṇaṃ svaviṣayāt vini vartya lakṣyē yēvasthāpayitvā tadbhāgavatēna tasmin brahmaṇi akṣarē lakṣyē bhāvanā bhāstadgatēna cētasā lakṣyaṃ tadēva yadhōkta lakṣaṇamakṣaraṃ viddhi tāḍayēt ityarthaḥ.

(manassu anu śaramucēta (bāṇamu cēta) (guri cūsi) koṭṭataginadi. manassamādhānamu, kēṃdrīkaraṇamu cēyavalayunu. iṭlu cēsina bhagavaṃtuneṭlu telusukonagalugunu? - goppa bāṇamunu tīsukoni, dhanassunu (villunu) tīsukoni, abhyāsamuvalana tīkṣṇamaina guri cūcukoni, dhanassumīda bāṇamunu ekkiṃci (saṃdiṃci) manassunu iṃdriyamulanu viṣayamulanuṃḍi nivartiṃci (tappiṃci), lakṣya vastuvunaṃdē nilipi, tana lakṣyamaina (guri ayina) akṣaruḍagu brahmamaṃdu nilipi, ā lakṣyamaṃdu bhaktuḍaguvāḍu ā bāṇamunu koṭṭavalenu. paina ceppinadānilō praṇavamu dhanassu, bāṇamu ātma, vēdanamu kalugacēyunadaguṭacēta aṃtaḥkaraṇamu bāṇamu. ī bāṇamutō ā dhanassu mīdanuṃci koṭṭavalasina lakṣyamu parabrahmamu. apramattatatō ēkāgra cittamutō ā lakṣyamaina brahmanu telusukonavalenu - sādhāraṇamugā bāṇamunu lakṣyamu mīdaku vaduluṭalō ēkāgrata yunnaṭlē. dēhamu modalagunavi ātmakādani vadali (tiraskariṃci) akṣaruḍaina parabrahmamē phalamani dānini poṃdavalenu).

  1. “yathā dhanuṣā prakṣiptaḥ iṣuḥ lakṣyē ataḥ praṇavaḥ dhanuriva dhanuḥ śarōhyātmāṃtaḥkaraṇaṃ hi śaraḥ śara sadṛśa lakṣyavēdanāccara iva śaraḥ - atra lakṣyaṃtu dadbrahmaiva ucyatē. apramattēna ēkāgracētasā tallakṣyaṃ brahmavēddhavyaṃ, yadhāśarō lakṣyaikatāṃ prāpōti tathā dēhādyātmapratyaya tiraskārēṇa akṣaraikātmyaṃ phalaṃ āpādayēt ithyarthaḥ”.

(paina ‘2’ lō ceppinadānilō dhanassucēta koṭṭabaḍina bāṇamu - praṇavamu dhanassu, bāṇamu (śaramu) ātma aṃtaḥkaraṇamu, lakṣyamu brahmamu - ani telusukonavalenu - bāṇamu lakṣyamunē tākunaṭlu dēhamē ātma yanuṭa tiraskariṃci akṣaruḍaina parabrahmamē ātmayanu siddhāṃtamē phalamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.