← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వేగః vēgaḥ

Original — తెలుగు
  1. రోమాంచన హృష్ట నేత్ర వదనాది లింగోంతః కరణ ప్రక్షోభరూపః కామోద్భవః వేగః. గాత్ర ప్రకంప ప్రస్వేద దష్తౌపుటరక్తనేతాది రింగః క్రోదోద్భవః - వేగః.

(దేహము గగుర్పొడుచుట, సంతోషము, మొగములోను, కళ్ళలోను కనబడు అంతఃకరణముయొక్క ప్రక్షోభము -, కామము వలన కలిగినది వేగము - మాటలలోను గొంతుకవణుకు, చమటపట్టుట, కండ్లు ఎర్రబారుట మొదలగునవి క్రోధము వలన కలుగునది వేగము).

  1. కామక్రోధయోః ఉత్కటావస్థా లోక వేద విరుద్ధ ప్రవృత్యున్ముఖ త్వ రూపా నదీవేగ సామ్యేన వేగః ఇత్యుచ్యతే - యథాహి నద్యాః వేగో వర్షాసు అతి ప్రబలతయా లోకవేదవిరోధ ప్రతిసంధానేన అనిచ్ఛంతమపి గర్తేపాతయిత్వా మజ్జయతిచ. అధో నయతిచ, తథా కామక్రోధ యోరపి వేగః విషయాభిధ్యానా భ్యాసేన వర్షాకాల స్థానీయేన అతి ప్రబలో లోక వేద విరోధి ప్రతి సంథానేన అనిచ్ఛంతమపి విషయ గర్తే పాతయిత్వా సంసారసముద్రే మజ్జయతి చ, అధోమహా నరకాన్నయతిచ.

  2. (వర్షాకాలమునందు నదులు వేగముగా ప్రవహించును. ఇష్టము లేకపోయినను ఈ నదీవేగము ప్రాణులను సుడిగుండములో పడివేయును - అట్లే కామమువలన క్రోధమువలన కలిగిన వేగము మనుజులను - వారికి ఇష్టములేకున్నను - వేదవిరుద్ధమార్గమైన విషయలోలత్వము అను పాడునూతిలో పడవేయును. అట్టి వేగమును - నరకమునకు తీసుకొని పోవకమునుపే - నిగ్రహించవలెను.)

  3. ద్వేషో మన్యుః సచక్రోధః తజ్జోవేగస్త యోర్త్ద్వయోః |

యాచాస్త్యుత్కటావస్థా లోకవేద విరోధినీ |

మార్గే ప్రవృత్తిహేతుత్వాత్ వేగో నద్యా రయో యథా |

నద్యా వేగొపి వర్షాసు ప్రాబల్యాల్లోక వేదయోః |

విరోధి న్యప్యనిచ్ఛంతం కుగర్తే పాతయత్యధః |

తదా కామాదిజో వేగో లోకవేదవిరోధిన |

భోగగర్తేప్యనిచ్ఛంతం నిరయే పాతయత్యధిః |

చిత్తప్రక్షోపరూపంతం స్తంభస్వేవాది లింగకం |

అమృత్యోర్జాత మాత్రం యది హైవ పతనాత్పురా |

తద్దోష దర్శనా భ్యాస జాత వైరాగ్య తేజసా |

మోషీకర్తుం సమర్థోస్తి సయోగీ స సుఖీనరః ||. (గీతాభావప్రకాశము - 5 - 197 to 202)

  1. (translation) కామక్రోధములు ప్రజ్వలించగా వాటియొక్క అత్యుత్కటావస్థ వేగమనబడును - ఈ వేగము నదీవేగమువలె నుండును - నదీవేగములో చిక్కుకున్నవారిని ఇష్టములేకపోయినను ఆ నదీవేగము పాడుగోతిలో పడద్రోయును - ఈ ప్రవాహవేగమును నిగ్రహించుట కష్టము - ఆ ప్రకారముగానే విషయములను అనుభవించుటలో కామక్రోధములు ఒక్కొక్కప్పుడు ప్రబలి మనిషిని నరకరూపమైన పాడుగోతిలో బలవంతముగా కూలదోయును - ఈ వేగము మనస్సులో పుట్టిన తీవ్రమైన కామము లేక క్రోధము వలన కలుగును - చనిపోయేవఱకు దీని ప్రభావము ఉండును - దీనివలన పతనముకాకమునుపే దీనిని అరికట్టి భంగపఱచవలెను - అట్లు చేయువాడే యోగి, అతనే సుఖి, అతనే పురుషుడు. అట్లు చేయనివాడు పశుధర్మములైన ఆహార నిద్రాదులయందే తత్పరుడైనవాడు నరాకారముతోనున్నను పరమ పురుషార్థ పరాఙ్ముఖుడైన పశువుగానే తెలియబడువాడు).

  2. “యథా నదీనాం బహహోంబువేగాః సముద్రమేవాభి ముఖద్రవంతి |

తథా తవామీ నరలోకవీరాః విశంతి వక్త్రాణ్య భి విజ్వలంతి |

యథా ప్రదీప్తం జ్వలనం వతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగాః |

తదైవ నాశాయ విశంతి నాశాయ లోకా స్తనాపి వక్త్రాణి సమృద్ధ వేగాః ||“. (శ్రీమద్భగవద్గీత - 11 - 28, 29)

(నదులన్నియు వాటి ప్రవాహవేగముచే (పల్లముగానుండు) సముద్రము దిశగానే ప్రవహించుచున్నట్లు ఈ రాజులందరు - ఎంత బలశాలులయినను నీ యొక్క (శ్రీకృష్ణభగవానుని యొక్క - నోటిలో ప్రవేశించుచున్నారు - భగవంతుడు వారినందఱిని తన ఆకర్షణశక్తి చేత తనలోనకు లాగుకొనుచున్నాడు - అంతమొందించుచున్నాడు - బాగా కాంతివంతమైన మంటలోనికి రెక్కపురుగులు అది ఆహారమని భ్రమపడి కాలవేగముచే ప్రవేశించుచున్నవి - ప్రవేశించి చనిపోవుచున్నవి. ఆ ప్రకారముగానే ఈ లోకములోని ప్రజలందరు నిన్నే - నీలోనే (భగవంతునిలోనే) ప్రవేశించుచున్నారు - లీనమగుచున్నారు -)

(నదులన్నియు వాటి ప్రవాహవేగముచే సముద్రములోనే కలియుచున్నవి - “నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు” అనినట్లు భూమి మధ్యనుండు ఆకర్షణ శక్తి - (magnetic field in the earth’s core) భూమిమీదనుండు వస్తువులను తనకు దగ్గరగా లాగుకొనును. భూమిమీదనుండు పల్లపు ప్రదేశములు మెట్ట ప్రదేశములకన్నకన్న భూమధ్యభాగమునకు దగ్గరగా నుండుటవలన నీరు మెట్ట ప్రదేశమునుండి పల్లమునకు పారును (by gradient). ఇట్లునీరు పారుటకు భగావంతుని యొక్క శక్తియే కారణము - ఇదియే వేగము అని చెప్పబడినది - ఈ శక్తిని ఆపుదల కష్టము - జీవులు వారి వారి నిర్ణీత కాలము తీరిపోయినతర్వాత, వారికిష్టములేకపోయినను భగవంతునిలో బలవంతముగా నెట్టబడి అంతమునొందుచున్నారు - ఇదియే కాలమనుశక్తి (irresistable force which impels a man to go to a certain place or do a certain thing even against his will - there only to meet his destiny)

Transliteration
  1. rōmāṃcana hṛṣṭa nētra vadanādi liṃgōṃtaḥ karaṇa prakṣōbharūpaḥ kāmōdbhavaḥ vēgaḥ. gātra prakaṃpa prasvēda daṣtaupuṭaraktanētādi riṃgaḥ krōdōdbhavaḥ - vēgaḥ.

(dēhamu gagurpoḍucuṭa, saṃtōṣamu, mogamulōnu, kaḷḷalōnu kanabaḍu aṃtaḥkaraṇamuyokka prakṣōbhamu -, kāmamu valana kaliginadi vēgamu - māṭalalōnu goṃtukavaṇuku, camaṭapaṭṭuṭa, kaṃḍlu errabāruṭa modalagunavi krōdhamu valana kalugunadi vēgamu).

  1. kāmakrōdhayōḥ utkaṭāvasthā lōka vēda viruddha pravṛtyunmukha tva rūpā nadīvēga sāmyēna vēgaḥ ityucyatē - yathāhi nadyāḥ vēgō varṣāsu ati prabalatayā lōkavēdavirōdha pratisaṃdhānēna anicchaṃtamapi gartēpātayitvā majjayatica. adhō nayatica, tathā kāmakrōdha yōrapi vēgaḥ viṣayābhidhyānā bhyāsēna varṣākāla sthānīyēna ati prabalō lōka vēda virōdhi prati saṃthānēna anicchaṃtamapi viṣaya gartē pātayitvā saṃsārasamudrē majjayati ca, adhōmahā narakānnayatica.

  2. (varṣākālamunaṃdu nadulu vēgamugā pravahiṃcunu. iṣṭamu lēkapōyinanu ī nadīvēgamu prāṇulanu suḍiguṃḍamulō paḍivēyunu - aṭlē kāmamuvalana krōdhamuvalana kaligina vēgamu manujulanu - vāriki iṣṭamulēkunnanu - vēdaviruddhamārgamaina viṣayalōlatvamu anu pāḍunūtilō paḍavēyunu. aṭṭi vēgamunu - narakamunaku tīsukoni pōvakamunupē - nigrahiṃcavalenu.)

  3. dvēṣō manyuḥ sacakrōdhaḥ tajjōvēgasta yōrtdvayōḥ |

yācāstyutkaṭāvasthā lōkavēda virōdhinī |

mārgē pravṛttihētutvāt vēgō nadyā rayō yathā |

nadyā vēgopi varṣāsu prābalyāllōka vēdayōḥ |

virōdhi nyapyanicchaṃtaṃ kugartē pātayatyadhaḥ |

tadā kāmādijō vēgō lōkavēdavirōdhina |

bhōgagartēpyanicchaṃtaṃ nirayē pātayatyadhiḥ |

cittaprakṣōparūpaṃtaṃ staṃbhasvēvādi liṃgakaṃ |

amṛtyōrjāta mātraṃ yadi haiva patanātpurā |

taddōṣa darśanā bhyāsa jāta vairāgya tējasā |

mōṣīkartuṃ samarthōsti sayōgī sa sukhīnaraḥ ||. (gītābhāvaprakāśamu - 5 - 197 to 202)

  1. (translation) kāmakrōdhamulu prajvaliṃcagā vāṭiyokka atyutkaṭāvastha vēgamanabaḍunu - ī vēgamu nadīvēgamuvale nuṃḍunu - nadīvēgamulō cikkukunnavārini iṣṭamulēkapōyinanu ā nadīvēgamu pāḍugōtilō paḍadrōyunu - ī pravāhavēgamunu nigrahiṃcuṭa kaṣṭamu - ā prakāramugānē viṣayamulanu anubhaviṃcuṭalō kāmakrōdhamulu okkokkappuḍu prabali maniṣini narakarūpamaina pāḍugōtilō balavaṃtamugā kūladōyunu - ī vēgamu manassulō puṭṭina tīvramaina kāmamu lēka krōdhamu valana kalugunu - canipōyēvaṟaku dīni prabhāvamu uṃḍunu - dīnivalana patanamukākamunupē dīnini arikaṭṭi bhaṃgapaṟacavalenu - aṭlu cēyuvāḍē yōgi, atanē sukhi, atanē puruṣuḍu. aṭlu cēyanivāḍu paśudharmamulaina āhāra nidrādulayaṃdē tatparuḍainavāḍu narākāramutōnunnanu parama puruṣārtha parāṅmukhuḍaina paśuvugānē teliyabaḍuvāḍu).

  2. “yathā nadīnāṃ bahahōṃbuvēgāḥ samudramēvābhi mukhadravaṃti |

tathā tavāmī naralōkavīrāḥ viśaṃti vaktrāṇya bhi vijvalaṃti |

yathā pradīptaṃ jvalanaṃ vataṃgā viśaṃti nāśāya samṛddha vēgāḥ |

tadaiva nāśāya viśaṃti nāśāya lōkā stanāpi vaktrāṇi samṛddha vēgāḥ ||“. (śrīmadbhagavadgīta - 11 - 28, 29)

(nadulanniyu vāṭi pravāhavēgamucē (pallamugānuṃḍu) samudramu diśagānē pravahiṃcucunnaṭlu ī rājulaṃdaru - eṃta balaśālulayinanu nī yokka (śrīkṛṣṇabhagavānuni yokka - nōṭilō pravēśiṃcucunnāru - bhagavaṃtuḍu vārinaṃdaṟini tana ākarṣaṇaśakti cēta tanalōnaku lāgukonucunnāḍu - aṃtamoṃdiṃcucunnāḍu - bāgā kāṃtivaṃtamaina maṃṭalōniki rekkapurugulu adi āhāramani bhramapaḍi kālavēgamucē pravēśiṃcucunnavi - pravēśiṃci canipōvucunnavi. ā prakāramugānē ī lōkamulōni prajalaṃdaru ninnē - nīlōnē (bhagavaṃtunilōnē) pravēśiṃcucunnāru - līnamagucunnāru -)

(nadulanniyu vāṭi pravāhavēgamucē samudramulōnē kaliyucunnavi - “nīru pallamerugu, nijamu dēvuḍerugu” aninaṭlu bhūmi madhyanuṃḍu ākarṣaṇa śakti - (magnetic field in the earth’s core) bhūmimīdanuṃḍu vastuvulanu tanaku daggaragā lāgukonunu. bhūmimīdanuṃḍu pallapu pradēśamulu meṭṭa pradēśamulakannakanna bhūmadhyabhāgamunaku daggaragā nuṃḍuṭavalana nīru meṭṭa pradēśamunuṃḍi pallamunaku pārunu (by gradient). iṭlunīru pāruṭaku bhagāvaṃtuni yokka śaktiyē kāraṇamu - idiyē vēgamu ani ceppabaḍinadi - ī śaktini āpudala kaṣṭamu - jīvulu vāri vāri nirṇīta kālamu tīripōyinatarvāta, vārikiṣṭamulēkapōyinanu bhagavaṃtunilō balavaṃtamugā neṭṭabaḍi aṃtamunoṃducunnāru - idiyē kālamanuśakti (irresistable force which impels a man to go to a certain place or do a certain thing even against his will - there only to meet his destiny)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.