← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విభుః vibhuḥ

Original — తెలుగు
  1. ప్రభువు, భర్త.

(ప్రభువైనవాడు - భరించువాడు)

  1. ప్రభుః - ప్రభుత్వం నియంతృత్వం.

(ప్రభువు అనగా నియంత - అన్నింటినీ నియమించువాడు).

  1. సర్వశక్తిమాన్ - (అన్నివిధములైన శక్తులు కలవాడు).

  2. సమర్థః

(ఏ కార్యమునైనను చేయుటలో సమర్ధుడైనవాడు - శక్తిమంతుడు - చేతనయినవాడు)

  1. “వివిధం ఆసీత్ ఇతి విభుః” (శ్రీ ఆనందతీర్థః)

(అనేక విధములుగా నుండువాడు).

  1. నానాకారతయా విద్యమానః -

(అనేక రూపములతో నుండువాడు)

  1. వివిధేన ప్రకారేణ భవతి ఇతి విభుః - సకల భువన వ్యాపకః.

(అనేక ప్రకారములుగా నుండువాడు, పుట్టువాడు, లోకములన్నింటియందును వ్యాపించి యుండు వాడు)

  1. వివిధం బ్రహ్మాది స్థావరాంత ప్రాణిభేదైర్భవతీతి విభుః -

(చతుర్ముఖ బ్రహ్మ మొదలు స్థావరములవఱకు గల అనేక విధములైన ప్రాణములుగా పుట్టువాడు)

  1. ఆకాశాది వివిధకార్య రూపేణ భవతీతి విభుః - తస్మాత్ సర్వగతం -

(ఆకాశము మొదలగు అనేక విధములైన కార్యవస్తువులుగా పుట్టువాడు - ఉండువాడు)

  1. బ్రహ్మాది స్తంబాంత వివిధ జంతు రూపేణ భవతీతి విభుః -

(చతుర్ముఖబ్రహ్మ మొదలు స్తంబమువరకు గల అనేక విధములైన జంతువుల (ప్రాణుల) రూపముతో నుండువాడు, పుట్టువాడు)

  1. వ్యాపీ - వ్యాపకః, సర్వవ్యాపకః -

(తాను ఒక్కడే అయినను అనేకవస్తువులుగా, అనేక వస్తువులుగా వ్యాపించియుండువాడు - అన్నింటిలోను పూర్తిగా వ్యాపించియుండు స్వభావము గలవాడు)

  1. “హిరణ్యగర్భాది రూపేణ వివిధం భవతీతి విభుః” (శ్రీశంకరః)

(హిరణ్యగర్భుడు - చతుర్ముఖబ్రహ్మ - మొదలగు రూపములతో అనేకముగా, అనేక వస్తువులుగా నుండువాడు)

  1. “సర్వత్ర వర్తమానత్వాత్ త్రయాణాం లోకానాం విభుత్వాత్ విభుః”.

(అన్నిచోట్ల నుండుటవలనను, లేక, మూడులోకములకు - స్వర్గ, మర్త్య, పాతాళములకు - ఊర్థ్వలోకములకు, మధ్యలోకమునకు అధోలోకములకు (ఇవియే పదునాలుగు లోకములు) విభుత్వము, ప్రభుత్వము గలవాడగుటచేత విభువు).

  1. సర్వమూర్త ద్రవ్య సం యోగిత్వం విభుత్వం.

(అన్నిరూపములను, అన్ని వస్తువులను కలిపియుంచుటచేత విభువు)

  1. వివిధం స్థానత్రయం - ప్రాజ్ఞ, తైజస, విశ్వ లక్షణం) అస్మాత్ భవతీత్యుత్పత్యా తురీయ విభు రుచ్యతే.

(ప్రాజ్ఞుడు, తైజసుడు, విశ్వుడు అను లక్షణములుగల స్థానత్రయము ఇతనివలన కలుగుచున్నవి అను వ్యుత్పత్త్యర్థమును బట్టి వీటికి కారణమైన తురీయావస్థ రూపుడైనవాడు కనుక విభువు)

  1. “మహావైభవశాలీ” (శ్రీరంగ రామానుజః)

(గొప్ప వైభవముగలవాడు)

  1. దేశాపరిచ్ఛిన్నః -

(ఒక చోట నుండును, మఱియొకచోట నుండడు అను దేశపరిచ్ఛేదము లేకుండ అంతట నుండువాడు).

  1. వివిధం భవతీతి విభుః -

(అనేక విధములుగ పుట్టువాడు - సృష్టిలో అనేక రూపములు దాల్చువాడు - అవతారములఓ అనేక విధములైన రూపములు దాల్చువాడు)

  1. బ్రహ్మాండకోటి స్రష్టాచ కటాక్ష క్షణమాత్రతః |

సహర్తా పాలకశ్చైవకో(అ)న్యే భవేద్విభుః- ||“. (ఆది పురాణము - 7 - 65)

(కటాక్ష క్షణమాత్రమున కోటి బ్రహ్మాండములను సృష్టించి, వాటిని పాలించి నశింపచేయువాడు) - ఇట్లు సృష్టి,స్థితి,లయములు చేయగలవాడు ఇంకెవరును లేరు)

Transliteration
  1. prabhuvu, bharta.

(prabhuvainavāḍu - bhariṃcuvāḍu)

  1. prabhuḥ - prabhutvaṃ niyaṃtṛtvaṃ.

(prabhuvu anagā niyaṃta - anniṃṭinī niyamiṃcuvāḍu).

  1. sarvaśaktimān - (annividhamulaina śaktulu kalavāḍu).

  2. samarthaḥ

(ē kāryamunainanu cēyuṭalō samardhuḍainavāḍu - śaktimaṃtuḍu - cētanayinavāḍu)

  1. “vividhaṃ āsīt iti vibhuḥ” (śrī ānaṃdatīrthaḥ)

(anēka vidhamulugā nuṃḍuvāḍu).

  1. nānākāratayā vidyamānaḥ -

(anēka rūpamulatō nuṃḍuvāḍu)

  1. vividhēna prakārēṇa bhavati iti vibhuḥ - sakala bhuvana vyāpakaḥ.

(anēka prakāramulugā nuṃḍuvāḍu, puṭṭuvāḍu, lōkamulanniṃṭiyaṃdunu vyāpiṃci yuṃḍu vāḍu)

  1. vividhaṃ brahmādi sthāvarāṃta prāṇibhēdairbhavatīti vibhuḥ -

(caturmukha brahma modalu sthāvaramulavaṟaku gala anēka vidhamulaina prāṇamulugā puṭṭuvāḍu)

  1. ākāśādi vividhakārya rūpēṇa bhavatīti vibhuḥ - tasmāt sarvagataṃ -

(ākāśamu modalagu anēka vidhamulaina kāryavastuvulugā puṭṭuvāḍu - uṃḍuvāḍu)

  1. brahmādi staṃbāṃta vividha jaṃtu rūpēṇa bhavatīti vibhuḥ -

(caturmukhabrahma modalu staṃbamuvaraku gala anēka vidhamulaina jaṃtuvula (prāṇula) rūpamutō nuṃḍuvāḍu, puṭṭuvāḍu)

  1. vyāpī - vyāpakaḥ, sarvavyāpakaḥ -

(tānu okkaḍē ayinanu anēkavastuvulugā, anēka vastuvulugā vyāpiṃciyuṃḍuvāḍu - anniṃṭilōnu pūrtigā vyāpiṃciyuṃḍu svabhāvamu galavāḍu)

  1. “hiraṇyagarbhādi rūpēṇa vividhaṃ bhavatīti vibhuḥ” (śrīśaṃkaraḥ)

(hiraṇyagarbhuḍu - caturmukhabrahma - modalagu rūpamulatō anēkamugā, anēka vastuvulugā nuṃḍuvāḍu)

  1. “sarvatra vartamānatvāt trayāṇāṃ lōkānāṃ vibhutvāt vibhuḥ”.

(annicōṭla nuṃḍuṭavalananu, lēka, mūḍulōkamulaku - svarga, martya, pātāḷamulaku - ūrthvalōkamulaku, madhyalōkamunaku adhōlōkamulaku (iviyē padunālugu lōkamulu) vibhutvamu, prabhutvamu galavāḍaguṭacēta vibhuvu).

  1. sarvamūrta dravya saṃ yōgitvaṃ vibhutvaṃ.

(annirūpamulanu, anni vastuvulanu kalipiyuṃcuṭacēta vibhuvu)

  1. vividhaṃ sthānatrayaṃ - prājña, taijasa, viśva lakṣaṇaṃ) asmāt bhavatītyutpatyā turīya vibhu rucyatē.

(prājñuḍu, taijasuḍu, viśvuḍu anu lakṣaṇamulugala sthānatrayamu itanivalana kalugucunnavi anu vyutpattyarthamunu baṭṭi vīṭiki kāraṇamaina turīyāvastha rūpuḍainavāḍu kanuka vibhuvu)

  1. “mahāvaibhavaśālī” (śrīraṃga rāmānujaḥ)

(goppa vaibhavamugalavāḍu)

  1. dēśāparicchinnaḥ -

(oka cōṭa nuṃḍunu, maṟiyokacōṭa nuṃḍaḍu anu dēśaparicchēdamu lēkuṃḍa aṃtaṭa nuṃḍuvāḍu).

  1. vividhaṃ bhavatīti vibhuḥ -

(anēka vidhamuluga puṭṭuvāḍu - sṛṣṭilō anēka rūpamulu dālcuvāḍu - avatāramulaō anēka vidhamulaina rūpamulu dālcuvāḍu)

  1. brahmāṃḍakōṭi sraṣṭāca kaṭākṣa kṣaṇamātrataḥ |

sahartā pālakaścaivakō(a)nyē bhavēdvibhuḥ- ||“. (ādi purāṇamu - 7 - 65)

(kaṭākṣa kṣaṇamātramuna kōṭi brahmāṃḍamulanu sṛṣṭiṃci, vāṭini pāliṃci naśiṃpacēyuvāḍu) - iṭlu sṛṣṭi,sthiti,layamulu cēyagalavāḍu iṃkevarunu lēru)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.