← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విభూతి vibhūti

Original — తెలుగు
  1. ఐశ్వర్యం; ఏతాం సర్వస్య మదాయత్తోత్పత్తి స్థితి ప్రవృత్తిరూపాం విభూతిం.

(ఐశ్వర్యము - ఈశ్వరత్వము; నావలన (భగవంతునివలన) సృష్టి స్థితి లయములుగల యీ కనబడు ప్రపంచము నా విభూతి - భగవంతుడే ప్రపంచములోని అన్ని వస్తువులుగా నగుట)

  1. విభః; సంపత్తిః; ప్రభుత్వం -

(వైభవము; సంపద, ప్రభువైయుండుట).

  1. వివిధం భూతిః -

(అనేకవిధములుగా, అనేక రూపములుగా, పుట్టుట).

  1. “నియమన విశేషాః విభూతయః -” (శ్రీమాన్ రామానుజః)

(అనేక విధములుగా రూపములుగా నియమించబడినవి విభూతులు -)

  1. “ఆత్మనః మహాత్మ్య విస్తరాః” (శ్రీశంకరః)

(ఆత్మయొక్క మహాత్మ్యము అనేక విధములుగా, అనేక రూపములుగా విస్తరించియుండునవి విభూతులు).

  1. విభూతిత్వం నామ నియామ్యత్వం.

(విభూతి అనగా నియమించగలుగుట - ప్రపంచమును సృష్టిచేసి, దానిలోని వస్తువులలో తాను ప్రవేశించి, వాటిని వాటి వాటి పనులలో నియమించుట - వాటిని నియమించిన పనులను అవి నెరవేర్చునట్లు చూచుట)

  1. భగవంతుడు అనేక రూపములతో తానే యగుట విభూతి యని చెప్పబడినది - అది యెట్లంటే –

    1. మత్తకోకిల “ఒక్కవేళను సూక్ష్మరూపము నొందుదీవణుమాత్రమై

యొక్క వేళను స్థూల రూపమునొందు దంతయు నీవయై

పెక్కు రూపులు దాల్చు నీదగు పెంపు మాకు నుతింపగా

నక్కజంబగుచున్న దేమన నంబుజాక్ష రమాపతీ“.

  1. “జ్యోతీం షి విష్ణుః భువనాని విష్ణుః, వనాని విష్ణుఃగిరయో దిశశ్చ |

నద్యః సముద్రాశ్చ స ఏవ సర్వం యదస్తి యన్నాస్తి చ విప్రవర్య ||“. (విష్ణుపురాణము)

(ప్రకాశరూపములైన నక్షత్రములు మొదలగునవియు, లోకములు, కొండలు, నదులు, దిక్కులు, సముద్రములు, ఈ సర్వము, ఇదంతయు ఉన్నదీ, లేనిదీ అంతయు విష్ణువే).

  1. శ్రీకృష్ణుడు నరకాసురుడు చెరలోనుంచిన పదియారు వేల రాజ కన్యకలను ఒకే ముహూర్తమున వివాహమాడెను -

“చ. అమిత విహారుడీశ్వరుడనంతుడు దానొకనాడు మంచి ల

గ్నమున బదాఱువేలభవనంబులలోన బదాఱువేల రూ

పముల బదాఱువేల నృపబాలల బ్రీతి బదారువేల చం

దముల విభూతి నొందుచు యథావిధితో వరియించే, భూవరా.

ఉ. దానములందు, సమ్మద విధానములందవలోకనా భాషణా

వ్వానములందు నొక్క క్రియ నాలలితాంగుల కన్ని మూర్తులై

తాన నిశంబుగానబడి, తక్కువ ఎక్కువ లేక యుత్తమ

జ్ఞాన గృహస్థ ధర్మమున జక్రి రమించె బ్రపూర్ణకాముడై“. (శ్రీమదాంధ్రమహాభాగవతము- 10 - ఉ.భా - 220)

ఒకే సమయమున నందఱి రాజకుమారికల ఇండ్లలో నుండుచు వారి నలరించుచుండుట నారద మహర్షి చూచి ఆశ్చర్యపోయెను - “మ. ఒక యింటం గజవాజిరోహకుడునై, యొక్కింట భుంజానుడై

సకలాత్ముండు పరుండు షోడశ సహస్ర స్త్రీ నివాసంబులం

దొక బోటింటను దప్పకుండ నిజమాయోత్సాహుడై యుండ న

య్యకలంకున్ వరదున్ - - -

“క||. మాయురె హరి, హరి, వరదయ

మేయ గుణా యనుచు నాత్మ మెచ్చి మునీంద్రుడు - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా - 627,630)

  1. శ్రీకృష్ణుడు నగరప్రవేశము చేయునపుడు -

“మ. ఒక దేవీ భవనంబుమున్ను సొర వేఱొక్కర్తు లోగుందునో,

సుకరాలాపములాడదో, సొలయునో, సుప్రీతి నీక్షింపదో,

వికలత్వంబున నుండునో యనుచు నవ్వేళన్ వధూగేహముల్

ప్రకటాశ్చర్య విభూతి జొచ్చె బహు రూపవ్యక్తుడై, భార్గవా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 11 - 225)

  1. “తే. సతత యౌవన సుందరీ యుత విహారు

డగుచు, సతులెందఱకన్ని రూప

ములను గ్రీడించె బెక్కబ్దములు సెలంగి

నందనందనుడ భివనానంద లీల”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 3 - 132)

  1. గోవర్థన గిరి నెత్తిన తర్వాత నాగలికి పూజ చేయమని శ్రీకృష్ణుడు గోపకులతో చెప్పి, తాను ఆ కొండరూపమై గోపకులలో నొకడై, గోపకులు ఆ కొండకు ఆరగింపు తానే ఆరగించెను –

“మ. సకాలాభీరులు వీడె కృష్ణుడన నైజంబైన రూపంబుతో

నకలంక స్థితినుండి, శైలమిదె మీరర్చింపరండంచు దా

నొక శైలాకృతి దాల్చి గోపకులతో నొండండ పూజించి గో

పక దత్తాన్నములారగించె విభుడా ప్రత్యక్ష శైలాకృతిన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. - 93)

  1. ఆవు పెయ్యలను, గొల్ల పిల్లలను చతుర్ముఖబ్రహ్మ ఒక కొండ గుహలో సుమారు సంవత్సరము కాలము దాచి యుంచినపుడు ఆ గోప బాలురు, ఆ గోవత్సములు యొక్క రూపములు తానే అయి శ్రీకృష్ణుడు వారి తల్లులకు (గోపబాలుర తల్లులుకుగాని, గోవత్సముల తల్లులైన గోవులకుగాని) ఈ విషయము తెలియనీయ కుండునట్లు చేసెను - గోపబాలురకు గాని, గోవత్సములకుగాని యీ విషయము తెలియదు - గోపబాలురు గడిచిన సంవత్సరము ఒక దినముగానే భావించిరి, ఇట్లు గోప బాలుర రూపములు గోవత్సముల రూపములు తానే యగుట తన విభూతియే –

“క. గోపాల సుతులు లేరని

గోపికలకు చెప్పనేల, గోపాలకులున్

గోపికలు నలర బాలుర

క్రేపుల రూపములనే జరించెదననుచున్.

“మ.కరముల్ పాదములున్ శిరంబు లవలగ్నంబుల్ ముఖంబుల్ భుజాం

తరముల్ ముక్కులు గన్నులున్ శ్రవణముల్ దంతాదులున్ దండకాం

బరస్రగ్వేణువిషాణ భూషణ నయో భాషా గుణాఖ్యాన త

త్పరతల్ వీడ్వడకుండ దాల్చె విభుడా వత్సార్భ కాకారముల్.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా.- 511,512)

“క. రూపంబులెల్లనగు బహు

రూపకుడిట్లు బాలవత్స రూపంబులతో

నేపారుటేమి చోద్యము

రూపింపగ నతని కితర రూపము గలదే.

“క. మరలుపుమనియెడు కర్తయు

మరలించు కుమారకులును మరలెడి క్రేపుల్

పరికింప దానయై హరి

మరలం జనె లీలతోడమందునధిపా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. - 514,515)

  1. శ్రీకృష్ణుడు గోపికలతో కూడి రాస క్రీడ సలిపినపుడు తానొక్కడైనను, గోపవనితలెందరో అందఱికి అంతమంది కృష్ణరూపములనొందెను -

“వ. సరళంబగు మురళంబు లీలం గేల నందుకొని మధురంబగు నధరంబునం గదియించి - - - మురళీ రవంబులు సారించి పూరించుచు సరిలేని భంగిం ద్రిభంగియై కమల కర్ణికాకారంబున నడుమ నిలిచి, మఱియు గోప సుందఱందఱకు నందఱయి, సుందఱుల కవలయడలం దానును, దనకవలయడల సుందరులును దేజరిల్ల నృత్త విద్యా మహార్ణవ వేలావల యితంబై విస్మితాఖండలంబయి నరాస మండలంబు గల్పించి - --”. (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 10- పూ. భా. - 1085)

“వ. ఇట్లు భగవంతుడైన కృష్ణుండాత్మారాముండయ్యును గోపసతులెందరందఱకు నందఱై నిజ ప్రతిబింబంబుల తోడం గ్రీడించు బాలు పోలిక రాసకేలి సలిపిన - - -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - పూ. భా. -1100)

“శ్లో||. అంగనామంగనా మాంతరే మాధవో, మాధవం మాధచాంతరేణాంగనా |

ఇత్థమా కల్పితే మండలే మధ్యగః సంజగౌ వేణునా దేవకీ నందనః ||“. (శ్రీకృష్ణకర్ణామృతం - 2 - 35)

ఇట్లు శ్రీకృష్ణుడొకడే అయినను గోపికలెందరో అందరకు అంతమంది కృష్ణులై తానా రూపములను దాల్చుట యతని విభూతియే).

  1. “యథాన జాయతే పుత్రః పితరం మాతరం వినా |

తథా భవం భవానీం వినా సైతచ్చరాచరం |

స్త్రీ పుంస ప్రభవం విశ్వం స్త్రీ పుంసాత్మకమేవ చ |

స్త్రీ పుంసయోర్విభూతి శ్చ స్త్రీ పుంసాభ్యా మథిష్ఠితం |

- - - శంకరః పురుషాస్సర్వే స్త్రియ స్సర్వా మహేశ్వరీ ||.

సర్వే స్త్రీ పుం రూపాస్తస్మాత్ తయోరేవ విభూతియః |

- - - పుంలింగమఖిలం ధత్తే భగవాన్ పురశాసనః |

స్త్రీలింగ మఖిలంధత్తే దేవీ దేవమనోరమ |

- - - యస్య యస్య పదార్థస్య యా యా శక్తిరుదాహృతా |

సాసా సర్వేశ్వరీ దేవి సస శర్వో మహేశ్వరః |

- - - యథా దీపస్య దీప్తస్య శిఖ దీపయతే గృహం |

తదా తేజస్తయో రేతత్ వ్యాప్త్యా దీపయ తే జగత్ |

- - - యే య ముక్తా విభూతిర్వై ప్రకృతీ సా పరాస్మృతా |

అప్రాకృతీం పరామన్యాం గుహ్యం గుహ్య విదో విదుః |

యతో వాచో నివర్తంతే మనసా చేంద్రియై స్సహ |

అప్రాకృతిః పరాసైషా విభూతిః పరమేశ్వరీ |

సైవేహ పరమంధామ సైవేహ పరమాగతిః |

సైవేహ పరమా కాష్ఠా విభూతిః పరమేష్ఠినః |

తాం ప్రాప్తుం ప్రయతంతే (అద్య) జితశ్వాసా జితేంద్రియాః |

- - విభూతిం శివయోర్విద్వాన్ న బిభేతి కుతశ్చన |

యః పరామపరాంచైవ విభూతిం వేత్తి తత్వతః |

సో(అ)పరాం భూతి ముల్లంఘ్య పరాభూతిం సమశ్నుతే ||. (సూతసంహితాయాం)

తల్లిదండ్రులు లేక పుత్రుడు పుట్టనట్లు, శివుడు, పార్వతి లేక ఈ సమస్త చరాచరరూపమైన ప్రపంచము పుట్టదు - స్త్రీ పురుషుల సం యోగము వలన కలిగిన ప్రపంచము స్త్రీరూపములు, పురుష రూపములు గలదియే, స్త్రీ పురుషులైన శివ పార్వతుల విభూతులే, వారిచే నదిష్ఠింపబడియుండునవే - - - పురుషు లందరూ శంకరుడే, స్త్రీలందరూ పార్వతియే. అందుచేత స్త్రీరూపములు, పురుషరూపములన్నియు వారిద్దరి విభూతిలే. భగవంతుడైన శివుడు పురుషరూపమును ధరించును, శివుని భార్య అయిన పార్వతీ దేవి స్త్రీరూపములు ధరించును. ఏ వస్తువులో ఏ శక్తియున్నదో అది శివుడే, అది అతని శక్తి అయిన పార్వతియే. ప్రకాశించుచున్న దీపము గృహమును ప్రకాశింప చేయునట్లు పార్వతీ పరమేశ్వరులయొక్క తేజస్సు (ప్రకాశము) చేతనే జగత్తు అంతయు ప్రకాశించుచున్నది - పుట్టి పోషింపబడుచున్నది. ఈ విభూతి యని చెప్పబడినది అపరా ప్రకృతి. దానిని సూక్ష్మ వేత్తలు -సూక్ష్మాతి సూక్ష్మమైన వస్తువులను తెలుసుకొనువారు - యెరుగుదురు. ఇది మనసుచేత ఊహించలేనిది, ఇంద్రియములకు గోచరముకానిది. ఇదియే పరమేశ్వరుని విభూతి అయిన పరమేశ్వరి. ఆ పరమేశ్వరియే పరమ థామము పరమగతి యని చెప్పబడుచున్నది. ఆమెయే ఈశ్వరుని విభూతులన్నింటిలోను ఉత్కృష్టమైనది - పరాకాష్ట అయినది. ఇంద్రియజయముకలవారు, ప్రాణాయామము చేయువారు పొంద దలచు స్థానమిదియే. శివుని యొక్క విభూతిని తెలిసినవానికి ఏ విధమైన భయము లేదు -పరావిభూతిని అపరావిభూతిని వాటి తత్వమును యధార్ధముగా తెలిసినవాడు, అపరావిభూతిని ఉల్లంఘించి, దాటి, పరవిభూతిని పొందుదురు).

ప్రకృతి దానివలన కలిగినవి భగవంతునికి ఉపాధులు - నివసించు చోటులు - ఇట్లు అన్ని వసువులలోను భగవంతుడున్నప్పటికీ ఆ ఉపాధుల నైర్మల్యమువలన భగవంతుని సత్తా - చైతన్యశక్తి - కొన్నింటిలో ప్రబలముగా అనేక విధములుగా వ్యక్తమగును - అట్లు భగవచ్ఛక్తి వ్యక్తమగు ఉపాధులు భగవంతుని విభూతులని చెప్పబడుచున్నవి. ఉపాసన చేయుటలో యీ ఉపాధుల రూపమును గాక వాటిలో నణగియుండు భగవంతుని - తన శక్తిరూపములో నున్న భగవంతుని - ధ్యానించవలెను -గోడమీదపడిన సూర్యకాంతి బాగుగ ప్రతిబింబించదు, నిర్మలముగానున్న అద్దముమీద పడిన సూర్యకాంతి బాగుగా ప్రతిబింబించును. ఈ ప్రకారముగానే భగవంతుని అంశ - చిచ్ఛక్తి - మూర్ఖునియందు ప్రకటముకాదు - సామాన్యమానవునందు కొద్దిగా ప్రకటమగును - సాత్విక ప్రభావముగలవానియందు, భగవద్భక్తునియందు బాగుగా ప్రకటమగును. వాటిని భగవద్విభూతులని వాటిలో ప్రకటమగుచున్న భగవంతుని ఉపాసనచేయవలెను.

“చ. క్రమమున మింటికై యెగయుగాక విహంగము మింటిదైన పా

రము గన నేర్చునే?, హరి పరాక్రమ మోపినయంత గాక స

ర్వము వివరింప నెవ్వడు ప్రవర్తకుడౌ? మునులార, నాదు చి

త్తమునకు నెంత గానబడె దప్పక చెప్పెద మీకు నంతయున్ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 18 - 453))

  1. “వ. చరాచర భూతంబయిన జగంబంతయు మదాకారంబు గా భావించి భూతంబులందు నాధారభూతంబును, సూక్ష్మంబులందు జీవుండును, దుర్జయంబులందు మనంబును దేవతలందు పద్మగర్భుండును - - - ఇవి యన్నియు మద్విభూతులుగా నెఱుంగుము.”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 105)

(మిగిలిన విభూతులకు చూడుము శ్రీమదాంధ్రమహాభాగవతము)

“క. ధరణీ వల్లభ! విను,

హరి మాయా గుణ విభూతులగు జలనిధులుం

బరగిన దీవులు వర్షము

లరయంగా గొలది వెట్ట నలవియె జగతిన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 2 - 15 - 15)

  1. విభూతి యనగా యీ క్రిందను కొన్ని చెప్పబడినవి : -

    1. వివిధోభాతి; మహిమా -

(అనేక విధములుగా ప్రకాశించునది; మహిమ, గొప్పతనము)

  1. అభివ్యక్తం సత్

(లోపల గూఢముగా నున్నను శక్తి సామర్థ్యములద్వారా లోపల నున్నట్లు పైకి ప్రకటన చేయునట్లుగా కనబడు భగవంతుని సత్తా - చిచ్ఛక్తి, చైతన్య శక్తి –

“సీ. అఖిల భూతములందు ఆత్మరూపంబున - ఈశుండు హరి యుండునెల్లప్రొద్దు; బుద్ధ్యాదిరూపంబుల గానబడును -”.

  1. “హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః |

ప్రాధాన్యతః కురుశ్రేష్ట నాస్త్యంతోస్తి విస్తరస్య మే ||” (శ్రీమద్భగవద్గీత - 10 - 19, 20)

“స విశేషస్య తస్య ప్రాగ్ధ్యానో పాయాః విభూతయః |

నిర్విశేషస్య తస్యైవ జ్ఞానో పాయా స్తదేరితాః |

- - - దుర్విజ్ఞేయం పరం తత్వం శ్రీమద్భగవతో హరేః |

అతో జ్ఞానయ తత్తత్వం తద్ధ్యానాయ విభూతయః |

దశమే ప్రవక్ష్యంతే ముముక్షూణాం హితాయచ |

ప్రోత్సాహ యితుమత్రాదౌ శ్రోతారం హరిర బ్రవీత్ ||. (గీతాభావప్రకాశము - 10 - 2 to 6)

(సవిశేష బ్రహ్మను సాధించుటకు ఉపాయములైనవి విభూతులు - ఇవియే నిర్విశేష పరబ్రహ్మగుఱించి అయిన జ్ఞానమునకు ఉపాయములు:

“హంత తే కథ యిష్యామి - - - నాస్త్యం తో విస్తరస్య మే ||

అహమాత్మా గుఢాకేశ సర్వ భూతాశయ స్థితః |

అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ ||“. (శ్రీమద్భగవద్గీత - 10 - 19, 20)

“మమ సాధారణా దివ్యాః ప్రసిద్ధాః యా విభూతయః |

అశక్యా విస్తరాద్వక్తుం నాస్త్యం తో విస్తరస్య మే |

అతః ప్రాథాన భూతా స్తా విభూతీః కాశ్చి దేవహి |

తుభ్యం సం కథయిష్యామి కురుశ్రేష్ఠో యతో భవాన్ ||

తత్రాదౌ చింతనీయం యన్ముఖ్యం తత్ప్రథమం శృణు |

హృద్దేశే సర్వ భూతానాం అంతర్యామితయా స్థితః |

ప్రత్యగాత్మాత్మనా చైవ పరానంద ఘనో(అ)చ్యుతః |

త్వ యైవ వాసుదేవో హం ధ్యేయో నిత్యం జితాలస |

చేతనానాం సమస్తానాం యతోహం జన్మకారణం|

మధ్యే స్థిత ర్లయోంతేచ మత్తో భిన్నం న కించన |

సర్వచేతన వర్గాణాం జన్మస్థితి లయాత్మనా |

తత్కారణాత్మనా వాహమేవ ధ్యేయ ఇతీరితః ||“. (గీ తాభావప్రకాశము - 10 - 97 to 100)

(అసాధారణమైనటువంటీన్నీ, దివ్యమైనటువంటిన్నీ, ప్రసిద్ధి పొందినటువంటిన్నీ నా విభూతులు విస్తరించి చెప్పుటకు - నిశ్శేషముగా చెప్పుటకు - శక్యము కానివి. నేను ఈ సృష్టిలో, అంతటిలోను, సృష్టిలోని ప్రతివస్తువులోను అంతములేకుండ వ్యాపించియున్నాను - అందుచేత ముఖ్యమైన వాటిని కొన్నింటిని చెప్పెదను. నా గుఱించి ధ్యానము చేయుటకు అయిన విభూతులలో ముఖ్యమైనది మొదటిది వినుము - సమస్త భూతములలోను హృదయమందత్మరాత్మగాను, ప్రత్యగాత్మలో ఆథ్మగానున్నాను. అందుచేత - అన్నింటిలోను నివసించియున్నందున వాసుదేవుడని చెప్పబడుచున్నాను. అట్లు నన్ను ధ్యానింపుము. సమస్తమైన చేతన వస్తువుల జన్మమునకు, స్థితికి, లయమునకు - నాశమునకు - నేనే కారణము. అందుచేత నాకన్న వేఱైనదేదియు లేదు. సమస్త చేతన వస్తువులకు జన్మ స్థితి లయములు నేనే యగుటవలన వాటికి కారణమైనవాడినిగా నేనే ధ్యానము చేయతగినవాడను).

(ఈ ప్రకారముగ ముఖ్యమైన విభూతి మొదట చెప్పి తర్వాత కొన్ని కొన్ని రకముల వస్తువులలో ముఖ్యమైనటువంటివాటిని - తన సత్తా హెచ్చుగానున్నవాటిని - చెప్పుట ప్రారంభించెను)

- ” ఆదిత్యానామహం విష్ణుః -” (శ్రీమద్భగవద్గీత - 10 - 21 to 38)

ద్వాదశాదిత్త్యులలో విష్ణువను ఆదిత్యుడను నేనే. అదితియొక్క కుమారులు ఆదిత్యులు - వీరిలో వామనుడను పేరుతో అవతారమెత్తిన శ్రీమహావిష్ణువు ఒకడు - ఆదిత్యులందఱు ప్రకాశరూపులే, తేజోవంతులే అయినను వారందఱిలోను హెచ్చు భగవచ్ఛక్తి గలవాడు వామనుడు. అందుచేత ఆదిత్యులలో విష్ణువు తన విభూతి యని శ్రీకృష్ణభగవానుడు చెప్పెను –“అక్షరాణామకారోస్మి” - (అకారము మొదలు క్షకారము అంతముగా గల - క్షకారము ఆఖరిదిగా గల - అక్షరములన్నింటిలోను మొదటి అక్షరమైన ‘అ’ కారము నేనే - భగవంతుడే - భగవంతుని విభూతియే - అక్షరములన్నియు ‘అ’ కారముయొక్క వికారములే - అక్షరములన్నింటిలోను భగవంతుని అంశ యున్నప్పటికి వాటి అన్నింటిలోకంటె అకారములో భగవదంశ విశేషముగా నున్నది. మిగిలిన అక్షరములన్నియు అకారము యొక్క వికారములే - (‘అ’ ఇతి బ్రహ్మ. “ఓమిత్యేకాక్షరం బ్రహ్మ” ‘క’ ఇతి బ్రహ్మ.)

(సమస్త భూతములు పుట్టుటకు కారణమైన బీజము నేనే - భూతములన్నియు ఒకదానిలోనుండి ఒకటి పుట్టి ఒకదానికొకటి కారణ మైనప్పటికీ వాటి అన్నింటికీ మొదటి కారణము (మూల కారణము, మూల బీజము) నేనే - ప్రతి కారణవస్తువులోనుండి కార్యవస్తువు పుట్టుటకు కారణ వస్తువునందుండు కారణము నేనే - కనుక సృష్టి ప్రారంభములోనే కాక ప్రతి కారణవస్తువులో నుండి కార్య వస్తువు పుట్టుటకు కారణవస్తువులో కారణరూపముగా నున్నది నేనే - ఇట్లు సృష్టి అంతటిలోను ఏ వస్తువులోనైనను ఇంకొక వస్తువు పుట్టుటకు కారణము నేనే - కారణవస్తువులో నేను లేనిదే కార్యవస్తువేదియు పుట్టదు - ప్రతి కారణవస్తువులోను నేనుండుటవలననే ఆదినుండి ఇప్పటివఱకు సృష్టి జరుగుచున్నది. అట్లుగాకున్న సృష్టి ఏనాడో ఆగిపోయి యుండును). అందుచేత లోన నేను లేని చరాచరభూతము లేదు - “ఆ హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు”.

“ఇయత్తా నాస్తి దివ్యానాం విభూతీనాం మమేశితుః |

సర్వజ్ఞే నాపి వక్తుం వా జ్ఞాతుం వా నైవ శక్యతే |

ఇయత్తా మద్విభూతీనాం అనంతనాం కథంచన |

విభూతేరేష విస్తారః ప్రోక్తస్తే చైక దేశతః |

సంగ్రహీతు మనుక్తాహి విభూతీరీశు తుర్హరేః |

సమ్యగ్బోధాయ తనిద ముపలక్షణ ముచ్యతే |

లోకే విభూతి యుక్తం యద్యత్ప్రాణి శ్రీయుతం భవేత్ |

బలాద్యైశ్వర్య యుక్తం వా తత్తత్సర్వం మదంశజం |

జానీహిత్వం, న మత్తో అన్యత్కించి ద్వస్త్వస్తి జాగతం ||“. (బావప్రకాశము - 10 - 167, 168)

(స్థావర జంగమాది సర్వభూతములందు గూఢముగానున్నవాడు పరమేశ్వరుడొక్కడే. అయినను చిత్తమను ఉపాధి విశేషముయొక్క తారతమ్యమువలన కూటస్థ నిత్యుడు, అద్వితీయుడు అయిన ఆ పరమేశ్వరుని యావిష్కరణలో తారతమ్యము కలుగుచున్నది. అదియే విభూతి విశేషమన బడును. ఎచ్చటెచ్చట ఈ విభూత్యతిశయముండునో యది పరమేశ్వర రూపముగా నుపాసన చేయవలసినదని చెప్పబడినది –

“యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవవా |

తత్తదేవావ గచ్ఛత్వం మమ తేజోంశ సంభవం ||. (శ్రీమద్భగవద్గీత - 10 - 41)

“ప్రమేశ్వరుడనైన నా దివ్యవిభూతులకు ఇయత్త పరిమితి లేదు - సర్వజ్ఞుడు కూడ చెప్పుటకుగాని, తెలియటకుగాని సమర్థుడు కాడు - నా విభూతులనంతములు. ఈ విభూతి విస్తరమేక దేశాను సారమున నిరూపితమని గుర్తింపదగును - భగవానుని దివ్య విభూతులు చెప్పనివి యెన్నియో గలవు. అనుక్త సంగ్రహణమునకై సమ్యగ్విబోధనముకై యిది యుపలక్షణముగ నిరూపితమగును - లోకమున విభూతి యుక్తమగు సర్వప్రాణియు శ్రీయుత మగునదికాని, బలాద్వైశ్వర్య యుక్తమగునదికాని, సర్వమునా యంశ సంభవమే యని తెలియుము - జగద్గతముగా నాకన్న అతిరిక్తమగు వస్తువేదియును లేదు - సర్వము నా తేజోంశ సంభవము. ఈ లోకమునగాని పరలోకమునగాని సత్వముగాని, ద్రవ్యముగాని, చేతనముగాని, అచేతనముగాని ప్రభాసమృద్ధి, ధనసమృద్ధి పుణ్యకర్మసమృద్ధి, విద్యాసమృద్ధి, తపస్సమృద్ధి, శౌర్య, ధర్మౌదార్య శమ దమాది సద్గుణ సమృద్ధి, జ్ఞానసమృద్ధి గోచరించినచో ఓజః, తేజః, తత బలపౌరుష, సార, ఆకార, దార్డ్య, ఉత్సాహములతో మహత్తరముగా నూర్జితమై గోచరించెనేని, శ్రీ, శోభా, లక్ష్మీ, కాంతి, సరస్వతి, బుద్ధి, కీర్తి, స్మృతి యుక్తముగా గోచరించునేని, అది సర్వము నా శక్తి సంభూతము, కాలసంభూతమైన నా విభూతి విశేషమని గుర్తింపుము).

  1. “అధవా బహు నైతేనకిం జ్ఞాతేన తవార్జున |

విష్టభ్యహమిదం కృత్స్నుమేకాంశేన స్థితో జగత్ ||“. (10 - 42)

“శ్రీభగవాన్ విభూతిం స్వాముక్త్వా వయవశో (అ)ధునా |

సాకల్యేనైకతా మాహ కరుణామృత సాగరః |

జ్ఞానేన సవిశేషేణ కిం తేస్యా దేవమాదినా |

వ్యాప్తైక దేశమాత్రేణ జగత్సర్వమహం స్థితః |

కిమనేన పరిచ్ఛిన్న దర్శినేన తవార్జున |

ముద్దృష్టిం కురు సర్వత్ర సర్వానర్థక్షయం కరం |

పదో (అ)స్య సర్వభూతానీత్తాది శ్రుత్యా హమీశ్వరః |

ఏక ఏవ వినిర్ణీతః తం త్వాం మాం విద్ధి సర్వదా ||“. (గీతాభావప్రకాశము - 10- 169 to 173)

(భగవంతుడు అయిన శ్రీ కృష్ణుడు తన విశ్వ శరీరములోని అవయవములను విభూతులుగా నిరూపించి, తర్వాత ఈ చెప్పిన విభూతులన్నియు కలిసి ఒకే రూపముగా అయిన తన విశ్వరూపము అను ఒక పెద్ద వస్తువును ఒక పెద్ద నిరూపించెను - ఇట్టి నా సవిశేషరూపము అయిన నా విశ్వరూపము యొక్క భాగముల జ్ఞానము వలన నీకేమి ప్రయోజనము? ఈ విశ్వరూపము అనునది ఒక పెద్ద విభూతి - దీనిలో నా విభూతులన్నియు ఇమిడి యున్నవి, ఆవిశ్వరూపములో అంతట నేనే వ్యాపించి యున్నాను - అందుచేత దానిలో అంతట నేనే ఉన్నాను కనుక నా విశ్వరూపమును ధ్యానించుము - ఈ విశ్వరూపములోని వేరు వేరు విభూతులైన సమస్త ప్రాణులు నా లోని నాలుగవ వంతు- మిగిలిన 3 వంతులు స్వర్గలోకము అని శ్రుతి చెప్పుచున్నది కదా).

  1. పరమాత్మరూపము శుద్ధము, శబలము అని రెండు విధములు - ప్రకృతి, మహత్తత్వము మొదలగు వాటి కంటె వేరై పరబ్రహ్మ అని చెప్పబడునది శుద్ధము - ఇది సకల జీవరాశులలో అంతర్యామిగా నున్నది. విభూతులలో ప్రకాశరూపముగనుండునది శబలరూపము -
Transliteration
  1. aiśvaryaṃ; ētāṃ sarvasya madāyattōtpatti sthiti pravṛttirūpāṃ vibhūtiṃ.

(aiśvaryamu - īśvaratvamu; nāvalana (bhagavaṃtunivalana) sṛṣṭi sthiti layamulugala yī kanabaḍu prapaṃcamu nā vibhūti - bhagavaṃtuḍē prapaṃcamulōni anni vastuvulugā naguṭa)

  1. vibhaḥ; saṃpattiḥ; prabhutvaṃ -

(vaibhavamu; saṃpada, prabhuvaiyuṃḍuṭa).

  1. vividhaṃ bhūtiḥ -

(anēkavidhamulugā, anēka rūpamulugā, puṭṭuṭa).

  1. “niyamana viśēṣāḥ vibhūtayaḥ -” (śrīmān rāmānujaḥ)

(anēka vidhamulugā rūpamulugā niyamiṃcabaḍinavi vibhūtulu -)

  1. “ātmanaḥ mahātmya vistarāḥ” (śrīśaṃkaraḥ)

(ātmayokka mahātmyamu anēka vidhamulugā, anēka rūpamulugā vistariṃciyuṃḍunavi vibhūtulu).

  1. vibhūtitvaṃ nāma niyāmyatvaṃ.

(vibhūti anagā niyamiṃcagaluguṭa - prapaṃcamunu sṛṣṭicēsi, dānilōni vastuvulalō tānu pravēśiṃci, vāṭini vāṭi vāṭi panulalō niyamiṃcuṭa - vāṭini niyamiṃcina panulanu avi neravērcunaṭlu cūcuṭa)

  1. bhagavaṃtuḍu anēka rūpamulatō tānē yaguṭa vibhūti yani ceppabaḍinadi - adi yeṭlaṃṭē –

    1. mattakōkila “okkavēḷanu sūkṣmarūpamu noṃdudīvaṇumātramai

yokka vēḷanu sthūla rūpamunoṃdu daṃtayu nīvayai

pekku rūpulu dālcu nīdagu peṃpu māku nutiṃpagā

nakkajaṃbagucunna dēmana naṃbujākṣa ramāpatī”.

  1. “jyōtīṃ ṣi viṣṇuḥ bhuvanāni viṣṇuḥ, vanāni viṣṇuḥgirayō diśaśca |

nadyaḥ samudrāśca sa ēva sarvaṃ yadasti yannāsti ca vipravarya ||“. (viṣṇupurāṇamu)

(prakāśarūpamulaina nakṣatramulu modalagunaviyu, lōkamulu, koṃḍalu, nadulu, dikkulu, samudramulu, ī sarvamu, idaṃtayu unnadī, lēnidī aṃtayu viṣṇuvē).

  1. śrīkṛṣṇuḍu narakāsuruḍu ceralōnuṃcina padiyāru vēla rāja kanyakalanu okē muhūrtamuna vivāhamāḍenu -

“ca. amita vihāruḍīśvaruḍanaṃtuḍu dānokanāḍu maṃci la

gnamuna badāṟuvēlabhavanaṃbulalōna badāṟuvēla rū

pamula badāṟuvēla nṛpabālala brīti badāruvēla caṃ

damula vibhūti noṃducu yathāvidhitō variyiṃcē, bhūvarā.

  1. dānamulaṃdu, sammada vidhānamulaṃdavalōkanā bhāṣaṇā

vvānamulaṃdu nokka kriya nālalitāṃgula kanni mūrtulai

tāna niśaṃbugānabaḍi, takkuva ekkuva lēka yuttama

jñāna gṛhastha dharmamuna jakri ramiṃce brapūrṇakāmuḍai”. (śrīmadāṃdhramahābhāgavatamu- 10 - u.bhā - 220)

okē samayamuna naṃdaṟi rājakumārikala iṃḍlalō nuṃḍucu vāri nalariṃcucuṃḍuṭa nārada maharṣi cūci āścaryapōyenu - “ma. oka yiṃṭaṃ gajavājirōhakuḍunai, yokkiṃṭa bhuṃjānuḍai

sakalātmuṃḍu paruṃḍu ṣōḍaśa sahasra strī nivāsaṃbulaṃ

doka bōṭiṃṭanu dappakuṃḍa nijamāyōtsāhuḍai yuṃḍa na

yyakalaṃkun varadun - - -

“ka||. māyure hari, hari, varadaya

mēya guṇā yanucu nātma mecci munīṃdruḍu - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā - 627,630)

  1. śrīkṛṣṇuḍu nagarapravēśamu cēyunapuḍu -

“ma. oka dēvī bhavanaṃbumunnu sora vēṟokkartu lōguṃdunō,

sukarālāpamulāḍadō, solayunō, suprīti nīkṣiṃpadō,

vikalatvaṃbuna nuṃḍunō yanucu navvēḷan vadhūgēhamul

prakaṭāścarya vibhūti jocce bahu rūpavyaktuḍai, bhārgavā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 11 - 225)

  1. “tē. satata yauvana suṃdarī yuta vihāru

ḍagucu, satuleṃdaṟakanni rūpa

mulanu grīḍiṃce bekkabdamulu selaṃgi

naṃdanaṃdanuḍa bhivanānaṃda līla”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 3 - 132)

  1. gōvarthana giri nettina tarvāta nāgaliki pūja cēyamani śrīkṛṣṇuḍu gōpakulatō ceppi, tānu ā koṃḍarūpamai gōpakulalō nokaḍai, gōpakulu ā koṃḍaku āragiṃpu tānē āragiṃcenu –

“ma. sakālābhīrulu vīḍe kṛṣṇuḍana naijaṃbaina rūpaṃbutō

nakalaṃka sthitinuṃḍi, śailamide mīrarciṃparaṃḍaṃcu dā

noka śailākṛti dālci gōpakulatō noṃḍaṃḍa pūjiṃci gō

paka dattānnamulāragiṃce vibhuḍā pratyakṣa śailākṛtin”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. - 93)

  1. āvu peyyalanu, golla pillalanu caturmukhabrahma oka koṃḍa guhalō sumāru saṃvatsaramu kālamu dāci yuṃcinapuḍu ā gōpa bāluru, ā gōvatsamulu yokka rūpamulu tānē ayi śrīkṛṣṇuḍu vāri tallulaku (gōpabālura tallulukugāni, gōvatsamula tallulaina gōvulakugāni) ī viṣayamu teliyanīya kuṃḍunaṭlu cēsenu - gōpabāluraku gāni, gōvatsamulakugāni yī viṣayamu teliyadu - gōpabāluru gaḍicina saṃvatsaramu oka dinamugānē bhāviṃciri, iṭlu gōpa bālura rūpamulu gōvatsamula rūpamulu tānē yaguṭa tana vibhūtiyē –

“ka. gōpāla sutulu lērani

gōpikalaku ceppanēla, gōpālakulun

gōpikalu nalara bālura

krēpula rūpamulanē jariṃcedananucun.

“ma.karamul pādamulun śiraṃbu lavalagnaṃbul mukhaṃbul bhujāṃ

taramul mukkulu gannulun śravaṇamul daṃtādulun daṃḍakāṃ

barasragvēṇuviṣāṇa bhūṣaṇa nayō bhāṣā guṇākhyāna ta

tparatal vīḍvaḍakuṃḍa dālce vibhuḍā vatsārbha kākāramul.

(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā.- 511,512)

“ka. rūpaṃbulellanagu bahu

rūpakuḍiṭlu bālavatsa rūpaṃbulatō

nēpāruṭēmi cōdyamu

rūpiṃpaga natani kitara rūpamu galadē.

“ka. maralupumaniyeḍu kartayu

maraliṃcu kumārakulunu maraleḍi krēpul

parikiṃpa dānayai hari

maralaṃ jane līlatōḍamaṃdunadhipā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. - 514,515)

  1. śrīkṛṣṇuḍu gōpikalatō kūḍi rāsa krīḍa salipinapuḍu tānokkaḍainanu, gōpavanitaleṃdarō aṃdaṟiki aṃtamaṃdi kṛṣṇarūpamulanoṃdenu -

“va. saraḷaṃbagu muraḷaṃbu līlaṃ gēla naṃdukoni madhuraṃbagu nadharaṃbunaṃ gadiyiṃci - - - muraḷī ravaṃbulu sāriṃci pūriṃcucu sarilēni bhaṃgiṃ dribhaṃgiyai kamala karṇikākāraṃbuna naḍuma nilici, maṟiyu gōpa suṃdaṟaṃdaṟaku naṃdaṟayi, suṃdaṟula kavalayaḍalaṃ dānunu, danakavalayaḍala suṃdarulunu dējarilla nṛtta vidyā mahārṇava vēlāvala yitaṃbai vismitākhaṃḍalaṃbayi narāsa maṃḍalaṃbu galpiṃci - --”. (śrīmadāṃdhra mahābhāgavatamu - 10- pū. bhā. - 1085)

“va. iṭlu bhagavaṃtuḍaina kṛṣṇuṃḍātmārāmuṃḍayyunu gōpasatuleṃdaraṃdaṟaku naṃdaṟai nija pratibiṃbaṃbula tōḍaṃ grīḍiṃcu bālu pōlika rāsakēli salipina - - -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - pū. bhā. -1100)

“ślō||. aṃganāmaṃganā māṃtarē mādhavō, mādhavaṃ mādhacāṃtarēṇāṃganā |

itthamā kalpitē maṃḍalē madhyagaḥ saṃjagau vēṇunā dēvakī naṃdanaḥ ||“. (śrīkṛṣṇakarṇāmṛtaṃ - 2 - 35)

iṭlu śrīkṛṣṇuḍokaḍē ayinanu gōpikaleṃdarō aṃdaraku aṃtamaṃdi kṛṣṇulai tānā rūpamulanu dālcuṭa yatani vibhūtiyē).

  1. “yathāna jāyatē putraḥ pitaraṃ mātaraṃ vinā |

tathā bhavaṃ bhavānīṃ vinā saitaccarācaraṃ |

strī puṃsa prabhavaṃ viśvaṃ strī puṃsātmakamēva ca |

strī puṃsayōrvibhūti śca strī puṃsābhyā mathiṣṭhitaṃ |

- - - śaṃkaraḥ puruṣāssarvē striya ssarvā mahēśvarī ||.

sarvē strī puṃ rūpāstasmāt tayōrēva vibhūtiyaḥ |

- - - puṃliṃgamakhilaṃ dhattē bhagavān puraśāsanaḥ |

strīliṃga makhilaṃdhattē dēvī dēvamanōrama |

- - - yasya yasya padārthasya yā yā śaktirudāhṛtā |

sāsā sarvēśvarī dēvi sasa śarvō mahēśvaraḥ |

- - - yathā dīpasya dīptasya śikha dīpayatē gṛhaṃ |

tadā tējastayō rētat vyāptyā dīpaya tē jagat |

- - - yē ya muktā vibhūtirvai prakṛtī sā parāsmṛtā |

aprākṛtīṃ parāmanyāṃ guhyaṃ guhya vidō viduḥ |

yatō vācō nivartaṃtē manasā cēṃdriyai ssaha |

aprākṛtiḥ parāsaiṣā vibhūtiḥ paramēśvarī |

saivēha paramaṃdhāma saivēha paramāgatiḥ |

saivēha paramā kāṣṭhā vibhūtiḥ paramēṣṭhinaḥ |

tāṃ prāptuṃ prayataṃtē (adya) jitaśvāsā jitēṃdriyāḥ |

- - vibhūtiṃ śivayōrvidvān na bibhēti kutaścana |

yaḥ parāmaparāṃcaiva vibhūtiṃ vētti tatvataḥ |

sō(a)parāṃ bhūti mullaṃghya parābhūtiṃ samaśnutē ||. (sūtasaṃhitāyāṃ)

tallidaṃḍrulu lēka putruḍu puṭṭanaṭlu, śivuḍu, pārvati lēka ī samasta carācararūpamaina prapaṃcamu puṭṭadu - strī puruṣula saṃ yōgamu valana kaligina prapaṃcamu strīrūpamulu, puruṣa rūpamulu galadiyē, strī puruṣulaina śiva pārvatula vibhūtulē, vāricē nadiṣṭhiṃpabaḍiyuṃḍunavē - - - puruṣu laṃdarū śaṃkaruḍē, strīlaṃdarū pārvatiyē. aṃducēta strīrūpamulu, puruṣarūpamulanniyu vāriddari vibhūtilē. bhagavaṃtuḍaina śivuḍu puruṣarūpamunu dhariṃcunu, śivuni bhārya ayina pārvatī dēvi strīrūpamulu dhariṃcunu. ē vastuvulō ē śaktiyunnadō adi śivuḍē, adi atani śakti ayina pārvatiyē. prakāśiṃcucunna dīpamu gṛhamunu prakāśiṃpa cēyunaṭlu pārvatī paramēśvarulayokka tējassu (prakāśamu) cētanē jagattu aṃtayu prakāśiṃcucunnadi - puṭṭi pōṣiṃpabaḍucunnadi. ī vibhūti yani ceppabaḍinadi aparā prakṛti. dānini sūkṣma vēttalu -sūkṣmāti sūkṣmamaina vastuvulanu telusukonuvāru - yeruguduru. idi manasucēta ūhiṃcalēnidi, iṃdriyamulaku gōcaramukānidi. idiyē paramēśvaruni vibhūti ayina paramēśvari. ā paramēśvariyē parama thāmamu paramagati yani ceppabaḍucunnadi. āmeyē īśvaruni vibhūtulanniṃṭilōnu utkṛṣṭamainadi - parākāṣṭa ayinadi. iṃdriyajayamukalavāru, prāṇāyāmamu cēyuvāru poṃda dalacu sthānamidiyē. śivuni yokka vibhūtini telisinavāniki ē vidhamaina bhayamu lēdu -parāvibhūtini aparāvibhūtini vāṭi tatvamunu yadhārdhamugā telisinavāḍu, aparāvibhūtini ullaṃghiṃci, dāṭi, paravibhūtini poṃduduru).

prakṛti dānivalana kaliginavi bhagavaṃtuniki upādhulu - nivasiṃcu cōṭulu - iṭlu anni vasuvulalōnu bhagavaṃtuḍunnappaṭikī ā upādhula nairmalyamuvalana bhagavaṃtuni sattā - caitanyaśakti - konniṃṭilō prabalamugā anēka vidhamulugā vyaktamagunu - aṭlu bhagavacchakti vyaktamagu upādhulu bhagavaṃtuni vibhūtulani ceppabaḍucunnavi. upāsana cēyuṭalō yī upādhula rūpamunu gāka vāṭilō naṇagiyuṃḍu bhagavaṃtuni - tana śaktirūpamulō nunna bhagavaṃtuni - dhyāniṃcavalenu -gōḍamīdapaḍina sūryakāṃti bāguga pratibiṃbiṃcadu, nirmalamugānunna addamumīda paḍina sūryakāṃti bāgugā pratibiṃbiṃcunu. ī prakāramugānē bhagavaṃtuni aṃśa - cicchakti - mūrkhuniyaṃdu prakaṭamukādu - sāmānyamānavunaṃdu koddigā prakaṭamagunu - sātvika prabhāvamugalavāniyaṃdu, bhagavadbhaktuniyaṃdu bāgugā prakaṭamagunu. vāṭini bhagavadvibhūtulani vāṭilō prakaṭamagucunna bhagavaṃtuni upāsanacēyavalenu.

“ca. kramamuna miṃṭikai yegayugāka vihaṃgamu miṃṭidaina pā

ramu gana nērcunē?, hari parākrama mōpinayaṃta gāka sa

rvamu vivariṃpa nevvaḍu pravartakuḍau? munulāra, nādu ci

ttamunaku neṃta gānabaḍe dappaka ceppeda mīku naṃtayun “. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 18 - 453))

  1. “va. carācara bhūtaṃbayina jagaṃbaṃtayu madākāraṃbu gā bhāviṃci bhūtaṃbulaṃdu nādhārabhūtaṃbunu, sūkṣmaṃbulaṃdu jīvuṃḍunu, durjayaṃbulaṃdu manaṃbunu dēvatalaṃdu padmagarbhuṃḍunu - - - ivi yanniyu madvibhūtulugā neṟuṃgumu.”

(śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 105)

(migilina vibhūtulaku cūḍumu śrīmadāṃdhramahābhāgavatamu)

“ka. dharaṇī vallabha! vinu,

hari māyā guṇa vibhūtulagu jalanidhuluṃ

baragina dīvulu varṣamu

larayaṃgā goladi veṭṭa nalaviye jagatin”. (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 2 - 15 - 15)

  1. vibhūti yanagā yī kriṃdanu konni ceppabaḍinavi : -

    1. vividhōbhāti; mahimā -

(anēka vidhamulugā prakāśiṃcunadi; mahima, goppatanamu)

  1. abhivyaktaṃ sat

(lōpala gūḍhamugā nunnanu śakti sāmarthyamuladvārā lōpala nunnaṭlu paiki prakaṭana cēyunaṭlugā kanabaḍu bhagavaṃtuni sattā - cicchakti, caitanya śakti –

“sī. akhila bhūtamulaṃdu ātmarūpaṃbuna - īśuṃḍu hari yuṃḍunellaproddu; buddhyādirūpaṃbula gānabaḍunu -”.

  1. “haṃta tē kathayiṣyāmi divyā hyātmavibhūtayaḥ |

prādhānyataḥ kuruśrēṣṭa nāstyaṃtōsti vistarasya mē ||” (śrīmadbhagavadgīta - 10 - 19, 20)

“sa viśēṣasya tasya prāgdhyānō pāyāḥ vibhūtayaḥ |

nirviśēṣasya tasyaiva jñānō pāyā stadēritāḥ |

- - - durvijñēyaṃ paraṃ tatvaṃ śrīmadbhagavatō harēḥ |

atō jñānaya tattatvaṃ taddhyānāya vibhūtayaḥ |

daśamē pravakṣyaṃtē mumukṣūṇāṃ hitāyaca |

prōtsāha yitumatrādau śrōtāraṃ harira bravīt ||. (gītābhāvaprakāśamu - 10 - 2 to 6)

(saviśēṣa brahmanu sādhiṃcuṭaku upāyamulainavi vibhūtulu - iviyē nirviśēṣa parabrahmaguṟiṃci ayina jñānamunaku upāyamulu:

“haṃta tē katha yiṣyāmi - - - nāstyaṃ tō vistarasya mē ||

ahamātmā guḍhākēśa sarva bhūtāśaya sthitaḥ |

ahamādiśca madhyaṃ ca bhūtānāmaṃta ēva ca ||“. (śrīmadbhagavadgīta - 10 - 19, 20)

“mama sādhāraṇā divyāḥ prasiddhāḥ yā vibhūtayaḥ |

aśakyā vistarādvaktuṃ nāstyaṃ tō vistarasya mē |

ataḥ prāthāna bhūtā stā vibhūtīḥ kāści dēvahi |

tubhyaṃ saṃ kathayiṣyāmi kuruśrēṣṭhō yatō bhavān ||

tatrādau ciṃtanīyaṃ yanmukhyaṃ tatprathamaṃ śṛṇu |

hṛddēśē sarva bhūtānāṃ aṃtaryāmitayā sthitaḥ |

pratyagātmātmanā caiva parānaṃda ghanō(a)cyutaḥ |

tva yaiva vāsudēvō haṃ dhyēyō nityaṃ jitālasa |

cētanānāṃ samastānāṃ yatōhaṃ janmakāraṇaṃ|

madhyē sthita rlayōṃtēca mattō bhinnaṃ na kiṃcana |

sarvacētana vargāṇāṃ janmasthiti layātmanā |

tatkāraṇātmanā vāhamēva dhyēya itīritaḥ ||“. (gī tābhāvaprakāśamu - 10 - 97 to 100)

(asādhāraṇamainaṭuvaṃṭīnnī, divyamainaṭuvaṃṭinnī, prasiddhi poṃdinaṭuvaṃṭinnī nā vibhūtulu vistariṃci ceppuṭaku - niśśēṣamugā ceppuṭaku - śakyamu kānivi. nēnu ī sṛṣṭilō, aṃtaṭilōnu, sṛṣṭilōni prativastuvulōnu aṃtamulēkuṃḍa vyāpiṃciyunnānu - aṃducēta mukhyamaina vāṭini konniṃṭini ceppedanu. nā guṟiṃci dhyānamu cēyuṭaku ayina vibhūtulalō mukhyamainadi modaṭidi vinumu - samasta bhūtamulalōnu hṛdayamaṃdatmarātmagānu, pratyagātmalō āthmagānunnānu. aṃducēta - anniṃṭilōnu nivasiṃciyunnaṃduna vāsudēvuḍani ceppabaḍucunnānu. aṭlu nannu dhyāniṃpumu. samastamaina cētana vastuvula janmamunaku, sthitiki, layamunaku - nāśamunaku - nēnē kāraṇamu. aṃducēta nākanna vēṟainadēdiyu lēdu. samasta cētana vastuvulaku janma sthiti layamulu nēnē yaguṭavalana vāṭiki kāraṇamainavāḍinigā nēnē dhyānamu cēyataginavāḍanu).

(ī prakāramuga mukhyamaina vibhūti modaṭa ceppi tarvāta konni konni rakamula vastuvulalō mukhyamainaṭuvaṃṭivāṭini - tana sattā heccugānunnavāṭini - ceppuṭa prāraṃbhiṃcenu)

- ” ādityānāmahaṃ viṣṇuḥ -” (śrīmadbhagavadgīta - 10 - 21 to 38)

dvādaśādittyulalō viṣṇuvanu ādityuḍanu nēnē. aditiyokka kumārulu ādityulu - vīrilō vāmanuḍanu pērutō avatāramettina śrīmahāviṣṇuvu okaḍu - ādityulaṃdaṟu prakāśarūpulē, tējōvaṃtulē ayinanu vāraṃdaṟilōnu heccu bhagavacchakti galavāḍu vāmanuḍu. aṃducēta ādityulalō viṣṇuvu tana vibhūti yani śrīkṛṣṇabhagavānuḍu ceppenu –“akṣarāṇāmakārōsmi” - (akāramu modalu kṣakāramu aṃtamugā gala - kṣakāramu ākharidigā gala - akṣaramulanniṃṭilōnu modaṭi akṣaramaina ‘a’ kāramu nēnē - bhagavaṃtuḍē - bhagavaṃtuni vibhūtiyē - akṣaramulanniyu ‘a’ kāramuyokka vikāramulē - akṣaramulanniṃṭilōnu bhagavaṃtuni aṃśa yunnappaṭiki vāṭi anniṃṭilōkaṃṭe akāramulō bhagavadaṃśa viśēṣamugā nunnadi. migilina akṣaramulanniyu akāramu yokka vikāramulē - (‘a’ iti brahma. “ōmityēkākṣaraṃ brahma” ‘ka’ iti brahma.)

(samasta bhūtamulu puṭṭuṭaku kāraṇamaina bījamu nēnē - bhūtamulanniyu okadānilōnuṃḍi okaṭi puṭṭi okadānikokaṭi kāraṇa mainappaṭikī vāṭi anniṃṭikī modaṭi kāraṇamu (mūla kāraṇamu, mūla bījamu) nēnē - prati kāraṇavastuvulōnuṃḍi kāryavastuvu puṭṭuṭaku kāraṇa vastuvunaṃduṃḍu kāraṇamu nēnē - kanuka sṛṣṭi prāraṃbhamulōnē kāka prati kāraṇavastuvulō nuṃḍi kārya vastuvu puṭṭuṭaku kāraṇavastuvulō kāraṇarūpamugā nunnadi nēnē - iṭlu sṛṣṭi aṃtaṭilōnu ē vastuvulōnainanu iṃkoka vastuvu puṭṭuṭaku kāraṇamu nēnē - kāraṇavastuvulō nēnu lēnidē kāryavastuvēdiyu puṭṭadu - prati kāraṇavastuvulōnu nēnuṃḍuṭavalananē ādinuṃḍi ippaṭivaṟaku sṛṣṭi jarugucunnadi. aṭlugākunna sṛṣṭi ēnāḍō āgipōyi yuṃḍunu). aṃducēta lōna nēnu lēni carācarabhūtamu lēdu - “ā harimayamugāni dravyamu paramāṇuvu lēdu”.

“iyattā nāsti divyānāṃ vibhūtīnāṃ mamēśituḥ |

sarvajñē nāpi vaktuṃ vā jñātuṃ vā naiva śakyatē |

iyattā madvibhūtīnāṃ anaṃtanāṃ kathaṃcana |

vibhūtērēṣa vistāraḥ prōktastē caika dēśataḥ |

saṃgrahītu manuktāhi vibhūtīrīśu turharēḥ |

samyagbōdhāya tanida mupalakṣaṇa mucyatē |

lōkē vibhūti yuktaṃ yadyatprāṇi śrīyutaṃ bhavēt |

balādyaiśvarya yuktaṃ vā tattatsarvaṃ madaṃśajaṃ |

jānīhitvaṃ, na mattō anyatkiṃci dvastvasti jāgataṃ ||“. (bāvaprakāśamu - 10 - 167, 168)

(sthāvara jaṃgamādi sarvabhūtamulaṃdu gūḍhamugānunnavāḍu paramēśvaruḍokkaḍē. ayinanu cittamanu upādhi viśēṣamuyokka tāratamyamuvalana kūṭastha nityuḍu, advitīyuḍu ayina ā paramēśvaruni yāviṣkaraṇalō tāratamyamu kalugucunnadi. adiyē vibhūti viśēṣamana baḍunu. eccaṭeccaṭa ī vibhūtyatiśayamuṃḍunō yadi paramēśvara rūpamugā nupāsana cēyavalasinadani ceppabaḍinadi –

“yadyadvibhūtimatsatvaṃ śrīmadūrjitamēvavā |

tattadēvāva gacchatvaṃ mama tējōṃśa saṃbhavaṃ ||. (śrīmadbhagavadgīta - 10 - 41)

“pramēśvaruḍanaina nā divyavibhūtulaku iyatta parimiti lēdu - sarvajñuḍu kūḍa ceppuṭakugāni, teliyaṭakugāni samarthuḍu kāḍu - nā vibhūtulanaṃtamulu. ī vibhūti vistaramēka dēśānu sāramuna nirūpitamani gurtiṃpadagunu - bhagavānuni divya vibhūtulu ceppanivi yenniyō galavu. anukta saṃgrahaṇamunakai samyagvibōdhanamukai yidi yupalakṣaṇamuga nirūpitamagunu - lōkamuna vibhūti yuktamagu sarvaprāṇiyu śrīyuta magunadikāni, balādvaiśvarya yuktamagunadikāni, sarvamunā yaṃśa saṃbhavamē yani teliyumu - jagadgatamugā nākanna atiriktamagu vastuvēdiyunu lēdu - sarvamu nā tējōṃśa saṃbhavamu. ī lōkamunagāni paralōkamunagāni satvamugāni, dravyamugāni, cētanamugāni, acētanamugāni prabhāsamṛddhi, dhanasamṛddhi puṇyakarmasamṛddhi, vidyāsamṛddhi, tapassamṛddhi, śaurya, dharmaudārya śama damādi sadguṇa samṛddhi, jñānasamṛddhi gōcariṃcinacō ōjaḥ, tējaḥ, tata balapauruṣa, sāra, ākāra, dārḍya, utsāhamulatō mahattaramugā nūrjitamai gōcariṃcenēni, śrī, śōbhā, lakṣmī, kāṃti, sarasvati, buddhi, kīrti, smṛti yuktamugā gōcariṃcunēni, adi sarvamu nā śakti saṃbhūtamu, kālasaṃbhūtamaina nā vibhūti viśēṣamani gurtiṃpumu).

  1. “adhavā bahu naitēnakiṃ jñātēna tavārjuna |

viṣṭabhyahamidaṃ kṛtsnumēkāṃśēna sthitō jagat ||“. (10 - 42)

“śrībhagavān vibhūtiṃ svāmuktvā vayavaśō (a)dhunā |

sākalyēnaikatā māha karuṇāmṛta sāgaraḥ |

jñānēna saviśēṣēṇa kiṃ tēsyā dēvamādinā |

vyāptaika dēśamātrēṇa jagatsarvamahaṃ sthitaḥ |

kimanēna paricchinna darśinēna tavārjuna |

muddṛṣṭiṃ kuru sarvatra sarvānarthakṣayaṃ karaṃ |

padō (a)sya sarvabhūtānīttādi śrutyā hamīśvaraḥ |

ēka ēva vinirṇītaḥ taṃ tvāṃ māṃ viddhi sarvadā ||“. (gītābhāvaprakāśamu - 10- 169 to 173)

(bhagavaṃtuḍu ayina śrī kṛṣṇuḍu tana viśva śarīramulōni avayavamulanu vibhūtulugā nirūpiṃci, tarvāta ī ceppina vibhūtulanniyu kalisi okē rūpamugā ayina tana viśvarūpamu anu oka pedda vastuvunu oka pedda nirūpiṃcenu - iṭṭi nā saviśēṣarūpamu ayina nā viśvarūpamu yokka bhāgamula jñānamu valana nīkēmi prayōjanamu? ī viśvarūpamu anunadi oka pedda vibhūti - dīnilō nā vibhūtulanniyu imiḍi yunnavi, āviśvarūpamulō aṃtaṭa nēnē vyāpiṃci yunnānu - aṃducēta dānilō aṃtaṭa nēnē unnānu kanuka nā viśvarūpamunu dhyāniṃcumu - ī viśvarūpamulōni vēru vēru vibhūtulaina samasta prāṇulu nā lōni nālugava vaṃtu- migilina 3 vaṃtulu svargalōkamu ani śruti ceppucunnadi kadā).

  1. paramātmarūpamu śuddhamu, śabalamu ani reṃḍu vidhamulu - prakṛti, mahattatvamu modalagu vāṭi kaṃṭe vērai parabrahma ani ceppabaḍunadi śuddhamu - idi sakala jīvarāśulalō aṃtaryāmigā nunnadi. vibhūtulalō prakāśarūpamuganuṃḍunadi śabalarūpamu -
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.