చదువు
జ్ఞానం; వేద శాస్త్రాది జ్ఞానం; వేద శాస్త్ర పురానాది రూపా -
(జ్ఞానము; వేదములు, శాస్త్రములు మొదలగు వాటివలన కలుగు జ్ఞానము -)
“వేద శాస్త్ర పురాణాది విద్యలెల్ల
తరుణి ! ఘంఠా పదమ్ము మాకు - - “. (శ్రీనాధుడు - శృంగారనైషధము)
(వేదములు, ఉపవేదములు మొదలగు విద్యాస్థానములు).
(పరబ్రహ్మ తత్వమును - యదార్థముగా తెలియచేయు శక్తిగల విద్యయే విద్య) (విద్యలలో అధ్యాత్మ విద్య నేనే) (అధాత్మ విద్య భగవంతుని విభూతి (గీత - 10 - 32)
(వైరాగ్య తత్వజ్ఞానమును బోధించునది - వైరాగ్య తత్వజ్ఞానముతో నిండియుండునది)
(మోక్షమును కలుగచేయు జ్ఞానమే విద్య).
(అమృతత్వము - అనగా - చావులేని స్థితి, మోక్షము - దానికి సాధనమైనదే విద్య) ‘హమృతం విద్యా’ (శ్వేతాశ్వతరోపనిషత్)
(పరమపురుషార్థమైన మోక్షమును పొందించు విద్య)
(విష్ణు పురాణములో చెప్పబడిన విద్య)
“సర్వేశ్వరుని యందు నేమిట మితి సంభవించునది విద్య” (శ్రీమదాంధ్రమాభాగవతము - 4 - 29 - 875)
విద్యానామ శ్రీవిద్యైవ.
(శ్రీవిద్యయే విద్య - శ్రీదేవిని గుఱించి చెప్పునదియే విద్య)
(మోక్షమునకు ఒకే కారణమైనది - ఒకే సాధనమైనదగు శ్రీవిద్యయే విద్య. ఇందుకు సందేహము లేదు)
ఆత్మ శరీరముకంటె వేఱు అని తెలియచేయునది విద్య.
“మూఢజనులకు జ్ఞానోపదేశంబును, గామ్యత్యాగంబును, సమ దర్శనంబును, వైష్ణవ సమూహంబులతోడి భక్తియు, బ్రాణాయామంబును, జిత్తశుద్ధియు ననునవి విద్య యనంబడు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 109)
శ్రేయో విషయా.
(శ్రేయస్సు విషయముగా గల విద్య, శ్రేయస్సును బోధించునది)
“చాలాః అవివేకినః తలమింద్రనీల కటాహకల్పం నభోమలినం పీత ఇత్యేవమ పరోక్షం అధ్యస్యంతి. తత్రేంద్రియ గ్రాహ్యత్వం నాస్తీతివ్యభిచారా న్న వ్యాప్తిః ఏతేనాత్మ నాత్మనోః సాదృశ్యభావా న్నాధ్యనః ఇత్యపాస్తం. ఆక్షిప్తం సమాహితం ఉక్తలక్షణం లక్షితం అధ్యాసం అవిద్యా కార్యత్వాత్ అవిద్యా ఇతి మన్యంతే ఇత్యర్థః”
(నీలముగా కనబడు ఆకాశము ధూళి మొదలగువాటివలన మలినమై పసుపురంగు గలదని అజ్ఞానులు అధ్యాస కలిగి యుందురు - ఆ ప్రకారముగానే ఆత్మకంటె వేరుకాని ప్రత్యగాత్మ అనాత్మయను అధ్యాస కలుగు చున్నది. కాని ఆత్మకి అనాత్మకి సాదృశ్యము లేనందున ఇది అధ్యాస కాదు - ఇటువంటి అధ్యాస అవిద్య యని పండితులు చెప్పుదురు - ఇట్లు తెలుసుకొని, దాని నిజస్వరూపమును తెలుసుకొనుట విద్యయని చెప్పుదురు)
(అధ్యాసను పోగొట్టి అధిష్ఠాన వస్తువుయొక్క నిజస్వరూపమును నిర్ధారణ చేయునది విద్య)
“మాయాగుణత్రయ సామాన్యం వల్ల ప్రకృతి అనిపించుకొనును; దుష్కర్మ విశేషంవల్ల తామస ప్రధానమై సాత్వికమును మూసుకొని యవిద్య యనిపించుకొనును; సత్కర్మ సామర్ధ్యంవల్ల సాత్విక గుణప్రధానమై అవిద్యకు విరోధియై విద్య యనిపించుకొనును. అది యెలాగంటె - స్వల్పోదకాలనయిన పికలాగకు బహుళఓదకము విరోధియై యుండును”. (బ్రహ్మవిద్యా సుధార్ణవము - 3)
ఉపాసన; అంతర్ధానాది లక్షణం -
(ఉపాసన - అంతర్ధానమగుట మొదలగు లక్షణములు కలది విద్య.)
“చక్ర హస్తుని ప్రకటించు చదువు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 5 - 169)
“ద్వే విద్యే వేదితవ్యే పరా చై నా పరాచ తత్ర అపరా ఋగ్వేదో, యజుర్వేదః, సామవేదో అధర్వ వేదః, శిక్షా, కల్పో, వ్యాకరణం, నిరుక్తం, ఛందో జ్యోతిషమితి. అధ పరా యయా తదక్షరమధి గమ్యతే”.
“కేతే విద్యే ఇత్ర త్రాహ పరా చైవాపరా చ ఇతి - పరమపరం ఇతి జ్ఞానం - ద్వివిధం ఇత్యర్థః - తత్ర సూచీకటాహ న్యాయేన అపరజ్ఞాన స్వరూపం ఆహ - తత్రేతి - జ్యోతిషమత్యనంతరం.”ఇతిహాసన్యాయ పురాణ మీమాంసా ధర్మ శస్త్రాణి” ఇతి అధికః పాఠః శ్రీభాష్య కారైః రంగరామానుజ యతీంద్రైశ్చ ఆదృతః షడంగోపేత స శిరస్క సోతబృహణ వేద శ్రవణ జన్యం పరోక్ష జ్ఞానం ఇత్యర్థః. అధ పరవిద్యాం ఆహ - అధపరేతి. అత్ర తత్ శబ్దః ఇతి హాస్మ యత్ బ్రహ్మవిద్ ఇతత్ర నిర్దిష్ట ‘యత్’ శబ్దప్రతి నిర్దేశకః |
యేన జ్ఞానేన యద్బ్రహ్మ విదః ఇతి వాక్యే ప్రాప్తతయా నిర్దిష్టం; తదక్షరం అధిగమ్యతే ఆధిక్యేన గమ్యతే, అపరోక్షీ క్రియతే ఇత్యర్థః -వివేకాది సాధన సప్తక జన్యం, శ్రవణ జన్య జ్ఞానానం తర భావి దర్శన సమానాకారం పరజ్ఞానం ఇత్యర్థః -“.
(తెలియ తగిన విద్యలు రెండు - పరావిద్య, అపరావిద్య. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము, శిఖా, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము - ఇవి అపరావిద్య. పైన చెప్పిన వాటిలో జ్యోతిషము తరువాత ఇతిహాసములు, న్యాయశాస్త్రము, పురాణములు, మీమాంస శాస్త్రములు, ధర్మ శాస్త్రము కూడా అపరావిద్య యని శ్రీరంగరామానుజులవారు వారి భాష్యములో చెప్పియున్నారు. షడంగములతో కూడినది వేదశిరస్సు అయిన ఉపనిషత్తులతో కూడినది అయిన వేదశ్రవణమువలన కలిగిన జ్ఞానము అపరవిద్యయని యర్థము)
(అక్షరమైన, నిత్యమైన పరబ్రహ్మ తత్వమును తెలియ చేయునది పరావిద్య. ‘తత్’ పదార్థమైన పరబ్రహ్మను ఆధిక్యముతో (అధికముగా) అపరోక్షము చేయునది సాక్షాత్కరింపచేయునది, నిత్యా నిత్య వివేకజ్ఞానము మొదలగు ఏడు సాధనముల వలన కలుగు బ్రహ్మజ్ఞానము శ్రవణము వలన కలిగిన జ్ఞానము తర్వాత కలుగు సాక్షాత్కారము కలుగ చేయు జ్ఞానము పరావిద్య. (పరాజ్ఞానము). ఆ పరావిద్య అభ్యుద య ఫలమునిచ్చునది, నిశ్రేయ ఫలము నిచ్చునది, అదియే బ్రహ్మ విద్య, నిర్గుణ బ్రహ్మను తెలియచేయునది. సగుణ బ్రహ్మను తెలియచేయునది అపరావిద్య.
(పరబ్రహ్మము విషయముగా గలది - పరబ్రహ్మ తత్వమును బోధించునది, అంతర్ముఖము కలది విద్య. అది ఉపాధిగా గలది ఆత్మ తురీయము - బహిర్ముఖము కలది - ప్రపంచవస్తువులు విషయముగా గల విద్య ఉపాధిగాగల ఆత్మప్రాజ్ఞుడు)
(నిర్గుణ బ్రహ్మజ్ఞానము కలుగుట కష్టమని సగుణ బ్రహ్మజ్ఞానము ముందు కలిగినచో చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత కలుగునని, దానివలన నిర్గుణ బ్రహ్మజ్ఞానము కలుగునని అదియే బ్రహ్మ విద్యయని చెప్పబడినది)
“తత్ప్రాప్తి హేతుర్జ్ఞానం చ కరచోక్తం మహా మునే |
ఆగమోత్థం వివేకాచ్చ ద్విధా జ్ఞానం తదోచ్యతే ||
శబ్ద బ్రహ్మ గమ మయం పరం బ్రహ్మ వివేకజం ||” ఇతి.
(బ్రహ్మ ప్రాప్తికి రెండు విద్యలు తెలియ తగినవి - బ్రహ్మ విషయము పరోజ్ఞానము అపరోక్షజ్ఞానము అను రెండింటివలన తెలియనగును. పరబ్రహ్మను పొందుటకు జ్ఞానము, కర్మ చెప్పబడినవి - ఆగమములవలన, వివేకము చేతను కలుగునది శబ్దబ్రహ్మ ఆగమమయము - వేదములవలన కలుగునది, వివేకము వలన కలుగునది పరవిద్య).
అవిద్య యా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే ||“.
“అత్రాపి విద్యా శబ్దాభిహిత వర్ణాశ్రమ విహితం కర్మ - అవిద్యయా కర్మణా మృత్యుం జ్ఞానోత్పత్తి విరోధి ప్రాచీనం కర్మా. తీర్త్వా ఆపోహ్య, విద్యయా జ్ఞానేన అమృతం బ్రహ్మ అశ్నుతే ప్రాప్నో తీత్యర్థః - మృత్యు తరుణోపాయ తయా ప్రతీతా అవిద్యా విద్యేతర ద్విహి తం కర్మైవ”. (శ్రీశంకరః)
“విద్యయా మృత్యుం తీర్త్వా - -” ఇతి శుత్యా కర్మణా పాపనివృత్తి జ్ఞానేన ముక్త్యభి ధానాచ్చ- ఇతి.
(ఇక్కడ విద్యయనగా వర్ణాశ్రమములకు విధించబడిన కర్మ. అవిద్యయనగా కర్మ - మృత్యువనగా జ్ఞానము కలుగుటకు ఆటంకము చేయు కర్మ - జ్ఞానముచేత అమృతమనగా బ్రహ్మను పొందును - బ్రహ్మమే మోక్షము, మోక్షమే బ్రహ్మ).
(విద్యయనగా బ్రహ్మజ్ఞనము కలుగచేయునది. అవిద్య యనగా శాస్త్రజ్ఞానము - అవిద్యవలన సంసారములో సుఖదుఃఖములను పోగొట్టుకొనిమృత్యువునుదాటి విద్యచేత మరల మృత్యువు కలుగకుండ - జన్మ లేకుండ - చేసుకొనును - అనగా, మోక్షము నొందును - కనుక విద్యను అవిద్యను రెండింటినీ నేర్చవలెను - అవిద్య నేర్చనిదే విద్య అలవడుట కష్టము).
పర్యంకవిద్య, పంచాగ్ని విద్య; ఉపకోసలవిద్య, దహరవిద్య, మధువిద్య, శాండిల్య విద్య; షోడశకలావిద్య; వైశ్వానరవిద్య - ఇవి ఉపాసనలు -
(శాండిల్య విద్యయందు పరబ్రహ్మ హృదయమందుండునని చెప్పబడినది. “ఈ ఆత్మ హృదయమందున్నది” అని శ్రుతి చెప్పుచున్నది).
(2). దహరవిద్యాయాం - “దహరం పిఉండరీకం వేశ్మ దహరో(అ)స్మిన్నం తర ఆకాశః” ఇతి. (హృదయ పుండరీకము లోపలనుండు ఆకాశము అని చెప్పబడినది)
(3). ఉపకోసలవిద్యాయాం త్వక్ష్వాయ తనత్వం - “య ఏషో (అ)క్షిణే పురుషో దృశ్యతే” ఇతి.
(ఉపకోసల విద్యలో కన్ను పరబ్రహ్మకి ఆయతనమని చెప్పబడినది - కంటిలో పరబ్రహ్మ ఉన్నాడని చెప్పబడినది –“కంటిలో ఏ పరమ పురుషుడు కనబడుచున్నాడో అతనే పరబ్రహ్మ” అని శ్రుతి చెప్పుచున్నది - “ఏవం తత్ర తత్ర తత్తధా ధ్యాత్మిక మాయతనమే తేసు విద్యాసు ప్రతీయతే - - ఏకమపి బ్రహ్మ విభూతి భేదైరనేక ధైరనేక థా ఉపాస్యతే ఇతి స్థితిః పరోవరీయస్త్వాది భేద దర్శనాత్”
(శ్రీశంకరః - బ్రహ్మసూత్రభాష్యే - 3 - 3 - 23)
పైన చెప్పిన ప్రకారము శ్రుతులలో అక్కడక్కడ బ్రహ్మ ఆయతనము - పరబ్రహ్మ ఉండుచోటు - ఈ విద్యలలో చెప్పబడినది, పరబ్రహ్మ ఒకడే అయినను విభూతి భేదములవలన - అతను ఉండి ప్రకటమగు కొన్ని విశిష్ట వస్తువుల భేదమువలన అనేక విధములుగా పరబ్రహ్మ ఉపాసింపబడు చున్నాడు - పరబ్రహ్మ క్షీణించనివాడు అని చెప్పబడి యుండుటచేత.)
(విద్యలు మూడు విధములు - అహం గ్రహోపాసన, తటస్థము, అంగాశ్రితము).
“అల్వీక్షికీ, త్రయీవార్తా దండనీతిశ్చ శాస్వతా |
ఏతా విద్యాచతస్రస్తు లోక సంస్థితి శాశ్వతా |
ఏతా విద్యా చ త స్రస్తు లోక సంస్థితి హేతువః ||“.
(అన్వీక్షికీ, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అను మూడు, వార్తా, దండనీతి - ఈ నాలుగు విద్యలు లోకముల స్థితికి కారణములగుచున్నవి)
(విద్యతో సమానమైన చక్షువు లేదు - మాంసపు కన్నులతో కంటె విద్యయనెడి కంటితో విశేషములను చూడ గలుదురు).
(మందబుద్ధికి - సోమరికి - విద్య అబ్బదు - విద్యలేనివానికి ధనము కలుగదు)
(సుఖము కోరువానికి విద్య అలవడదు - విద్యను నేర్చుకొనవలెనను బుద్ధి కలుగదు - విద్యను నేర్చుకొను అభిలాష గలవాడు సుఖము నాశించ కూడదు - కష్టపడిననే విద్య అలవడును)
(ఇతర స్థలములందుండునపుడు విద్యయే మిత్రుడు - అక్కరకు వచ్చునది. మిత్రులు లేనిచోట విద్యయే మిత్రునివలె సహకరించును)
విద్యా విహీనాః న శోభంతే నిర్గంధాః కిన్శుకా ఇవ ||“.
(ఎంతటి సుందర రూపముగలవారైనను, యౌవనవంతులైనను, ఎంతటి గొప్ప కులమందు పుట్టినవారైనను విద్యలేనివారు వాసనలేని కింశుక పుష్పమువలె శోభించరు).
కర్య కాలే సముత్పన్నే న సా విద్యా న తద్ధనం ||”
(పుస్తకమందుండు విద్య - సమయానికి జ్ఞాపకమురాని విద్య, అవసరమునకు పనికిరాని విద్య - ఇతరులవద్దనుండు తనధనము - అవసరమైనపుడు ఉపయోగింపవు కనుక అట్టివిద్య విద్యకాదు, అట్టి ధనము తన ధనముకాదు).
పాత్రత్వాద్ధనమాప్నోతి ధనాద్ధర్మం త తస్సుఖం ||”
(విద్య యొసగును వినయంబు, వినయమునను బడయు పాత్రత, పాత్రతవలన ధనము| ధనమువలనను ధర్మంబు, దానివలన| ఐహికాముష్మిక సుఖంబులందు నరుడు||.
కాతేవ చాభిరమయత్యపనీయ ఖేదం |
కీర్తించ దిక్షు వితనోతి లక్ష్మీం |
కిం కిం న సాదయతి కల్పలతేవ విద్యా ||“. (భోజరాజచరిత్రము)
(విద్య తల్లివలె రక్షించును, తండ్రి వలె హితకార్యమునందు నియోగించును, భార్యవలె దుఃఖమున నపనయించి (పోగొట్టి) రమింప చేయును, కీర్తియనెడి లక్ష్మిని దిక్కులందు ప్రసరింపచేయును - (లేక, కీర్తిని దిక్కులందు సాటించును) (ధనమును చేకూర్చును, ఇట్టి విద్య కోరికలనిచ్చు కల్ప వృక్షము -).
అధవా విద్యయా విద్యా చతుర్థో నోపపద్యతే ||“.
(విద్యను గురువునకు శుశ్రూషచేసి యైనను, పుష్కలముగా ధనము నిచ్చియైనను, లేక తనకు గల విద్యనిచ్చి యింకొకరి దగ్గరనున్న విద్యను నేర్చుకొనుటచేతనైనను సంపాదింపవలెను - విద్యను సంపాదిచుటకు ఇతరమార్గము లేదు)
విద్యయనగా బ్రహ్మజ్ఞానమే అయినను బ్రహ్మజ్ఞానమునకు సాధనములైన ఉపాసనలు కూడ విద్యయే యని చెప్పబడినవి.
“యామామనంతి మునయః ప్రకృతిం పురాణీం |
విద్యేతియాం శ్రుతి రహస్య గిరో ఘృణంతి |
తామర్థ పల్లవిత శంకర రూప ముద్రాం |
దేవీ మనన్యశరణశ్సరణం ప్రపద్యే ||“.
(మునులు దేనిని అనాదియగు ప్రకృతియని చెప్పుదురో, శ్రుతి రహస్యములు - ఉపనిషత్తులు దేనిని విద్యయని చెప్పుచున్నవో, శంకరుని శరీరములో ఏది అర్థభాగమగుచున్నదో అట్టి శ్రీదేవిని - శివశక్తియే మూర్తీభవించిన దానిని - వేరు శరణములేని వాడనై - నేను - శరణు పొందుచున్నాను)
caduvu
jñānaṃ; vēda śāstrādi jñānaṃ; vēda śāstra purānādi rūpā -
(jñānamu; vēdamulu, śāstramulu modalagu vāṭivalana kalugu jñānamu -)
“vēda śāstra purāṇādi vidyalella
taruṇi ! ghaṃṭhā padammu māku - - “. (śrīnādhuḍu - śṛṃgāranaiṣadhamu)
(vēdamulu, upavēdamulu modalagu vidyāsthānamulu).
(parabrahma tatvamunu - yadārthamugā teliyacēyu śaktigala vidyayē vidya) (vidyalalō adhyātma vidya nēnē) (adhātma vidya bhagavaṃtuni vibhūti (gīta - 10 - 32)
(vairāgya tatvajñānamunu bōdhiṃcunadi - vairāgya tatvajñānamutō niṃḍiyuṃḍunadi)
(mōkṣamunu kalugacēyu jñānamē vidya).
(amṛtatvamu - anagā - cāvulēni sthiti, mōkṣamu - dāniki sādhanamainadē vidya) ‘hamṛtaṃ vidyā’ (śvētāśvatarōpaniṣat)
(paramapuruṣārthamaina mōkṣamunu poṃdiṃcu vidya)
(viṣṇu purāṇamulō ceppabaḍina vidya)
“sarvēśvaruni yaṃdu nēmiṭa miti saṃbhaviṃcunadi vidya” (śrīmadāṃdhramābhāgavatamu - 4 - 29 - 875)
vidyānāma śrīvidyaiva.
(śrīvidyayē vidya - śrīdēvini guṟiṃci ceppunadiyē vidya)
(mōkṣamunaku okē kāraṇamainadi - okē sādhanamainadagu śrīvidyayē vidya. iṃduku saṃdēhamu lēdu)
ātma śarīramukaṃṭe vēṟu ani teliyacēyunadi vidya.
“mūḍhajanulaku jñānōpadēśaṃbunu, gāmyatyāgaṃbunu, sama darśanaṃbunu, vaiṣṇava samūhaṃbulatōḍi bhaktiyu, brāṇāyāmaṃbunu, jittaśuddhiyu nanunavi vidya yanaṃbaḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 109)
śrēyō viṣayā.
(śrēyassu viṣayamugā gala vidya, śrēyassunu bōdhiṃcunadi)
“cālāḥ avivēkinaḥ talamiṃdranīla kaṭāhakalpaṃ nabhōmalinaṃ pīta ityēvama parōkṣaṃ adhyasyaṃti. tatrēṃdriya grāhyatvaṃ nāstītivyabhicārā nna vyāptiḥ ētēnātma nātmanōḥ sādṛśyabhāvā nnādhyanaḥ ityapāstaṃ. ākṣiptaṃ samāhitaṃ uktalakṣaṇaṃ lakṣitaṃ adhyāsaṃ avidyā kāryatvāt avidyā iti manyaṃtē ityarthaḥ”
(nīlamugā kanabaḍu ākāśamu dhūḷi modalaguvāṭivalana malinamai pasupuraṃgu galadani ajñānulu adhyāsa kaligi yuṃduru - ā prakāramugānē ātmakaṃṭe vērukāni pratyagātma anātmayanu adhyāsa kalugu cunnadi. kāni ātmaki anātmaki sādṛśyamu lēnaṃduna idi adhyāsa kādu - iṭuvaṃṭi adhyāsa avidya yani paṃḍitulu ceppuduru - iṭlu telusukoni, dāni nijasvarūpamunu telusukonuṭa vidyayani ceppuduru)
(adhyāsanu pōgoṭṭi adhiṣṭhāna vastuvuyokka nijasvarūpamunu nirdhāraṇa cēyunadi vidya)
“māyāguṇatraya sāmānyaṃ valla prakṛti anipiṃcukonunu; duṣkarma viśēṣaṃvalla tāmasa pradhānamai sātvikamunu mūsukoni yavidya yanipiṃcukonunu; satkarma sāmardhyaṃvalla sātvika guṇapradhānamai avidyaku virōdhiyai vidya yanipiṃcukonunu. adi yelāgaṃṭe - svalpōdakālanayina pikalāgaku bahuḷaōdakamu virōdhiyai yuṃḍunu”. (brahmavidyā sudhārṇavamu - 3)
upāsana; aṃtardhānādi lakṣaṇaṃ -
(upāsana - aṃtardhānamaguṭa modalagu lakṣaṇamulu kaladi vidya.)
“cakra hastuni prakaṭiṃcu caduvu” (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 5 - 169)
“dvē vidyē vēditavyē parā cai nā parāca tatra aparā ṛgvēdō, yajurvēdaḥ, sāmavēdō adharva vēdaḥ, śikṣā, kalpō, vyākaraṇaṃ, niruktaṃ, chaṃdō jyōtiṣamiti. adha parā yayā tadakṣaramadhi gamyatē”.
“kētē vidyē itra trāha parā caivāparā ca iti - paramaparaṃ iti jñānaṃ - dvividhaṃ ityarthaḥ - tatra sūcīkaṭāha nyāyēna aparajñāna svarūpaṃ āha - tatrēti - jyōtiṣamatyanaṃtaraṃ.”itihāsanyāya purāṇa mīmāṃsā dharma śastrāṇi” iti adhikaḥ pāṭhaḥ śrībhāṣya kāraiḥ raṃgarāmānuja yatīṃdraiśca ādṛtaḥ ṣaḍaṃgōpēta sa śiraska sōtabṛhaṇa vēda śravaṇa janyaṃ parōkṣa jñānaṃ ityarthaḥ. adha paravidyāṃ āha - adhaparēti. atra tat śabdaḥ iti hāsma yat brahmavid itatra nirdiṣṭa ‘yat’ śabdaprati nirdēśakaḥ |
yēna jñānēna yadbrahma vidaḥ iti vākyē prāptatayā nirdiṣṭaṃ; tadakṣaraṃ adhigamyatē ādhikyēna gamyatē, aparōkṣī kriyatē ityarthaḥ -vivēkādi sādhana saptaka janyaṃ, śravaṇa janya jñānānaṃ tara bhāvi darśana samānākāraṃ parajñānaṃ ityarthaḥ -“.
(teliya tagina vidyalu reṃḍu - parāvidya, aparāvidya. ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamu, adharvavēdamu, śikhā, kalpamu, vyākaraṇamu, niruktamu, chaṃdassu, jyōtiṣamu - ivi aparāvidya. paina ceppina vāṭilō jyōtiṣamu taruvāta itihāsamulu, nyāyaśāstramu, purāṇamulu, mīmāṃsa śāstramulu, dharma śāstramu kūḍā aparāvidya yani śrīraṃgarāmānujulavāru vāri bhāṣyamulō ceppiyunnāru. ṣaḍaṃgamulatō kūḍinadi vēdaśirassu ayina upaniṣattulatō kūḍinadi ayina vēdaśravaṇamuvalana kaligina jñānamu aparavidyayani yarthamu)
(akṣaramaina, nityamaina parabrahma tatvamunu teliya cēyunadi parāvidya. ‘tat’ padārthamaina parabrahmanu ādhikyamutō (adhikamugā) aparōkṣamu cēyunadi sākṣātkariṃpacēyunadi, nityā nitya vivēkajñānamu modalagu ēḍu sādhanamula valana kalugu brahmajñānamu śravaṇamu valana kaligina jñānamu tarvāta kalugu sākṣātkāramu kaluga cēyu jñānamu parāvidya. (parājñānamu). ā parāvidya abhyuda ya phalamuniccunadi, niśrēya phalamu niccunadi, adiyē brahma vidya, nirguṇa brahmanu teliyacēyunadi. saguṇa brahmanu teliyacēyunadi aparāvidya.
(parabrahmamu viṣayamugā galadi - parabrahma tatvamunu bōdhiṃcunadi, aṃtarmukhamu kaladi vidya. adi upādhigā galadi ātma turīyamu - bahirmukhamu kaladi - prapaṃcavastuvulu viṣayamugā gala vidya upādhigāgala ātmaprājñuḍu)
(nirguṇa brahmajñānamu kaluguṭa kaṣṭamani saguṇa brahmajñānamu muṃdu kaliginacō cittaśuddhi, citta ēkāgrata kalugunani, dānivalana nirguṇa brahmajñānamu kalugunani adiyē brahma vidyayani ceppabaḍinadi)
“tatprāpti hēturjñānaṃ ca karacōktaṃ mahā munē |
āgamōtthaṃ vivēkācca dvidhā jñānaṃ tadōcyatē ||
śabda brahma gama mayaṃ paraṃ brahma vivēkajaṃ ||” iti.
(brahma prāptiki reṃḍu vidyalu teliya taginavi - brahma viṣayamu parōjñānamu aparōkṣajñānamu anu reṃḍiṃṭivalana teliyanagunu. parabrahmanu poṃduṭaku jñānamu, karma ceppabaḍinavi - āgamamulavalana, vivēkamu cētanu kalugunadi śabdabrahma āgamamayamu - vēdamulavalana kalugunadi, vivēkamu valana kalugunadi paravidya).
avidya yā mṛtyuṃ tīrtvā vidyayā amṛtamaśnutē ||“.
“atrāpi vidyā śabdābhihita varṇāśrama vihitaṃ karma - avidyayā karmaṇā mṛtyuṃ jñānōtpatti virōdhi prācīnaṃ karmā. tīrtvā āpōhya, vidyayā jñānēna amṛtaṃ brahma aśnutē prāpnō tītyarthaḥ - mṛtyu taruṇōpāya tayā pratītā avidyā vidyētara dvihi taṃ karmaiva”. (śrīśaṃkaraḥ)
“vidyayā mṛtyuṃ tīrtvā - -” iti śutyā karmaṇā pāpanivṛtti jñānēna muktyabhi dhānācca- iti.
(ikkaḍa vidyayanagā varṇāśramamulaku vidhiṃcabaḍina karma. avidyayanagā karma - mṛtyuvanagā jñānamu kaluguṭaku āṭaṃkamu cēyu karma - jñānamucēta amṛtamanagā brahmanu poṃdunu - brahmamē mōkṣamu, mōkṣamē brahma).
(vidyayanagā brahmajñanamu kalugacēyunadi. avidya yanagā śāstrajñānamu - avidyavalana saṃsāramulō sukhaduḥkhamulanu pōgoṭṭukonimṛtyuvunudāṭi vidyacēta marala mṛtyuvu kalugakuṃḍa - janma lēkuṃḍa - cēsukonunu - anagā, mōkṣamu noṃdunu - kanuka vidyanu avidyanu reṃḍiṃṭinī nērcavalenu - avidya nērcanidē vidya alavaḍuṭa kaṣṭamu).
paryaṃkavidya, paṃcāgni vidya; upakōsalavidya, daharavidya, madhuvidya, śāṃḍilya vidya; ṣōḍaśakalāvidya; vaiśvānaravidya - ivi upāsanalu -
(śāṃḍilya vidyayaṃdu parabrahma hṛdayamaṃduṃḍunani ceppabaḍinadi. “ī ātma hṛdayamaṃdunnadi” ani śruti ceppucunnadi).
(2). daharavidyāyāṃ - “daharaṃ piuṃḍarīkaṃ vēśma daharō(a)sminnaṃ tara ākāśaḥ” iti. (hṛdaya puṃḍarīkamu lōpalanuṃḍu ākāśamu ani ceppabaḍinadi)
(3). upakōsalavidyāyāṃ tvakṣvāya tanatvaṃ - “ya ēṣō (a)kṣiṇē puruṣō dṛśyatē” iti.
(upakōsala vidyalō kannu parabrahmaki āyatanamani ceppabaḍinadi - kaṃṭilō parabrahma unnāḍani ceppabaḍinadi –“kaṃṭilō ē parama puruṣuḍu kanabaḍucunnāḍō atanē parabrahma” ani śruti ceppucunnadi - “ēvaṃ tatra tatra tattadhā dhyātmika māyatanamē tēsu vidyāsu pratīyatē - - ēkamapi brahma vibhūti bhēdairanēka dhairanēka thā upāsyatē iti sthitiḥ parōvarīyastvādi bhēda darśanāt”
(śrīśaṃkaraḥ - brahmasūtrabhāṣyē - 3 - 3 - 23)
paina ceppina prakāramu śrutulalō akkaḍakkaḍa brahma āyatanamu - parabrahma uṃḍucōṭu - ī vidyalalō ceppabaḍinadi, parabrahma okaḍē ayinanu vibhūti bhēdamulavalana - atanu uṃḍi prakaṭamagu konni viśiṣṭa vastuvula bhēdamuvalana anēka vidhamulugā parabrahma upāsiṃpabaḍu cunnāḍu - parabrahma kṣīṇiṃcanivāḍu ani ceppabaḍi yuṃḍuṭacēta.)
(vidyalu mūḍu vidhamulu - ahaṃ grahōpāsana, taṭasthamu, aṃgāśritamu).
“alvīkṣikī, trayīvārtā daṃḍanītiśca śāsvatā |
ētā vidyācatasrastu lōka saṃsthiti śāśvatā |
ētā vidyā ca ta srastu lōka saṃsthiti hētuvaḥ ||“.
(anvīkṣikī, ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamu anu mūḍu, vārtā, daṃḍanīti - ī nālugu vidyalu lōkamula sthitiki kāraṇamulagucunnavi)
(vidyatō samānamaina cakṣuvu lēdu - māṃsapu kannulatō kaṃṭe vidyayaneḍi kaṃṭitō viśēṣamulanu cūḍa galuduru).
(maṃdabuddhiki - sōmariki - vidya abbadu - vidyalēnivāniki dhanamu kalugadu)
(sukhamu kōruvāniki vidya alavaḍadu - vidyanu nērcukonavalenanu buddhi kalugadu - vidyanu nērcukonu abhilāṣa galavāḍu sukhamu nāśiṃca kūḍadu - kaṣṭapaḍinanē vidya alavaḍunu)
(itara sthalamulaṃduṃḍunapuḍu vidyayē mitruḍu - akkaraku vaccunadi. mitrulu lēnicōṭa vidyayē mitrunivale sahakariṃcunu)
vidyā vihīnāḥ na śōbhaṃtē nirgaṃdhāḥ kinśukā iva ||“.
(eṃtaṭi suṃdara rūpamugalavārainanu, yauvanavaṃtulainanu, eṃtaṭi goppa kulamaṃdu puṭṭinavārainanu vidyalēnivāru vāsanalēni kiṃśuka puṣpamuvale śōbhiṃcaru).
karya kālē samutpannē na sā vidyā na taddhanaṃ ||”
(pustakamaṃduṃḍu vidya - samayāniki jñāpakamurāni vidya, avasaramunaku panikirāni vidya - itarulavaddanuṃḍu tanadhanamu - avasaramainapuḍu upayōgiṃpavu kanuka aṭṭividya vidyakādu, aṭṭi dhanamu tana dhanamukādu).
pātratvāddhanamāpnōti dhanāddharmaṃ ta tassukhaṃ ||”
(vidya yosagunu vinayaṃbu, vinayamunanu baḍayu pātrata, pātratavalana dhanamu| dhanamuvalananu dharmaṃbu, dānivalana| aihikāmuṣmika sukhaṃbulaṃdu naruḍu||.
kātēva cābhiramayatyapanīya khēdaṃ |
kīrtiṃca dikṣu vitanōti lakṣmīṃ |
kiṃ kiṃ na sādayati kalpalatēva vidyā ||“. (bhōjarājacaritramu)
(vidya tallivale rakṣiṃcunu, taṃḍri vale hitakāryamunaṃdu niyōgiṃcunu, bhāryavale duḥkhamuna napanayiṃci (pōgoṭṭi) ramiṃpa cēyunu, kīrtiyaneḍi lakṣmini dikkulaṃdu prasariṃpacēyunu - (lēka, kīrtini dikkulaṃdu sāṭiṃcunu) (dhanamunu cēkūrcunu, iṭṭi vidya kōrikalaniccu kalpa vṛkṣamu -).
adhavā vidyayā vidyā caturthō nōpapadyatē ||“.
(vidyanu guruvunaku śuśrūṣacēsi yainanu, puṣkalamugā dhanamu nicciyainanu, lēka tanaku gala vidyanicci yiṃkokari daggaranunna vidyanu nērcukonuṭacētanainanu saṃpādiṃpavalenu - vidyanu saṃpādicuṭaku itaramārgamu lēdu)
vidyayanagā brahmajñānamē ayinanu brahmajñānamunaku sādhanamulaina upāsanalu kūḍa vidyayē yani ceppabaḍinavi.
“yāmāmanaṃti munayaḥ prakṛtiṃ purāṇīṃ |
vidyētiyāṃ śruti rahasya girō ghṛṇaṃti |
tāmartha pallavita śaṃkara rūpa mudrāṃ |
dēvī mananyaśaraṇaśsaraṇaṃ prapadyē ||“.
(munulu dēnini anādiyagu prakṛtiyani ceppudurō, śruti rahasyamulu - upaniṣattulu dēnini vidyayani ceppucunnavō, śaṃkaruni śarīramulō ēdi arthabhāgamagucunnadō aṭṭi śrīdēvini - śivaśaktiyē mūrtībhaviṃcina dānini - vēru śaraṇamulēni vāḍanai - nēnu - śaraṇu poṃducunnānu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.