← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విజ్ఞానము vijñānamu

Original — తెలుగు
  1. సవిశేష జ్ఞానం విజ్ఞానం.

(విశేషముతో కూడిన జ్ఞానము - విశేష జ్ఞానముతో కూడిన జ్ఞానము).

  1. విజ్ఞాయతే అనేన ఇతి విజ్ఞానం - సేంద్రియా బుద్ధిః.

(పదార్థములను బాగుగా తెలుసుకొనునట్లు చేయు జ్ఞానము - ఇంద్రియములతో కూడిన బుద్ధివలన కలుగు జ్ఞానము).

  1. వివేకాది జన్యం జ్ఞానం - విజ్ఞానం.

(మంచి, చెడ్డ యొక్క వివేకము, ఆత్మ అనాత్మల యొక్క వివేకమువలన కలుగు జ్ఞానము).

  1. విశేషతః శాస్త్రజ్ఞానం, తదనుభవః -

(శాస్త్రమువలన విశేషముగ కలిగిన జ్ఞానము, దాని అనుభవము).

  1. విశేషేణ ఇదమిత్థం నాన్యథా, అహమే తత్ నతు మత్తో అన్య దిత్యాదినా అవగమ్యమానం జ్ఞానం.

(ఇది ఈ ప్రకారముగానే, మరియొక రీతిగా కాదు - ఇది నేనే, నాకంటె వేరు కాదు అను మొదలగు జ్ఞానము)

  1. విశిష్టం భకిరూపం యత్ జ్ఞానం తత్ విజ్ఞానం.

(భక్తిరూపమైన జ్ఞానము విజ్ఞానము)

  1. విజ్ఞాయతే అనేన దివ్యాత్మ స్వరూపం ఇతి విజ్ఞానం.

(దివ్యమైన ఆత్మస్వరూపమును, ఆత్మ యాధాత్మ్యమును తెలియచేయునది విజ్ఞానము.)

  1. “పరతత్వ గతా సాధారణ విశేష విషయం జ్ఞానం” (శ్రీమాన్ రామానుజః)

(పరతత్వమునకు సంబంధించిన అసాధారణ విశేష వీషయమును తెలియచేయు జ్ఞానము).

  1. నిధిధ్యాసన జం.

(నిధిధ్యాసనవలన కలిగిన జ్ఞానము)

  1. చిచ్ఛక్తిః -

(చిత్ అనగా చైతన్యము, జ్ఞానము - చైతన్య శక్తి, జ్ఞానశక్తి -)

  1. “విజ్ఞానం జీవాత్మానం బ్రహ్మప్రాపయతి.”

(జీవాత్మను బ్రహ్మతో పొందించునది -)

  1. కాలాది పరిజ్ఞానం.

(కాలము బ్రహ్మశక్తులలో నొకటి. సృష్టిలోని ప్రతి వస్తువు కాలము గడచినకొలది మార్పుచెందును - అటువంటి కాలము గుఱించి, దానివలన కలుగు పరిణామములగుఱించి అయిన జ్ఞానము)

  1. “చతుష్షష్టికలాది జ్ఞానం, లౌకికం జ్ఞానం” (శ్రీ అనందగిరి)

(అరువది నాలుగు కళలవలన కలుగు లోకసంబంధమైన జ్ఞానము)

  1. విశేషకల్పనా పరిజ్ఞానం విజ్ఞానం.

(విశేషకల్పనా పరిజ్ఞనము) (విశేషముగా కల్పించుట).

  1. విభిన్నతయా జ్ఞానం.

(అనేక రీతులుగానుండు జ్ఞానము - అనేక విషయముల గుఱించి అయిన జ్ఞానము -).

  1. “ఘృత మివ పయసి నిగూఢం భూతే భూతే చ వసతి విజ్ఞానం |

సతతం మనసి మంధయితవ్యం మనో మంథాన భూతేన”. (అమృత బిందూపనిషత్)

“యథా పయసి నిగూఢాం ఘృతం మధ నాదినా ఆవర్భవతి తథా భూతే భూతే సర్వ భూతాంతః కరణే తద్వత్తిభావా భావ ప్రకాశమపి విజ్ఞానం ప్రత్యక్తత్వం స్వాజ్ఞ దృష్టి నిగూఢతయా వసతి.”

(పాలలో కనబడకుందా గూఢముగా నుండు వెన్న (నేయి) పాలను మధించగా మధించగా పైకి వచ్చునట్లు సమస్త భూతముల అంతఃకరణమందు ఆ అంతఃకరణవృత్తిని ప్రకాశింపచేయు - క్రియలలో కనబడునట్లు చేయునది విజ్ఞానము. అది తన అజ్ఞానముచేత కప్పబడియుండును).

  1. “విజ్ఞానం బ్రహ్మవసతి తిరోహితం తన్మనసా మంథాన భూతేన మంథయి తవ్యం - మంథనేన పయః సకాశాత్ ఘృతమివ పృథక్ కుర్యాత్.”

(విజ్ఞానమే బ్రహ్మ. అది కనబడకుండ పైకి వెల్లడికాకుండ నుండును - దానిని మనస్సుచేత మంధనము చేయగా - మధించగా - వెన్న కొఱకు పాలు ద్రచ్చినట్లు - పాలలోనుండి వెన్నను వేఱు చేసినట్లు - విజ్ఞానమయమైన బ్రహ్మను పైకి తీసివేయవలయును - పైకి కనబడునట్లు చేయవలెను - బ్రహ్మ చైతన్యశక్తి ని పొందవలయును - ఉపయోగించుకొనవలెను) (పాల సముద్రమును మధించగా అమృతము, శ్రీమహాలక్ష్మి లభించినట్లు).

  1. సామాన్యైర్యేత ద్విజ్ఞాయాః విశేషాః విశేషాః మమగోచరాః |

దేవదీనాంతు తత్ జ్ఞానం దర్శనం విజ్ఞానమితి కీర్తితం |

శ్రవణాన్మననాచ్చైవ యత్ జ్ఞానముపజాయతే |

తత్ జ్ఞానం దర్శనం విష్ణోః విజ్ఞానం శంబురబ్రవీత్ |

విజ్ఞానం జ్ఞానమంగాదేః విశిష్టం దర్శనం తథా ||“.

(సామాన్య మానవులకు దేవతులు మొదలగువారికి నాకు తెలిసిన విషయములేవి తెలియవో వాటి గుఱించి అయిన జ్ఞానము విజ్ఞానమని చెప్పబడినది. శ్రవణము వలనను మననము వలనను కలుగు జ్ఞానము విజ్ఞానము - ఆ జ్ఞానము విష్ణు దర్శనమువలన కలుగునది. విజ్ఞానమనగా అంగముల విశిష్టదర్శనము - (భగవంతుని రూపమునను దర్శించుటవలన కలిగిన జ్ఞానము).

  1. వివిచ్యజ్ఞానం వ్యా వృత్తతయా జ్ఞానం ఇత్యర్థః -వివిక్తాకార విషయం జ్ఞానం విజ్ఞానం - “యథా అహం మద్వ్యతిరిక్తాత్ సమస్తచిద చిద్వస్తు జాతాన్నఖిల హేయ ప్రత్యనీకతయా నానా విధ్నాన వది కాతిశయా సంఖ్యేయ కల్యాణ గుణ గణానంతమహా విభూతి తయా చ వివిక్తః, తేన వివిక్త విషయ జ్ఞానం విజ్ఞానం”. (శ్రీమాన్ రామానుజః)

(వివేచనచే కలుగు జ్ఞానము - నేను కానటువంటి, నాకు వ్యతిరేకమైన - సమస్త చిద చిద్వస్తువులకంటె నేను ఏ విధమైన హేయగుణములు లేక, ఏ విధమైన హద్దులు ఆపులు లేక లెక్కలేనన్ని కల్యాణగుణములు, అనంతమైన విభూతులు కలిగియుండు వాడనగుటచేత వాటికంటెవేరు అయినవాడనగుటచేత వాటికంటె వేఱు అయినవాడనని తెలుసుకొనుట వివిక్త విషయ జ్ఞానము.

  1. “శాస్త్రోక్తానాం పదార్థానాం జ్ఞానం స్యాదేవ దేశికం |

అసందిగ్ధ విపర్యాసం విజ్ఞానం స్వానిభూతితః ||“. (గీతాభావప్రకాశము - 6 - 40)

(శాస్త్రములో చెప్పబడిన విషయములను గుఱించి కలుగు జ్ఞానము ఔపదేశికము - అనగా గురువు మొదలగువారు ఉపదేశించుటవలన కలిగిన జ్ఞానము - తన అనుభవము వలన సందిగ్ధములు, విపర్యాసములు లేక కలిగిన జ్ఞానము విజ్ఞానము).

  1. “విజ్ఞానం బ్రహ్మేతి వ్యజనాత్” -

(విజ్ఞానమే బ్రహ్మ అని చెప్పబడినది) - “విజ్ఞానమానందం బ్రహ్మ” -

  1. “మోక్షో విషయ వైరశ్యం బంధో వైషయికో రసః |

ఏతావ దేవ విజ్ఞానం యధేచ్చసి తధాకురు ||” (అష్టావక్రిగీత - 15 - 2)

(విషయము లందనురాగము లేకుండుటే మోక్షము)

  1. విశేషత స్తదనుభవః.

(విశేషముగా పరబ్రహ్మానుభవము కలిగియుండుట)

  1. ఆత్మ రూప విషయమునందు వ్యాప్తమైన వృత్తివలన జనించెడి “నేనీ బ్రహ్మమునే” అనెడి అపరోక్షజ్ఞానము - మోక్షమే ముఖ్యమగు ప్రయోజనముగా గలది.

  2. “జ్ఞానం తే(అ)హం సవిజ్ఞానమిదం వక్ష్యామ్య శేషతః |

యత్ జ్ఞాత్వా నేహ భూయో (అ)న్యత్ జ్ఞాతన్యమవశిష్యతే ||“. (శ్రీమద్భగవద్గీత - 7- 2)

(విజ్ఞానముతో కూడిన జ్ఞానమునంతయు నీకు చెప్పుచున్నాను - ఇది తెలిసిన తర్వాత ఇంకను తెలియవలసినది మిగిలి యుండదు అని శ్రీకృష్ణభగవానుడు అర్జుననకు బోధించెను - శాస్త్ర జ్ఞానముతో అనుభవజ్ఞానము కలిసినయడల దానికి మించిన జ్ఞానము మఱియుండదు).

  1. చేతనం జంగమం - అజడస్వరూపం.

(చైతన్యశక్తి - జ్ఞానశక్తి - చరము - జడము కానిది.)

విజ్ఞానఘనము
  1. చిదేకరసము - సాంద్రిమైన చైతన్యము - చైతన్య ఘనము - ఘనీభూతమైన చైతన్యము.

(సృష్టిలోని ఎన్ని వస్తువులను సృష్టించినను, వాటి అన్నింటికి కావలసిన చైతన్యము నిచ్చినను తరగని చైతన్యము గలవాడు).

  1. “యథా సైంధవ ఖండః అంతర్బహిశ్చ రసనా (అ)వతిష్టతే, ఏవమాత్మా పి అంతర్బహిశ్చ సర్వత్ర విజ్ఞేయ వినిర్ముక్త విజ్ఞానైక స్వరూపతయా అవతిష్టతే”.

(ఉప్పుగల్లు లోపల పైన అంతట ఉప్పు రసముతోనే ఎట్లు నిండియుండునో, అట్లే ఆత్మ అంతట, అన్నింటిలోను విజ్ఞానమయ రూపముతో - చైతన్య రూపుడై నిండియున్నాడు).

  1. నమే (అ)స్తి పూర్వన్న పరన్న చాంతరం, ని బాహ్యవస్త్యేవ, సదా, మునీశ్వరాః |

యధైవ సింధూత్థ ఘనో రసాత్మకః తధైవ విజ్ఞాన ఘనో (అ)హమాస్తికాం ||.

(నాకు ముందుకాని, తర్వాతగాని, (వెనుకగాని) లోపలగాని, వెలుపలగాని ఎప్పుడూ ఏదియు లేదు - ఉప్పుగడ్డలోనున్నది అంతయు ఉప్పు రసమే అయినట్లు నేను ఘనీభూతమైన విజ్ఞానమునై - ఘనీభవించిన చైతన్యమై - చిచ్చక్తినై - యున్నాను)

Transliteration
  1. saviśēṣa jñānaṃ vijñānaṃ.

(viśēṣamutō kūḍina jñānamu - viśēṣa jñānamutō kūḍina jñānamu).

  1. vijñāyatē anēna iti vijñānaṃ - sēṃdriyā buddhiḥ.

(padārthamulanu bāgugā telusukonunaṭlu cēyu jñānamu - iṃdriyamulatō kūḍina buddhivalana kalugu jñānamu).

  1. vivēkādi janyaṃ jñānaṃ - vijñānaṃ.

(maṃci, ceḍḍa yokka vivēkamu, ātma anātmala yokka vivēkamuvalana kalugu jñānamu).

  1. viśēṣataḥ śāstrajñānaṃ, tadanubhavaḥ -

(śāstramuvalana viśēṣamuga kaligina jñānamu, dāni anubhavamu).

  1. viśēṣēṇa idamitthaṃ nānyathā, ahamē tat natu mattō anya dityādinā avagamyamānaṃ jñānaṃ.

(idi ī prakāramugānē, mariyoka rītigā kādu - idi nēnē, nākaṃṭe vēru kādu anu modalagu jñānamu)

  1. viśiṣṭaṃ bhakirūpaṃ yat jñānaṃ tat vijñānaṃ.

(bhaktirūpamaina jñānamu vijñānamu)

  1. vijñāyatē anēna divyātma svarūpaṃ iti vijñānaṃ.

(divyamaina ātmasvarūpamunu, ātma yādhātmyamunu teliyacēyunadi vijñānamu.)

  1. “paratatva gatā sādhāraṇa viśēṣa viṣayaṃ jñānaṃ” (śrīmān rāmānujaḥ)

(paratatvamunaku saṃbaṃdhiṃcina asādhāraṇa viśēṣa vīṣayamunu teliyacēyu jñānamu).

  1. nidhidhyāsana jaṃ.

(nidhidhyāsanavalana kaligina jñānamu)

  1. cicchaktiḥ -

(cit anagā caitanyamu, jñānamu - caitanya śakti, jñānaśakti -)

  1. “vijñānaṃ jīvātmānaṃ brahmaprāpayati.”

(jīvātmanu brahmatō poṃdiṃcunadi -)

  1. kālādi parijñānaṃ.

(kālamu brahmaśaktulalō nokaṭi. sṛṣṭilōni prati vastuvu kālamu gaḍacinakoladi mārpuceṃdunu - aṭuvaṃṭi kālamu guṟiṃci, dānivalana kalugu pariṇāmamulaguṟiṃci ayina jñānamu)

  1. “catuṣṣaṣṭikalādi jñānaṃ, laukikaṃ jñānaṃ” (śrī anaṃdagiri)

(aruvadi nālugu kaḷalavalana kalugu lōkasaṃbaṃdhamaina jñānamu)

  1. viśēṣakalpanā parijñānaṃ vijñānaṃ.

(viśēṣakalpanā parijñanamu) (viśēṣamugā kalpiṃcuṭa).

  1. vibhinnatayā jñānaṃ.

(anēka rītulugānuṃḍu jñānamu - anēka viṣayamula guṟiṃci ayina jñānamu -).

  1. “ghṛta miva payasi nigūḍhaṃ bhūtē bhūtē ca vasati vijñānaṃ |

satataṃ manasi maṃdhayitavyaṃ manō maṃthāna bhūtēna”. (amṛta biṃdūpaniṣat)

“yathā payasi nigūḍhāṃ ghṛtaṃ madha nādinā āvarbhavati tathā bhūtē bhūtē sarva bhūtāṃtaḥ karaṇē tadvattibhāvā bhāva prakāśamapi vijñānaṃ pratyaktatvaṃ svājña dṛṣṭi nigūḍhatayā vasati.”

(pālalō kanabaḍakuṃdā gūḍhamugā nuṃḍu venna (nēyi) pālanu madhiṃcagā madhiṃcagā paiki vaccunaṭlu samasta bhūtamula aṃtaḥkaraṇamaṃdu ā aṃtaḥkaraṇavṛttini prakāśiṃpacēyu - kriyalalō kanabaḍunaṭlu cēyunadi vijñānamu. adi tana ajñānamucēta kappabaḍiyuṃḍunu).

  1. “vijñānaṃ brahmavasati tirōhitaṃ tanmanasā maṃthāna bhūtēna maṃthayi tavyaṃ - maṃthanēna payaḥ sakāśāt ghṛtamiva pṛthak kuryāt.”

(vijñānamē brahma. adi kanabaḍakuṃḍa paiki vellaḍikākuṃḍa nuṃḍunu - dānini manassucēta maṃdhanamu cēyagā - madhiṃcagā - venna koṟaku pālu draccinaṭlu - pālalōnuṃḍi vennanu vēṟu cēsinaṭlu - vijñānamayamaina brahmanu paiki tīsivēyavalayunu - paiki kanabaḍunaṭlu cēyavalenu - brahma caitanyaśakti ni poṃdavalayunu - upayōgiṃcukonavalenu) (pāla samudramunu madhiṃcagā amṛtamu, śrīmahālakṣmi labhiṃcinaṭlu).

  1. sāmānyairyēta dvijñāyāḥ viśēṣāḥ viśēṣāḥ mamagōcarāḥ |

dēvadīnāṃtu tat jñānaṃ darśanaṃ vijñānamiti kīrtitaṃ |

śravaṇānmananāccaiva yat jñānamupajāyatē |

tat jñānaṃ darśanaṃ viṣṇōḥ vijñānaṃ śaṃburabravīt |

vijñānaṃ jñānamaṃgādēḥ viśiṣṭaṃ darśanaṃ tathā ||“.

(sāmānya mānavulaku dēvatulu modalaguvāriki nāku telisina viṣayamulēvi teliyavō vāṭi guṟiṃci ayina jñānamu vijñānamani ceppabaḍinadi. śravaṇamu valananu mananamu valananu kalugu jñānamu vijñānamu - ā jñānamu viṣṇu darśanamuvalana kalugunadi. vijñānamanagā aṃgamula viśiṣṭadarśanamu - (bhagavaṃtuni rūpamunanu darśiṃcuṭavalana kaligina jñānamu).

  1. vivicyajñānaṃ vyā vṛttatayā jñānaṃ ityarthaḥ -viviktākāra viṣayaṃ jñānaṃ vijñānaṃ - “yathā ahaṃ madvyatiriktāt samastacida cidvastu jātānnakhila hēya pratyanīkatayā nānā vidhnāna vadi kātiśayā saṃkhyēya kalyāṇa guṇa gaṇānaṃtamahā vibhūti tayā ca viviktaḥ, tēna vivikta viṣaya jñānaṃ vijñānaṃ”. (śrīmān rāmānujaḥ)

(vivēcanacē kalugu jñānamu - nēnu kānaṭuvaṃṭi, nāku vyatirēkamaina - samasta cida cidvastuvulakaṃṭe nēnu ē vidhamaina hēyaguṇamulu lēka, ē vidhamaina haddulu āpulu lēka lekkalēnanni kalyāṇaguṇamulu, anaṃtamaina vibhūtulu kaligiyuṃḍu vāḍanaguṭacēta vāṭikaṃṭevēru ayinavāḍanaguṭacēta vāṭikaṃṭe vēṟu ayinavāḍanani telusukonuṭa vivikta viṣaya jñānamu.

  1. “śāstrōktānāṃ padārthānāṃ jñānaṃ syādēva dēśikaṃ |

asaṃdigdha viparyāsaṃ vijñānaṃ svānibhūtitaḥ ||“. (gītābhāvaprakāśamu - 6 - 40)

(śāstramulō ceppabaḍina viṣayamulanu guṟiṃci kalugu jñānamu aupadēśikamu - anagā guruvu modalaguvāru upadēśiṃcuṭavalana kaligina jñānamu - tana anubhavamu valana saṃdigdhamulu, viparyāsamulu lēka kaligina jñānamu vijñānamu).

  1. “vijñānaṃ brahmēti vyajanāt” -

(vijñānamē brahma ani ceppabaḍinadi) - “vijñānamānaṃdaṃ brahma” -

  1. “mōkṣō viṣaya vairaśyaṃ baṃdhō vaiṣayikō rasaḥ |

ētāva dēva vijñānaṃ yadhēccasi tadhākuru ||” (aṣṭāvakrigīta - 15 - 2)

(viṣayamu laṃdanurāgamu lēkuṃḍuṭē mōkṣamu)

  1. viśēṣata stadanubhavaḥ.

(viśēṣamugā parabrahmānubhavamu kaligiyuṃḍuṭa)

  1. ātma rūpa viṣayamunaṃdu vyāptamaina vṛttivalana janiṃceḍi “nēnī brahmamunē” aneḍi aparōkṣajñānamu - mōkṣamē mukhyamagu prayōjanamugā galadi.

  2. “jñānaṃ tē(a)haṃ savijñānamidaṃ vakṣyāmya śēṣataḥ |

yat jñātvā nēha bhūyō (a)nyat jñātanyamavaśiṣyatē ||“. (śrīmadbhagavadgīta - 7- 2)

(vijñānamutō kūḍina jñānamunaṃtayu nīku ceppucunnānu - idi telisina tarvāta iṃkanu teliyavalasinadi migili yuṃḍadu ani śrīkṛṣṇabhagavānuḍu arjunanaku bōdhiṃcenu - śāstra jñānamutō anubhavajñānamu kalisinayaḍala dāniki miṃcina jñānamu maṟiyuṃḍadu).

  1. cētanaṃ jaṃgamaṃ - ajaḍasvarūpaṃ.

(caitanyaśakti - jñānaśakti - caramu - jaḍamu kānidi.)

vijñānaghanamu
  1. cidēkarasamu - sāṃdrimaina caitanyamu - caitanya ghanamu - ghanībhūtamaina caitanyamu.

(sṛṣṭilōni enni vastuvulanu sṛṣṭiṃcinanu, vāṭi anniṃṭiki kāvalasina caitanyamu niccinanu taragani caitanyamu galavāḍu).

  1. “yathā saiṃdhava khaṃḍaḥ aṃtarbahiśca rasanā (a)vatiṣṭatē, ēvamātmā pi aṃtarbahiśca sarvatra vijñēya vinirmukta vijñānaika svarūpatayā avatiṣṭatē”.

(uppugallu lōpala paina aṃtaṭa uppu rasamutōnē eṭlu niṃḍiyuṃḍunō, aṭlē ātma aṃtaṭa, anniṃṭilōnu vijñānamaya rūpamutō - caitanya rūpuḍai niṃḍiyunnāḍu).

  1. namē (a)sti pūrvanna paranna cāṃtaraṃ, ni bāhyavastyēva, sadā, munīśvarāḥ |

yadhaiva siṃdhūttha ghanō rasātmakaḥ tadhaiva vijñāna ghanō (a)hamāstikāṃ ||.

(nāku muṃdukāni, tarvātagāni, (venukagāni) lōpalagāni, velupalagāni eppuḍū ēdiyu lēdu - uppugaḍḍalōnunnadi aṃtayu uppu rasamē ayinaṭlu nēnu ghanībhūtamaina vijñānamunai - ghanībhaviṃcina caitanyamai - ciccaktinai - yunnānu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.