← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వికారః vikāraḥ

Original — తెలుగు
  1. వస్తువు మరియొక విధముగా మారుట - పాలు పెరుగుగా మారుట; పరిణామము.

  2. పూర్వరూపం త్యక్త్వా అన్యరూపప్రాప్తిః వికారః; స ఏవ విక్రియా, పరిణామః ఇతి చ ఉచ్యతే.

(ఇదివరకునుండు రూపమును వదలి ఇంకొక రూపమును పొందుట వికారము. అదియే విక్రియ యని పరిణామమని చెప్పబడుచున్నది.)

  1. ప్రకృతి పరిణామాః

(ప్రకృతియొక్క మార్పులు - జడమైన ప్రకృతిలో పురుషుడు - భగవంతుడు - తన చైతన్యశక్తితో ప్రవేశించి దానికి చైతన్యము కలిగించుటవలన దానిలోనుండి మరియొక వస్తువు కలుగుచున్నది - ఈ విధముగా ప్రకృతి అనేక వస్తువులుగా మారుచున్నది, ఈ వస్తువులన్నియు ప్రకృతియొక్క వికారములు, మార్పులు - ఈ వస్తువులన్నింటికి ప్రకృతి ఉపాదానకారణము)

  1. ప్రకృతేః అన్య విధాత్వం (ప్రకృతి యింకొక విధముగా మారుట)

  2. అహంకారః (అహంకారము)

  3. మహత్తత్తాహంకారాది

(మహత్తత్తము, అహంకారము మొదలగునవి)

  1. దేవతిర్యగాది వికారః

(దేవతులు, తిర్యగ్జంతువులు మొదలగునవి.)

  1. ఏకాదశేంద్రియాణి మహాభూతాని చ ఇతి చ షోడశకః

  2. ఏకాదశేంద్రియాణి మహాభూతాని చ ఇతి షోడశకః

(జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు, పంచభూతములు కలిసి పదియారు వికారములు).

  1. ఇచ్ఛాదయః (కోరిక మొదలగునవి)

  2. హర్షో ద్రేకాది రూపః, విపరీత భావః

(సంతోషము, ఉద్రేకము కలిగియుండుట - విపరీత భావములు కలిగియుండుట - ఏమిటా వికారము? ఏందుకట్లు వికారపడుతున్నావు? అను మాటలు వాడుకలో నున్నవేకదా!).

  1. ” వ. - - - కర్మేంద్రియంబులయిన వాక్పాణి పాదపాయూపస్థంబులును, జ్ఞానేంద్రియంబులైన శ్రవణ, నయన, రసనాత్వక ఘ్రాణంబులును, మనంబును మహీ సలిల తేజోవాయుగ గనంబులును నివి పదాఱును వికారంబులు” –

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 7 - 237)

  1. వివిధం కార్యం యస్య ఇతి వికారీ, (అహంకారము),

(అనేక విధములైన కార్యవస్తువులను కలిగించునది - అహంకారము)

  1. ఒక పదార్థముచే ఏర్పడిన - ఒక పదార్థములోనుండి పుట్టిన - మఱియొక పదార్థము.

  2. “ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి |

వికరాంశ్చ గుణాంశ్చైవ విద్ది ప్రకృతి సంభవాన్||“. (శ్రీమద్భగవద్గీత - 13 - 19)

(వికారములు, గుణములు ప్రకృతివలన కలిగినవి అని తెలుసుకొనుము. ప్రకృతి, పురుషుడు (భగవంతుడు) అనాదినుండి యున్నవి, ప్రకృతి పురుష సం యోగము వలన ప్రకృతిలో నుండి కలిగినవి వికారములు - ప్రకృతియే అనేక వస్తువులుగా మారినది. అట్లు మారిన వస్తువులు వికారములు)

  1. “మూల ప్రకృతి రవికృతిః, మహదాద్యాః ప్రకృతి వికృతయ స్సప్త, షోడశకశ్చ వికారః, న ప్రకృతిర్న వికృతిః పురుషః”.

(మూల ప్రకృతి వికృతి కాదు, అది ఇంకొక వస్తువు పరిణామము చెందుటవలన కలిగినది కాదు - భగవంతునివలె మొదటినుండి యున్నదే. మహత్తత్వము మొదలగునవి ప్రకృతియొక్క వికారములు - పంచభూతములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు అను పదియారును వికరములు - పురుషుడు ప్రకృతి కాడు, వికృతి కాడు)

  1. “వికారశ్చ వ్యభిచరతి, యథ ఘటాది సంస్థానం చక్షుషా నిరూప్యమానం మృద్వ్యతే రేకేణ అనులబ్ధేః అసత్, తథా సర్వో వికారః కారణ వ్యతిరేకేణ అనుపలబ్దేరినన్ = నహి శీతోష్ణాదిసకారణం ప్రమానైః నిరూప్యమాణం వస్తు సంభవతి - వికారోహి సః”.

(వికారము అనగా మార్పుచెందునది. కుండ మొదలగునవి మన్నుకక ఇతరము కాదని కంటికి కనబడుతవలన - అని అసత్ అని చెప్పబడును - ఆ ప్రకారముగానే కారణములేనిదే కార్యము కలుగుట అసంభవముకనుక కార్యములు - వికారములు - అసత్. శీతోష్ణాదులకు కారనము ప్రమాణమువలన నిరూపించుటకు వీలులేనిదగుటచే అవి అసత్. వికారము కూడ నిటువంటిదే - మట్టియొక్క వికారమే, మార్పే కుండ).

  1. వికారములు ఆరు విధములు - షడ్భావ వికారములు - “అస్తి, జాయతే, వర్థతే, పరిణమితే, పరిక్షీయతే, మ్రియతే” - అస్తిత్వము = ఉండుట, ఉనికి; జన్మించుట; వృద్ధిపొందుట - పెరుగుట; మార్పుచెందుట; క్షీణించుట, (తరుగుట - తరిగిపోవుట); నశించుట - జన్మించిన వస్తువులన్నియు జన్మకలవే - భగవంతుడు అజుడు = జన్మ లేనివాడు - అనాది. అందుచేత భగవంతునికి వికారములు - మార్పులు - లేవు, నిర్వికారుడు, ఎల్లపుడు ఒకే రీతిగ నుండువాడు - ” సదా ఏకరసః“).

  2. ప్రాకృత దృష్టిలో వికారములన్నియు వేరు వేరుగా నున్నట్లు కనుపించినను పరమార్థ దృష్టిలో అవన్నియు భగవంతుడే - భగవంతుని నామరూపములే. మట్టితో చేసిన కుండ, మూకుడు మొదలగునవి యధార్థ స్థితిలో మట్టియే. అందుచేత కుండ, మూకుడు మొదలగువాటివలెనుండు కార్యవస్తువులన్నియు - వికారములన్నియు - నశించ వలసినవే - సృష్టిలోని ప్రతివస్తువు పుట్టిన దగ్గరనుండి చనిపోవువరకు మార్పులు చెందుచునే యుండును - ఈ మార్పు ఆగకుంద, కంటికి కనపదకుందా, దినదినము, క్షణక్షణము జరుగుచునే యుండును - కలగతిని బట్టి ఒక చిన్న మొక్క పెద్ద చెట్టుగా క్రమేపి పెరుగును - ఒక చిన్న లేత ఆకు, చిగిర్చి లేతరంగు కలదై - కాంతివంతముగా నుండి, నిగనిగలాడుచు రాత్రి, పగలు అనకా మెల్లిగా, పెరుగుచు పెరిగినకొలది ముదిరిన రంగు కలదై చివరకు రాలిపోవును. అట్లు మార్పు చెందునవి కనుకనే ఈ ప్రపంచమును జగత్ అని చెప్పుచున్నారు - (That which undergoes a change almotst every moment)

“వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం”. = మృత్తిక (మన్ను) వలన పుట్టి, మృత్తికయందుండి, మృత్తికయందు లయమగు కుండ, మూకుడు మోదలగు మూర్తి వికారమంతయు నామధేయమాత్రము - పేరుకే కుండ, మూకుడు అని చెప్పబడుచున్నవి. ఇవన్నియు నిజమునకు మట్టియే. అట్లే ఈ ప్రపంచమంతయు బ్రహ్మవలన పుట్టి, బ్రహ్మవలన పెరిగి, పోషింపబడి బ్రహ్మమునందే లయమగుటవలన ఇవన్నియు బ్రహ్మరూపములగుట స్పష్టము; బ్రహ్మము కన్న వేఱొక వస్తువు లేదు - అంతా బ్రహ్మమే, అన్నీ బ్రహ్మమే - “ఆ హరిమయముగాని వస్తువు పరమాణువు లేదు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - )

Transliteration
  1. vastuvu mariyoka vidhamugā māruṭa - pālu perugugā māruṭa; pariṇāmamu.

  2. pūrvarūpaṃ tyaktvā anyarūpaprāptiḥ vikāraḥ; sa ēva vikriyā, pariṇāmaḥ iti ca ucyatē.

(idivarakunuṃḍu rūpamunu vadali iṃkoka rūpamunu poṃduṭa vikāramu. adiyē vikriya yani pariṇāmamani ceppabaḍucunnadi.)

  1. prakṛti pariṇāmāḥ

(prakṛtiyokka mārpulu - jaḍamaina prakṛtilō puruṣuḍu - bhagavaṃtuḍu - tana caitanyaśaktitō pravēśiṃci dāniki caitanyamu kaligiṃcuṭavalana dānilōnuṃḍi mariyoka vastuvu kalugucunnadi - ī vidhamugā prakṛti anēka vastuvulugā mārucunnadi, ī vastuvulanniyu prakṛtiyokka vikāramulu, mārpulu - ī vastuvulanniṃṭiki prakṛti upādānakāraṇamu)

  1. prakṛtēḥ anya vidhātvaṃ (prakṛti yiṃkoka vidhamugā māruṭa)

  2. ahaṃkāraḥ (ahaṃkāramu)

  3. mahattattāhaṃkārādi

(mahattattamu, ahaṃkāramu modalagunavi)

  1. dēvatiryagādi vikāraḥ

(dēvatulu, tiryagjaṃtuvulu modalagunavi.)

  1. ēkādaśēṃdriyāṇi mahābhūtāni ca iti ca ṣōḍaśakaḥ

  2. ēkādaśēṃdriyāṇi mahābhūtāni ca iti ṣōḍaśakaḥ

(jñānēṃdriyamulu, karmēṃdriyamulu, manassu, paṃcabhūtamulu kalisi padiyāru vikāramulu).

  1. icchādayaḥ (kōrika modalagunavi)

  2. harṣō drēkādi rūpaḥ, viparīta bhāvaḥ

(saṃtōṣamu, udrēkamu kaligiyuṃḍuṭa - viparīta bhāvamulu kaligiyuṃḍuṭa - ēmiṭā vikāramu? ēṃdukaṭlu vikārapaḍutunnāvu? anu māṭalu vāḍukalō nunnavēkadā!).

  1. ” va. - - - karmēṃdriyaṃbulayina vākpāṇi pādapāyūpasthaṃbulunu, jñānēṃdriyaṃbulaina śravaṇa, nayana, rasanātvaka ghrāṇaṃbulunu, manaṃbunu mahī salila tējōvāyuga ganaṃbulunu nivi padāṟunu vikāraṃbulu” –

(śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 7 - 237)

  1. vividhaṃ kāryaṃ yasya iti vikārī, (ahaṃkāramu),

(anēka vidhamulaina kāryavastuvulanu kaligiṃcunadi - ahaṃkāramu)

  1. oka padārthamucē ērpaḍina - oka padārthamulōnuṃḍi puṭṭina - maṟiyoka padārthamu.

  2. “prakṛtiṃ puruṣaṃ caiva viddhyanādī ubhāvapi |

vikarāṃśca guṇāṃścaiva viddi prakṛti saṃbhavān||“. (śrīmadbhagavadgīta - 13 - 19)

(vikāramulu, guṇamulu prakṛtivalana kaliginavi ani telusukonumu. prakṛti, puruṣuḍu (bhagavaṃtuḍu) anādinuṃḍi yunnavi, prakṛti puruṣa saṃ yōgamu valana prakṛtilō nuṃḍi kaliginavi vikāramulu - prakṛtiyē anēka vastuvulugā mārinadi. aṭlu mārina vastuvulu vikāramulu)

  1. “mūla prakṛti ravikṛtiḥ, mahadādyāḥ prakṛti vikṛtaya ssapta, ṣōḍaśakaśca vikāraḥ, na prakṛtirna vikṛtiḥ puruṣaḥ”.

(mūla prakṛti vikṛti kādu, adi iṃkoka vastuvu pariṇāmamu ceṃduṭavalana kaliginadi kādu - bhagavaṃtunivale modaṭinuṃḍi yunnadē. mahattatvamu modalagunavi prakṛtiyokka vikāramulu - paṃcabhūtamulu, jñānēṃdriyamulu, karmēṃdriyamulu, manassu anu padiyārunu vikaramulu - puruṣuḍu prakṛti kāḍu, vikṛti kāḍu)

  1. “vikāraśca vyabhicarati, yatha ghaṭādi saṃsthānaṃ cakṣuṣā nirūpyamānaṃ mṛdvyatē rēkēṇa anulabdhēḥ asat, tathā sarvō vikāraḥ kāraṇa vyatirēkēṇa anupalabdērinan = nahi śītōṣṇādisakāraṇaṃ pramānaiḥ nirūpyamāṇaṃ vastu saṃbhavati - vikārōhi saḥ”.

(vikāramu anagā mārpuceṃdunadi. kuṃḍa modalagunavi mannukaka itaramu kādani kaṃṭiki kanabaḍutavalana - ani asat ani ceppabaḍunu - ā prakāramugānē kāraṇamulēnidē kāryamu kaluguṭa asaṃbhavamukanuka kāryamulu - vikāramulu - asat. śītōṣṇādulaku kāranamu pramāṇamuvalana nirūpiṃcuṭaku vīlulēnidaguṭacē avi asat. vikāramu kūḍa niṭuvaṃṭidē - maṭṭiyokka vikāramē, mārpē kuṃḍa).

  1. vikāramulu āru vidhamulu - ṣaḍbhāva vikāramulu - “asti, jāyatē, varthatē, pariṇamitē, parikṣīyatē, mriyatē” - astitvamu = uṃḍuṭa, uniki; janmiṃcuṭa; vṛddhipoṃduṭa - peruguṭa; mārpuceṃduṭa; kṣīṇiṃcuṭa, (taruguṭa - tarigipōvuṭa); naśiṃcuṭa - janmiṃcina vastuvulanniyu janmakalavē - bhagavaṃtuḍu ajuḍu = janma lēnivāḍu - anādi. aṃducēta bhagavaṃtuniki vikāramulu - mārpulu - lēvu, nirvikāruḍu, ellapuḍu okē rītiga nuṃḍuvāḍu - ” sadā ēkarasaḥ”).

  2. prākṛta dṛṣṭilō vikāramulanniyu vēru vērugā nunnaṭlu kanupiṃcinanu paramārtha dṛṣṭilō avanniyu bhagavaṃtuḍē - bhagavaṃtuni nāmarūpamulē. maṭṭitō cēsina kuṃḍa, mūkuḍu modalagunavi yadhārtha sthitilō maṭṭiyē. aṃducēta kuṃḍa, mūkuḍu modalaguvāṭivalenuṃḍu kāryavastuvulanniyu - vikāramulanniyu - naśiṃca valasinavē - sṛṣṭilōni prativastuvu puṭṭina daggaranuṃḍi canipōvuvaraku mārpulu ceṃducunē yuṃḍunu - ī mārpu āgakuṃda, kaṃṭiki kanapadakuṃdā, dinadinamu, kṣaṇakṣaṇamu jarugucunē yuṃḍunu - kalagatini baṭṭi oka cinna mokka pedda ceṭṭugā kramēpi perugunu - oka cinna lēta āku, cigirci lētaraṃgu kaladai - kāṃtivaṃtamugā nuṃḍi, niganigalāḍucu rātri, pagalu anakā melligā, perugucu periginakoladi mudirina raṃgu kaladai civaraku rālipōvunu. aṭlu mārpu ceṃdunavi kanukanē ī prapaṃcamunu jagat ani ceppucunnāru - (That which undergoes a change almotst every moment)

“vikārō nāmadhēyaṃ mṛttikētyēva satyaṃ”. = mṛttika (mannu) valana puṭṭi, mṛttikayaṃduṃḍi, mṛttikayaṃdu layamagu kuṃḍa, mūkuḍu mōdalagu mūrti vikāramaṃtayu nāmadhēyamātramu - pērukē kuṃḍa, mūkuḍu ani ceppabaḍucunnavi. ivanniyu nijamunaku maṭṭiyē. aṭlē ī prapaṃcamaṃtayu brahmavalana puṭṭi, brahmavalana perigi, pōṣiṃpabaḍi brahmamunaṃdē layamaguṭavalana ivanniyu brahmarūpamulaguṭa spaṣṭamu; brahmamu kanna vēṟoka vastuvu lēdu - aṃtā brahmamē, annī brahmamē - “ā harimayamugāni vastuvu paramāṇuvu lēdu” (śrīmadāṃdhramahābhāgavatamu - )

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.