← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విక్షేపః vikṣēpaḥ

Original — తెలుగు
  1. పరబ్రహ్మ వైపునకు పోవుటవదలి ప్రపంచమందభిమానము కలిగియుండుట.

  2. చాంచల్యము

  3. “అనేకాలై తోచిన తోపు (రూపము) లన్నీ విక్షేపాలనిపించును. అదెలాగంటేను - ఒకానొక వృక్షానకు కారణమైన బీజమందు అంకురము మొదలయిన తోపులు (రూపాలు) గలిగినట్లే - జగత్కారణరూపమైన మాయా బీజమందు ప్రథమవిక్షేపం మహదహంకారము.”

  4. చిత్తచాంచల్యం - యస్య చిత్తం వేదాంత శ్రవణే స్వరూపానుసంధానేవా స్థైర్యం నప్రాప్నోతి. కింతు విషయాభిముఖీ భవతి, తేన తన్నివృత్తయే ఈశ్వరనామోచ్ఛారణం, అజపా మంత్రా వృత్తిః ఈశ్వరమూర్తిధ్యానం, నిర్గుణ బ్రహ్మాను సంధానం, ఇత్యాద్యుపాయాః అనుష్టేయాః, ఉపాసనాది భిః చిత్తైకాగ్ర్య సంభవాత్ - అధవా శరీర వాఙ్మనోభిః పుష్కలేన ధనేన శుశ్రూషయా చ, ఈశ్వర ఏవ అస్మదనంతకోటి జన్మార్జిత సుకృత పరిపాకవశాత్ గురుమూర్తి రూపేణావతీర్థః ఇతి శ్రీసద్గురూపాసనం కుర్యాత్. ఏ తచ్చ గురూపాసనం వినైవ కర్మోపాసనాది సాధనకలాపం చిత్త శుద్ధి ద్వారా చిత్తైకగ్ర్యం జనయేత్.

“అధవా అహర్నిశం వేదాంతశ్రవణే ఏవ అత్యంతం ఆదరేణ తీవ్రతరా ప్రవృత్త నప్యుపాయాంతరమేవ”.

(ఎవని యొక్క చిత్తము ఉపనిషత్తులలో బోధ వినుటయందుకాని, స్వరూపానుసంధానమందుకాని, స్థైర్యము - స్థిరత్వము పొందక (స్థిరముగా నుండక, విషయములందభిమానము కలిగియుండునో, అట్తివాడు అట్టి చిత్తచాంచల్యమును నివారించుటకు - మనస్థైర్యము కలుగుటకు - భగవంతుని నామములనుచ్చరించుట, అజపామంత్రావృత్తి, భగవంతుని రూపమును, ధ్యానించుట, నిర్గుణబ్రహ్మను సంధానము మొదలగు ఉపాయములను అనుష్టించవలెను - ఉపాసనలవలన చిత్తైకాగ్ర్యము కలుగును - ఇట్లు చేయనియడల త్రికరణములతో (శరీరము, వాక్కు, మనస్సులతో) గాని, అధికమైన ధనమునిచ్చిగాని, లేక శుశ్రూషచేసిగాని, అనంతకోటి జన్మములలో నేనార్జించిన పుణ్యపాపములవలన, భగవంతుడే గురువు రూపములో అవతరించెను (గురు దేవోభవ) అను శ్రద్ధాభక్తులు కలిగి గురువును ఉపాసించవలెను. ఇట్టి గురూపాసన లేకుండనయినను కర్మోపాసన మొదలగు సాధనములు చిత్తశుద్ధి ద్వారా చిత్తైకాగ్ర్యమును కలుగచేయును.

(ఇట్లుకానియడల రాత్రింపగలు వేదాంతశ్రవణమందు అత్యంతాదరముతో తీవ్రమైన ప్రవృత్తి వేరొక ఉపాయముగా నుండును).

  1. అనేక వస్త్వవలంబేన చిత్తవృత్తేః అన్యావలంబనం విక్షేపః.

(అఖండ వస్తువు, పరిపూర్ణుడు అయిన పరబ్రహ్మయందు చిత్తవృత్తికి పట్టుదొరకక ఇతర వస్తువులందు అవలంబనము కలుగుట).

(పరమాత్మయందు - వేదాంతవిచారమందు మనస్సు ఏకాగ్రముకాక అనేక పదార్థములందు భ్రమ చెందుట)

  1. లేని వస్తువును చూపుట.

  2. “అవిద్యకు రెండు శక్తులు గలవు - ఆవరణశక్తి, విక్షేపశక్తి. ముత్యపు చిప్ప, త్రాడు తెలియకపోవుట అజ్ఞానము. ఆ యజ్ఞానము ముత్యపు చిప్పను త్రాటిని మనకు కనబడకుండ గప్పి పుచ్చును. ఇట్లు కప్పి పుచ్చుటయే ఆవరణశక్తి. అజ్ఞానమంతట విరమింపగ ముత్తెపు చిప్పయందు లేని వెండిని, త్రాటియందు లేని సర్పమును మనకు జూపును - ఇదియే విక్షేపశక్తి.”

  3. (ఒకానొక వృక్షమునం జుట్టుకొన దొడ తీగలున్నూ అక్కడ తనకు ఆశ్రయమైన వృక్షం యొక్క శాఖోపశాఖలనెల్లా తానే చుట్టుకొని, మూసుకొని ఆ వృక్షముయొక్క ఫల పత్ర పుష్ఫాదుల నెల్లాను కప్పుకొని తానే తానై అంతట నిండి పరిపూర్ణమైన తీగలున్నూ తన ఫల పత్ర పుష్పాదుల వలనే కనిపించి తనకాశ్రయమైన వృక్షానకు తానే భారమై యున్నట్టే, యేదైనా ఒకటి అభిమాన చైతన్యమును తొడరిన కర్మాలనె తీగలు చుట్టి నానా వైచిత్ర్య భేదాంకురాలు కలిగి నిజానందముం గప్పుకొని, స్వగత, స్వజాతి, విజాతీయాత్మకమైన రూపభేద, గుణభేద, త్రాణభేద, భోగభేదాత్కమమైన ప్రపంచరూపం చేతం గనుపించి రంజించి తోచెడి తోపు విక్షేపశక్తి యనిపించును –

(బ్రహ్మవిద్యాసుధార్ణవము - 7)

  1. లేని వస్తువులను చూపునది. ప్రపంచమనునది యదార్థముగా లేకపోయినను అంతా భగవంతుడే అయినను వేరే ప్రపంచముగా తోచుట - తోపించుట.

  2. విక్షేప శక్తిస్తు యధారజ్వజ్ఞానం స్వా వృతర జ్జౌ స్వశక్త్యా సర్పాదికం ఉద్భావయత్యేవ మజ్ఞానమపి స్వా వృతాత్మని స్వశక్త్యాకాశాది ప్రపంచ ముత్పాదయతి తా దృశం సా మర్థ్యం - తదుక్తం - విక్షేపశక్తి లింగాది బ్రహ్మాండాంతం జగత్ సృజేత్.

(త్రాడు చీకటిలో పాము అను భ్రాంతి కలుగుటలో కల్గు అజ్ఞానము తన ఆవరణశక్తి ద్వారా త్రాడును ఆవరించి పాము అను భ్రమ కలిగించినట్లు అజ్ఞానము ఆత్మను ఆవరించి దానియందు తనశక్తిచేత ఆకాశము మొదలగుగాగల ప్రపంచమును తోచునట్లు చేయుచున్నది. ఇదియే విక్షేపశక్తి. ఈ విక్షేపశక్తియే ప్రపంచమునంతను సృష్టించుచున్నది. సృష్టి ప్రారంభములో ప్రకృతిలో సూక్ష్మరూపములో నున్న సమస్త వస్తువులను సృష్టించుటే కాక స్థూలరూపములలో తనలోనుండి పైకి విరజిమ్ముటయే కాక, స్థితికాలములో ఒక వస్తువులోనుండి ఇంకొక వస్తువు పుట్టుటకును, ఒక వస్తువు ఇంకొక వస్తువుగా మారుటకును, ఇదియే కారణమగుచున్నది. ఇది భగవచ్ఛక్తియే కనుక భగవంతుడే తన శక్తిరూపములో ఈ పని చేయుచున్నాడు - ఇటువంటి సామర్థ్యము విక్షేపశక్తియని చెప్పబడును - “బ్రహ్మాండమంతటిని ఈ విక్షేపశక్తి సృష్టించుచున్నది” అని చెప్పబడినది.

  1. “నిజస్వరూపమునావరించి తెలియనీయకుండుటవలన అజ్ఞానమును ఆవరణశక్తి యనియు, అన్యవిధమున భ్రమింపచేయుటవలన విక్షేపశక్తి లేక మాయ యనియు దానినందురు.”

  2. “అనాత్మపదార్థములను దుఃఖహేతువు అని ఎఱిగి అద్వైతానందముకు విషయము చేయుటకొఱకు అంతఃకరణవృత్తి అంతర్ముఖమైనను, అచ్చట వృత్తి విషయమైన చైతన్యము అతిసూక్ష్మమగుటవలన కించిత్కాలము వృత్తికి నిలకడలేని యెడ తత్కాలమందే చైతన్య స్వరూపానందము యొక్క లాభము కాదు - కనుక తొందఱపడి వృత్తి బహిర్ముఖమగును - ఈ రీతిగా బహిర్ముఖమగు వృత్తిని విక్షేపమందురు - అది సమాధి విఘ్నములలో నొకటి.”

  3. ‘వృ’ అను ధాతువునుండి - (root word) - కలిగినది పదమునకర్థము ఆదరించుట. ‘క్షిప్’ అను ధాతువునుండి (root word) కలిగినది విక్షేపము (to throw) - దీని అర్థము త్రోసివేయుట, లేక విసరివేయుట - జడమైన ప్రకృతినుండి అందులోని భగవంతుని చైతన్య శక్తిచేత, ప్రకృతిలో అంతవఱకు లీనమైయున్న పదార్థములన్నియు స్థూలరూపములో పైకి ఆవిర్భవించుట - సృష్టింపబడుట - వేరు వేరు నామరూపములుగల వస్తువులుగా పరిణమించుట. ఇట్లు చేయు భగవచ్ఛక్తియే విక్షేపశక్తి).

  4. అధ్యాసః - ఆచ్ఛాదికా అవిద్యా, విక్షేపికా అవిద్యా ఇతి అవిద్యయాః ఏకస్యాః ఏవ అవస్థా ద్వయం.

(అధ్యాసము - అవిద్యయను నొక్క దానికే ఆచ్ఛాదికా - ఆచ్ఛాదించునది, కప్పునది యనియు విక్షేపికా అను రెండు అవస్థలు).

  1. “తానే కర్మ,కర్త, తానే కర్మఫలభోక్తా యని యేర్పఱచి దేహాభిమానుండగు చిదాభాసజీవుడే విక్షేపంబనంబడు”-

(వివేకచింతామణి - పరమానందతీర్థ)

  1. “దేహద్వయ చిదాభాసరూపో విక్షేప ఈరితః |

కర్తృత్వాదఖిల శ్శోకః సంసారాఖ్యో అస్య బంధకః ||“.

(స్థూలదేహము, సూక్ష్మదేహము అను దేహద్వయముకల చిదాభాసుడను నేను. (చిద్రూపుడువలె భాసించువాడను నేను) అనునదే విక్షేపము. కర్తృత్వము వలననే సంసారమను సకల దుఃఖములు కలుగచేయుటవలన బంధకమైనది).

  1. విసరివేయుట - ప్రపంచమునకు ఉపాదానకారణమైన ప్రకృతి - జడము, మాయ - అష్టవిధములుగలదియని శ్రీమద్భగవద్గీతలో చెప్పబడినది. ఆ ప్రకృతిలో భగవంతుడు తన చిచ్ఛక్తి - చైతన్యశక్తితో ప్రవేశించి ఆ ప్రకృతిని చైతన్య వంతముగా చేసి, దానిలో సూక్ష్మరూపములోనున్న పూర్వ సృష్టిలోని పదార్థములన్నింటినీ పైకి విరజిమ్ముట - విసరి వేయుట - (‘క్షిప్’ = to throw) - ఇదియే సృష్టిచేయుట –

“సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం |

కల్పక్షయే; పున స్తాని కల్పాదౌ విసృజామ్యహం ||“. (శ్రీమద్భగవద్గీత - 9 - 7)

“లయే సర్వాణి భూతాని మచ్చక్తిత్వేన కల్పితాం |

ప్రకృతిం యాంతి మాయాఖ్యాం లీయంతే తత్ర వైయతః |

సర్గకాలే విభాగేన పునస్తాని వ్య న ఙ్మ్యహం ||“. (గీతాభావప్రకాశము - 9 - 52, 53)

(ప్రలయకాలమందు నా చితన్యశక్తిచేత కల్పించబడిన - సృష్టించబడిన సమస్త భూతములు మాయయను పేరుగల ప్రకృతిని పొంది దానిలో లీనమగుచున్నవి - లయమగుచున్నవి, కలిసిపోవుచున్నవి. సృష్టికాలమందు తిరిగి వాటిని వేరు వేరుగా - వేరు వేరు రూపములుగలవిగా - ప్రకృతిలోనుండి పుట్టినట్లుగా ప్రకృతిలోనుండి పైకి నెట్టుచున్నాను - విసరివేయబడినట్లు చేయుచున్నాను. ఈ శక్తియే స్థితికాలమందు ప్రతి వస్తువులోనుండి ఇంకొక వస్తువు పుట్టినట్లుగా, లేక, ఇంకొక వస్తువుగా మారినట్లుగా, చేయుచున్నది.

  1. “ఈశ్వరా ధిష్టితావరణ శక్తితో రజోద్రిక్తామహదాఖ్యా విక్షేపశక్తిరాసీత్ -” (పైంగలోపనిషత్)

(ఈశ్వరుడు - పరబ్రహ్మ - అధిష్టించియుండు ఆవరణశక్తివలన రజోగుణముచేత ఉద్రిక్తమగు మహత్తు అను పేరుగల విక్షేపశక్తి కలిగెను -)

  1. సమాధి విఘ్నః - యథాబహిః మార్జారాది భయాచ్చటకా గృహాంతః ప్రవిశ్య భయక్లేశ వ్యాకులతాది నివృత్తి యోగ్యం స్థలం తత్కాలం తత్రా పస్యంతీ బహిరేవ పునరాగత్య భయం వా మరణాదిరూపం దుఃఖం వా ప్రాప్నుయాత్, తధైవ బహిరనాత్మ పదార్థాన్ దుఃఖ హేతుత్వేన బుధ్ధ్వా, అద్వైతానంద విషయీ కర్తుం చిత్త వృత్తిః అంతర్ముఖీ భూయ ప్రత్యక్ చైతన్య స్వరూపస్యాత్మనః అత్యంత సూక్ష్మత్వాత్ కించిత్ కాలమపి తత్ర స్థైర్య మప్రాప్య చైతన్య స్వరూపానందం అనుభూయ పునర్బహిర్ముఖీభవతి. ఈదృక్ వృత్తిరేవ బహిర్ముఖీ భూతా విక్షేపః ఇత్యుచ్యతే -

(పైన ఉండిన యడల పిల్లి చంపివేయునేమో అను భయముచేత ఎలుక ఇంటిలోపల ప్రవేశించి, భయముగాని, భాధకాని, వ్యాకులతగాని లేని స్థలమందు కొంతకాలముండి, మరల పైకి వచ్చి, మరల భయముచెందుటగాని, చనిపోవుటగాని పొందును. ఆ ప్రకారముగానే పైన - తన శరీరముపైన, ప్రపంచములోనుండు అనాత్మ పదార్థములు దుఃఖమునకుకారణములు అని తెలుసుకొని లోపలనుండి అద్వైతానందమును విషయముగా చేసుకొనుట కు చిత్తము అంతర్ముఖమై ప్రత్యక్ చైతన్యము అను ఆత్మ మిక్కిలి సూక్ష్మరూపమైనదగుటచేత దానియందు కొంచెము కాలమైనను స్థిరముగనుండక, చైతన్య స్వరూపానందము ననుభవించి మరల బహిర్ముఖమగును. ఇట్లు బహిర్ముఖమైన చిత్త వృత్తియే విక్షేపమని చెప్పబడుచున్నది)

Transliteration
  1. parabrahma vaipunaku pōvuṭavadali prapaṃcamaṃdabhimānamu kaligiyuṃḍuṭa.

  2. cāṃcalyamu

  3. “anēkālai tōcina tōpu (rūpamu) lannī vikṣēpālanipiṃcunu. adelāgaṃṭēnu - okānoka vṛkṣānaku kāraṇamaina bījamaṃdu aṃkuramu modalayina tōpulu (rūpālu) galiginaṭlē - jagatkāraṇarūpamaina māyā bījamaṃdu prathamavikṣēpaṃ mahadahaṃkāramu.”

  4. cittacāṃcalyaṃ - yasya cittaṃ vēdāṃta śravaṇē svarūpānusaṃdhānēvā sthairyaṃ naprāpnōti. kiṃtu viṣayābhimukhī bhavati, tēna tannivṛttayē īśvaranāmōcchāraṇaṃ, ajapā maṃtrā vṛttiḥ īśvaramūrtidhyānaṃ, nirguṇa brahmānu saṃdhānaṃ, ityādyupāyāḥ anuṣṭēyāḥ, upāsanādi bhiḥ cittaikāgrya saṃbhavāt - adhavā śarīra vāṅmanōbhiḥ puṣkalēna dhanēna śuśrūṣayā ca, īśvara ēva asmadanaṃtakōṭi janmārjita sukṛta paripākavaśāt gurumūrti rūpēṇāvatīrthaḥ iti śrīsadgurūpāsanaṃ kuryāt. ē tacca gurūpāsanaṃ vinaiva karmōpāsanādi sādhanakalāpaṃ citta śuddhi dvārā cittaikagryaṃ janayēt.

“adhavā aharniśaṃ vēdāṃtaśravaṇē ēva atyaṃtaṃ ādarēṇa tīvratarā pravṛtta napyupāyāṃtaramēva”.

(evani yokka cittamu upaniṣattulalō bōdha vinuṭayaṃdukāni, svarūpānusaṃdhānamaṃdukāni, sthairyamu - sthiratvamu poṃdaka (sthiramugā nuṃḍaka, viṣayamulaṃdabhimānamu kaligiyuṃḍunō, aṭtivāḍu aṭṭi cittacāṃcalyamunu nivāriṃcuṭaku - manasthairyamu kaluguṭaku - bhagavaṃtuni nāmamulanuccariṃcuṭa, ajapāmaṃtrāvṛtti, bhagavaṃtuni rūpamunu, dhyāniṃcuṭa, nirguṇabrahmanu saṃdhānamu modalagu upāyamulanu anuṣṭiṃcavalenu - upāsanalavalana cittaikāgryamu kalugunu - iṭlu cēyaniyaḍala trikaraṇamulatō (śarīramu, vākku, manassulatō) gāni, adhikamaina dhanamuniccigāni, lēka śuśrūṣacēsigāni, anaṃtakōṭi janmamulalō nēnārjiṃcina puṇyapāpamulavalana, bhagavaṃtuḍē guruvu rūpamulō avatariṃcenu (guru dēvōbhava) anu śraddhābhaktulu kaligi guruvunu upāsiṃcavalenu. iṭṭi gurūpāsana lēkuṃḍanayinanu karmōpāsana modalagu sādhanamulu cittaśuddhi dvārā cittaikāgryamunu kalugacēyunu.

(iṭlukāniyaḍala rātriṃpagalu vēdāṃtaśravaṇamaṃdu atyaṃtādaramutō tīvramaina pravṛtti vēroka upāyamugā nuṃḍunu).

  1. anēka vastvavalaṃbēna cittavṛttēḥ anyāvalaṃbanaṃ vikṣēpaḥ.

(akhaṃḍa vastuvu, paripūrṇuḍu ayina parabrahmayaṃdu cittavṛttiki paṭṭudorakaka itara vastuvulaṃdu avalaṃbanamu kaluguṭa).

(paramātmayaṃdu - vēdāṃtavicāramaṃdu manassu ēkāgramukāka anēka padārthamulaṃdu bhrama ceṃduṭa)

  1. lēni vastuvunu cūpuṭa.

  2. “avidyaku reṃḍu śaktulu galavu - āvaraṇaśakti, vikṣēpaśakti. mutyapu cippa, trāḍu teliyakapōvuṭa ajñānamu. ā yajñānamu mutyapu cippanu trāṭini manaku kanabaḍakuṃḍa gappi puccunu. iṭlu kappi puccuṭayē āvaraṇaśakti. ajñānamaṃtaṭa viramiṃpaga muttepu cippayaṃdu lēni veṃḍini, trāṭiyaṃdu lēni sarpamunu manaku jūpunu - idiyē vikṣēpaśakti.”

  3. (okānoka vṛkṣamunaṃ juṭṭukona doḍa tīgalunnū akkaḍa tanaku āśrayamaina vṛkṣaṃ yokka śākhōpaśākhalanellā tānē cuṭṭukoni, mūsukoni ā vṛkṣamuyokka phala patra puṣphādula nellānu kappukoni tānē tānai aṃtaṭa niṃḍi paripūrṇamaina tīgalunnū tana phala patra puṣpādula valanē kanipiṃci tanakāśrayamaina vṛkṣānaku tānē bhāramai yunnaṭṭē, yēdainā okaṭi abhimāna caitanyamunu toḍarina karmālane tīgalu cuṭṭi nānā vaicitrya bhēdāṃkurālu kaligi nijānaṃdamuṃ gappukoni, svagata, svajāti, vijātīyātmakamaina rūpabhēda, guṇabhēda, trāṇabhēda, bhōgabhēdātkamamaina prapaṃcarūpaṃ cētaṃ ganupiṃci raṃjiṃci tōceḍi tōpu vikṣēpaśakti yanipiṃcunu –

(brahmavidyāsudhārṇavamu - 7)

  1. lēni vastuvulanu cūpunadi. prapaṃcamanunadi yadārthamugā lēkapōyinanu aṃtā bhagavaṃtuḍē ayinanu vērē prapaṃcamugā tōcuṭa - tōpiṃcuṭa.

  2. vikṣēpa śaktistu yadhārajvajñānaṃ svā vṛtara jjau svaśaktyā sarpādikaṃ udbhāvayatyēva majñānamapi svā vṛtātmani svaśaktyākāśādi prapaṃca mutpādayati tā dṛśaṃ sā marthyaṃ - taduktaṃ - vikṣēpaśakti liṃgādi brahmāṃḍāṃtaṃ jagat sṛjēt.

(trāḍu cīkaṭilō pāmu anu bhrāṃti kaluguṭalō kalgu ajñānamu tana āvaraṇaśakti dvārā trāḍunu āvariṃci pāmu anu bhrama kaligiṃcinaṭlu ajñānamu ātmanu āvariṃci dāniyaṃdu tanaśakticēta ākāśamu modalagugāgala prapaṃcamunu tōcunaṭlu cēyucunnadi. idiyē vikṣēpaśakti. ī vikṣēpaśaktiyē prapaṃcamunaṃtanu sṛṣṭiṃcucunnadi. sṛṣṭi prāraṃbhamulō prakṛtilō sūkṣmarūpamulō nunna samasta vastuvulanu sṛṣṭiṃcuṭē kāka sthūlarūpamulalō tanalōnuṃḍi paiki virajimmuṭayē kāka, sthitikālamulō oka vastuvulōnuṃḍi iṃkoka vastuvu puṭṭuṭakunu, oka vastuvu iṃkoka vastuvugā māruṭakunu, idiyē kāraṇamagucunnadi. idi bhagavacchaktiyē kanuka bhagavaṃtuḍē tana śaktirūpamulō ī pani cēyucunnāḍu - iṭuvaṃṭi sāmarthyamu vikṣēpaśaktiyani ceppabaḍunu - “brahmāṃḍamaṃtaṭini ī vikṣēpaśakti sṛṣṭiṃcucunnadi” ani ceppabaḍinadi.

  1. “nijasvarūpamunāvariṃci teliyanīyakuṃḍuṭavalana ajñānamunu āvaraṇaśakti yaniyu, anyavidhamuna bhramiṃpacēyuṭavalana vikṣēpaśakti lēka māya yaniyu dāninaṃduru.”

  2. “anātmapadārthamulanu duḥkhahētuvu ani eṟigi advaitānaṃdamuku viṣayamu cēyuṭakoṟaku aṃtaḥkaraṇavṛtti aṃtarmukhamainanu, accaṭa vṛtti viṣayamaina caitanyamu atisūkṣmamaguṭavalana kiṃcitkālamu vṛttiki nilakaḍalēni yeḍa tatkālamaṃdē caitanya svarūpānaṃdamu yokka lābhamu kādu - kanuka toṃdaṟapaḍi vṛtti bahirmukhamagunu - ī rītigā bahirmukhamagu vṛttini vikṣēpamaṃduru - adi samādhi vighnamulalō nokaṭi.”

  3. ‘vṛ’ anu dhātuvunuṃḍi - (root word) - kaliginadi padamunakarthamu ādariṃcuṭa. ‘kṣip’ anu dhātuvunuṃḍi (root word) kaliginadi vikṣēpamu (to throw) - dīni arthamu trōsivēyuṭa, lēka visarivēyuṭa - jaḍamaina prakṛtinuṃḍi aṃdulōni bhagavaṃtuni caitanya śakticēta, prakṛtilō aṃtavaṟaku līnamaiyunna padārthamulanniyu sthūlarūpamulō paiki āvirbhaviṃcuṭa - sṛṣṭiṃpabaḍuṭa - vēru vēru nāmarūpamulugala vastuvulugā pariṇamiṃcuṭa. iṭlu cēyu bhagavacchaktiyē vikṣēpaśakti).

  4. adhyāsaḥ - ācchādikā avidyā, vikṣēpikā avidyā iti avidyayāḥ ēkasyāḥ ēva avasthā dvayaṃ.

(adhyāsamu - avidyayanu nokka dānikē ācchādikā - ācchādiṃcunadi, kappunadi yaniyu vikṣēpikā anu reṃḍu avasthalu).

  1. “tānē karma,karta, tānē karmaphalabhōktā yani yērpaṟaci dēhābhimānuṃḍagu cidābhāsajīvuḍē vikṣēpaṃbanaṃbaḍu”-

(vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)

  1. “dēhadvaya cidābhāsarūpō vikṣēpa īritaḥ |

kartṛtvādakhila śśōkaḥ saṃsārākhyō asya baṃdhakaḥ ||“.

(sthūladēhamu, sūkṣmadēhamu anu dēhadvayamukala cidābhāsuḍanu nēnu. (cidrūpuḍuvale bhāsiṃcuvāḍanu nēnu) anunadē vikṣēpamu. kartṛtvamu valananē saṃsāramanu sakala duḥkhamulu kalugacēyuṭavalana baṃdhakamainadi).

  1. visarivēyuṭa - prapaṃcamunaku upādānakāraṇamaina prakṛti - jaḍamu, māya - aṣṭavidhamulugaladiyani śrīmadbhagavadgītalō ceppabaḍinadi. ā prakṛtilō bhagavaṃtuḍu tana cicchakti - caitanyaśaktitō pravēśiṃci ā prakṛtini caitanya vaṃtamugā cēsi, dānilō sūkṣmarūpamulōnunna pūrva sṛṣṭilōni padārthamulanniṃṭinī paiki virajimmuṭa - visari vēyuṭa - (‘kṣip’ = to throw) - idiyē sṛṣṭicēyuṭa –

“sarvabhūtāni kauṃtēya prakṛtiṃ yāṃti māmikāṃ |

kalpakṣayē; puna stāni kalpādau visṛjāmyahaṃ ||“. (śrīmadbhagavadgīta - 9 - 7)

“layē sarvāṇi bhūtāni maccaktitvēna kalpitāṃ |

prakṛtiṃ yāṃti māyākhyāṃ līyaṃtē tatra vaiyataḥ |

sargakālē vibhāgēna punastāni vya na ṅmyahaṃ ||“. (gītābhāvaprakāśamu - 9 - 52, 53)

(pralayakālamaṃdu nā citanyaśakticēta kalpiṃcabaḍina - sṛṣṭiṃcabaḍina samasta bhūtamulu māyayanu pērugala prakṛtini poṃdi dānilō līnamagucunnavi - layamagucunnavi, kalisipōvucunnavi. sṛṣṭikālamaṃdu tirigi vāṭini vēru vērugā - vēru vēru rūpamulugalavigā - prakṛtilōnuṃḍi puṭṭinaṭlugā prakṛtilōnuṃḍi paiki neṭṭucunnānu - visarivēyabaḍinaṭlu cēyucunnānu. ī śaktiyē sthitikālamaṃdu prati vastuvulōnuṃḍi iṃkoka vastuvu puṭṭinaṭlugā, lēka, iṃkoka vastuvugā mārinaṭlugā, cēyucunnadi.

  1. “īśvarā dhiṣṭitāvaraṇa śaktitō rajōdriktāmahadākhyā vikṣēpaśaktirāsīt -” (paiṃgalōpaniṣat)

(īśvaruḍu - parabrahma - adhiṣṭiṃciyuṃḍu āvaraṇaśaktivalana rajōguṇamucēta udriktamagu mahattu anu pērugala vikṣēpaśakti kaligenu -)

  1. samādhi vighnaḥ - yathābahiḥ mārjārādi bhayāccaṭakā gṛhāṃtaḥ praviśya bhayaklēśa vyākulatādi nivṛtti yōgyaṃ sthalaṃ tatkālaṃ tatrā pasyaṃtī bahirēva punarāgatya bhayaṃ vā maraṇādirūpaṃ duḥkhaṃ vā prāpnuyāt, tadhaiva bahiranātma padārthān duḥkha hētutvēna budhdhvā, advaitānaṃda viṣayī kartuṃ citta vṛttiḥ aṃtarmukhī bhūya pratyak caitanya svarūpasyātmanaḥ atyaṃta sūkṣmatvāt kiṃcit kālamapi tatra sthairya maprāpya caitanya svarūpānaṃdaṃ anubhūya punarbahirmukhībhavati. īdṛk vṛttirēva bahirmukhī bhūtā vikṣēpaḥ ityucyatē -

(paina uṃḍina yaḍala pilli caṃpivēyunēmō anu bhayamucēta eluka iṃṭilōpala pravēśiṃci, bhayamugāni, bhādhakāni, vyākulatagāni lēni sthalamaṃdu koṃtakālamuṃḍi, marala paiki vacci, marala bhayamuceṃduṭagāni, canipōvuṭagāni poṃdunu. ā prakāramugānē paina - tana śarīramupaina, prapaṃcamulōnuṃḍu anātma padārthamulu duḥkhamunakukāraṇamulu ani telusukoni lōpalanuṃḍi advaitānaṃdamunu viṣayamugā cēsukonuṭa ku cittamu aṃtarmukhamai pratyak caitanyamu anu ātma mikkili sūkṣmarūpamainadaguṭacēta dāniyaṃdu koṃcemu kālamainanu sthiramuganuṃḍaka, caitanya svarūpānaṃdamu nanubhaviṃci marala bahirmukhamagunu. iṭlu bahirmukhamaina citta vṛttiyē vikṣēpamani ceppabaḍucunnadi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.