← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విప్రకర్తవ్యము viprakartavyamu

Original — తెలుగు

“శ్రుణు విప్రేణ కర్తవ్యం మోక్షమార్గాశ్రితేన యత్ |

ఉపనితో వసే దాదౌ వేదాభ్యాసాయవై గురౌ |

అధీత్య వేదవేదాన్ తాన్ దత్వా చ గురు దక్షిణాం |

సమావృతస్తు గార్హస్థ్యే సదా రో నివసే న్మునిః |

న్యాయ వృత్తిస్తు సంతోషీ నిరాశీ గత కల్మషః |

అగ్నిహోత్రాది కర్మాణి కుర్వాణః సత్యవా క్సుచిః |

పుత్రం పౌత్రం సమాసాద్య వానప్రస్థాశ్రమే వశేత్ |

తపసా షట్ రిపూన్ జిత్వా భార్యా పుత్రే నివేశ్యచ |

సర్వా నగ్నేన్ యథా న్యాయం ఆత్మన్యారోప్య ధర్మవిత్ |

వసేత్తుర్యాశ్రమే శ్రాంతః శుద్ధే వైరాగ్య సంభవే |

విరక్తస్యాది కారోస్తి సన్యాసే నాన్యదా క్వచిత్ |

వేదవాక్యం ఇదం తథ్యం నాన్యధేతి మతిర్మమ |

శుకాష్ట చత్వారింశద్వై సంస్కారా వేదబోధితాః |

చత్వారింశత్ గృహస్థస్య ప్రోక్తాః తత్ర మహాత్మభిః |

అష్టౌచ ముక్తికామస్య ప్రోక్తాః శమదమాదయః |

ఆశ్రమవాశ్రమం గచ్చేత్ ఇతి శిష్ఠాను శాసనం||“. (శ్రీదేవీ భాగవతము)

(మోక్షమార్గము నాశ్రయించు విప్రుల కర్తవ్యము క్రింద చెప్పిన విధముగా నుండును - ఉపనయనము చేసుకొనిన పిమ్మట వేదము నభ్యసించుకొఱకు గురువు వద్దకు వెళ్ళి వేదాధ్యయనము చేసిన పిమ్మట గురువునకు దక్షిణ యివ్వవలెను - తర్వాత పెండ్లి చేసుకొని భార్యతో గృహస్థాశ్రమ మందుండవలెను - న్యాయముగా వర్తించుచు సంతోషియై, ఆశలు లేనివాడై యుండవలెను, ఏ విధమైన కల్మషము లేని వాడై యుండవలెను - అగ్నిహోత్రము మొదలగు కర్మలను చేయుచు సత్యసంధుడై బాహ్యశౌచము, అంతశ్శౌచము గలిగి యుండవలయును - పిల్లలను, మనుమలను కనిన తర్వాత వానప్రస్థాశ్రమము చేపట్టవలెను - తపస్సు చేసి అరిషడ్వర్గమును జయించవలెను - కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను జయించవలెను. అటుపైన కుటుంబమును వదలి అగ్నులను తనయనందారోపించుకొని శ్రాంతుడై వైరాగ్యమును పొంది తుర్యాశ్రమమందుండవలెను - వైరాగ్యము కలిగినవాడే సన్యసించవలెను. వైరాగ్యము కలిగినవాడే సన్యాసాశ్రమమునకధికారి. ఇది వేదవాక్యము, వేదవిహితము - ఇది తథ్యము - ఇంకొక విధముగా సన్యాసము స్వీకరించుటకధికారము లేదు - అని నా అభిప్రాయము. వేదములందు చెప్పబడిన సంస్కారములలో గృహస్థునిసంస్కారములు, ముముక్షువుని సంస్కారములు చెప్పబడినవి. శమము, దమము మొదలగునవి ఎనిమిది. ఒక ఆశ్రమమునుండి ఇంకొక అశ్రమమును స్వీకరించవలెను - అనగా, బ్రహ్మచారిగానుండి గృహస్థాస్రమమును స్వీకరించవలెను - గృహస్థుగానుండి వానప్రస్థాశ్రమమును స్వీకరించవలెను - అప్పుడు వైరాగ్యము కలిగినమీదట సన్యసించవలెను. ఇది శిష్టులైనవారి శాసనము - అనుశాసనము)

Transliteration

“śruṇu viprēṇa kartavyaṃ mōkṣamārgāśritēna yat |

upanitō vasē dādau vēdābhyāsāyavai gurau |

adhītya vēdavēdān tān datvā ca guru dakṣiṇāṃ |

samāvṛtastu gārhasthyē sadā rō nivasē nmuniḥ |

nyāya vṛttistu saṃtōṣī nirāśī gata kalmaṣaḥ |

agnihōtrādi karmāṇi kurvāṇaḥ satyavā ksuciḥ |

putraṃ pautraṃ samāsādya vānaprasthāśramē vaśēt |

tapasā ṣaṭ ripūn jitvā bhāryā putrē nivēśyaca |

sarvā nagnēn yathā nyāyaṃ ātmanyārōpya dharmavit |

vasētturyāśramē śrāṃtaḥ śuddhē vairāgya saṃbhavē |

viraktasyādi kārōsti sanyāsē nānyadā kvacit |

vēdavākyaṃ idaṃ tathyaṃ nānyadhēti matirmama |

śukāṣṭa catvāriṃśadvai saṃskārā vēdabōdhitāḥ |

catvāriṃśat gṛhasthasya prōktāḥ tatra mahātmabhiḥ |

aṣṭauca muktikāmasya prōktāḥ śamadamādayaḥ |

āśramavāśramaṃ gaccēt iti śiṣṭhānu śāsanaṃ||“. (śrīdēvī bhāgavatamu)

(mōkṣamārgamu nāśrayiṃcu viprula kartavyamu kriṃda ceppina vidhamugā nuṃḍunu - upanayanamu cēsukonina pimmaṭa vēdamu nabhyasiṃcukoṟaku guruvu vaddaku veḷḷi vēdādhyayanamu cēsina pimmaṭa guruvunaku dakṣiṇa yivvavalenu - tarvāta peṃḍli cēsukoni bhāryatō gṛhasthāśrama maṃduṃḍavalenu - nyāyamugā vartiṃcucu saṃtōṣiyai, āśalu lēnivāḍai yuṃḍavalenu, ē vidhamaina kalmaṣamu lēni vāḍai yuṃḍavalenu - agnihōtramu modalagu karmalanu cēyucu satyasaṃdhuḍai bāhyaśaucamu, aṃtaśśaucamu galigi yuṃḍavalayunu - pillalanu, manumalanu kanina tarvāta vānaprasthāśramamu cēpaṭṭavalenu - tapassu cēsi ariṣaḍvargamunu jayiṃcavalenu - kāma, krōdha, lōbha, mōha, mada, mātsaryamulanu jayiṃcavalenu. aṭupaina kuṭuṃbamunu vadali agnulanu tanayanaṃdārōpiṃcukoni śrāṃtuḍai vairāgyamunu poṃdi turyāśramamaṃduṃḍavalenu - vairāgyamu kaliginavāḍē sanyasiṃcavalenu. vairāgyamu kaliginavāḍē sanyāsāśramamunakadhikāri. idi vēdavākyamu, vēdavihitamu - idi tathyamu - iṃkoka vidhamugā sanyāsamu svīkariṃcuṭakadhikāramu lēdu - ani nā abhiprāyamu. vēdamulaṃdu ceppabaḍina saṃskāramulalō gṛhasthunisaṃskāramulu, mumukṣuvuni saṃskāramulu ceppabaḍinavi. śamamu, damamu modalagunavi enimidi. oka āśramamunuṃḍi iṃkoka aśramamunu svīkariṃcavalenu - anagā, brahmacārigānuṃḍi gṛhasthāsramamunu svīkariṃcavalenu - gṛhasthugānuṃḍi vānaprasthāśramamunu svīkariṃcavalenu - appuḍu vairāgyamu kaliginamīdaṭa sanyasiṃcavalenu. idi śiṣṭulainavāri śāsanamu - anuśāsanamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.