← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విరక్తిమార్గము viraktimārgamu

Original — తెలుగు
  1. “క. దేహము నిత్యముగాదని

మోహము దెగగోసి సిద్ధముని వర్థనుడై

దేహము వెలువడు నరుడు

త్సాహముతో జెందు ముక్తి సంపద ననఘా“.

  1. “హేతుమద్భావంబున శోకహేతు వహంకార మమకారాత్మకంబైన ద్వైత భ్రమంబనియును, ద్వైతభ్రమంబునకు గారణంబు దేహంబనియు, దేహంబునకు బీజంబు లింగంబనియు, లింగంబునకు మూలంబు గుణంబులనియు, గుణంబులకు నిదానంబు ప్రకృతి యనియు, బ్రహ్మహమనియెడు జ్ఞానంబున లీనయై ప్రకృతి లేకుండు ననియు, బ్రకృతి యడంగుటయ నైర్గుణ్యంబనియు, నైర్గుణ్యంబువలన గార్య లింగనాశంబగుననియు, బ్రకృతి బాసి క్రమ్మర స్థూలశరీర ప్రాప్తుండు గాక పురుషుండు సమ్యగ్భోగంబున నుండుననియు, నిశ్చయించి అర్జనుండు విరక్తుండై యూరకుండె”- (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 -1 -)
Transliteration
  1. “ka. dēhamu nityamugādani

mōhamu degagōsi siddhamuni varthanuḍai

dēhamu veluvaḍu naruḍu

tsāhamutō jeṃdu mukti saṃpada nanaghā”.

  1. “hētumadbhāvaṃbuna śōkahētu vahaṃkāra mamakārātmakaṃbaina dvaita bhramaṃbaniyunu, dvaitabhramaṃbunaku gāraṇaṃbu dēhaṃbaniyu, dēhaṃbunaku bījaṃbu liṃgaṃbaniyu, liṃgaṃbunaku mūlaṃbu guṇaṃbulaniyu, guṇaṃbulaku nidānaṃbu prakṛti yaniyu, brahmahamaniyeḍu jñānaṃbuna līnayai prakṛti lēkuṃḍu naniyu, brakṛti yaḍaṃguṭaya nairguṇyaṃbaniyu, nairguṇyaṃbuvalana gārya liṃganāśaṃbagunaniyu, brakṛti bāsi krammara sthūlaśarīra prāptuṃḍu gāka puruṣuṃḍu samyagbhōgaṃbuna nuṃḍunaniyu, niścayiṃci arjanuṃḍu viraktuṃḍai yūrakuṃḍe”- (śrīmadāṃdhramahābhāgavatamu - 1 -1 -)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.