← Back to వ · Booklets 41–50 (digitized file 5)

విరూపాక్షః virūpākṣaḥ

Original — తెలుగు
  1. విషమాక్షః త్ర్యకత్వాత్, విషమ లోచనః.

(మూడు కన్నులు కలిగియుండుటచేత విషమాక్షుడు - వికృతమైన కన్నులు కలవాడు - శివుడు).

  1. త్రినేత్రత్వాత్ విరూపాక్షః తాదృశః పరమేశ్వరః.

(మూడు కన్నులు కలిగియుండుటచేత వికృతమైన - వికారమైన కన్నులు కలవాడు కనుక విరూపాక్షుడు) (అటువంటివాడు పరమేశ్వరుడు).

  1. వికృత రూపాణి అక్షీణ నేత్రాణి యస్య సః - విరూపాక్షః - వైరూప్యంచ త్రినేత్రత్వాత్.

(మూడు కన్నులు కలవాడు కనుక వికృతరూపముగల కన్నులు కలవాడు).

  1. విరూపే వికృతే అక్షిణీ యస్య సః; విరూపే కురూపే అక్షిణీ వస్తుతః విరూపాణి త్రీణి ఇతి యావత్ అక్షిణి యస్య సః.

(మూడు కన్నులు కలిగియుండుటచేత విషమమైన కన్నులు గలవాడు, అందుచేత విరూపమైన కురూపమైన కన్నులు గలవాడు).

  1. విరూపే అక్షిణీ యస్య సః విరూపాక్షః వరాహే –

తస్య చింతయతో నేత్రాత్ తేజస్సమభవన్మహత్ |

దక్షిణం వహ్ని సంకాశం నామం తుహిన సన్నిభం |

ఇత్యుక్తేః శీతోష్ణ త్వేన పరస్పర విలక్షణత్వాత్ విరూపాక్షత్వం |

రుద్ర పరత్వేహి విరూపాణి అక్షీణి ఇతివా - విరూపమక్షీ నిటలస్థం ఇతివా |

(ధ్యానములో మునిగియున్న అతని - శివుని - నేత్రములనుండి గొప్ప తేజస్సు పుట్టినది - దక్షిణమున వహ్నితో సమానమైనది, ఎడమ వైపుది మంచువలె చల్లని కాంతి కలది - అని వరాహ పురాణములో చెప్పబడియున్నది.ఇట్లు శీతలము ఉష్ణత్వము అను ఒకదానికొకటి విలక్షణమైన లక్షణములు గలిగి యుండుటవలన విరూపాక్షత్వము - రుద్రుని విషయములో విరూపములైన కండ్లు గలవాడు, లేక, లలాటమందు విరూపముగా కన్ను కలిగియుండువాడు కనుక విరూపాక్షుడు).

  1. “ఊర్థ్వరేతం విరూపక్షం విశ్వరూపాయవై నమోనమః” (మంత్రపుష్పము)
Transliteration
  1. viṣamākṣaḥ tryakatvāt, viṣama lōcanaḥ.

(mūḍu kannulu kaligiyuṃḍuṭacēta viṣamākṣuḍu - vikṛtamaina kannulu kalavāḍu - śivuḍu).

  1. trinētratvāt virūpākṣaḥ tādṛśaḥ paramēśvaraḥ.

(mūḍu kannulu kaligiyuṃḍuṭacēta vikṛtamaina - vikāramaina kannulu kalavāḍu kanuka virūpākṣuḍu) (aṭuvaṃṭivāḍu paramēśvaruḍu).

  1. vikṛta rūpāṇi akṣīṇa nētrāṇi yasya saḥ - virūpākṣaḥ - vairūpyaṃca trinētratvāt.

(mūḍu kannulu kalavāḍu kanuka vikṛtarūpamugala kannulu kalavāḍu).

  1. virūpē vikṛtē akṣiṇī yasya saḥ; virūpē kurūpē akṣiṇī vastutaḥ virūpāṇi trīṇi iti yāvat akṣiṇi yasya saḥ.

(mūḍu kannulu kaligiyuṃḍuṭacēta viṣamamaina kannulu galavāḍu, aṃducēta virūpamaina kurūpamaina kannulu galavāḍu).

  1. virūpē akṣiṇī yasya saḥ virūpākṣaḥ varāhē –

tasya ciṃtayatō nētrāt tējassamabhavanmahat |

dakṣiṇaṃ vahni saṃkāśaṃ nāmaṃ tuhina sannibhaṃ |

ityuktēḥ śītōṣṇa tvēna paraspara vilakṣaṇatvāt virūpākṣatvaṃ |

rudra paratvēhi virūpāṇi akṣīṇi itivā - virūpamakṣī niṭalasthaṃ itivā |

(dhyānamulō munigiyunna atani - śivuni - nētramulanuṃḍi goppa tējassu puṭṭinadi - dakṣiṇamuna vahnitō samānamainadi, eḍama vaipudi maṃcuvale callani kāṃti kaladi - ani varāha purāṇamulō ceppabaḍiyunnadi.iṭlu śītalamu uṣṇatvamu anu okadānikokaṭi vilakṣaṇamaina lakṣaṇamulu galigi yuṃḍuṭavalana virūpākṣatvamu - rudruni viṣayamulō virūpamulaina kaṃḍlu galavāḍu, lēka, lalāṭamaṃdu virūpamugā kannu kaligiyuṃḍuvāḍu kanuka virūpākṣuḍu).

  1. “ūrthvarētaṃ virūpakṣaṃ viśvarūpāyavai namōnamaḥ” (maṃtrapuṣpamu)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.